1, ఫిబ్రవరి 2023, బుధవారం

పదిహేడవ అల…(సీరియల్)...(PART-3)

 

                                                                              పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                  (PART-3)

భార్గవ్ హడావిడిగా సూట్ కేసులో దుస్తులు పెడుతున్నప్పుడు అందులోనుంచి ఒక ఫోటో జారి కింద పడింది. అది పట్టించుకోనట్లు తన పనిలో ఉండిపోయాడు. తల్లి ప్రభావతి గమనించింది. అది అక్షరా ఫోటో! ఆమె అందంగా నవ్వుతూ ఉన్న అద్భుత దృశ్యం. 

ప్రభావతి లేచి వెళ్ళి ఫోటోను తీసి, చూసి, తన మొండితనాన్ని మర్చిపోయి అడిగింది: ఏరా, ఈమేనా అమ్మాయి?”

భార్గవ్ తిరిగి చూడకుండానే తల ఊపాడు.

తల్లి ఫోటోను తీసుకు వెళ్ళి తన భర్త దగ్గర చూప...ఓరకంటితో చూసేసి, చూడనట్లు తిరిగి నిలబడ్డారు.

ప్రభావతి అడిగింది...ఈమె పేరు ఏమిట్రా చెప్పావు?”

అక్షరా అమ్మా

అందంగానే ఉంది! సొంత ఊరు ఏది?”

తెనాలి అమ్మా...వైజాగ్ లో చదువుకుంటోంది

ఆమె తండ్రి ఏం చేస్తున్నాడు?”

ఇప్పుడు ప్రకాష్ రావ్ తన పట్టుదలను వదిలి మాట్లాడటం మొదలుపెట్టారు. భార్గవ్ కూడా ఉత్సాహంగా జవాబు చెప్పాడు.

స్కూలు అన్యువర్షరీ నాటకంలో అల్లూరి సీతారామరాజు వేషం వేసిన చిన్న కుర్రాడు వీర మాటలు మాట్లాడి నటిస్తాడు. మధ్యలో వాడికి అతికించిన మీసం సగ భాగం ఊడిపోయి వేలాడుతోంది. వెంటనే ప్రేక్షకులు అంటూ నవ్వుతారు. అంతవరకు సీరియస్ గా ఉన్న నాటకం,  క్షణంలో హాస్యంగా మారిపోతుంది. ఇదే విధంగానే భార్గవ్ ఇంట్లో జరిగింది!

ఏమే, కులాంతర వివాహం చేస్తే, బంధువులందరికీ ఏం జవాబు చెప్పాలి?”

లోకంలో జరగనిదా? ఏదైనా చెప్పి సమాధాన పరుద్దాం...దాని గురించి మీరేమీ పెద్దగా బాధ పడకండి. వదిలేయండి

సంభాషణ జరుగుతున్నప్పుడు భార్గవ్ సెల్ ఫోన్మోగింది. అక్షరానే పిలిచింది!

అతను మెల్లగా జారుకుని, వేరే గదిలోకి వెళ్ళి మాట్లాడాడు.

చెప్పు అక్షరా.ఏమైంది?”

చెబుతాను. మొదట మీ ఇంట్లో ఏం జరిగిందో చెప్పు

మన ప్రేమకు విజయం. మొదట కుదరనే కుదరదు అని చెప్పిన అమ్మా-నాన్నా, ఇప్పుడు మన పెళ్ళిని ఎలా జరపాలని మాట్లాడుకుంటున్నారు. సరే, మీ నాన్న ఏం చెప్పారు?”

తండ్రి చెప్పిన జాతకం విషయం చెప్పింది.

ఏమిటి అక్షరా, మనసులు రెండూ కలిసినప్పుడు, జాతకాలు కలిసాయా అని ఎందుకు చూడటం?”

మా నాన్న ఇంతవరకు దిగివచ్చిందే పెద్ద విషయం

సరే, నా జాతకాన్ని వెంటనే పంపనా?”

వద్దు, మీరు వైజాగ్ వస్తున్నప్పుడు తీసుకు రండి. నాన్నకు నేను పంపిస్తాను

సరే...నువ్వెప్పుడు వైజాగ్ బయలుదేరుతున్నావు?”

రేపు రాత్రికి. సొమవారం ప్రొద్దున మనం కలుసుకుందాం

భార్గవ్ నాలుగు అంచులలోనూ పసుపు రాయబడ్డ జాతకాన్ని తీసి  మడతపెట్టుకుని, ఒక పత్రికలో పెట్టి, టేబుల్ మీద పెట్టాడు. తరువాత కిటికీకి దగ్గరగా వచ్చి నిలబడి వీధిని వేడుకగా చూసాడు.

పొద్దుటి పూట విశాఖపట్నం ఉత్సాహంగా హడావిడిగా ఉన్నది. రోడ్డు మీద వాహనాలు వేగంగా వెడుతున్నాయి. సిటీ బస్సులలో జనం నిండిపోయున్నారు.

హఠాత్తుగా అతని సెల్ ఫోన్ఒక్కసారి మాత్రం మోగి ఆగిపొయింది. అక్షరా వస్తున్నదనే దానికి అది కాలింగ్ బెల్.

ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. వీధి చివర అక్షరా ఒక ఆటోలో రావటం చూసిన వెంటనే చేతులు ఊపాడు. ఆటో తిన్నగా అతని దగ్గరకు వచ్చి నిలబడింది. అందులో నుండి దిగిన ఆమె, ఆటోను వెయిట్ చేయమని చెప్పి వచ్చింది.

రా... అక్షరా

చోటుకు ఎప్పుడు మారారు?”

ఒక సంవత్సరం అయ్యింది

ఇద్దరూ భార్గవ్ గదికి వచ్చారు. అక్షరా గదిని చుట్టూ చూసింది. చిన్న వంట గది, స్నానాల గది, బెడ్ రూమ్ అంటూ ఒక చిన్న ఇల్లు అని చెప్పవచ్చు.

పెద్దదిగా ఉందే...మీరు ఒక్కరే ఉంటున్నారా?”

లేదు...నీతోటి ఉండబోతాను - మన పెళ్ళి జరిగిన తరువాత!

జోకులొద్దు -- ముద్దుగా గదమాయించింది.

ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. చాలా మంది కలిసి ఉండే హాస్టల్స్ నాకు నచ్చలేదు. అందుకని అద్దెకు ఇల్లు తీసుకున్నాను

అక్కడున్న కుర్చీలో కూర్చుంది. ఇంట్లో పెళ్ళి గురించి మాటలు మొదలైన తరువాత అతన్ని కలుసుకోవటం ఇదే మొదటిసారి. అక్షరాకి రెండు రోజులలోనే అందం ఎక్కువయ్యింది. బుగ్గలు ఎరుపెక్క, పెదాలు మెరవ -- కొత్త పెళ్ళి కూతురులాగా మొహం మీద....ఆమెను చూస్తేనే ఆనందంగా ఉన్నది.

సిగ్గుతో తల వంచుకుని చూసింది చాలు! జాతకం ఇవ్వండి... అన్నది.

భార్గవ్ మామూలు పరిస్థితికి వచ్చి జాతకం తీసి ఆమెకు ఇచ్చాడు.

మీ నాన్నకు వెంటనే కొరియర్లో పంపిస్తావా?”

జవాబు చెప్పకుండా తన చేతిలో ఉన్న పసుపు అంటించి ఉన్న ఇంకొక కాగితాన్ని తీసింది. అది ఆమె జాతకం కాపీ.

నా జాతకాన్ని కూడా తీసుకువచ్చాను. నాన్నకు పంపటానికి ముందు ఒక జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి మన జాతకాలు ఇచ్చి కలిసినయా చూడమందాం

అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకు?”

జాతకాన్ని మా నాన్నకు పంపి, ఆయన ఒక మంచి రోజు చూసి జ్యోతిష్కుడి దగ్గర కలిసిందా చూసి, అంతవరకు మనం ఎందుకు ఆగాలి? ఇప్పుడే తెలుసుకుందాం

భుజాలు ఎగరేసిన అతను నువ్వు చెబితే సరే అన్నాడు.

అక్షరా లేచి, “ఆఫీసుకు సెలవు చెప్పండి. నేను ఆల్రెడీ ఎంక్వయరీ చేసి...గాంధీ నగర్ జ్యోతిష్కుడు ఒకాయన అడ్రస్సు నోట్ చేసి పెట్టుకున్నాను. అక్కడికి వెళదాం

భార్గవ్ దానికీ తల ఊపాడు. ఇద్దరూ ఆటోలో ఎక్కారు.

ఆన్యువల్ పరీక్షలు రాసి, ఫలితాలకు ఎదురు చూస్తూ ఆందోళన చెందుతున్న స్టూడెంట్స్ పరిస్థితిలోనే ఉన్నారు భార్గవ్, అక్షరా!

వాళ్ళ జాతకాలను చేతిలో ఉంచుకున్న జ్యోతిష్కుడు ఒక మధ్య వయసు వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఎడమవైపు...పంచాంగం, కుడివైపు ల్యాప్ టాప్. జ్యోతిష్క పండితులు విజయ సారధీ’ -- బయట వేలాడుతున్న పలక ఆయన పేరు తెలిపింది.

రెండు జాతకాలనూ తీసి ఉంచుకుని ఒక తెల్లకాగితం మీద గడులు వేసాడు. కొన్ని అంకెలను వేరు అంకెలతో కూడి, మైనస్ చేసి మధ్యలో భార్గవ్, అక్షరా లను తలెత్తి ఎటువంటి చలనం లేకుండా ఒకసారి చూసారు. మళ్ళీ చాలాసేపు లెక్కలు వేసిన తరువాత తల ఎత్తారు.

భార్గవ్, అక్షరా అంటే మీరేనా?”

అవునండీ

పెద్దవాళ్ళు ఎవరూ మీతో రాలేదా?”

లేదని తల ఊపారు ఇద్దరూ!

రెండు జాతకాలూ అసలు కొంచం కూడా కలవటం లేదే...!

మామూలుగానే చెప్పారు విజయ సారధీ. కానీ, ఒక బాంబు పేలిన షాక్ ఏర్పడింది ఇద్దరికీ. కలతతో ఒకర్ని ఒకరు చూసుకున్నారు.

ఆయన వివరించారు. అక్షరా రాశి, నక్షత్రం -- భార్గవ్ యొక్క రాశి, నక్షత్రం...రెండింటికీ రోజులు కలవటం లేదు. అంటే ఆయుష్ బలం లేదు. అబ్బాయి జాతకంలో అష్టమాధిపతి బాధించే స్థానంలో కలిసి ఉండటం వలన, అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే...ఒక సంవత్సరం లోపు అక్షరాకి మరణం నిశ్చయం

ఆమె షాక్ నుండి తేరుకుని తిరిగి నోరు తెరిచింది. దీనికేమన్నా పరిహారం ఉన్నదా...?”

పరిహారమే లేదమ్మా. జాతకం కలిగిన ఆయనకి కలిసిపోయే వేరు రాశి - నక్షత్రం కలిగిన అమ్మాయిని చూసి పెళ్ళి చేయటమే ఒకే ఒక పరిహారం...దారి

అంతకు మించి అక్కడ కూర్చోవటానికి ఇద్దరికీ కుదరలేదు...లేచేశారు.

మళ్ళీ ఆటో పుచ్చుకుని భార్గవ్ గదికి వచ్చేంత వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు.

గదికి వచ్చి కూర్చున్న తరువాత అక్షరా తన చేతులో ఉన్న జాతకాన్ని చూసింది. గడులలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలూ బ్రహ్మాండంగా ఆకారం పెంచుకుని వచ్చి ఆమె తలని చుట్టి చుట్టి వస్తున్నట్టు అనిపించింది. కళ్ళు మూసుకుని మనోదృఢంతో భయాన్ని విధిలించి కొట్టింది.

భార్గవ్ ను చూసి ఆందోళనతో చెప్పింది:

జాతకం, జ్యోతిష్కం అంతా పచ్చి అబద్దమండి. ఉత్త మోసపూరిత పని

నువ్వు విరక్తితో మాట్లాడుతున్నావు అక్షరా! యధార్ధాన్ని ఆలొచించి చూడు. మీ నాన్న జ్యోతిష్కుడుని చూసేసి మనకి పెళ్ళి చేయటానికి ఒప్పుకుంటారా?”

ఆమె మౌనం వహించింది.

మొహంలో విచారం చోటు చేసుకోగా, ఇద్దరూ మనిషికో మూలలో కూర్చున్నారు.

కొంత సేపటి ఆలొచన తరువాత అక్షరా దగ్గర స్పష్టత పుట్టింది.

ఏమండీ, నా జాతకానికి కలిసిపోయేటట్టు మీ జాతకాన్ని మార్చి రాసేస్తే...?" అన్నది వేగంగా.

ఉలిక్కిపడ్డాడు భార్గవ్. ఏం చెబుతున్నావు అక్షరా?”

ఒక జ్యోతిష్కుడు సహాయంతో మీరు పుట్టిన తారీఖు, సమయం మార్చి రాసి, నా జాతకంతో కలిసేటట్టుగా నకిలీగా కొత్త జాతకాన్ని తయారు చేద్దాం. దాన్ని మా నాన్నకు పంపుదాం

ఇలా కన్న వాళ్ళను మోసం చేసి పెళ్ళి చేసుకోవాలా?”

వేరే దారి లేదండి. మన ప్రేమ...హర్డుల్ పరుగు పందెం లాగా ఒక్కొక్క అడ్డంకిని దాటుకుంటూ వచ్చున్నాం. చివరి అడ్డంకిని కూడా దాటితేనే పెళ్ళి

అతని మొహంలో భయం రేఖలు పరిగెత్తినై. వద్దు అక్షరా. ఒకవేల జ్యోతిషం  ఫలిస్తే, పెళ్ళి తరువాత, నీకు ఏదైనా ఆపద ఏర్పడితే...? కనుక...మనం విడిపోదాం

కన్నీరు ధారగా కారుతుండగా వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె.

కుదరదండీ...నేను ఒక రోజు జీవించినా, అది మీ భార్యగానే జీవించాలి

అతని కళ్ళు కూడా చెమ్మగిల్లినై. ఆమె చెప్పినదానికి తల ఊపటం తప్ప, వేరు దారిలేదు. మరు క్షణం.

ప్రేమికుడి చేతులను బలంగా పుచ్చుకున్నది. ఇష్టమైన, పోగొట్టుకున్న వస్తువు ఒకటి మళ్ళీ తిరిగి దొరికినట్లు ఇద్దరి మనసుల్లోనూ ప్రశాంతత పూసింది.

తరువాత వాళ్ళల్లో తలెత్తిన ఒకే ప్రశ్న: దొంగ జాతకం తయారు చేయడానికి జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళాలి?’

ఇప్పుడు చూసొచ్చిన జ్యోతిష్కుడి దగ్గరకు వద్దు. మనం తిరిగి వస్తున్నప్పుడు నెహ్రూ నగర్ లో జ్యోతిష్కు నిలయంఅని ఒక బోర్డు చూసాను. అక్కడికి వెళ్దాం అన్నది అక్షరా.

గంగిరెద్దులాగా తల ఊపాడు భార్గవ్.

నెహ్రూ నగర్ లోని జ్యోతిష్కు నిలయంను వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నప్పుడు, జ్యోతిష్కుడు ఒంటరిగా , ఆసక్తితో పేపర్ చదువుతున్నాడు.

వాళ్ళను చూసిన వెంటనే ఉత్సాహంతో, “రండి...రండి. జాతకం చూడాలా?” అంటూ చదువుతున్న పేపర్ను మడత పెట్టాడు.

అక్షరా భయపడుతూ, భయపడుతూ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన నవ్వారు. జాతకాన్ని మార్చి రాయాలా. కుజ దోషం ఉన్న అమ్మాయల తల్లి-తండ్రులు వచ్చి అడిగినందువలన జాతకాన్ని మార్చి రాసిచ్చాను. కానీ ఒక ప్రేమ జంట నా దగ్గరకు వచ్చి అడగటం ఇదే మొదటి సారి

ఆయన బహిరంగంగా మాట్లాడటం వలన... అక్షరాకి ధైర్యం వచ్చింది.

సార్, మీరు మాకు సహాయం చేసి పెట్టాలి.అంటూ రెండు జాతకాలనూ...దాంతో పాటూ డబ్బును టేబుల్ మీద పెట్టింది. ఇది మీ దక్షణ.

డబ్బును చూసిన వెంటనే ఆయన మొహం వికసించింది. ఆయనే ఎదురు చూడని మొత్తం.మీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలనేది బ్రహ్మ విధించిన విధి. అందువలనే ఇప్పుడు నా ముందు వచ్చి నిలబడ్డారు అంటూ నవ్వుతూ డబ్బు తీసుకుని లోపల పెట్టారు.

కొత్త గీతలూ, గడులూ తయారైనై. పుట్టిన తారీఖూ, సమయం మారింది. భార్గవ్ ఇంకోసారి పుట్టాడు. నక్షత్రాలూ, గ్రహాలూ చోటు మారినై. శని, శుకృడు దిస మారింది. దోషాలు తప్పుకున్నాయి. చివరగా జ్యోతిష్కుడు కాగితానికి నాలుగు అంచులలోనూ పసుపురాసి, తీసి అక్షరా దగ్గర ఇచ్చాడు. కొత్త జాతకం పుట్టింది.

జ్యోతిష్కుడి స్వరం పెద్ద ఉచ్వాశతో పలికింది.

ఇప్పుడు మీ ఇద్దరి జాతకాలూ బాగా, పూర్తిగా కలిసినై

అక్కడ్నుంచి తిన్నగా కొరియర్ఆఫీసుకు వెళ్ళిన అక్షరా, ఒక కవరు మీద తన  తండ్రి అడ్రస్సు రాసి... భార్గవ్ నకిలీ జాతకాన్ని అందులోపెట్టి అతికించింది. తప్పు చేస్తున్నాం అనే భావన రాగా....‘నాన్నా, మిమ్మల్ని మొసం చేస్తున్నందుకు నన్ను క్షమించండి...అని మనసులో మళ్ళీ మళ్ళీ చెప్పుకుంది.

కవర్ను తెనాలి పంపించాలి అని చెప్పినప్పుడు, ఆమెకే తెలియకుండా ఆమె చేయి వణికింది.

మెల్లగా నిద్రపోతున్న రాత్రిహాస్టల్ గదిలో చదువుకోవటానికి అక్షరా కుర్చునున్నా మనసు వేరే ఎక్కడికో వెడుతోంది. జాతకం పంపి నాలుగు రోజులయ్యింది. నాన్న దగ్గర నుండి ఎప్పుడు సమాధానం వస్తుంది అని ఎదురు చూస్తున్న మనసు నీళ్ళళ్ళో పడి కొట్టుకుంటున్న చీమలాగా గిలగిలా కొట్టుకుంది.

ఆలొచనలలో చిక్కుకున్న ఆమెను సెల్ ఫోన్పిలిచింది. వేగంగా తీసింది. ఒక కొత్త నెంబర్. అనుమానంతో ఎత్తి హలోఅన్నది

వార్తలు చెప్పేది సౌభాగ్యవతి. మీరు ఆత్రుతగా ఎదురుచూస్తున్న జ్యోతిషం ముగింపు రోజు ప్రకటించబడింది...

ఏదో వ్యాపార ప్రకటన లాగుంది...!అని సెల్ ఫోన్ ను ఆఫ్ చేద్దామనుకున్నప్పుడు సడన్ గా గుర్తుకు వచ్చింది. ఇది అభయ స్వరం!

ఆమె కొనసాగించింది భార్గవ్ - అక్షరా ఇద్దరి జాతకాలను పరిశీలించి  అన్వేషించిన తెనాలి జ్యోతిష్క పండితులు, రెండు జాతకాలూ అద్భుతంగా కలిసినట్లు తెలిపారు అని చెప్పుకుంటూ వెళ్ల, అక్షరా ఉత్సాహంతో అడ్డుపడింది.

ఏయ్ అబీ...నువ్వే కదా?”

నేనేనక్కా. ఇది నా కొత్త సెల్ ఫోన్ నెంబర్. నాన్న కొనిచ్చింది

ఆట పట్టించింది చాలు. విషయం చెప్పు

ఏంటక్కా...విషయాన్నే వార్తలు లాగా చదివేను కదక్కా...

అదంతా నిజమేనే...నాన్న ఏం చెప్పేరే?”

అదొచ్చి...కొంచం ఉండు... అని అభయ చెప్పిన తరువాత, కొన్ని క్షణాల విరామం తరువాత.

అక్షరా, నేను నాన్నను మాట్లాడుతున్నాను

చెప్పండి నాన్నా అన్నది గుండె వేగంగా కొట్టుకుంటుంటే.

అంతా మంచి వార్తేనమ్మా. మీ ఇద్దరి జాతకాలూ బ్రహ్మాండంగా కలిసినై. భార్గవ్ వాళ్ల తల్లి-తండ్రులను ఒక మంచి రోజు చూసి మన ఇంటికి రమ్మని చెప్పు. తరువాత మనం ఒక రోజు వాళ్ళింటికి వెళదాం

ఎందుకు నాన్నా వెళ్ళాలి?” -- అని అభయ అల్లరిగా అడగటం, “అక్కయ్య పెళ్ళి నిశ్చయం చేయటానికి అంటూ అమాయకంగా తల్లి జవాబు చెప్పటం, నాన్న నవ్వుతూ సెల్ ఫోను ను టీవీ లాగా మార్చి కుటుంబమంతా కుతూహలంగా ఉండటాన్ని కళ్ళ ముందు చూపించారు.

అక్షరా కళ్ళల్లో ఆనంద కన్నీరు పొంగింది.

                                                                                                    Continued...PART-4

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి