8, ఫిబ్రవరి 2023, బుధవారం

ఓడినవాడి తీర్పు...(పూర్తి నవల)


                                                                                 ఓడినవాడి తీర్పు                                                                                                                                                                            (పూర్తి నవల) 

ప్రియమైన నా భర్తకు - మీ భార్య నమస్కరించి రాయునది! కొద్ది కాలంగా శేఖర్ అనే అతనితో నాకు పరిచయం ఏర్పడి, కొత్త స్నేహం లోతుగా పెరిగింది. శేఖర్ మీ కంటే అందంలోనూ-వసతిలోనూ గొప్పవాడు. మా స్నేహం ప్రేమగా మారింది. పెళ్ళి అనే బంధం మా ప్రేమకు పెద్ద అడ్డుగా నిలబడుతోంది. చాలా ఆలొచించి నిర్ణయానికి వచ్చాను.

రోజు నేనూ, శేఖరూ ఊరు వదిలి బయలుదేరి వెళుతున్నాము...ఒక కొత్త జీవితం కోసం. ఇది తప్పే. చెయ్యకూడని పనే. కానీ, నా వలన శేఖర్ను మరిచిపోవటం కుదరటం లేదు. అందువల్ల మిమ్మల్ని వదిలి వెళుతున్నాను. నన్ను వెతక వద్దు. నన్ను క్షమించండి. మరిచిపొండి.

                                                                                        ******************

ప్రియమైన కొడుకుకు -- తండ్రి ప్రేమతో రాస్తున్నది.

మధ్య వ్యాపారంలో నాకు ఏర్పడిన నష్టం నాకు తగిలిన, తేరుకోలోని ఒక పెద్ద దెబ్బ! పేకమేడలాగా నేను ఒక్కసారిగా వేగంగా పడిపోయాను. ఇంతపెద్ద ఓటమిని నా వల్ల తట్టుకోవటం కుదరటం లేదు. వెళ్ళిన ప్రతి చోటా నన్ను దుఃఖం విచారిస్తున్నారు. పెద్ద అవమానంగా ఉంది.

పారేసుకున్న మనశ్శాంతిని వెతుక్కుంటూ నేను ఇంటిని, ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలనేది నేనే తీర్మానించుకోలేదు. నా మనసు నిలకడగా లేదు. నిలకడ అయినప్పుడు, తిరిగి వస్తాను. రోజు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఎవరూ నన్ను వెతకటానికి ప్రయత్నించ వద్దు. నీకు నా ప్రేమ పూర్వకమైన దీవెనెలు.

ఇట్లు.

                                                                                        ******************

పై రెండు ఉత్తరాలకు ఒక పెద్ద లింకు ఉన్నది. అదేమిటో తెలుసుకోవటానికి సస్పెన్ష్ నవలను చదవండి.

వర్షం కురిసి ఆగింది.

అందువలన కాశంలో వెలుతురును రాజీనామా చేయమని చెప్పి, చీకటి పదవి ఎక్కింది.

మనుషులు ఇంకా గొడుగులను మడవకుండా నడుస్తున్నారు. కట్టుకున్న మూటలను మళ్ళీ విప్పుదామా, లేకపోతే చిరంజీవి సినిమా చూడటానికి వెళ్ళిపోదామా అని ప్లాట్ ఫారం మీద షాపులు పెట్టుకున్న వాళ్ళు ఆలొచించ, రైన్ కోటు వేసుకున్న రెండు చక్రాల వాహనదారులు రోడ్డు మీద 'వీర్ ' అని ఎగురుతున్నారు. చూసి చూసి అడుగులు వేస్తున్న పాదచారుల దుస్తుల గురించి పట్టించుకోకుండా, బురద నీటిని వాళ్ళ మీద జల్లుతూ వెళ్తున్నాయి బస్సులు.

కంప్యూటర్ క్లాసు ముగించుకుని, రెండు అంతస్తుల మెట్లను జాగ్రత్తగా దిగి, చేయి జాపి చూసి, వర్షం పూర్తిగా తగ్గిందని తెలుసుకుని తన సైకిల్ దగ్గరకు వెళ్ళాడు వెంకట్.

తరంగినీ మొబైల్స్ఎదురువైపు సీరియల్ బల్బులు అలంకరించుకుని మొబైల్ ఫోనులు ఉన్నవాళ్ళను కూడా కొత్త మొబైల్ కొనుక్కుని అప్ డేట్ అవండి అని పిలుస్తున్నది.

సైకిల్ తాళం చెవిని జేబులో వేసుకుని రోడ్డు క్రాస్ చేద్దామనుకున్నప్పుడు ఒక ఆటోవాడి దగ్గర తిట్లు తిని, వెంటనే తుడుచుకున్నాడు.

షాపుకు అద్దాల తలుపులు ఉన్నాయి.

మల్లికా, నల్లరంగు చుడీధార్ వేసుకుని అతనికి వీపు చూపిస్తూ 'ఆల్బం  తిరగేస్తున్నది. ఒకసారి తన జడను అనవసరంగా విప్పి, విదిలించుకుని మళ్ళీ కట్టుకుంది.

తలుపు తోసుకుని ఆమెకు దగ్గరగా వచ్చాడు అతను.

ఆమె చెవి దగ్గర, హాయ్ మల్లికా? అన్నాడు.

హాయ్ అంటూ వెనక్కి తిరిగిన మల్లికా ఆల్బం రెండు కాపీలనూ వేరు వేరు సంచీలలో వేసి ఇవ్వండి అని షాపతనికి చెప్పి, వెనక్కి తిరిగి ఎలా ఉన్నారు వెంకట్? అని అడిగింది.

ఆల్బం సంచులను తీసుకుని, తన దగ్గరున్న మరో పెద్ద సంచిలో పెట్టుకుంది ఆమె.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఓడినవాడి తీర్పు...(పూర్తి నవల)  @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి