10, మే 2023, బుధవారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-10)


                                                                             ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                                   (PART-10) 

సంవత్సరం

వెంకట్ అద్దానికి ముందు నిలబడి అతికించుకున్న గడ్డాన్నీ, అతికించుకున్న మీసాన్నీ పెట్టుకుని--అది సరిగ్గా అమరిందా లేదా అని ఒకసారి చూసుకున్నాడు. వెడల్పైన నళ్ళ కళ్ళద్దాలు వేసుకున్నాడు.

అప్పుడు అతనికే అతని మొహం వ్యత్యాసంగా కనబడింది. ఇస్త్రీ చేసి రెడీగా ఉంచుకున్న పచ్చరంగు సఫారీ డ్రస్సును వేసుకుని, షూ వేసుకున్నాడు.

గదికి తాళం వేసి బయలుదేరాడు.

టాక్సీఅని పిలిచి, అందులోకి ఎక్కి కూర్చున్నాడు.

ఎక్కడికి వెళ్ళాలి సార్?”

"మన ముఖ్యమంత్రి గారి ఇంటికి

డ్రైవర్ ఒకసారి వెనక్కి తిరిగి అతని ముఖం చూసి, అంతవరకు ఈలపాట పాడుతున్నది ఆపి నిదానంగా కారు నడిపాడు.

కొద్ది సమయంలో ముఖ్యమంత్రి ఇల్లు.

విచారణ తరువాత లోపలకు అనుమతించబడ్డాడు.

తరువాత రిసెప్షన్ హాలులో ఏడెనిమిది మంది కూర్చోనుండ, ఒక పి. వచ్చి ఎస్ ప్లీజ్?” అన్నాడు.

నేను ఆర్. ఆర్. కంపెనీ యొక్క జి.ఎం. సుబ్బారావ్. రోజు ముఖ్యమంత్రి గారిని చూడటానికి నిన్ననే ఫోనులో అపాయింట్ మెంట్అడిగాను. పదిన్నరకు రమ్మన్నారు అన్నాడు వెంకట్.

సరే...కూర్చోండి

కరెక్టుగా పదిన్నరకు వెంకట్ని లోపలకు పంపారు.

ముఖ్యమంత్రి నవ్వుతూ ఆహ్వానించారు.

సార్, మా కంపెనీ సంవత్సరం గోల్డన్ జూబ్లీ జరుపుకుంటోంది. దాని జ్ఞాపకార్దం ఏదైనా సంఘ సేవ చెయ్యాలని మా ఎం.డి. ఆనంద్ గారు తీర్మానించారు. తిన్నగా మేమే చేయటం కంటే, ప్రభుత్వం ద్వారా, మీ చేతుల మీదగా చెయ్యాలని అనుకున్నారు. చెక్కును మీదగ్గర ఇచ్చేసి రమ్మన్నారు. ముఖ్యమంత్రి సేవా పధకం ఫండ్స్ కింద కోటి రూపాయల చెక్కును వాడుకోమన్నారు. డబ్బును చిల్డ్రన్ వెల్ ఫేర్ కు ఖర్చు పెడితే సంతోషంగా ఉంటుందని చెప్పారు

వెంకట్ భవ్యంగా లేచి నిలబడి, చెక్కు ఉన్న కవర్ను జాప, ముఖ్యమంత్రి తీసుకున్నారు.

ఇంతపెద్ద మొత్తాన్ని దానంగా ఇవ్వటానికి చాలా పెద్ద మనసు కావాలి. మీ ఎం.డి. కి నా థ్యాంక్స్ చెప్పండి

ఆయన ఊర్లో లేరు సార్. అందువలనే నన్ను పంపారు. ఆయన తిరిగి రావటానికి రెండు రోజులు పడుతుంది. వచ్చిన వెంటనే ఫోన్ చేసి మీ అపాయింట్ మెంట్ తీసుకుని మిమ్మల్ని కలుస్తానని చెప్పారు

చాలా సంతోషం అని నమస్తే పెట్టారు.

                                                                                                                       Continued...PART-11

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి