24, మే 2023, బుధవారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-17)

 

                                                                                        ఓడినవాడి తీర్పు                                                                                                                                                                           (సీరియల్)

సంవత్సరం.

రోజు రాత్రి పన్నెండు గంటలకు టైము బాంబు కరెక్టుగా పనిచేసింది.

ఆనంద్ యొక్క అతి పెద్ద గోడౌన్ తునాతునకలై, ఎటు చూసినా నిప్పు రవ్వలు నాట్యమాడుతున్నాయి.

ఏం చెబుతున్నారు బాబాయ్?” నమ్మలేక అడిగాడు ఆనంద్.

అవును. ఇది ఎవరో ప్లాను వేసి చేసిన కుట్ర. నిన్నటితో ఇన్స్యూరన్స్ లాస్ట్ డేట్ అయిపోయింది. మనం పంపిన చెక్కు వారికి వెళ్ళి చేరలేదు. నా సంతకం లాగానే పెడుతూ, మన ఆఫీసు లెటర్ హెడ్డుపై ఇన్స్యూరన్స్ రెన్యూ చేయటం మేము ఇష్టపడటం లేదు అంటూ తెలివిగా టైపు చేసి ఎవరో పంపించారు. ఇన్స్యూరన్స్ కంపెనీ వాళ్ళు ఉత్తరాన్ని తీసి చూపిస్తున్నారు. అక్కడ్నుంచే నేను బ్యాంకుకు ఫోను చేసాను. వాళ్ళు కూడా ఇన్స్యూరన్స్ చెక్కు రాలేదని చెప్పారు. మన ఆఫీసులోనే ఎవరో ఒకరు కుట్ర పన్నుతున్నారు

ఎవరతను అనేది తరువాత అలొచిద్దాం...మనకి కాంపన్షేషన్ దొరుకుతుందా...దొరకదా?”

దొరకదు ఆనంద్. కాలిపోయిన సరకు మొత్త వాల్యూ దగ్గర దగ్గర ఐదు కోట్లు. మొత్తం కాలిపోయింది ఆనంద్. బిల్డింగే నాశనం అయిపోయింది!

ఆనంద్ కు గుండె నొప్పి పుట్టింది.

తల మీద చేతులు పెట్టుకుని, తన ఇంట్లో కూర్చోనున్నారు సుబ్బారావ్ గారు.

ఏమిటి నాన్నా. చాలా డీలా పడిపోయున్నారు?” అన్నాడు తండ్రి దగ్గరగా వచ్చిన అశోక్.

గబగబ మని అంతా జరిగిపోయిందిరా. గోడౌన్ లోనిప్పంటుకున్నందువలన ఏర్పడిన నష్టంతో తలెత్తుకోలేక ఇండస్ట్రీని, ఆఫీసునూ మూసి వేయవలసి వచ్చింది. మిషెనరీ మొత్తాన్నీ బ్యాంకు వాళ్ళు జప్తు చేసి తీసుకు వెళ్ళిపోయారు. అక్కడక్కడ కొని పడేసిన స్థలాలూ, ఇళ్ళూ అన్నీ అమ్మి అప్పు తీరుస్తూ వస్తున్నాడు ఆనంద్. ఒకే నెలలో తలరాత మారిపోయింది. అన్నీ తలకిందలైంది రా

ఏమైనా సరే మీకు వాడి మీద ప్రేమ ఎక్కువే...ఎక్కువగా బాధపడుతున్నారే!

మూర్ఖంగా మాట్లాడకు. ఇదంతా మనకే నష్టం. మధ్యలో ఎవడో చిన్న చిన్న అల్లరి  చేసి మన ప్లాను నంతా పేకముక్కల్లలాగా జారిపోయేటట్టు చేశాడు. పోలీసులతో చెప్పినా కూడా, వాళ్ళు వచ్చి ఆఫీసులో ఉన్న అందరినీ విచారించి చూసినా అతన్ని కనిబెట్టలేకపోయారు

పెద్ద పడవను ముంచటానికి చిన్న చిల్లు చాలు అనే సిద్ధాంతమును అర్ధం  చేసుకున్న వాడిలాగా ఉన్నాడు. ఎవరు నాన్నా అతను? ఎందుకు ఆనంద్ పై అంత పగ?”

ఆనంద్ చేసిన పాపాలకు లెక్క లేదు? ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు? కాపురాలు కూల్చేడు? హత్య వరకు కూడా వెళ్ళేడే! ఎవరో బాధపడిన వాళ్ళు ఇలా ఆటలాడుతున్నారు

.........................”

అశోక్! ఆనంద్ కు తోబుట్టువులు ఎవరూ లేరు. అతని ఆస్తులన్నీ అతని పేరు  మీదే ఉన్నాయి. ఒకడే వారసుడు, ఊటీలో చదువుతున్న అతని కొడుకు. హఠాత్తుగా ఆనంద్ చచ్చిపోతాడే అనుకో, ఊటీలో చదువుతున్న సుధీర్ మైనర్కాబట్టి అతను మేజర్అయ్యేంతవరకు ఆస్తులన్నింటికీ నేనే గార్డియన్ అవుతాను. వాడు మేజర్అయ్యి నన్ను ప్రశ్నించేంత లోపు, ఆనంద్ ఆస్తి మొత్తాన్ని మన వసం చేసుకుందామనుకున్నా

అలాగైతే ఇప్పుడు మనకి ఏమీ రాదు. అంతేకదా?”

ఎవర్రా వీడు...ఉత్త మట్టి బుర్ర... ఇంకా ఆనంద్ దగ్గర కోటి రూపాయల విలువగల ఆస్తి ఉంది

ఏం ప్రయోజనం? మిగిలున్న ఆస్తంతా ఆనంద్ అమ్మినా అతని అప్పు తీరదు. కొడుకుకే ఏమీ ఇవ్వలేని బిచ్చగాడవుతాడు. ఇక మనకొచ్చేదేముంది?”

ఆనంద్ ఇప్పుడే చచ్చిపోతే?”

నీకేమన్నా పిచ్చా?  ఆనంద్ ఇంకా ఆరొగ్యంగానే ఉన్నాడు కదా? వాడిపుడప్పుడే చచ్చిపోడు.

అవున్రా...వాడు ఇప్పుడే చచ్చిపోడు. దానికి మనమే ఏర్పాటు చేయాలి

నాన్నా?”

ఎందుకురా ఆశ్చర్యపోతున్నావు? ఇది ఒక విధంగా తప్పట్లేదు. ఆనంద్ ఆస్తిలో  కనీశం సగం ఆస్తి అయినా మనం చేజిక్కించుకోవచ్చునని ఇన్ని సంవత్సరాలు ఆనంద్ దగ్గర, ఆనంద్ కోసం ఎన్ని నీచమైన పనులు చేసేనో తెలుసా! ఇప్పుడు  ఆనంద్ ఉన్న పరిస్థితికి మనం ఏమీ సంపాదించలేము. ఇన్ని సంవత్సరాలు  అతనితో కుస్తీ పడినందుకు కనీసం కోటి రూపాయలైనా దోచుకోలేదనుకో ఇన్ని రోజులు నేను జీవించిందే వేస్టు. కాబట్టి మనమే అతన్ని లేకుండా చేయాలి. హత్య అనేది బయటకు తెలియకుండా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కూడా పరవాలేదురా. వాడు ఉంటున్న బంగళా, ఇంట్లో ఉంచుకున్న నగలు, డబ్బు అంతా కలిపి కోటిన్నర చేస్తుంది. మంచి ప్లాను వేసి తరువాత చెప్తాను" అన్న సుబ్బారావ్ గారు కళ్ళు మూసుకుని -- ఆలొచనలో ఉండిపోయాడు.

                                                                                                                 Continued...PART-18

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి