21, ఫిబ్రవరి 2023, మంగళవారం

అస్థిపంజరం సైజు 6 ఇంచులే.. మనిషా? ఏలియనా?...(మిస్టరీ)

 

                                                          అస్థిపంజరం సైజు 6 ఇంచులే.. మనిషా? ఏలియనా?                                                                                                                                              (మిస్టరీ)

దక్షిణ అమెరికాలోని ఎడారిలో ఉన్న పాడుబడిన చర్చిలో లభించిన బుల్లి అస్థిపంజరం శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతోంది.

మనిషి అస్థిపంజరం సైజులో ఉంటుందో తెలిసిందే. అయితే, అస్థిపంజరం మాత్రం సాధారణమైనది కాదు. దీని పొడవు కేవలం 6 ఇంచులు మాత్రమే. అంటే.. మన అరచేతిలో పట్టేంత చిన్న సైజు బొమ్మంత ఉంటుంది. దీని తల కూడా చాలా చిత్రంగా ఉంది. హాలీవుడ్ సినిమాల్లో చూపించే గ్రహాంతరవాసుల తలలా పొడవుగా ఉంది. దీంతో.. అస్థిపంజరం మనిషిదా? గ్రహాంతరవాసిదా (ఏలియన్) తెలియక పరిశోధకులు జుట్టు పట్టుకుంటున్నారు. ఎందుకంటే.. అస్థిపంజరం దొరికి దాదాపు 18 ఏళ్లు కావస్తోంది. కానీ, అది ఏమిటనేది పూర్తిగా తెలుసుకోలేకపోయారు. తాజాగా కొంతమంది పరిశోధకులు మరోసారి దాన్ని పరిశీలించారు. సందర్భంగా వారు కొన్ని కీలక విషయాలు చెప్పారు. వాటి గురించి తెలుసుకొనే ముందు అస్థిపంజరం ఎక్కడ లభ్యమైందో తెలుసుకుందాం.

పాడుబడిన చర్చిలో లభ్యం: 2003 సంవత్సరంలో దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారిలో ట్రెజర్ హంట్ (నిధులు కోసం అన్వేషణ) చేస్తున్న ఆస్కార్ మునో అనే వ్యక్తికి లా నోరియాలోని పాడుబడిన చర్చిలో అస్థిపంజరం లభించింది. అప్పట్లో వార్త పెద్ద సంచలనంగా మారింది. అస్థిపంజరానికి పరిశోధకులు అటా (ఆత) అని పేరు పెట్టారు.

మనిషా? ఏలియనా?: వాస్తవానికి మనుషుల అస్థిపంజరానికి 10 పక్కటెముకలు (రిబ్స్) ఉంటాయి. అయితే, బుల్లి అస్థిపంజరానికి మాత్రం 12 పక్కటెములు ఉన్నాయి. పైగా దాని తల కూడా పైకి పెరిగినట్లుగా ఉంది. అస్కార్కు అది లెదర్ పౌచ్లో లభించింది. దాని చుట్టూ తెల్లని వస్త్రం, రిబ్బన్ చుట్టి ఉంది. అయితే, దాన్ని ఎందుకు అక్కడ వదిలి వెళ్లిపోయారనేది మాత్రం తెలియరాలేదు. దాని అస్థిపంజర నిర్మాణం కూడా చాలా చిత్రంగా ఉంది. దానికి మనిషికి ఉన్నన్ని ఎముకలు కూడా లేవు. దాని కళ్లు కూడా ఏలియన్ తరహాలోనే ఉన్నాయి.

డీఎన్ఏ రిపోర్ట్లో ఏముంది?: అస్థిపంజరాన్ని పరిశీలించిన పరిశోధకులు అది 1970 సంవత్సరానికి చెందినదిగా గుర్తించారు. పైగా అస్థిపంజరం నుంచి సేకరించిన డీఎన్ఏను పరిశీలిస్తే.. అది మనుషులది కాదని తేలింది. 2018లో శాన్ ఫ్రాన్సిస్కోలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మరోసారి దీన్ని పరీక్షించారు. అది తప్పకుండా మనిషి అస్థిపంజరమే కావచ్చని తెలిపారు. దాదాపు 40 ఏళ్ల కిందట చనిపోయిన శిశువు అస్థిపంజరం కావచ్చని పేర్కొన్నారు. జన్యు లోపం వల్ల శిశువులో ఎముకలు అసాధారణంగా పెరిగి ఉండవచ్చని తెలిపారు.

గ్రహాంతరవాసి, లేదా పిండం, దొంగిలించబడినది లేదా కనుగొనబడినది, అస్థిపంజరంలో అంతులేని వివాదాల ఎముకలు ఉన్నట్లు తెలుస్తోంది.

Images Credit: To those who took the original photos.

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి