26, మే 2023, శుక్రవారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-18)

 

                                                                                ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                             (PART-18)

పోయిన సంవత్సరం

చెప్పు...మర్యాదగా చెప్పు! నువ్వెవరు? చేతి గడియారం నీకెలా వచ్చింది? చెప్పకపోతే పొడిచేస్తాను అన్నాడు ఆక్రోషంగా వెంకట్.

అతని చేతిలో తలతల మెరుస్తున్నది కత్తి.

షాపతని మెడ చుట్టూ ఉన్న తుండును పట్టుకుని లాగి బిగించి పట్టుకున్నాడు.

ఒక కాలు లేని అతను, వెంకట్ పట్టుకున్న పట్టుకు తడబడి నులకమంచం మీద పడ్డాడు. చెబుతాను. చెయ్యి తియ్యండి. బెదిరించకండి. నేనుగా చెబుతాను. నువ్వెవరు?” అన్నాడు.

వెంకట్, పట్టుకున్న తుండు పిడికిలిని సడలించి, తన గురించి -- తన అన్నయ్య మరణం గురించి -- వదిన మర్మమైన మాయం గురించి క్లుప్తంగా చెప్పాడు.

అలాగా? చెబుతాను... ఆనంద్ ను నేను ఎదుర్కోలేను. బలం లేదు. మనసూ లేదు. నీ వల్ల అవుతుంది. నేను చెబుతాను. జరిగింది చెబుతాను. మీ వదిన ఎవడితోనూ లేచిపోలేదు. చంపబడింది. ఆనంద్, సుబ్బారావ్ చేతిలో చనిపోయింది. మీ వదినను నేనే పూడ్చేను.

పూడ్చే ముందు ఆమె వేసుకున్న నగలూ, చేతి గడియారాన్ని తీసుకున్నాను. వాటిని ఒక్కొక్కటిగా అమ్మాను. చివరగా అమ్మింది చేతి గడియారం. అన్ని వార్తలనూ నేనూ పేపర్లలో చదివాను. అప్పుడు నేను ఆనంద్ ఇంట్లో తోటమాలిగా  ఉన్నాను. రోడ్డు ప్రమాదంలో నా కాలుకు దెబ్బతగిలి, ఆసుపత్రిలో పడున్నాను. పెద్దాపరేషన్ చేసి కాలు అతికించవచ్చు. దానికి లక్షన్నర అవుతుందని చెప్పారు.

నేను ఆనంద్ దగ్గర డబ్బు సహాయం అడిగాను. తనవల్ల కాదని చెప్పాడు. నా  కాలు తీసేయవలసి వచ్చింది. తరువాత షాపు పెట్టుకుని బ్రతుకుతున్నా. పది సంవత్సరాలు అతని దగ్గర పని చేశాను. ఆనంద్ చేసిన ఏన్నో పాప కార్యాలకు తోడుగా ఉన్నాను. కానీ, కార్యం అయిన తరువాత నన్ను కరివేపాకు లాగా విసిరిపారేసాడు. నాకూ అతని మీద కోపమే. కానీ, పగ తీర్చుకునే ధైర్యం లేదు. అతనికి డబ్బూ, పలుకుబడీ ఉన్నది. ఎలాగైనా తప్పించుకుంటాడు.  అవసరమైతే మనల్ని నేరస్తులుగా చిత్రీకరించి జైలుకు పంపగలడు.

నేను అతని నేరాల్లో సహాయపడినందువలన నాలో నేర భావం చోటు చేసుకుని నన్ను చిత్ర వధకు గురిచేస్తోంది. నువ్వు ఏమైనా చెయ్యి తమ్ముడూ, సహాయపడతాను. ఏదైనా అడుగు చెబుతాను అన్నాడు.

నా వదిన ఎందుకు, ఎలా చనిపోయింది?”

మహతీ పైన ఆనంద్ ఆశపడిన దగ్గర నుండి మొదలుపెట్టి, అతని బాబాయ్ పధకం వేసి ఇచ్చింది, బెదిరించి ఉత్తరం రాయించింది, అని ఒక్కటి కూడా వదల కుండా మొత్తం చెప్పాడు అతను.

వెంకట్ క్షణం తీర్మానించుకున్నాడు.

                                                                                                          Continued...PART-19

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి