28, మే 2023, ఆదివారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-19)

 

                                                                               ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                               (PART-19)

సంవత్సరం.

నమస్తే అన్నాడు వెంకట్.

తలెత్తి చూసాడు ఆనంద్.

ఆల్రెడీ మూడు రౌండ్ల మందు లోపలకు వెళ్ళింది.

చోటు: ఆనంద్ బంగళా పచ్చిక బయలు.

సమయం: చంద్రుడు ఆకాశంలో తేలుతున్న రాత్రి ఎనిమిది.

చిన్న టీపా మీదా మందు బాటిల్ సగం వరకే ఉంది.

రావయ్యా. కూర్చో. ఇంకేదన్నా కంపెనీలో ఉద్యోగం దొరికి చేరేవా?”

ఇంకా లేదు సార్

నా విధి! ఎలా ఉన్న వాడిని...ఎలా అయిపోయానో చూసావా?”

ఆనంద్ గడ్డంతో, బుగ్గలు అంటుకుపోయి ఉన్నాడు. చేతిలో ఉన్న గాజు గ్లాసులో మళ్ళీ మందు పోసుకున్నాడు.

మీ విధికి, మీరు ఇలా అయిపోవటానికి మీరే కారణం సార్

నేనా?”

అవును మీరే. మీ బాబాయికి మీరు మీ వ్యాపార బాధ్యత అప్పగించటమే మీ స్థితికి కారణం

చూడు, నీతో కొంచం క్లోసుగా మాట్లాడుతున్నా కదానని నువ్వు అనవసరంగా మా బాబాయ్ మీద నేరం మోపుతున్నావు. మా బాబాయ్ గురించి నీకేం తెలుసు. నా చిన్నప్పటి నుంచి....

ఆపండి సార్. మీ దగ్గర ఇంకా నేను దాచి పెట్ట దలుచుకోలేదు. మీకు మాటి మాటికి ఒకడు ఫోను చేసి...మీ స్నేహితుడని చెప్పి మీకు రాబోయే నష్టాల గురించి మీకు హెచ్చరిక చేసేడే ?”

అవును

అది నేనే

ఏమిటీ?”

అవును సార్. మీ కంపెనీలో చేరిన మొదటి రోజు మీ బాబాయిని కలవటానికి ఆయన గదికి వెళ్లాను. ఆయన ఎవరితోనో ఫోనులో మాట్లాడుతున్నాడు. అందుకని గది బయటే ఆగిపోయాను. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వినవలసి  వచ్చింది. ఆయన ఎవరితోనో ఒక సప్లయర్ దగ్గర మీ గిరించి చెడుగా మాట్లాడటం విన్నాను. తరువాత ఆయన్ని కలిసాను. మరుసటి రోజు మిమ్మల్ని కలిసాను. మిమ్మల్ని చూసిన వెంటనే మీ మీద నాకు తెలియని ప్రేమ, అభిమానం, అక్కర ఏర్పడింది. కంపెనీ లాభ నష్టాల లెక్కల్లో తీవ్రమైన అవకతవకలు ఉన్నది కనుగొన్నాను.

మీరేమో కంపెనీ వ్యవహారలను పట్టించుకోకుండా హాయిగా కాలం గడుపుతున్నారు. ఇరవై లక్షల మోసాన్ని మీ ముందుకు తీసుకు వచ్చాను. అప్పుడైనా మీరు మేల్కోనుండాలి. మీ బాబాయి మిమ్మల్ని బాగా బ్రైన్ వాష్ చేశారని గ్రహించాను. ఆయన చెప్పిందంతా నమ్మారు. మోసం చేసింది పర్చేస్ మేనేజర్ కాదు. మీ బాబాయే

నిజంగానా?” అన్నాడు ఆనంద్.

లోకం తెలియని మనిషిలాగా ఉండిపోయేరే! మీ బాబాయికీ, ఆయన కొడుకు అశోక్ కు దగ్గర దగ్గర ఐదు బ్యాంకులలో అకౌంట్లు ఉన్నాయి. ఇదంతా మీ మీదున్న అక్కరతో ఇన్వస్టిగేట్ చేశాను. ఇప్పుడు చివరిగా దొరికిన ఒక వార్త. వెంటనే ఇక్కడకు తీసుకు వచ్చాను. మిమ్మల్ని హెచ్చరిస్తున్న స్నేహితుడెవరో తెలియపరచాల్సి వచ్చింది అన్నాడు వెంకట్.

ఏమిటా వార్త?” -- నుదురు చిట్లిస్తూ అడిగాడు ఆనంద్.

తన ప్యాంటు జేబులోంచి ఆడియో క్యాసెట్టును బయటకు తీసాడు. ఒక టేప్ రికార్డర్ తీసుకు రమ్మని చెప్పి...అందులో క్యాసెట్టును ఉంచాడు.

వినండి. మీ బాబాయి యొక్క ప్రేమ పూర్వక పధకాన్ని వినండి

టేప్ మెల్లగా కదిలింది.

అశోక్. ఆనంద్ కి  తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. వాడి ఆస్తులన్నీ అతని పేరు మీదే ఉన్నాయి. ఒకే వారసుడు. ఊటీ కాన్వెంటులో చదువుతున్న అతని కొడుకు. సడన్ గా ఆనంద్ చచ్చిపోయాడే అనుకో, అతని కొడుకు మైనర్ కాబట్టి, వాడు మేజర్ అయ్యేంతవరకు వాళ్ళ మొత్త ఆస్తికీ నేనే గార్డియన్ అవుతాను. వాడు పెద్ద వాడయ్యి ప్రశ్నలడిగే స్టేజీకి వచ్చేలోపల ఆస్తి మొత్తం మన వసం చేసుకుందాం అని అనుకున్నా

ఆనంద్ కళ్ళు ఎరుపెక్కేయి, పళ్ళు కొరుక్కోబడ్డాయి.

నా బాబాయా ఇలాగంతా మాట్లాడాడు?”

ఇంకా ఉంది. వినండి సార్

ఆనంద్ లేకపోతేనే కదా నీ ప్లాను విజయవంతం అవుతుంది. ఆనంద్ పూర్తి  ఆరొగ్యంగా ఉన్నాడు. ఇప్పుడప్పుడే నువ్వనుకున్నది జరగదు. అది జరిగేటప్పటికి నీకు వయసు అయిపోతుంది

ఎవర్రా వీడు...పిచ్చోడిలాగా ఉన్నాడు. అతను ఆరొగ్యగంగానే ఉన్నాడని, ఎక్కువ కాలం ఉంటాడని నాకు తెలియదా? కానీ ఆనంద్ చచ్చిపోవాలి. దానికి మనమే ఏర్పాటు చేయాలి!

నాన్నా!

ఎందుకురా ఆశ్చర్యపోతున్నావు? హత్య అనేది బయటకు తెలియకుండా ఉండేటట్టు ఏర్పాటు చెయ్యాలి. ఇప్పటికీ అతని దగ్గర రెండు కోట్ల విలువకు పైనే ఆస్తి ఉంటుంది. ఆస్తి కూడా కరిగిపోయేలోపు మన ప్లాన్ పక్కాగా నెరవేరాలీ

బాబాయ్!అంటూ గొంతు చించుకునేలా అరిచాడు ఆనంద్.

వేగంగా లేచాడు. సార్...సార్ అన్న వెంకట్ పిలుపును లెక్కచేయకుండా వేగంగా తన గదికి వచ్చి, లైసన్స్ ఉన్న తన తుపాకీని తీసుకుని, దాన్ని నడుం దగ్గర దాచాడు.

వెనక్కి తిరిగినప్పుడు, “శభాష్ అన్నాడు వెంకట్. శత్రువు మిమ్మల్ని చంపేలోపు మీరు అతన్ని చంపుదామనుకుంటున్నారు. మంచి ఆలొచనే! కానీ, అవసరపడితే మీరు దొరికిపోతారు

నా చేత్తో ఇప్పుడే వాడ్ని చంపితేనే నా ఆత్రం చల్లారుతుంది

చెయ్యండి. న్యాయమే! కానీ మీరు చిక్కుకోకుండా తెలివిగా చెయ్యాలి. నేను ఒక ప్లాను చెబుతాను. దాని ప్రకారం చేస్తే మీ బాబాయిని మీరు ఈజీగా చంపేయొచ్చు. మీరూ పట్టుబడరు

ఏమిటా ప్లాను...చెప్పు...త్వరగా అన్నాడు ఆనంద్, ఓర్పు నశించి.

బెంగళూరులో నాకొక ఇల్లు ఉంది. అక్కడ కొన్ని రోజులు తలదాచుకోని ఉండటం మంచిది. హత్యా నేరం మీ మీద పడకుండా తప్పించుకోవటానికి వసతిగా ఉంటుంది

.......................”

ఇప్పుడు మీ బాబాయి ఎక్కడున్నారో తెలుసా?”

ఇంట్లోనే ఉంటాడు

లేదు. మిమ్మల్ని చంపే విషయంలో ఒక మనిషిని రమ్మని చెప్పి, కరీం నగర్ కు ఫోను చేసేసి, అతన్ని కలుసుకోవటానికి హోటల్ దివ్యాలో రూము నెంబర్ 119 లో ఉన్నారు

ఇదంతా నీకెలా తెలిసింది?”

మీ బాబాయిని ట్రాక్ చేయటానికోసం ఆయన ఎప్పుడూ ఉపయోగించే చిన్న సూట్ కేసులో రహస్యంగా ఒక మైక్రోఫోన్ ఉంచి అయన ప్రతి సంభాషణ విన్నాను. క్యాసెట్టును కూడా అలాగే రికార్డు చేశాను. అందువలన వాళ్ల ప్లాను నాకు క్లియర్ గా తెలుసు

సరే, నువ్వూ నాతోరా. నేరుగా హోటలుకు వెళ్ళి అతన్ని ఫినీష్ చేద్దాం. ఫినీష్ చేసేసి బెంగళూరు వెళ్ళిపోదాం. ఏమంటావు...?”

దానికి ముందు ఒక చిన్న కార్యం చేయాలి. ఒక కాగితమూ, పెన్నూ  తీసుకోండి...చెబుతాను. దేనికీ? ఎందుకూ? అంటూ అడుగుతూ నిలబడకండి. కారణం లేకుండా నేను ఏమీ చెయ్యను

సమయంలో అన్ని విషయాలనూ తనకి సపోర్టుగా వివరించి చెప్పి, ఎదురు చేయాల్సిన పధకాలను ప్లాను వేసి చెబుతున్న వెంకట్ ఒక దేవుడిలాగా కనబడ్డాడు -- ఆనంద్ కి.

దాంతో పాటూ తాగిన మత్తు కలవటంతో, వెంకట్ తనకి సపోర్టుగానే పనులు చేస్తున్నాడు అనే నమ్మకం కలగడంతో, అతని మీద అనుమానమే కలగకుండా నమ్మి -- ఒక బానిసలాగా కాగితమూ, పెన్నూ తీసుకు వచ్చాడు.

నేను చెప్పినట్టు రాయండి. వివరణ తరువాత చెబుతాను

సరే, ఏం రాయాలి?” 

ప్రియమైన కొడుకు సుధీరుకు.

తండ్రి ఆనంద్ ప్రేమతో రాస్తున్నది.

మధ్య వ్యాపారంలో నాకు ఏర్పడిన నష్టం నాకు తగిలిన, తేరుకోలోని ఒక పెద్ద దెబ్బ! పేకమేడలాగా నేను ఒక్కసారిగా వేగంగా పడిపోయాను. ఇంతపెద్ద ఓటమిని నా వల్ల తట్టుకోవటం కుదరటం లేదు. వెళ్ళిన ప్రతి చోటా నన్ను దుఃఖం విచారిస్తున్నారు. పెద్ద అవమానంగా ఉంది.

పారేసుకున్న మనశ్శాంతిని వెతుక్కుంటూ నేను ఇంటిని, ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలనేది నేనే తీర్మానించుకోలేదు. నా మనసు నిలకడగా లేదు. నిలకడ అయినప్పుడు, తిరిగి వస్తాను. రోజు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఎవరూ నన్ను వెతకటానికి ప్రయత్నించ వద్దు. నీకు నా ప్రేమ పూర్వకమైన దీవెనెలు.

ఇట్లు.

ఆనంద్.

వెంకట్ చెబుతుంటే అలాగే రాసి సంతకం పెట్టాడు ఆనంద్.

కింద తారీఖు వేయండి నిన్నటి తారీఖు...!

నిన్నటి తారీఖా...దేనికీ...? సరే, వేశాను

ఉత్తరాన్ని మడతపెట్టి, టేబుల్ పైన పెట్టండి. మీరు చంపబోయేది రోజు. కానీ,  నిన్ననే మీరు ఊరు వదిలి వెళ్ళినట్టు ఉత్తరం చెబుతుంది. మీరు బెంగళూరులో నెలలకొద్దీ ఉండండి. హత్య కేసును పోలీసులు విచారించి పూర్తి అయిన తరువాత తిరిగి రావచ్చు

అబ్బో...భయంకరమైన కేడీ ప్లాను ఆలొచన లాగుందే. సరే రా

కొద్ది సమయం తరువాత ఇద్దరూ హోటల్ దివ్యా వాకిలిలో ఆటోలో నుండి దిగారు. అతికించిన గడ్డంతో మారు వేషంలో ఉన్న ఆనంద్ ప్యాంటు జేబులో సైలన్సర్ ఫిక్స్ చేసిన తుపాకీ ఉంది.

గది నెంబర్ 119 కి తిన్నగా వెళ్ళి తలుపు కొట్టండి. తలుపు తెరిచిన వెంటనే లోపలకు దూరి, వెంటనే తుపాకీతో కాల్చండి. నేను ఇక్కడే నిలబడతాను. త్వరగా వచ్చేయండి అన్నాడు వెంకట్.

ఆనంద్ తిన్నగా నడిచాడు.

కాలింగ్ బెల్ నొక్కాడు.

సుబ్బారావ్ గారు తలుపు తీసారు.

నేను లోపలకు రావచ్చా సార్?”

మీరెవరో నాకు తెలియదే...మీరెవరు?”

లోపలకు వచ్చి చెబుతాను ఆనంద్ లోపలకు వెళ్ళి తలుపు మూసి ఏరా బాబాయ్, నన్ను దివాలా ఎత్తించింది కాక, హత్య కూడా చెయ్యాలని ప్లాను వేశావా? నువ్వు ప్రాణాలతో ఉంటేనేగా ప్లాను వేయగలవు? లేకుండా చేస్తాను అన్నాడు.

ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా, తుపాఖీ తీసి సుబ్బారావ్ గారి గుండెల్లో కాల్చాడు.

మళ్ళీ కాల్చేడు.

మళ్ళీ కాల్చేడు.

ఆనంద్ హోటల్ వాకిలికి వచ్చినప్పుడు -- వెంకట్ తన స్కూటర్లో కాచుకోనున్నాడు.

ఆనంద్ అతని స్కూటర్ వెనుక ఎక్కి కూర్చుని అయ్యింది. ఖచ్చితంగా చేసేసేను. మూడు గుళ్ళు ఖాలీ. అది సరే స్కూటర్ ఎక్కడిది?” అన్నాడు.

నాదే. ముందే ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచాను

ఇప్పుడు ఎక్కడికి వెడుతున్నాం?”

క్రిష్ణారావు పేట

అక్కడికి ఎందుకు?”

అక్కడే నా ఇల్లు ఉంది. బెంగళూరు లోని నా ఇంటి తాళం చెవిని మీకిచ్చి పంపించాలే

తమ్ముడూ వెంకట్, నువ్వు ఎవరో...? నాకోసం ఇంత సహాయపడుతూ  నడుచుకుంటున్నావే. నువ్వు బాగుండాలి. నా బాబాయిని నమ్మి నేనిలా మోసపోతానని నేను కొంచం కూడా ఎదురు చూడ లేదు

వెంకట్ మాట్లాడకుండా బండీ నడిపాడు.

తుపాకీ ఎక్కడ?”

నా జేబులో ఉంది

అది మీ దగ్గర ఉండటం ఆపద. నా దగ్గర ఇచ్చేయండి. నేను దాన్ని డిస్ పోజ్చేసేస్తాను

అది కూడా కరక్టే

తుపాకీని ఒక చేత్తో తీసుకుని, తన బనియన్ లో వేసుకున్నాడు వెంకట్. ఇప్పుడు సమయం పది దాటింది...రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గింది.

క్రిష్ణారావు పేట వచ్చి ఒక పర్టిక్యులర్ క్రాస్ వీధిలో స్కూటర్ను ఆపాడు.

వీధిలో వెలుతురు లేదు. దగ్గరలో ఇళ్ళూ లేవు. వీధి దీపాలూ లేవు.

ఇక్కడ నాకు కూడా ఒక ఖాలీ స్థలం ఉందయ్యా. దారిలోనా వెళ్ళాలి మీ ఇంటికి?”

అవును అన్నాడు అతను. కొద్ది సమయం తరువాత ఒక ఖాలీ స్థలం దగ్గర స్కూటర్ను నిలిపాడు.

అరె...ఇది నా స్థలం. నీకు తెలుసా? ఎందుకు ఇక్కడ ఆపావు?”

దిగండి. ఒక విషయం మాట్లాడాలి

దిగాడు ఆనంద్.

స్థలంలో పిచ్చి చెట్లు గుబురుగా పెరిగినై.

మరింత మబ్బుతో ఆకాశం చంద్రుడ్ని కప్పేసింది. అక్కడ కారు చీకటిగా ఉంది. నల్లటి ఆకారాలలోనే ఒకరినొకరు చూసుకోగలిగారు.

తన టార్చ్ లైటును ఆన్ చేసిన వెంకట్, నేల మీద కొంచం జరిపి వెలుతురు చూపాడు.

అక్కడ ఒక పొద వెనుక లోతైన గుంట త్వ్వబడి ఉంది.

ఏమిటిది, నా స్థలంలో ఎవరో గుంట తవ్వి ఉంచారు?”

ఎవరో కాదు ఆనంద్. నేనే గుంట తవ్వి నీ దగ్గరకు వచ్చాను

ఏమిటి మర్యాద లేకుండా పేరు పెట్టి మాట్లాడుతున్నావు? ఎందుకు గుంట తవ్వావు?”

నిన్ను పూడ్చి పెట్టటానికే ఆ గుంట. నా వదినను పూడ్చిన చోటు దగ్గరే నిన్ను కూడా పూడిస్తేనే కదా పగకి పగ సరైనదిగా ఉంటుంది. అర్ధం కాలేదా...? నీ ఆఫీసులో ఉద్యోగం చేసిన మహతీ నా వదిన రా.

నీ బాబాయి ప్లాను వేసిచ్చి -- నువ్వు తెలివిగా ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసి -- నీ తోట మాలి సహాయంతో పూడ్చిపెట్టమన్నావే... మహతీయేరా. నువ్వూ-- నీ బాబాయి, మీరిద్దరే నా కుటుంబం చెదిరిపోవటానికి కారణం అని నేను తెలుసుకున్న వెంటనే -- మీ ఇద్దరి మీదా పగ తీర్చుకోవాలని కష్టపడి నీ కంపెనీలో ఉద్యోగానికి చేరేను.

మీ బాబాయి చేసాడని చెప్పిన అన్ని కార్యాలూ నేనే చేసేను. నిన్ను నష్టపరిచి, దివాలా తీయించింది నేనే. నిన్ను ప్రేరేపించి నీ చేతులతోనే నీ బాబాయిని హత్య చేయించాను. నాకు దొరికిన సాక్ష్యాలతో నిన్ను పోలీసుల దగ్గర పట్టించగలను. కానీ, దానిలో నాకు తృప్తిలేదు. నీ దగ్గరున్న డబ్బు, నీ కాంటాక్టులతో నువ్వు బయటకు వచ్చేస్తావు. మళ్ళీ నీ ఆట మొదలు పెడతావు. మరికొంతమంది మహిళలు నీకు బలైపోతారు. అందుకే నిన్ను చంపేయాలని తీర్మానించుకున్నాను. నా చేత్తో చంపితేనే నీ మీద పగ తీర్చుకున్నట్టు అవుతుంది. నా వదిన ఆత్మ శాంతిస్తుంది. అందుకే నిన్ను చంపాలని ప్లాను వేసేను.

ఇప్పుడు చూడు...నీ చేత్తోనే ఉత్తరం రాసి ఉంచావు. నువ్వు ఊరు వదిలి పోయినట్లుగా పోలీసులూ, మిగిలిన వాళ్ళూ నమ్ముతారు. నిన్ను ఊరు, ఊరు వెతుకుతారు. కానీ, నువ్వు నీ సొంత స్థలంలోనే సమాధి అయ్యావని ఎవరికీ తెలియదు అన్నాడు వెంకట్.

ఆనంద్ దగ్గర తీసుకున్న తుపాకీని తీసి అతని వైపు గురి పెట్టాడు.

వద్దు. నన్ను కాల్చకు, ప్లీజ్...

బ్రతిమిలాడ, బ్రతిమిలాడా -- మిగిలిన మూడు తోటాలూ అతని గుండెల్లోకి కాల్చి అతన్ని చంపాడు.

కోపంతో ఆనంద్ ను తన కాలితో గుంతలోకి తోసి, మట్టిని వేసి మూసేసి -- చోటును వదిలి బయలుదేరటానికి వెంకట్ కి  మరో అరగంట పట్టింది.  

                                                                                                                                                                                                                                                                                    Continued...PART-20

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి