14, మే 2023, ఆదివారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-12)

 

                                                                              ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                              (PART-12)

సంవత్సరం

వాట్ నాన్ సెన్స్! అని న్యూస్ పేపర్లను ఎత్తి తన బాబాయ్ ముందు ఆవేశంగా పడేసాడు ఆనంద్.

చేతులు కట్టుకుని మౌనంగా నిలబడ్డారు బాబాయ్ సుబ్బారావ్.

కోటి రూపాయలు డోనేషన్ చేసినందుకు, పొద్దుటి నుండి మారి మారి ఎవరెవరో  ఫోనులు చేసి అభినందనలు తెలుపుతున్నారు. ఆర్. ఆర్.  కంపెనీ యొక్క జి.ఏం. సుబ్బారావ్, ముఖ్యమంత్రిని కలిసి తన ఏం.డీ. తరఫున చెక్కును అందించారని క్లియర్ గా రాసున్నారు. కానీ, మీరేమిట్రా అంటే...మీకు ఏమీ తెలియదని సాధిస్తున్నారు.మా బాకీలు తీర్చండి అని అడిగితే, కోట్లలో నష్టం అంటూనే కోటి రూపాయలు ముఖ్యమంత్రి నిధికి విరాళం ఇచ్చారు.  మా బాకీ వెంటనే సెటిల్ చెయ్యకపోతే మీ మీద పోలీసుల దగ్గర కంప్లైంట్ చేస్తామూ అని డీలర్లు అందరూ బెదిరిస్తున్నారు

ఆనంద్ మళ్ళీ చెబుతున్నాను. నిన్నటి రోజంతా నేను ఇంట్లోనే ఉన్నాను. మన ఆఫీసులోకి దూరి ఎవరో ఒక దొంగ, నా టేబుల్ డ్రా లో పెట్టుకున్న చెక్కు బుక్కులో నుండి ఒక చెక్కును దొంగలించి, నా పేరు చెప్పి అక్కడ ఇచ్చినట్టున్నాడు.

ఇప్పుడు మన దగ్గరున్నది మన డబ్బు కాదు. బ్యాంకు అప్పు. అన్ని ఆస్తులనూ తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బు. డబ్బు కూడా మనకు చాలదు. బ్యాలన్స్ డబ్బులో కోటి రూపాయలు తీసి ప్రభుత్వానికి ఇవ్వటానికి నేనేమన్నా మూర్ఖుడినా? ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతపెద్ద దుర్మార్గానికి పూనుకుంటానా?...నీకూ, నాకూ ఏమిట్రా పగ? నేనెందుకు ఇది చేస్తాను అన్నారు, దుఃఖమైన స్వరంతో.

ఇప్పుడేం చేయాలి బాబాయ్? ఇలా తప్పు జరిగిపోయిందని చెప్పి ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడదామా?”

అన్ని పత్రికలలోనూ వచ్చేసింది ఆనంద్. ఇప్పుడు వెళ్ళి తిరిగి ఇవ్వండి అంటే బాగుంటుందా?”

హఠాత్తుగా కోటి రూపాయలు విరాళం, సమాజ అభివ్రుద్దికి ఇచ్చేంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది బాబాయి? రేపటి ఖర్చులకే మనం అందులో నుండే డబ్బులు తీయాలి

కరక్టే. పళ్ళు బిగించి సరి చేసేద్దాం. వేరే దారి లేదు

ఏమిటి బాబాయ్, అన్నీ తెలిసి అలా సింపుల్ గా చెబుతున్నారు. ఎంత  వ్యాపారం చేస్తే మనకి కోటి రూపాయలు సంపాదన వస్తుంది. దానికి మనం ఎంత వ్యాపారం చెయ్యాలి. ఇప్పుడు మార్కెట్టులో మన బ్రాండుకు డిమాండ్ తగ్గింది. టర్న్ ఓవర్ తగ్గిపోయింది. ఇప్పటికే మన వినియోగస్తులు, డీలర్స్ వాళ్ల బ్యాలన్స్ ఇవ్వలేదని ముడిసరకు ఇవ్వటం మానేసేరని మీరే చెబుతున్నారు. మన వ్యాపారాన్ని బాగు చేయాలని ఎన్ని కొత్త ఐడియాలు, ప్లానులూ వేశాము. టైములో ఇంటి కాయితాలు సెక్యూరిటీ ఇచ్చి కోటిన్నర అప్పు తీసుకుంటే,  అందులో కోటి రూపాయలు విరాళమా...? బాబాయ్ కార్యం ఎవరు చేసేరని నాకు తెలిసే కావాలి. వాడ్ని తీసుకు వచ్చి నా ఎదురుగా నిలబెట్టండి

ఖచ్చితంగా అని చెప్పి తన సూట్ కేసుతో బాబాయ్ వెళ్ళి పోయిన కొద్ది నిమిషాల తరువాత ఆనంద్ సెల్ ఫోన్ మోగింది.

హలో... ఆనంద్ ఉన్నారా?”

నేనే మాట్లాడుతున్నా

నమస్తే. నేను మీ స్నేహితుడ్ని మాట్లాడుతున్నా. ఎంత అందమైన పద్దతితో మీకు కోటి రూపాయలు నష్టం అయ్యిందో చూశారా. నేను ముందే చెప్పాను. మీరు నమ్మలేదు. మీరు పెద్ద మొత్తంతో నష్టపోతారని పర్టికులర్ గా చెప్పానే. మీ మీదున్న శ్రద్ధతో చెప్పాను. నా మాటలకు గౌరవమిచ్చి వినుంటే, నష్టాన్ని అడ్డుకోనుండచ్చే?”

నువ్వు ఎవరయ్యా...నీకెలా విషయం ముందే తెలిసింది?”

మీకెదురుగా ప్లాన్లు వేస్తున్న మీ శత్రువులను మీ తరఫున నేను ఫాలో అవుతూ వస్తున్నాను. అప్పుడు నాకు దొరికిన సమాచారమే నేను మీకు చెప్పాను. మీరు నమ్మలేదు

నమ్ముతాను. నిన్ను నమ్ముతాను. నువ్వు ఎవరైనా సరే నమ్ముతా. చెప్పు... విరాళం పనిని నాకు ఎదురుగా చేసింది ఎవరు?”

కుట్ర చేస్తున్న మనిషిని సరైన సంధర్భంలో నేను ఐడెంటిఫై చేసి చూపిస్తాను

అవతలి వైపు ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో,’రీజీవర్నుపెట్టేసి బయటకు నడిచాడు వెంకట్. 

                                                                                                                      Continued...PART-13

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి