1, మే 2023, సోమవారం

ఓడినవాడి తీర్పు (సీరియల్)...(PART-6)

 

                                                                                 ఓడినవాడి తీర్పు (సీరియల్)                                                                                                                                                                     (PART-6)

పోయిన సంవత్సరం

హోటల్ పసిఫిక్. పది ఎకరాల స్థలాన్ని ఆక్రమించి, రెస్టారంట్, లాడ్జింగ్, మీటింగ్ హాలు, హైర్ కట్టింగ్ సెలూన్, మసాచ్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, వ్యాపార కేంద్రాలు, ఫిట్ నెస్ సెంటర్, బ్యూటీ పార్లర్ అంటూ సకల వసతులూ ఉన్నాయి.

హాలులోని నాలగవ అంతస్తులోని గది బాల్కనీలో నుండి చూస్తే ఒక వైపు హోటల్ ఎంట్రన్స్, మరో పక్క కదలకుండా ఉండలేని సముద్రపు అలలు తెలుస్తున్నాయి.

ఈజీ చైర్ లాంటి కుర్చీలో కూర్చుని -- కొంచం కొంచంగా మందు కొడుతూ వాకిలి వైపు చూస్తూ ఉన్నాడు ఆనంద్. ఆష్ ట్రేగుంటలో ఉంచబడిన సిగిరెట్టు -- కాలిపోతూ ఉండగా, లోపలున్న టేబుల్ మీద సంప్రదాయం కోసం లాప్ టాప్ఉంచబడింది.

టైము పదిన్నర అయినప్పుడు, ఒక ఆటోలో వచ్చి దిగింది మహతీ.

పసుపు రంగు చీరలో ఎర్ర పువ్వులు చిత్రించబడి ఉంది.

బాల్కనీలో నిలబడే ఇంకో యాంగిల్లో ఆమెను చూసిన ఆనందంతో లేచిన ఆనంద్, గబ గబా మందు బాటిల్ను, గాజు గ్లాసును అలమరాలో పెట్టేసి -- నోట్లో మౌత్ రెఫ్రెష్నర్జల్లుకుని -- న్యూస్ పేపర్ను తిరగేస్తున్నాడు. చిన్నగా వినబడ్డ తలుపుమీద కొట్టిన శబ్ధం విని ఎస్...కమిన్ అన్నాడు.

నమస్తే సార్. వచ్చేదారిలో కొంచం ఆలస్యం అయ్యింది అన్నది భవ్యంగా.

పరవాలేదు. కూర్చోండి

కుర్చీలో కూర్చుంది.

మిసస్ మహతీ. నేను ఎక్కువగా మన ఆఫీసుకే రావటం లేదు. అన్నీ బాబాయ్ చూసుకుంటున్నాడు. ఇప్పుడు కొన్ని రోజులుగానే మాటి మాటికీ ఆఫీసుకు వస్తున్నాను. అది ఎందుకో తెలుసా?”

తెలియదు సార్

"అబద్దం చెబుతున్నావు మహతీ. విషయాన్నైనా మగవారి కంటే ఆడవాళ్ళే త్వరగా అర్ధం చేసుకుంటారు. మీ వలన అర్ధం చేసుకోవటం కుదరటం లేదా?”

లేదు అని తల ఊపింది.

కారణం నువ్వే మహతీ

ఇపుడు అతని నవ్వులో వెకిలితనం ఉన్నది.

ఏమిటి సార్ చెబుతున్నారు?”

మీరేమన్నా ఎల్.కే.జి పాపా? ఏబిసిడి -- నుండి ప్రారంభించి చెప్పాలా? ఉండండి...

ఆనంద్ మంచానికి దగ్గరగా పెట్టున్న చిన్న సూట్ కేసు తెరిచి, అందులో ఉన్న చిన్న బాక్స్ తీసి, “ఉంచుకోండి... అన్నాడు.

చిన్న బాక్సును చూసిన వెంటనే -- అది రోజు నగల షాపులో కొన్న పోగులు ఉన్న బాక్స్ అనేది మహతీకి అర్ధమయ్యింది. 

దీన్ని ఎందుకు నన్ను ఉంచుకో అని చెబుతున్నారు? ఇది మీ స్నేహితుడి కూతురికి...

అబద్దం. నేను చెప్పేదంతా అబద్దం. మీకు నచ్చిన డిజైన్లోమీకు బహుమతిగా ఇవ్వటానికే కొన్నాను. తీసుకోండి అన్నాడు.

ఇప్పుడు మహతీకి అతని మాటలు, చూపులు అర్ధమయ్యింది.

అతని చూపులు పడిన చోట్లలో అమెకు తేళ్ళూ, జర్రులు పాకినట్లు అనిపించి గబుక్కున లేచింది.

క్షమించండి సార్. నాకు నగలు కొనివ్వటానికి నా భర్త ఉన్నారు

నవ్వుతూ ఆనంద్ ఆమె భుజంపై చేతులు వేయ, మరుక్షణమే అతని చేతిని తోసేసి, రెండడుగులు వెనక్కి వేసి, “ఛీ, ఛీ... అన్నది.

మహతీ తలుపు దగ్గరకు వెళ్ళి చెప్పులు వేసుకుని తల పైకెత్తగా, తలుపుకు ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి నవ్వాడు ఆనంద్.

మహతీ, ఇప్పుడు నిన్ను బలవంతంగా పట్టుకోవాలని నేను అనుకుంటే, అది  నాకు చాలా సులభం. కానీ, అది నాకు ఇష్టంలేదు. కోపరేషన్ లేకుండా...చప్పగా అయిపోతుంది. నా జాతకంలో దౌర్జన్యం లేదు. ఎవరి దగ్గరా నేను విషయంలో ఓడిపోయిందే లేదు. మొట్టమొదటి సారిగా నీ దగ్గర బ్రతిమిలాడుతున్నాను. ప్లీజ్...రా. ఎవరికీ నష్టం ఉండదు

తూ...

మహతీ ఉమ్మేసిన ఉమ్ము అతని మొహం మీద జారుతుండగా, ఆమె చటుక్కున తలుపు తెరుచుకుని, వేగంగా బయటకు వెళ్ళింది.

ఆనంద్ మొహం బాగా ఎరుపెక్కింది.

మహతీ! నా మొహం మీద ఉమ్మేసి వెళుతున్నావా? గెలిచినట్టు అనుకుని బయటకు వెళ్ళిపోయావా? ఇది నాకు ఓటమే. కానీ తాత్కాలికమైనది! ఓడిపోయిన వాడి తీర్పు ఎప్పుడూ కొంచం కృరంగానే ఉంటుంది. చూస్తావు. త్వరలో నువ్వు దాన్ని చూస్తావు?’ -- మనసులో సపధం చేసుకున్నాడు.

హోటల్ గదిలో నుండి వేగంగా బయటకు వచ్చి, తొందర తొందరగా ఆటో పుచ్చుకుని, తన ఇంటికి వెళ్ళమని చెప్పిన మహతీకి ఇంకా గుండె దడ తగ్గలేదు.

హ్యాండు బాగులో ఉన్న కర్చీఫును తీసుకుని మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంది.

ఎంత ఒక ఆయోగ్యతనం! తన స్నేహితుడి అమ్మాయికి అని చెప్పి, నగ సెలెక్టు చేయమని చెప్పి...ఆఫీసులో రహస్యాలు దొంగలించ బడుతున్నాయని చెప్పి నన్ను నమ్మించి, అనుమానమే రాకుండా హోటలు రూముకు రప్పించుకుని...ఎంత పెద్ద పన్నాగ నాటకం! నన్ను బలవంతం చేయటానికి ప్రయత్నించుంటే, నేను సింగిల్ .సి గదిలో ఏం చేసుండగలను?’

తలచుకుంటేనే ఒళ్ళంతా కంపరం పుట్టింది.

గబుక్కున మళ్ళీ చెమెటలు కార, చిన్నగా తల తిరగటం జరిగింది.

తలతిప్పటం హఠాత్తుగా ఎక్కువై నాలుక పొడిబారి, ఆటో గుండ్రంగా తిరుగుతూ పోతున్నట్టు కనబడ తడబడింది మహతీ.

డ్రైవర్! తల తిప్పుతున్నట్టు ఉంది. పక్కనున్న ఏదైనా ఆసుపత్రికి వెళ్ళండి...త్వరగా అని అరిచి, ఇనుప చువ్వను గట్టిగా పట్టుకుంది.

కళ్ళు తెరిచినప్పుడు తన ఇంట్లో, తన మంచంలో పడుకోనున్నది తెలుసుకోగలిగింది మహతీ.

దగ్గరున్న కుర్చీలో కూర్చోనున్నాడు కల్యాన్.

మందుల కవరుతో లోపలకు వచ్చిన వెంకట్, “ఇందులో ఒక టాబ్లెట్ మాత్రం ఇక్కడ దొరకలేదు. రేపు ఇంకో షాపులో తీసుకు వస్తాను అన్న అతను -- తిరిగి చూసి వదినా మేలుకున్నారా, కంగ్రాట్స్ అన్నాడు.

లేచి కూర్చున్న మహతీ ఎందుకు?” అన్నది ఆర్ధం కాక.

హాస్పిటల్ నుండి డాక్టర్ మా ఆఫీసుకు ఫోను చేసి చెప్పింది. నీ హ్యాండ్ బ్యాగులో ఉన్న నీ మొబైల్ ఫోనులో హబ్బీఅని మా ఆఫీసు ఫోను నెంబర్ ఉంది. నేను తమ్ముడికి ఫోను చేసి, ఇద్దరం ఆసుపత్రికి వచ్చి టాక్సీలో నిన్ను ఇంటికి తీసుకు వచ్చాము. ఇప్పుడు తలతిప్పటం ఎలా ఉంది మహతీ?” అడిగాడు కల్యాన్.

ఇప్పుడు కళ్ళు తిరగటం అంతా లేదు. నార్మల్ అన్న మహతీ అది సరే...ఎందుకు కంగ్రాట్స్ చెప్పారు?” అన్నది వెంకట్ ను చూసి.

వదినకు తెలియదంటే...? అప్పుడు మీరు చెబితేనే మంచిది అంటూ గదిని వదిలి వెళ్ళాడు.

ఏమంటున్నాడు?”

వాడు బాబాయ్ అవుతాడట. అదే చెబుతున్నాడు

కొద్ది క్షణాల తరువాతే ఆమెకు అర్ధమయ్యింది.

ఆటోలో వచ్చేటప్పుడే నువ్వు కళ్ళు తిరిగి వాలిపోయావు. ఆటో డ్రైవర్ నిన్ను హాస్పిటల్లో చేర్చేడు. డాక్టర్ నాకు ఫోను చేసి చెప్పినప్పుడు నేను భయపడిపోయాను. వెంటనే తమ్ముడికి ఫోన్ చేసి ఇద్దరం కలిసి అక్కడికి వచ్చాము. నిన్ను టెస్టు చేసిన డాక్టరమ్మ, నువ్వు గర్భంగా ఉన్నావని చెప్పింది అన్నాడు కల్యాన్.

మహతీ లో కొత్త వరదలాగా -- సంతోషం తరుముతూ దూకింది.

పెళ్ళి చేసుకుని రెండు సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు బాగ్యం దొరకలేదని బంధువులు కలత చెందటం -- మాట్లాడటమూ మొదలై -- కల్యాన్ కూడా ఒక రోజు ఇద్దరం వెళ్ళి చెక్ చేయించుకుందామా?’ అని అడగటం మొదలుపెట్టిన సమయంలో, అందరి ప్రశ్నలకూ, కలతలకూ పులుస్టాప్ పెట్టేలాగా హ్యాపీ న్యూస్!

అవునూ! నువ్వు ఎప్పుడూ బస్సులోనే కదా ఆఫీసుకు వెళతావు? రోజు ఎందుకు ఆటోలో వెళ్ళావు?” అడిగాడు కల్యాన్.

కొత్త సంతోషంలో మరిచిపోయున్న హోటల్ సంఘటన, కల్యాన్ ప్రశ్నతో  జ్ఞాపకం వచ్చింది. పరిస్థితిలో చెబుదామా, వద్దా? చెబితే ఏం జరుగుతుంది? కల్యానైనా సరే, వెంకట్ అయినా సరే...స్వీయ గౌరవం ఎక్కువగా చూస్తారు. ఒకసారి ఎక్జిబిషన్ కు వెళ్ళినప్పుడు ఎవరో ఇద్దరు యువకులు నన్ను చూసి కామెంట్  చేశారని కోపం అనుచుకోలేక, వాళ్ళిద్దరి చొక్కాలు పుచ్చుకుని గొడవపడ్డారు.

ఇంతపెద్ద వ్యవహారం జరిగిందని చెబితే న్యాయం అడుగుతాననిఅనే నెపంతో వెంటనే వెళ్ళి గొడవపడతారు.

అనవసరంగా పోట్లాటలూ, కేసులూ అవసరమేనా?’

వెళ్ళేనండి. ఆఫీసుకు వెళ్ళే దోవలో చిన్నగా కడుపులో తిప్పింది. వాంతి వచ్చేటట్టు అనిపించింది. ఆఫీసుకు వెళ్ళకుండా ఇంటికి వచ్చేద్దామని ఆటో పుచ్చుకున్నాను. దారిలో కళ్ళు తిరగటం జరిగిపోయింది

పరవాలేదు...వదులు. నేను మీ ఆఫీసుకు ఫోను చేసి చెప్పేశాను

ఏమని?”

హెల్త్ బాగుండలేదు. ఈరోజు సెలవు. రేపు వస్తుంది అని చెప్పాను

ఒక పేపరూ, పెన్నూ తీసుకు రండి చెబుతాను

దేనికీ!

తీసుకు రండి

కారణం అర్ధం కాక కల్యాన్ తీసుకు వచ్చాడు. తీసుకుని గబగబా రాసింది.

రాసింది అతనికి చూపించి చదవండి అన్నది.

గౌరవనీయులైన ఏం.డి. గారికి,

నమస్తే.

నా సొంత కారణాల కారణంగా నా ఉద్యోగానికి నేను ఈరోజు నుండి రాజీనామా చేస్తున్నాను.

ఇట్లు,

మహతీ

అతను చదివి ముగించగానే రేపు మా ఆఫీసులో ఇది ఇచ్చేయండి. మీకు సంతోషమే కదా?” అన్నది.

ఎందుకు మహతీ ఇంత హఠాత్తుగా?”

మన ఒప్పందం ప్రకారమే కదా నడుచుకుంటున్నాను?”

మొదటి బిడ్డ పుట్టేంతవరకు ఉద్యోగానికి వెళతానని చెప్పేవే?”

పుట్టిందే...నా కడుపులో. అందుకే!

ఏడో నెల వరకు కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు మహతీ. నాకేం లేదు

లేదండీ. వద్దు. నేను ఉద్యోగానికి వెళ్ళను, దానికో కారణం ఉంది

ఏమిటా కారణం?”

మొదటి సారిగా గర్భం దాల్చాను. అందులోనూ పెళ్ళి అయిన రెండు సంవత్సరాల తరువాత. మన ఊర్లో బస్సు ఎక్కి, దిగటం ఒక పెద్ద మరణ అవస్త. కడుపులో బిడ్డకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే చెప్పాను

సరి...సరి. నువ్వు చెప్పేది కూడా న్యాయమే అన్నాడు కల్యాన్.

హమ్మయ్య అనుకుంది మహతీ.

                                                                                                    Continued...PART-7

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి