అంగారక గ్రహంలో మనుష్యులు...? (ఆసక్తి)
మనిషి తెలివైన జీవి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కానీ మనిషి కంటే తెలివైన జీవులు అంగారక గ్రహంలో జీవించాయని కొందరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు.
డజన్లకొద్దీ అంతరిక్ష నౌకలు, ఆర్బిటార్లు, ల్యాండర్లు మరియు రోవర్లు కుజునిపై ప్రయోగించబడ్డాయి. వీటిని సోవియట్ యూనియన్, నాసా,
యూరప్ మరియు జపాన్ మొదలైన దేశాలవారు, కుజుని ఉపరితలంపై వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించారు.
1975 లో నాసా వైకింగ్ కార్యక్రమం ప్రారంభించి వీటిలో గల రెండు ఆర్బిటర్లను సంధించారు. ప్రతీది ఒక ల్యాండర్ కలిగి ఉన్నది. ఈ కార్యక్రమం మొదటిసారిగా కుజుని రంగు చిత్రాలు భూమిపైకి పంపగలిగినది. అంగారక గ్రహంలో కనిపించే ప్రతి చిత్రం ఎప్పటి కప్పుడు చర్చను రేకెత్తిస్తోంది. సరికొత్త ప్రతిపాదనలకు కారణమవుతోంది.
1976లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కు చెందిన వైకింగ్-1 స్పేస్ క్రాఫ్ట్ అంగారకుడి చిత్రాలను భూమికి పంపింది. ఆ చిత్రాలలో సైడోనియా అనే ప్రాంతంలో మానవ ముఖ రూపం బయటపడింది.ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన భౌగొళిక ఆకారం అని కొద్దిమంది అంటే అలా ఏర్పడింది కాదని కొందరన్నారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అంగారక గ్రహంలో మనుష్యులు...?... (ఆసక్తి) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి