ఓడినవాడి తీర్పు...(సీరియల్) (PART-13)
పోయిన సంవత్సరం
“బాబాయ్”
చెమటతో తడిసిపోయున్న
ఆనంద్ చేతులను
ఆదరణగా పట్టుకుని
మెల్లగా చెప్పారు.
“వదులు!
ఇది ఆమె
విధి! నువ్వు
హత్య చేయలేదు.
యాక్సిడెంట్! అల్ప
ఆయుష్షు!
చచ్చిపోయింది. అన్ని
విధాలుగా ఆమెను
ఇరికించాలని అలాంటి
ఒక ఉత్తరాన్ని
-- ఆమెను బెదిరించి
రాయిపించమని -- ఆలొచన
చెప్పాను. అది
ఇప్పుడు మనకు
ఉపయోగపడబోతోంది.
ఈ శవాన్ని
గోవులపాలెం లో
కొనిపడేసిన ఖాలీ
స్థలంలో రాత్రికి
రాత్రి గొయ్యి
తవ్వి పూడ్చేయమంటాను.
ఈమె భర్త
కల్యాన్ ను
విడుదల చేసేద్దాం.
అతనూ, ఈ
ఊరూ -- మహతీ
తన కొత్త
ప్రేమికుడితో లేచిపోయిందని
నమ్ముతారు. మనకు
ఏ సమస్య
రాదు. శవాన్ని
పూడ్చే పనిని
మన తోటమాలి
గురువయ్యను చెయ్యమని
చెబుతా. వాడికి
ఎక్కువ డబ్బులు
ఇద్దాం. నువ్వు
దేనికీ బాధ
పడకు ఆనంద్.
నేను ఉన్నాగా...ధైర్యంగా
ఉండు”
ఆనంద్ వణుకుతున్న
వెళ్లతో సిగిరెట్టు
తీసి వెలిగించాడు.
చల్లటి నీళ్ళు
తన మొహం
మీద జల్ల
బడగానే, స్పృహ
కోల్పోతున్న స్థితిలో
ఉన్న కల్యాన్
కళ్ళు తెరిచి
చూసాడు.
అదే వ్యాను.
చీకటిలో సన్నని
వెళుతురు. మొహాలు
కనిపించకుండా ముసుగులు
వేసుకున్న నలుగురు
దుండగులు.
తన శరీరంలో
కట్టబడ్డ తాళ్ళు
లేవు. నోటిపై
ప్లాస్టర్ లేదు.
వ్యాను నిలబడుంది.
“సార్, మమ్మల్ని
మీరు క్షమించాలి.
మా స్నేహితుడు
రాజేశ్వరయ్యను హత్య
చేసిన
వ్యక్తి పేరూ
కల్యాన్. కానీ
వేరే కల్యాన్.
ఒక అయోమయంలో
తప్పుగా మిమ్మల్ని
కిడ్నాప్ చేయమన్నారు
హెడ్ క్వార్టర్స్.
ఇప్పుడు అది
వేరే కల్యాన్
అని తెలియడంతో
మిమ్మల్ని వదిలేయమన్నారు.
మీరు వెళ్ళొచ్చు.
వ్యానులో నుండి
కిందకు దిగండి.
రోడ్డు పక్కగా
మీ స్కూటర్
నిలబెట్టాము. తీసుకుని
వెళ్ళొచ్చు” అన్నాడు ఒకడు.
కల్యాన్ తల
ఊపి వ్యానులో
నుండి కిందకు
దిగిన వెంటనే, వేగంగా
వెళ్ళిపోయింది
వ్యాను. రోడ్డు
పక్కగా నిలబెట్టున్న
తన స్కూటర్ను
స్టార్ట్ చేసి
బయలుదేరి వెళ్లాడు
కల్యాన్.
‘ఇది
ఏ చోటు...ఏ
వీధి? ముఖ్యమైన
వీధికి వస్తే
అర్ధమవుతుంది. ఎంత
భయంకరమైన సంఘటన? మంచి
కాలం! చివరగా
వదిలేసారే! ఎప్పుడూ
సాయంత్రం ఐదున్నర
కల్లా ఇంటికి
వెళ్ళిపోతాను. ఇప్పుడు
టైము పదకుండూ
పది. మహతీ
చాల భయపడిపోయుంటుంది!’
కల్యాన్ తన
ఇంటి ముందు
స్కూటర్ ఆపినప్పుడు
సమయం రాత్రి
పన్నెండు.
ఇల్లు తాళం
వేసుండటం గమనించాడు.
‘నేను
రాలేదు కాబట్టి
ఊర్లో ఉన్న
తన మేనమామ
ఇంటికి ఎంక్వయరీ
చేయటానికి వెళ్ళుంటుంది’
‘ఆకలి
వేస్తోంది. ఇంట్లో
ఏదైనా ఉంటే
తినేసి, తరువాత
ఆమె మేనమామ
ఇంటికి వెళ్ళి
ఆమెను పిలుచుకు
వద్దాం’
కల్యాన్ తన
దగ్గరున్న మరో
తాళం చెవితో, తాళం
తెరిచి లోపలకు
వెళ్ళాడు.
లోపలకు వెళ్ళిన
వెంటనే టేబుల్
మీద ఉంచబడిన
ఉత్తరం కళ్ళకు
కనిపించింది. టేబుల్
గడియారాన్ని జరిపి, ఉత్తరాన్ని
తీసి చదవటం
మొదలుపెట్టిన అతను
తన గుండెను
పట్టుకున్నాడు.
చదివి ముగించినప్పుడు
ఆ ఇల్లు
చక్రంలా గుండ్రంగా
తిరిగింది.
‘మహతీనా...నా
మహతీనా!’
‘అనుమానమే
లేదు. ఆమె
చేతిరాతే. ఆమె
ఇలాగా?’
గుండ్రంగా తిరగటం
ఎక్కువయ్యింది.
దబ్ మని
నేల మీద
పడ్డాడు.
Continued...PART-14
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి