7, మే 2023, ఆదివారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-9)

 

                                                                              ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                               (PART-9)

పోయిన సంవత్సరం

సార్, మీకు ఫోను

కల్యాన్ తన టేబుల్ వదిలి లేచి వెళ్ళి, అకౌంటంట్ టేబుల్ పైన ఉన్న రిజీవర్ను ఎత్తి, “కల్యాన్ మాట్లాడుతున్నాను అన్నాడు. 

నేను వెంకట్ మాట్లాడుతున్నా అన్నయ్యా

ఏమిట్రా?...లాండ్ లైనుకు ఫోను చేసావు?”

ఏమీ లేదన్నయ్యా...నా సెల్ ఫోనులో చార్జ్ అయిపోయింది. అందుకే

సరే. విషయం ఏమిటో చెప్పు?”

బెంగళూరులో ఒక కంపెనీకి ఇంటర్వ్యూ కు వెళ్ళాను కదా? వాళ్ళు మళ్ళీ నన్ను సెకెండ్ ఇంటర్వ్యూ కు రమ్మని -మైల్ పంపించారు. రేపు సాయంత్రం నాలుగింటికి ఇంటర్వ్యూ. నేను ఇప్పుడే బయలుదేరతాను. ఏదైనా బస్సు పుచ్చుకుని వెళతాను. అది చెప్పటానికే ఫోను చేశాను

సరే వెంకట్...ఆల్ బెస్ట్...

థ్యాంక్స్ అన్నయ్యా

బెంగళూరులో ఎక్కడ స్టే చేస్తావు?”

నా స్నేహితుడు ఒకతని ఇంట్లో స్టే చేస్తాను

అక్కడ సీజన్ చాలా బాగుందని, నాతో పని చేసే ఒకాయన చెప్పారు. స్నేహితుడితోనే కదా ఉండబోతావు. ఒక వారం ఉండిరా. ఖర్చులకు వదిన దగ్గర ఐదువేలు తీసుకు వెళ్ళు. చాలా...?”

అంత అవసరం లేదన్నాయ్యా! రెండు వేలు చాలు

పిసినారిలాగా మాట్లాడకు...ఐదువేలు తీసుకు వెళ్ళు

సరే అన్నయ్యా అన్న అతని స్వరం కొంచం బొంగురుపోయింది.

ఇంటర్వ్యూ అయిన తరువాత ఫోను చెయ్యి...సరే పెట్టేయనా?”

కల్యాన్ తన కుర్చీకి వచ్చాడు.

సమయం నాలుగు గంటల పది నిమిషాలు అనేది గడియారం ముల్లులు చూపించినై.

టీ తాగుతూ, మళ్ళీ ఫైళ్ళలోకి తల దూర్చాడు కల్యాన్.

పావు గంట తరువాత మళ్ళీ ఫోను మోగింది.

లేచి వెళ్ళాడు. చెప్పరా?” అన్నాడు మళ్ళీ తమ్ముడే మాట్లాడుతున్నాడనుకుని.

కల్యాన్ గారేనా?”

అవును...మీరెవరు?”

సార్. నమస్తే. నా పేరు డాక్టర్. చక్రవర్తి...కొద్ది సేపటి క్రితం నేను కారులో వెలుతున్నప్పుడు, ఒక స్త్రీ మీద తెలియక ఢీ కొన్నాను. బలమైన దెబ్బ ఏదీ లేదు. నేనొక డాక్టర్ని. అందువలన వెంటనే ఆమెను ఎత్తి నా కారులో పడుకోబెట్టి, నా క్లీనిక్ కు తీసుకు వచ్చి చికిత్స ఇచ్చాను. 

ఇప్పుడు ఆమె బాగానే ఉన్నది. మాట్లాడుతోంది. తన పేరు మహతీ అని చెప్పి, మీ మొబైల్ ఫోను నెంబరూ, ఆఫీసు నెంబరూ ఇచ్చింది. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అందుకే ఆఫీసు నెంబరుకు చేసాను. ఆమె ఇప్పుడు నిద్రపోతోంది. మీరొచ్చి పిలుచుకు వెళతారా సార్?”

మై గాడ్! ఆమెకు ఏమీ లేదుగా?”

ఏమీ లేదు సార్. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మోకాళ్ళ మీద, తల  మీద చిన్న గాయాలు. తప్పు నాదే. క్షమించాలి. నేరుగా మాట్లాడదాం. నేను అడ్రస్సు చెబుతాను, నోట్ చేసుకోండి

క్లీనిక్ పేరు, అడ్రస్సు రాసుకున్నాడు కల్యాన్.

వెంటనే మేనేజర్ గదికి వెళ్ళి, పర్మిషన్ తీసుకుని తన స్కూటర్ పై బయలుదేరాడు.

అరగంట సమయంలో క్లీనిక్ ఉండే ఏరియా చేరుకుని, నోట్ చేసుకున్న అడ్రస్సుకు వచ్చినప్పుడు కన్ ఫ్యూజ్ అయ్యాడు.

క్లీనిక్ తాళం వేసుంది. 

అప్పుడు ఒక మనిషి అతని దగ్గరకు వచ్చి, “మీ భార్యను వెతుక్కునే కదా వచ్చారు?” అన్నాడు.

అవును

అదిగో నిలబడుంది చూడండి వ్యాను. అందులో పడుకోబెట్టారు. హాస్పిటల్లో చేర్చాలట. మిమ్మల్ని వ్యాను దగ్గరకు రమ్మని డాక్టర్ పిలిచాడు

స్కూటర్ను అక్కడే ఓక్ చెట్టు నీడ కింద నిలబెట్టి, తాళం వేసి, వేగంగా వెళ్ళాడు.

నిలబడున్న వ్యానులో ఇంజెన్ రన్ అవుతోంది. వెనుక తలుపు తెరిచి ఇతను లోపలకు ఎక్కీన వెంటనే, అది బయలుదేరింది.

తలుపులు మూసుకున్నాయి.

లోపల మహతీ లేదు. బదులుగా దృఢమైన శరీరంగల నలుగురు ఉన్నారు. నలుగురూ నల్ల గుడ్డలతో ముఖం కప్పుకోనున్నారు.

ఎవరు మీరంతా...నా మహతీ ఎక్కడ?”

టెన్షన్ పడకండి సార్. మీ భార్యకు ఏమీ అవలేదు. సురక్షితంగా మీ ఇంట్లో ఉన్నది. ఆమె నలుపా-తెలుపా అని కూడా మేము చూసింది లేదు. మిమ్మల్ని ఇలా రప్పించి రహస్యంగా కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళటానికే టెలిఫోనులో అబద్దం చెప్పాము అన్నాడు ఒకడు.

కిడ్నాపా...నన్నా? నేనేమన్నా డబ్బుగల ఇంటి మనిషినా, లేక రాజకీయ నాయకుడినా?”

నటించకు కల్యాన్. మా స్నేహితుడు రాజేశ్వరయ్యని దయా దాక్షణ్యాలు  చూడకుండా హత్య చేసేవే! దానికి జవాబు చెప్పక్కర్లేదా?”

ఇబ్బంది కరమైన పరిస్థితుల్లో కూడా కల్యాన్ కు నోరారా నవ్వాలని అనిపించింది.

రాజేశ్వరయ్యా... పేరును నేను వినను కూడా లేదు. మీ స్నేహితుడా? నేను హత్య చేసానా?”

విడి విడిగా అడిగితే లేదని అయిపోతుందా? మేమొక టెర్రరిస్టు గుంపు. దేనికీ భయపడము. రాజేశ్వరయ్యని నువ్వే హత్య చేసావని మాకు కరెక్టు వార్త వచ్చింది. నిన్ను రహస్యంగా కిడ్నాప్ చేసి తీసుకు రమ్మని మా అధికార వర్గం నుండి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ను మేము ఇప్పుడు విజయవంతంగా నెరవేర్చాము. సారును పట్టుకుని కట్టేయండిరా

కల్యాన్ కు భయం వచ్చేసింది. 

చెప్పేది వినండి. నేను అమాయకుడ్ని. నన్ను ఏం చేయకండి ప్రామిస్ గా నేను ఎవర్నీ హత్య చెయ్యలేదు అంటూ అరుస్తూ భయపడి దిగుతున్నప్పుడే తాడుతో కట్టేయబడ్డాడు.

కల్యాన్ నోటి మీద ఒక వెడల్పాటి ప్లాస్టర్అతికించబడింది.

అవతారంలో కల్యాన్ ని వీడియో తీశాడు, గుంపులోని ఒకడు.

                                                                                                                   Continued...PART-10

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి