12, ఫిబ్రవరి 2023, ఆదివారం

సెల్ ఫోన్…(కథ)

 

                                                                                        సెల్ ఫోన్                                                                                                                                                                                             (కథ)

ఎప్పుడూ నిజాలే చెప్పాలనీ, అబద్ధం ఆడకూడదు అని చిన్నప్పటినుంచి పెద్దవాళ్లు మనకి చెప్తారు. గొప్ప గొప్ప గురువులు మరియు అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారు అయిన ఎన్నో కథలు రామాయణ మహాభారతాలలో ఉన్నాయి. కానీ  సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు.

అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది.రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకువస్తుంది. చివర్గ మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది.

నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. అది మన ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అది మన ఆలోచనల్లో స్పష్టత తీసుకువస్తుంది.

కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం సుఖంగా ఉంటుంది.

కథలో హీరో విషయాన్ని ఏలా చెప్పాడో చూడండి.

మన జీవితం ఇలా అయిపోయిందే! సొంత ఇల్లు, తండ్రి తాగుడు మత్తుకు ఖర్చు అయిపోయిందే. చదువు సగంలో ఆగిపోయిందే. ఏదో అన్నయ్య మాత్రం కాలేజీ వరకు చదువుకున్నందువలన ఒక ఆఫీసులో మేనేజర్ ఉద్యోగం దొరికింది. పదో క్లాసు కూడా చదవని నేను, ఏం ఉద్యోగం ఎదురు చూడగలను?’

నాన్న చనిపోయిన తరువాత, అమ్మ మోసిన పండ్ల బుట్ట ఇప్పుడు తోపుడు బండీగా మారి ఉన్నది. అదే మా ఎదుగుదల.

పిల్లల్ని అయినా బాగా చదివించాలని ప్రైవేటు స్కూల్లో చేర్చి అయ్యింది. ఇప్పుడు పిల్లలిద్దరికీ కలిపి రెండువేల ఐదువందల రూపాయలు ఫీజుగా కట్టాలట. ఏం చేయాలో అర్ధంకావటం లేదు...అనే ఆలొచనతోనే ఉన్నాడు అతను.

మంచి భార్య దొరకటం దేవిడిచ్చిన వరంఅని చెప్పేటట్టే అతని భార్య సౌమ్య, పేరుకు తగినట్లు శాంతం ఉట్టిపడే శాంతమైన -- అభిమానమైన అమ్మాయి. ఆస్తికి ఒక కొడుకు, ఆశకు ఒక అమ్మాయి. మనసులో చాలా ఆశ ఉంది. ఆస్తికే దారిలేదు.

అయినా కానీ నిజము, నిజాయితీ,న్యాయము అనే వాటినే ఆస్తిగా అనుకుంటున్నారు. అందువలనే జీవితం ఎటువంటి కష్టమూ లేకుండా వెడుతున్నది అతనికి.

సీజనుకు తగిన పండ్ల అమ్మకం, అమ్మే చోటు కూడా మార్చి, మార్చే! రోజు అదేలాగానే బండిని తోసుకుంటూ చాలా దూరం వెళ్ళినందు వలన కాలు నొప్పి పుట్టి ఒక వీధి చివరిలో ఆపేసి, దాహం వేసినందు వలన పక్కన నిలబడున్న ఆటో డ్రైవర్ తో అన్నా. బండిని కొంచం చూసుకోండి. నీళ్ళు పట్టుకుని వచ్చేస్తాను అన్నాడు.

సరే...సరే...వెళ్ళిరా

వీధి కుళాయిలో నీళ్ళు పట్టుకుని నడిచి వస్తున్న అతను, కాలుకు ఏదో అడ్దుపడ్డట్టు అనిపించడంతో...వంగి చూసినప్పుడు సరికొత్త సెల్ ఫోన్. ఎవరో పారేసుకున్నారు.

ఏంటయ్యా...ఏమిటది?” -- ఆటో అతను అడిగాడు.

ఎవరో సెల్ ఫోను కింద పడేసుకుని వెళ్ళిపోయారన్నా.

ఇక్కడికి తీసుకురా చూద్దాం

"అయ్యో, ‘కేమేరాఫోను. దీని ఖరీదు ఇప్పుడు ఎనిమిది వేలు ఉంటుంది అన్నాడు ఆటో అతను.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

సెల్ ఫోన్…(కథ)@ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************                                                                                                                                                                   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి