3, మే 2023, బుధవారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-7)


                                                                                ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                               (PART-7) 

సంవత్సరం

ఆనంద్ తన మొద్దుబారిన పెదాలతో, సుతిమెత్తని పెదాలను అదుముతున్నాడు. వీపంతా ముగ్గులు వేయటానికి వేయబడిన చుక్కలలాగా చెమట.

మెల్లగా అన్నది ఆమె.

మూడు గాజులు ఇంతవరకు ముక్కలైనై.

అప్పుడు సెల్ ఫోన్ మోగింది.

ముఖ్యమైన సమయంలో అడ్డుపడిన సెల్ ఫోనును కాల్చేటట్టు చూసి, అది ఆపకుండా మోగిస్తున్న పిలుపుతో మండిపడి, కోపంతో సెల్ ఫోన్ తీసుకుని ఆన్ చేసి హలో అన్నాడు ఆనంద్.

నమస్తే సార్. మిస్టర్ ఆనందే కదా మాట్లాడేది?”

అవును...ఇప్పుడేమిటి దానికి?” విసుగుతో గట్టిగా అరిచాడు ఆనంద్.

హలో, హలో...అరవకండి. నా పేరు మీకు అనవసరం. మీ స్నేహితుడ్ని అని పెట్టుకోండి. ఒక స్నేహితుడి బాధ్యతను నేను పూర్తి చేస్తాను

మంచంలో పడుకోనున్న అమ్మాయి, ఆనంద్ ని గట్టిగా పట్టుకోవటంతో...   ఏయ్...బుద్దిలేనిదానా? కొంచం ఉండవే!

కొంచం ఉండవేనా? ...! చాలా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఫోను చేసానా? సారీ, కానీ మీరు ఇలాగే ఉంటే మీ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మీకు మిగలదు. జాగ్రత్త!

ఇడియట్! నువ్వు ఎవర్రా?”

చెప్పాను కదా, నీ స్నేహితుడ్ని!

పిరికి అని పెట్టుకోరా మూర్ఖుడా!

ఏదో మీకు సహాయం చేద్దామని ఫోను చేసాను. నేను చెప్పేది వినకుండా  విసుగుతో ఎదిరించి మాట్లాడితే... తరువాత మీకు సహాయమే చేయను మిస్టర్. ఆనంద్

రేయ్ పిరికోడా! నాకు ఎవరి సహాయమూ అక్కర్లేదు. నేనే వెయ్యి మందికి సహాయం చేయగలను

దానికి డబ్బు కావాలి కదా? ఇంకో రెండు రోజుల్లో నీకు లక్షల్లో నష్టం రాబోతోంది

మూర్ఖుడా! నువ్వు ఎవరనేది మొదట చెప్పరా...అప్పుడే నమ్ముతాను

చెప్పాను. నమ్మితే నమ్ము. నమ్మకపోతే పో. నాకు ఒక రూపాయి దండగ. నేను నీకు ఫోను చేయటం తప్పే మిస్టర్. ఆనంద్. సెల్ ఫోన్ ఆఫ్ చేసి మీ ఉల్లాసాన్ని గమనించండి

ఎవర్రా వీడు...దరిద్రుడు! అని గొణుగుతూ సెల్ ఫోన్ను పక్కన పడేసాడు ఆనంద్.

ఏమైంది?” అన్నది. తలలో ఉన్న మల్లె పూవులలో ఒకటి పీకి అతని గుండెల మీద విసురుతూ.

ఏమీ లేదు...ఎవడో ఒక పనిలేని మంగలి మాట్లాడాడు. అది సరే...నిన్నెవరు ఇంతలో డ్రస్సు వేసుకోమన్నది?” అన్నాడు.

పోయిన సంవత్సరం

ఊగే ఈజీ చైర్లో కూర్చోనున్నాడు ఆనంద్.

చేతిలో పట్టుకోనున్న మందు నిండిని గ్లాసులో వేయబడ్డ ఐసు ముక్కలు పూర్తిగా కరిగినా ఇంకా గుక్కెడు కూడా తాగకుండా, ఎదురుగా కూర్చున్న బాబాయ్ సుబ్బారావ్ ను చూస్తూ ఉన్నాడు. 

విషయాన్ని అంతటితో వదిలేయి ఆనంద్

ఎలా వదలగలను బాబాయ్? అవమానం...ఎంతపెద్ద అవమానం!

అవమానమే! కానీ, జరిగిన విషయం ఎవరికీ తెలియదు కదా ఆనంద్!

అది నిజమే బాబాయ్! కానీ, నా గుండె మండిపోతోందే. చిన్న బిడ్డ నా మీద ఉచ్చ పోస్తే కూడా, బిడ్డను చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఆమె, నా మొహాన ఉమ్మేసింది బాబాయ్! నా దగ్గర చెయ్యి జాపి జీతం తీసుకునే ఒక సాధారణ మనిషి!

సరే, దానికి ఏం చేయమంటావు?”

మీరే బాబాయ్ ఆలొచన చెప్పాలి. నాకు ఆమె కావాలి. ఒకసారి కావాలి. ఖచ్చితంగా కావాలి. మొదట ఆమె మీద ఆశతో ఇష్టపడ్డాను. ఇప్పుడు ఆమె మీద పగ తీర్చుకోవటానికి ఆమె కావాలంటున్నాను

ఆనంద్, నీకోసం నేను ఎవరెవరికో ఫోన్ చేసాను. రహస్యంగా కారులో పిలుచుకు వచ్చాను. కానీ, ఇది వేరు అబ్బాయ్. కుటుంబంలో ఉండే అమ్మాయి. అందులోనూ ఆమె మరునాడే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది

రాజీనామా చేసేస్తే వదిలేయ గలమా బాబాయ్? ఆలొచన చెప్పండి అంటే నీతులు చెబుతున్నారు? మీకు పెద్ద బుర్ర. మీకు ఎప్పుడూ యుక్తులు తడతాయి! అందుకే కదా మిమ్మల్ని నాతోనే ఉంచుకున్నాను. నాకు ఆమె కావాలి. ఎంత ఖర్చు అయినా సరే

సుబ్బారావ్ గారు ఆలొచిస్తునట్టు తన నుదిటి మీద గోక్కున్నాడు.

                                                                                                           Continued...PART-8

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి