15, మే 2023, సోమవారం

ఆడపిల్ల…(కథ)

 

                                                                                    ఆడపిల్ల                                                                                                                                                                           (కథ)

ఆడపిల్ల పుడితే ఇప్పటికీ భారంగా భావిస్తుంటారు. అమ్మాయి పుట్టింది అనగానే.. పెదవి విరుస్తుంటారు. తమపై దించుకోలేని భారం ఉందని భావిస్తుంటారు. ఆడపిల్ల పుట్టింది అనగానే. సంతోషం కంటే.. ఎక్కువగా విసుక్కుంటారు.

 ఆడపిల్ల పుడితే అరిష్టమని, మనకిది శాపమని భావిస్తున్న వారి సంఖ్య తక్కవేమి కాదు.. దీనికి తోడు మగ పిలగాడు పుడితే వారసుడు వచ్చడంటూ సంబరాలు జరుపుకుంటారు చాలా మంది. అబ్బాయి పుడితే ప్రపంచాన్ని జయించినట్లుగా ఫీలవుతుంటారు.

అమ్మాయి కంటే.. అబ్బాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. ఈ వివక్షత ప్రస్తుతం అనేక చోట్ల ఉంది.

కానీ ఈ కథలో మూడో బిడ్డ కూడా ఆడపిల్లగా పుట్టటంతో, ఒక తండ్రి కుటుంబాన్ని వదిలి, ఊరు వదిలి వెళ్ళొపోవలని నిర్ణయించుకుని బస్ స్టేషన్ కు వెల్లటానికి బస్ స్టాప్ కు వెడతాడు.

 అక్కడ అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. ఆడపిల్లలే కన్నవారిపట్ల ఎక్కువ బాధ్యత, ప్రేమ కలిగి ఉంటున్నారని అర్ధం చేసుకుని వెనక్కి తిరిగి వెడతాడు.

ఆ తండ్రికి జ్ఞానోదయం ఎలా కలిగింది? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

"వస్తావా...రావా?"

బ్రతిమిలాడుతున్న దోరణిలో కొడుకును చూసి అడిగింది తల్లి కామాక్షి.

"వద్దు...నాకు అది వద్దు...ఉన్న ఇద్దరే చాలు. దాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు. హాస్పిటల్ వాకిట్లోనే....చెత్త కుండీలో విసిరేసి వచ్చేయమ్మా..." అన్నాడు ఏడుకొండలు, కొంచం కూడా జాలనేదే లేకుండా!

నెత్తి మీద వాత పెట్టినట్టు, చుర్రు మన్నది కామాక్షికి. మడతలుపడ్డ ముఖంలో కోపం అలలు అలలుగా ప్రవహించింది.

"ఛీ...ఛీ... మనిషేనా నువ్వు...? కన్న కూతుర్నే చెత్త కుండీలో విసిరేయమంటున్నావే...?"

"నన్ను ఇంకేం చెప్పమంటావు? ఈ సారైనా మగపిల్లాడు పుడతాడని ఎంత ఆశగా ఉన్నానో తెలుసా? అన్నిట్లోనూ మట్టి పోసిందే...? శనిలాగా దాపురించింది ..."

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఆడపిల్ల…(కథ) @ కథా కాలక్షేపం 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి