20, మే 2023, శనివారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-15)


                                                                          ఓడినవాడి తీర్పు...(సీరియల్)                                                                                                                                                                  (PART-15) 

సంవత్సరం

ఒక వారం రోజులుగా ప్రయత్నించి సమాచారాన్ని తన ఆఫీసు ఫైల్స్ లో నుండి సేకరించాడు వెంకట్.

అదేమిటంటే.

ఆర్. ఆర్. కంపెనీకి ఒక పెద్ద సేకరింపు గొడౌన్ ఉన్నది. ఉత్పత్తికి కావలసిన ముడి సరకును అక్కడ స్టోర్ చేస్తారు. ఉత్పత్తి చేసిన సరకును కూడా అక్కడే స్టోర్ చేస్తారు. సమయంలోనైనా గోడౌన్లో అన్ని సరకులు కలిపి ఎప్పుడూ ఐదు కోట్ల ఖరీదుచేసే సరకు స్టోర్ చేయబడి ఉంటుంది. గోడౌన్లోని మొత్త ఐదు కోట్ల సరకుకూ ఇన్స్యూరన్స్ ఉంది.

దానికి సంవత్సరానికి భీమా ప్రీమియం మొత్తం ఒకేసారి కట్టేసుంది. ఒక్కొక్క సంవత్సరం, ఒక నిర్దిష్ట తారీఖులోపు ప్రీమియం డబ్బును కడితేనే పాలసీ అమలులో ఉంటుంది.

ఇన్స్యూరన్స్ పాలసీకి సంవత్సరానికి ప్రీమియం డబ్బు, ఇంకో నాలుగు రోజులలో కట్టాలి. అందువలన ముందు రోజు వరకే పాత పాలసీ చెల్లుబడి అవుతుంది.

ఇన్స్యూరన్స్ కంపెనీకి కట్టాల్సిన ప్రీమియానికి, చెక్కు రెడీ చేయబడి, కవరింగ్ లెటర్ తో జతచేసి డిస్పాచ్ క్లర్క్నారాయణ టేబుల్ మీద వెయిట్ చేస్తోంది.

అతను చెక్కును ఒక కవరులో ఉంచి, కవర్ను అతికించాడు. రిజిస్టర్ పోస్టులో పంపించాలి.

సమయంలోనే వెంకట్ ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.

ఏమిటి నారాయణ గారూ, రండి క్యాంటీన్వరకు వెళ్ళి ఒక టీ తాగొద్దాం అన్నాడు.

నారాయణ టీ ప్రియుడు. వెంకట్ పిలిచిన వెంటనే కుర్చీని వెనక్కి తోసి లేచాడు

ఎవరైనా పిలవరా అనుకుంటున్నా. రండి

క్యాంటీన్ లో ఇద్దరూ టీ తాగటానికి ముందు అప్పుడే వేసిన వేడి వేడి  బజ్జీలు తిందామనుకుని దానికి టోకన్ తీసుకుని టేబుల్ దగ్గర కూర్చుని, సప్లై కుర్రాడికి టోకన్ ఇచ్చి బజ్జీలను వేడి వేడి గా తీసుకురమ్మని చెప్పారు. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిన వాడిలాగా మేనేజర్ ఒక ముఖ్యమైన ఫైలును తీసుకుని ఆయన రూములో పెట్టమని చెప్పారు. పనిని పూర్తిగా మర్చిపోయి, ఇక్కడకి వచ్చేశాను. మీరు నిదానంగా తింటూ ఉండండి. నేను వెళ్ళి ఫైలు ఆయన రూములో పెట్టేసి వెంటనే వచ్చేస్తాను అని చెప్పిన వెంకట్ పరుగులాంటి వేగంతో నడిచి వెనక్కి వెళ్ళాడు.

తిన్నగా నారాయణ టేబుల్ దగ్గరకు వెళ్లాడు.

ఇన్స్యూరన్స్కంపెనీకి వెళ్ళ వలసిన - కవరులొ ఉన్న చెక్కును, లెటర్నూ తీసుకుని, తన జేబులో వేసుకుని, ఇది వరకే తయారుచేసి పెట్టుకున్న మరో ఉత్తరాన్ని మరో జేబులో నుండి తీసి -- కవరులో పెట్టేసి, వచ్చిన వేగంతోనే మళ్ళీ క్యాంటీన్ కు వెళ్ళి నారాయణ తో కలిసాడు వెంకట్.

కొద్ది సమయం తరువాత ఇద్దరూ వెనక్కి తిరిగి వచ్చారు. నారాయణ టేబుల్ దగ్గరకు వచ్చిన తరువాత ఇద్దరూ విడిపోయి తమ తమ టేబుల్స్ ముందు కూర్చున్నారు.

టేబుల్ మీద పెట్టున్న కవర్లను ఇంతకు ముందే చెక్ చేసిన కారణంగా, కవర్లలో ఉన్న వాటిని మళ్ళీ పరిశీలించి చూడకుండా - అలాగే అతికించి - రిజిస్టర్ పోస్టుకు కావలసిన స్టాంపులు అతికించి -- ఆఫీసు ప్యూన్ దగ్గర ఇచ్చి పంపించాడు నారాయణ.

ఆఫీసు పూర్తి అయిన తరువాత చెక్కునూ, ఉత్తరాన్నీ చించేసి, టాయిలెట్టులో పడేసి, నీళ్ళు కొట్టాడు.

ఆనంద్ మూర్ఖుడా! నీ ఆఫీసులో ఉద్యోగిగా ఉంటూనే ఎంత సాహసంగా నీ మీద పగ తీర్చుకుంటున్నా చూడు!

మన కంపెనీ లెటర్ హెడ్డులో రహస్యంగా టైపు చేసి, రబ్బర్ స్టాంపు ముద్ర వేసి, సుబ్బారావ్ గారి సంతకాన్ని నేనే పెట్టాను. ఉత్తరంలో మాకు ఇన్స్యూరన్స్ అవసరం లేదుఅంటూ దానికి కరెక్టు కారణాన్ని వివరించి రాసాను.

ఇంకో రెండు రోజుల్లో ఇప్పుడున్న ఇన్స్యూరన్స్ కాలం అయిపోతుంది. చివరి రోజు ప్రొద్దున ఏదైనా ప్రమాదం జరిగినా ఇన్స్యూరన్స్ కంపెనీ బాధ్యత తీసుకోదు.

చివరి రోజునే మీ గొడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ జరగబోతోంది. నేను పక్కగా నిలబడి వేడుక చూడ బోతాను

వెంకట్ పళ్ళు కొరుక్కున్నాడు. 

                                                                                                            Continued...PART-16

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి