13, మే 2023, శనివారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-11)

 

                                                                             ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                                  (PART-11)

పోయిన సంవత్సరం.

రాత్రి ఏడు గంటలకు వీధి చివర తన కారును ఆపి నడిచివచ్చిన ఆనంద్ వీధిలో ఒక్కొక్క ఇంటినీ దాటుతున్నప్పుడు కంటిన్యూ గా టీ.వీ మాటలు వినబడగలిగాడు.

రోడ్డు చీకటిగా ఉంది. చాలా గుడిసెలు చూపుల్లో పడ్డాయి. ఇళ్ళల్లో నలభై వాట్స్బల్బుల కంటే ఎక్కువ లేకుండా కాంతి వెలుగుతున్నాయి. వెదజల్లుతున్నాయి.

మహతీ ఇంటి ముందు నిలబడ్డాడు.

కాలింగ్ బెల్ నొక్కి కాచుకోనున్నాడు.

సాయంత్రం ఐదున్నరకల్లా ఇంటికి తిరిగొచ్చే భర్త - ఏడు దాటినా ఇంకా రాలేదేమిటా అనే ఆందోళనతో ఉన్న మహతీ కాలింగ్ బెల్లు శబ్ధం విన్న వెంటనే భర్తే అనుకుని నవ్వుతూ తలుపు తెరిచింది.

నవ్వు వెంటనే రద్దు అయ్యి, మొహం వాడిపోయింది.

బాగున్నావా...ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలకు రావచ్చా?”

ఆయన ఇంట్లో లేరు. తరువాత రండి

నేను నీతోనే మాట్లాడాలి

ఆయన ఉన్నప్పుడే మాట్లాడాలి

ఆయన గురించే మాట్లాడాలి

అర్ధంకాక ఆశ్చర్యంతో చూసింది మహతీ.

లోపలకు వచ్చి హక్కుగా చెక్క కుర్చీలో కూర్చుని తాగటానికి మంచి నీళ్ళు తీసుకురామ్మాఅన్నాడు ఆనంద్.

ఇష్టం లేకుండానే చెంబుతో మంచి నీళ్ళు తీసుకు వచ్చి ఇచ్చింది.

తీసుకుని తాగి, “విషయం ఏమిటంటే మహతీ, క్లుప్తంగా చెప్పాలంటే, నీ భర్త నా కస్టడీలో ఉన్నాడు. అంటే, నేను కళ్ళు ఊపితే, అతని ప్రాణం కూడా కలిపి  ఊగుతుంది...

పిచ్చిదానిలాగా చూసింది మహతీ.

నమ్మవా...తెలుసే! నాకు నీ గురించి బాగా తెలుసు. దీన్ని నువ్వు సులువుగా నమ్మవని. అందుకే, దీన్ని తీసుకు వచ్చాను. దీన్ని చూడు మహతీ అంటూ తన సెల్ ఫోనులోని వీడియో చూపించాడు.

ఆనంద్ చూపించిన వీడియోలో, కాళ్ళూ-చేతులూ కట్టబడ్డ పరిస్థితిలో - నోటిపై ప్లాస్టర్అతికించబడి నేల మీద పడుకోనున్నాడు కల్యాన్. పరిస్థితిలో తన భర్తను చూసిన మాత్రానే చూపుల్లో చీలికలు ఏర్పడ్డాయి.

అయ్యో! ఎందుకు ఇలా చేశారు...ఆయన ఏం తప్పు చేసారు? ఆయన్ని వదిలిపెట్టండి

ఖచ్చితంగా వదిలిపెడతాము...నేను చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే! వెళ్ళి ఒక పేపరూ, పెన్నూ తీసుకురా...హూ...త్వరగా. ఆలస్యం చేయకు. ఎందుకు అని అడుగుతూ టైము వేస్టు చేయకు

మహతీ వెంటనే తీసుకు వచ్చింది.

టేబుల్ మీద పెట్టి రాయి. నేను చెప్పినట్టు రాయి. ...నన్ను అలా చూస్తూ నిలబడితే ఏమీ ప్రయోజనం లేదు. రాయి

బాల్ పాయింట్ పెన్నును తెరిచిన మహతీ ఏం రాయాలీ?” అన్నది.

చెప్తాను.

ప్రియమైన నా భర్తకు - మహతీ నమస్కరించి రాయునది! కొద్ది కాలంగా శేఖర్ అనే అతనితో నాకు పరిచయం ఏర్పడి, కొత్త స్నేహం లోతుగా పెరిగింది. శేఖర్ మీ కంటే అందంలోనూ-వసతిలోనూ గొప్పవాడు. మా స్నేహం ప్రేమగా మారింది. పెళ్ళి అనే బంధం మా ప్రేమకు పెద్ద అడ్డుగా నిలబడుతోంది. చాలా ఆలొచించి నిర్ణయానికి వచ్చాను.

రోజు నేనూ, శేఖరూ ఊరు వదిలి బయలుదేరి వెళుతున్నాము...ఒక కొత్త జీవితం కోసం. ఇది తప్పే. చెయ్యకూడని పనే. కానీ, నా వలన శేఖర్ను మరిచిపోవటం కుదరటం లేదు. అందువల్ల మిమ్మల్ని వదిలి వెళుతున్నాను. నన్ను వెతక వద్దు. నన్ను క్షమించండి. మరిచిపొండి.

ఇట్లు,

మహతీ.

రాసావా? అందంగా సంతకం పెట్టమ్మా

సంసయిస్తూ, తడబడుతూ నిలబడ్డ మహతీకి మధ్యలో వీడియో చూపబడి-బెదిరించ...వణుకుతున్న వేళ్లతో ఉత్తరాన్ని రాసి ముగించింది మహతీ.

ఆనంద్ దాన్ని తీసుకుని, చదివి చూసి, మడతపెట్టి టేబుల్ పై పెట్టి,  ఎగిరిపోకుండా ఉండటానికి దానిపై టేబుల్ క్లాక్ పెట్టాడు.

మహతీ, రామ్మా అన్నాడు.

ఎక్కడికి?”

మీ ఆయన్ని చూడద్దా?”

అతనితో బయలుదేరటం తప్ప మహతీకి వేరే దారి లేదు.

ఇంటికి తాళం వేసి బయలుదేరింది.

వీధి చివరి వరకు ఇద్దరూ మౌనంగా నడుస్తూ వచ్చారు. తన కారులో  ఎక్కించుకున్న ఆనంద్, ఆమెను వెనుక సీటులో కూర్చోమని చెప్పి కారును డ్రైవ్ చేశాడు.

కొద్ది సేపట్లో ఆనంద్ యొక్క బంగళాకు వచ్చారు.

మేడ మీదున్న గదిలోకి వెళ్ళి -- అక్కడ ఎవరూ లేరనేది గ్రహించి వెనక్కి తిరుగుతున్నప్పుడు, తలుపులు మూస్తున్నాడు ఆనంద్.

వద్దు! అన్నది.

లేదు కావాలి అని నవ్వాడు. ఇలా చూడమ్మా మహతీ. నీ భర్త నా పిడిలో  ఉన్నాడు. కానీ, ఇక్కడ లేడు. ఒక ఫోను చేస్తే వాడ్ని వదిలేస్తారు. నేను ఫోను  చెయ్యాలంటే నువ్వు నాతో సహకరించాలి. అరవకూడదు. గది మొత్తం పరిగెత్త కూడదు. నాకు దౌర్జన్యం నచ్చదు

తన చొక్కా విప్పుతూనే ఆమె వైపుకు నడిచి వచ్చాడు.

వద్దు. దగ్గరకు రావద్దు అన్నది. భయంతో స్థంభించిన ఆమె, అప్పుడు గబుక్కున దగ్గరగా తగిలించి ఉన్న అద్దం వేసున్న ఫోటోను ఊడదీసి, నేల మీద పడేసి పగలకొట్టి పొడవుగా ఉన్న కొంచం పెద్ద అద్దం ముక్కను తీసుకుంది.

 రావద్దు. దగ్గరకు రావద్దు!

దీన్ని కూడా ఆలొచించి ఉంచాను మహతీ. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకోవటం వలన ఏమిటి లాభం? నీ చేత్తో రాసిన ఉత్తరంలో ఉన్న విషయం నీ మీద ఎంత పెద్ద అపవాదును మోస్తున్నదో తెలుసా?

నీ భర్తను వదిలేస్తాను. అతను ఉత్తరాన్ని చదివి, నీ గురించి ఏమనుకుంటాడు? చనిపోయేటప్పుడు పరువుపోయినదానిలా చావాలా? వద్దు. దాన్ని కింద పడేయి ఎగతాలిగా చెప్పాడు.

దానికి గట్టిగా సమాధానం చెప్పింది మహతీ. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదానిని కాదురా నేను. అదే సమయం నువ్వు విధంగా బెదిరించినా, నా మానాన్ని పోగొట్టుకోను. నన్ను ఇక్కడ్నుంచి వెళ్ళనివ్వు

లేకపోతే?”

నన్ను నేను కాపాడుకోవటానికి హత్య చెయటానికి కూడా సంసయించను

అలాగా? అది కూడా చూద్దామే!

ఆనంద్ పట్టుదలగా జరగ -- ఆమె, అద్దం ముక్క పుచ్చుకున్న చేతిని అతని వైపుకు ఎత్తింది. ఆవేశంతో అతని శరీరంలో గుచ్చటానికి ప్రయత్నించినప్పుడు, ఆమె  రెండు చేతులనూ బలంగా పట్తుకున్న ఆనంద్ -- ఆమె చేతిని అలాగే ఆమె వీపు వైపుకు తిప్పి, కాలుతో మధ్యలో తన్నాడు. 

అమ్మా! అని అరుస్తూ, గోడమీద పడింది. తలకి దెబ్బ తగిలి రక్తం చిందుతూ , నేల మీదకు జారి పడిన మహతీ యొక్క ప్రాణం వెంటనే పోయింది.

కానీ, ఆమె కడుపులో ఉన్న నలభై ఐదు రోజుల పిండానికి ఇంకా ప్రాణం ఉన్నది.

                                                                                         Continued...PART-12

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి