ఓడినవాడి తీర్పు...(సీరియల్) (PART-8)
ఈ సంవత్సరం
శనివారం రాత్రి
పదిన్నరకు గది
వదిలి బయలుదేరాడు
వెంకట్. ‘షూ’ లేసును
గట్టిగా కట్టుకున్నాడు.
కిళ్ళీ కోట్లో
వక్కపొడి పొట్లం
కొనుక్కుని చించి, దాంట్లో
నుండి నాలుగు
పలుకులు నోట్లో
వేసుకుని అటుగా
వెడుతున్న ఖాలీ
ఆటోను చప్పట్లు
కొట్టి పిలిచాడు.
అందులో ఎక్కి
కూర్చొని తన
ఆఫీసు ఉన్న
వీధి చివర్లో
దిగాడు.
ప్లాట్ ఫారం
చివర బెంచి
వేసి, వేడి
వేడి ఇడ్లీలు
తింటున్న వారి
ఆకులకోసం ఎముకలు
కనబడుతున్న కుక్క
ఒకటి కాచుకోనుంది.
వీధి లైట్ల
స్థంభాలలో ఒక
స్థంభాన్ని కూడా
వదలకుండా, అన్ని
స్థంభాలపై సర్కస్
కంపెనీ వాళ్ళు
ప్రకటన పత్రాలు
అతికించున్నారు.
మందమైన వెన్నెల
వెళుతురులో పురుగులు
ఎగరటం క్లియర్
గా కనబడింది.
చక్రాల బండీలో
మిక్షర్ అమ్ముతున్న
వృద్దుడు, బండికి
నాలుగువైపులా గోనె
సంచులు వేసి
మూసేసి బయలుదేరుతున్నాడు.
వెంకట్, ఆనంద్
ఆఫీసు వెనుకకు
వెళ్లటానికి దగ్గరున్న
పంచాయతీ స్కూలు
యొక్క గేటులేని
కాంపౌండ్ లోపలకు
దూరాడు.
స్కూలు వరాండాలో
ఏడెనిమిది మంది
ఒళ్ళు ముడుచుకుని
పడుకుని నిద్ర
పోతున్నారు. వెంకట్
కంటే అతని
పొడవైన నీడ
ముందు నడుస్తున్నది.
పొట్టిగా ఉన్న
కాంపౌండ్ గోడపైకి
ఒక జంపులో
ఎక్కి -- అవతలి
పక్కకు గెంతాడు
-- కొంతసేపు రెస్టు
తీసుకున్నాడు.
కటిక చీకటి!
సెక్యూరిటీ, వాకిలివైపు
కుర్చీలో కూర్చుని
ఎప్పుడూ లాగా
రేడియోలో ఒక్కొక్క
స్టేషనూ తిప్పుతున్నాడు.
ఇండియా స్టేషన్లు
‘జైహింద్’చెప్పిన
తరువాత విదేశీ
స్టేషన్ల కోసం
ప్రయత్నిస్తాడు.
బద్దకస్తుడు! చాలా
బద్దకస్తుడు! తన
జేబులోనుంచి డబ్బులు
పడినా, దాన్ని
ఏరి ఇవ్వటానికి
ఇంకో మనిషి
కోసం ఎదురు
చూస్తాడు.
స్టోర్స్ గది
వెనుకగా నిలబడ్డ
వెంకట్, ఆ
గదికున్న తుప్పు
పట్టిన ఇనుప
చువ్వలను
తీసే ముందు
చేతికి గ్లౌజ్
వేసుకున్నాడు.
మరుసటి పదో
నిమిషంలో అతను
స్టోర్స్ గదిలోకి
తన శరీరాన్ని
దూర్చి మెల్లగా
నేలను తాకిన
వెంటనే, రెండు
ఎలుకలు భయపడి
పరిగెత్తినై.
పాత లెడ్జర్
పుస్తకాలు సర్ది
పెట్టబడి ఉన్నాయి.
ఆ గది
తలుపు గొళ్ళాలు
సరిలేకపోవటంతో, దగ్గరకు
వేసున్నాయి.
అందువలన సులభంగా
ఆ రెండు
తలుపులనూ తోసి, ఆఫీసు
లోని పొడవైన
హాలులోకి ప్రవేశించాడు.
ప్యాంటు జేబులోకి
చెయ్యి పోనిచ్చి, ప్యాకెట్
టార్చ్ తీసి
ఆన్ చేసి, నిదానంగా
నడుస్తూ మేనేజర్
గది ముందుకు
వచ్చాడు.
దగ్గరున్న ‘బోర్డు’ లో
తగిలించి ఉన్న
తాళం చెవి
తీసుకుని గది
తలుపు తెరిచాడు.
లోపలకు వచ్చాడు.
సుబ్బారావ్ గారి
టేబుల్ ను
సమీపించాడు.
సోపు ముద్దతో
అచ్చు తీసుకుని
తయారు చేసుకున్న
తాళంచెవితో టేబుల్
డ్రాను సులభంగా
తెరిచాడు.
సొరుగులోపలకు టార్చ్
వెలుతురు కొట్టాడు.
వేరు చేతితో
వెతికి ‘చెక్కు’ పుస్తకాన్ని
బయటకు తీసాడు.
ఆ చెక్కు
బుక్కు పుస్తకాన్ని
వేగంగా తిరగేసాడు.
అన్ని చెక్కుల
మీదా ఆనంద్
సంతకం పెట్టున్నాడు.
వెంకట్, పైనున్న
మొదటి చెక్కును
మాత్రం చింపి
తీసుకున్నాడు. కంపెనీ
పేరు ప్రింటు
చేయబడ్డ కవరులో
దాన్ని బద్ర
పరిచి, తన
చొక్కా లోపల
వేసుకున్నాడు.
ఆ తరువాత
అన్నిటినీ ఇంతకు
ముందు ఉన్నట్టే
అమర్చి తాళం
వేసాడు.
మళ్ళీ ‘స్టోర్స్’ గది
ద్వారా బయటకు
వచ్చి, ఊడదీసిన
ఇనుప చువ్వలను
మునుపటిలాగా అమర్చి, బిగించి, గోడ
ఎక్కి గెంతి
స్కూలు ద్వారా
వీధికి వచ్చాడు.
నడవటం మొదలుపెట్టాడు...నిదానంగా.
Continued...PART-9
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి