12, మే 2023, శుక్రవారం

నిజమైన అభిమానం…(కథ)

 

                                                                                        నిజమైన అభిమానం                                                                                                                                                                           (కథ)

అభిమానం అనేది కూడా వెలకట్టలేనిది. కొందరి అభిమానం మధురంగా మనసు మీటుతుంది.

మనుష్యులు తన సహ మనుష్యుల మనసుల గెలుచుకోవాలి.  కష్టనష్టాల్లో అదుకోవాలి. నేనున్నాంటూ భరోసానివ్వాలి. అప్పుడే ఆ మనిషి పై అభిమానం ఏర్పడుతుంది. ఒక్కసారి గుండెల్లో ఏర్పడిన అభిమానం వారిని జీవితాంతం వెన్నంటే ఉంటుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అందుకే అది వెలకట్టలేనిది. వారి ప్రేమకు ప్రతి రూపంగా ఉంటుంది. అలా సహ మనుష్యులకు చేరువైన మనుష్యులు అరుదుగా ఉంటారు. ఈ కథలో చోటు చేసుకున్న ఓ సంఘటన నిజమైన అభిమానం ఎలా ఉంటుందో నిరూపిస్తుంది.

రఘురాం కన్ ఫ్యూజన్లో ఉన్నాడు. ఆఫీసులో అతనికి పై అధికారిగా ఉన్న గోపాలరావు గారి భార్య కొద్ది సేపటి క్రితం ఫోన్ చేసింది.

గోపాలరావు రెండు సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ తో చనిపోవడంతో బ్యాంకులో పనిచేస్తున్న అతని భార్యను గుంటూరుకు ట్రాన్స్ ఫర్ చేస్తే, ఒప్పేసుకుని అక్కడికి వెళ్ళిపోయింది.

భార్యా, భర్తలిద్దరూ రఘురాం తో బాగా చనువుగా, ప్రేమాభిమానాంతో స్నేహంగా ఉంటారు. రఘురాం కూడా వాళ్ళిదరితో అంతే చనువుగా ఉంటాడు. ఆ భార్య భర్తల దగ్గర నుండి అనారోగ్యంతో ఉన్న తన కూతురు కోసం ఎంతో సహాయం పొందాడు. రఘురాం ఐదేళ్ళ కూతురు అంటే ఆ భార్యా-భర్తలకు చచ్చేంత ప్రేమ.

పిల్లలు లేని ఆ దంపతుల ఇంటికి, సెలవు రోజుల్లో రఘురాం కూతురుతో కలిసి హాజరవుతూ ఉంటాడు...!

మధ్యలో జరిగిన ఆ విషాద సంఘటన తరువాత కూడా గోపాలరావు భార్య అప్పుడప్పుడు ఫోన్ చేసి రఘురాం తో మాట్లాడూతూ ఉండేది. కుశల ప్రశ్నలు అడిగి విషయాలు తెలుసుకునేది.

ఈ రోజు కూడా అలాగే ఫోన్ చేసి విషయాలు అడిగిన తరువాత " రఘురాం గారూ...ఒక వారం ట్రైనింగ్ కోసం నేను విజయవాడ వస్తున్నాను. కానీ అక్కడ ఆఫీసు గెస్ట్ హౌస్ లేదు. బయట ఏదైనా హోటల్లో ఉండాలి. భోజనాల సౌకర్యం, ట్రాన్స్ పోర్ట్ వసతి లాంటివి బ్యాంకు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.

హోటల్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఒక వారం ఇంకెక్కడైనా ఉండటానికి ఏర్పాటు చేయగలారా? విజయవాడలో మీరు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు. నేను సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తాను. కాస్త ఏర్పాటు చేయండి" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నిజమైన అభిమానం…(కథ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి