18, మే 2023, గురువారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-14)

 

                                                                            ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                                (PART-14)

సంవత్సరం

వేగంగా వీస్తున్న గాలి అందరి కళ్ళనూ ముడుచుకునేటట్టు చేసింది. చీర కొంగులను లాగి దోపుకోబెట్టింది. ఎగిరిపోతున్న జుట్టును గట్టిగా లాగి  పట్టుకోబెట్టింది.

ఎందుకని చాలాసేపటి నుండి ఏం మాట్లాడటం లేదు అన్నాడు వెంకట్.

కోపం. మీ మీద నాకు విపరీతమైన కోపం అన్నది మల్లికా.

ఎందుకమ్మా కోపం?”

మీ వైపు మీరు ఎవరి దగ్గరా పర్మిషన్అడగక్కర్లేదు. నా వైపు ఇదివరకే మిమ్మల్ని పరిచయం చేసి అనుమతి తీసుకున్నాం. అలాంటప్పుడు పెళ్ళికి ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు?”

ఒక తీర్పు రాయవలసి ఉన్నది మల్లికా. ఇప్పుడే రాయడం ప్రారంభించాను. అది ముగించిన వెంటనే పెళ్ళి చేసుకుందాం

అప్పుడప్పుడు హఠాత్తుగా ఏదైనా అర్ధం కాని విషయం మాట్లాడతారు. మీ నడవడికలో చాలా చిక్కుముడి కనబడుతోంది. పలు విషయాలు నాకు అర్ధం అవటంలేదు. ఎందుకని ఒక మర్మమైన మనిషిగా ఉన్నారు? స్వతంత్రంగా ఉండండి వెంకట్

దానికి కొన్ని రోజులు పడుతుంది. తరువాత మామూలుగా అయిపోతాను అన్న అతను, ఆమె మొహం మీద పడుతున్న వెంట్రుకలను పక్కకు జరిపి, ఆమె మొహాన్ని తన చేతులతో పుచ్చుకుని ఆమె కళ్ళల్లోకి లోతుగా చూసాడు.

మల్లికా నవ్వును తెప్పించుకుంది.

పోయిన సంవత్సరం.

మహతీ యొక్క ఇంటి కాలింగ్ బెల్లును ఆరోసారిగా విసుగుతో కొట్టాడు పాలవాడు. జవాబు లేదు.

దగ్గరున్న కిటికీ ద్వారా తొంగి చూసాడు.

లోపలున్న బెడ్ రూమ్ గది తలుపు చిన్నగా తీసుంది.

తీసున్న తలుపు సందులో పంచ కట్టిన రెండు కాళ్ళు పై నుండి వెళాడు తున్నట్టు చూసిన అతను, పాల గిన్నెను జారవిడిచాడు.

పది నిమిషాలలో పోలీసులు వచ్చి, వాకిటి తలుపును పగుల కొట్టారు.

లోపలకు దూరి నాలిక బయటకు వచ్చి -- కళ్ళు బయటకు వచ్చి, ఉరి తాడుతో  వేళాడుతున్న కల్యాన్ మృతదేహాన్ని కిందకు దించారు.

అతని చొక్కా జేబులో ఉత్తరం ఉన్నది.

నేను బాగా నమ్మిన నా భార్య, నాకు ద్రోహం చేసింది. నేను నమ్మలేకపోయాను. ఆమె చేసిన ద్రోహాన్ని నేను తట్టుకోలేకపోయాను. నా భార్య దగ్గర నుండి ప్రేమను సంపాదించుకోలేక పోయినవాడిగా, అవమానపడి నిలబడ్డ నేను ఇక జీవించటానికి ఇష్టపడటం లేదు. అందువలన ఆత్మహత్య చేసుకుంటున్నాను

                                                                                                          Continued...PART-15

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి