22, మే 2023, సోమవారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-16)

 

                                                                               ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                                 (PART-16)

పోయిన సంవత్సరం

గోడకు ఆనుకుని, మోకాళ్ళలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు వెంకట్.

అతని తలను ఓదార్పుగా నిమురుతోంది మల్లికా.

సంఘటన జరిగి రెండు వారాలైనా, మీరు ఇంకా బాధింపు లో నుండి కోలుకోలేదు. బయటకు రాలేకపోతున్నారా?”

కుదరటం లేదు మల్లికా. కుదరటం లేదు! నేను ఏదీ నమ్మలేకపోతున్నాను. ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్ళిన వాడిని, తిరిగి వచ్చేలోపు నా కుటుంబంలో ఇంత పెద్ద ప్రళయం జరుగుతుందని ఎదురు చూడలేదు. అన్నయ్య ఇంత బలహీనమైన ముగింపు తీసుకున్నాడే! వదిన అలాంటి మనిషి కాదు మల్లికా, బంగారం! ఆమె గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే, మాట్లాడిన వాళ్ళ నాలిక కుళ్ళిపోతుంది. ఆమెను పోయి ఈయన ఎలా అనుమానపడ్డాడు?”

కొన్నిసార్లు మనం నమ్మలేనివన్నీ జరుగుతాయి!

మల్లికా! ఇంకోసారి ఇలా మాట్లాడితే, నాకు పిచ్చి కోపం వస్తుంది. ఏదో ఒక కుట్ర  జరిగింది. ఇంటి నుండి వెళ్ళిపోయే ఆవిడ, చెప్పులు కూడానా వేసుకోకుండా వెళుతుంది? మరుసటి రోజు టిఫెనుకు పిండి రుబ్బి పెట్టా వెళుతుంది?

కుట్ర...ఏదో కుట్ర! ఏదో ఒక నిర్భంధం వలన ఉత్తరం రాయబడి ఉంటుంది. ఎవరో ఒకరు అలా రాయమని బెదిరించి ఉంటారు. అది కనిబెట్టాలి మల్లికా! ఇలా ఆలొచించకుండా వెంటనే వదిన్ని అనుమానించి, తనని శిక్షించుకున్న అన్నయ్యను తలుచుకుంటే ఒక పక్క కోపంగా ఉంది...మరో వైపు జాలిగా ఉంది. కానీ, కుట్రకు కారణ కర్త ఎవరనేది తెలుసుకోవాలి మల్లికా 

వెంకట్ ఇల్లు ఖాలీ చేసేసి, నెల అద్దెకు గది తీసుకుని అందులో ఉంటూ -- పోలీసు స్టేషన్ కు తన అనుమాలను తీసుకు వెళుతూ చెప్పులరిగేలా తిరిగేవాడు.

మూడు నెలలు కాళ్ళు అరిగేలాగా తిరిగింది మాత్రమే మిగిలింది.

మేము పూర్తిగా విచారణ చేశాము. మీ వదిన బంధువులు, స్నేహితురాళ్ళు, ఆమె ఉద్యోగం చేసిన కంపెనీలో, మీ ఇంటి చుట్టుపక్కల -- ఇలా అన్ని చోట్లా విచారించాము. అనుమానపడేటట్టు ఎలాంటి వార్త దొరకలేదు. శేఖర్ అనే అతని గురించి కూడా ఏదీ తెలియలేదు. కానీ, మీ వదిన స్వయంగా లెటర్ రాసినందువలన దాన్నే నిజమని తీసుకోవలసి వస్తోంది. ఇంతకంటే కేసులో విచారించటానికి ఏదీ లేదు

జవాబుతో డీలా పడిపోయాడు వెంకట్.

మరో రెండు నెలలు గడిచిన తరువాత--

తన పర్సనల్ పనులలో కాలం గడుపుతున్న వెంకట్ కి డబ్బు అవసరం ఏర్పడింది. అర్జెంటు కోసం చేతి గడియారాన్ని అమ్మ వలసిన పరిస్థితి ఏర్పడింది.

గడియారాలు అమ్మే షాపుకు వెళ్ళాడు.

వాచ్అమ్మాలి. ఎంత డబ్బు ఇస్తారు?”

షాపతను అది తీసుకుని పరిశీలిస్తున్నప్పుడు -- అనుకోకుండా షో కేసులో ఉన్న గడియారాలను చూస్తూ వచ్చాడు. అప్పుడు అందులో ఉన్న ఒక లేడీస్ వాచ్ను చూసాడు.

ఆ చేతి గడియారంలోని తెల్ల డయల్ పై లవ్ యూఅని సన్నగా ఎరుపు రంగు అక్షరాలు ఉన్నాయి.

గత సంవత్సరం పెళ్ళి రోజున వదినకు అన్నయ్య చేతి గడియారాన్నే బహుమతిగా ఇచ్చాడు. షాపులో మామూలు గడియారం కొని, లోపల డయల్ పైన అతనే రాసాడు. ఇది అతని చేతి రాతే. పక్కన చిన్నగా కల్యాన్ అని ఉండాలేఅని అనుకుంటూ ధీర్ఘంగా చూశాడు. ఉన్నది’. కొంచం కూడా అనుమానం లేదు

ఆలొచిస్తూ ఉన్నప్పుడే షాపతను అడ్డుపడి మీరు ఇచ్చిన వాచ్ కు వందరూపాయలు ఇవ్వచ్చు

అదే సరే... వాచ్ తీయండి

ఇది లేడీస్ వాచ్ సార్. పాతది. ఇది కావాలా?”

ఇది మీకు ఎలా దొరికింది?”

ఏం ప్రశ్న సార్ ఇది! ఇప్పుడు మీ వాచ్ ను అమ్మటానికి మీరొచ్చినట్టే ఎంతోమంది అమ్ముతున్నారు. కొంటున్నాము. లాభం పెట్టి అమ్ముతున్నాము

వాచ్ ను మీకు అమ్మిన వాళ్ళు ఎవరు?” అని కొంత పెద్ద స్వరంతో అడుగుతూ ఇది మా వదిన వాచ్ సార్!అన్నాడు.

                                                                                            Continued....PART-17

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి