పదిహేడవ అల…(సీరియల్) (PART-8)
మొట్టమొదటి సారిగా
స్కూల్లో విడిచిపెట్టబడ్డ
చిన్నపిల్లలాగా
మొదటి రాత్రి
గదిలోకి భయంతో
వచ్చి నిలబడింది
అభయ. కటిక
చీకటిలో నుండి
హఠాత్తుగా భయటకొచ్చి
వెలుతురును చూస్తున్న
వాడిలాగా తడబడ్డాడు
భార్గవ్.
వీళ్ళు ఇంతవరకు
ఒకొరికొకరు ఎదురుబొదురుగా
నిలబడి ఒక్క
మాట కూడా
మాట్లాడుకున్నది
లేదు. కానీ, ఇకమీదట
వీళ్ళిద్దరూ భార్యా
-- భర్తలుగా కలిసి
జీవించబోతారు.
లోపలకు వచ్చిన
అభయ తల
ఎత్తినప్పుడు ఎదురుగా
గోడమీద అక్షరా
యొక్క ఫోటో.
మెల్లగా దాని
ఎదురుగా వెళ్ళి
నిలబడింది. అతను
అత్రుతతో దగ్గరకు
వెళ్ళి చూసాడు.
ప్రాణమున్న నవ్వుతో
ఫోటోలో అక్షరా.
“ఈ
ఫోటో ఎప్పుడు
తీసింది బావా?”
ఇదే అభయా
భార్గవ్ తో
మాట్లాడిన మొదటి
మాట.
“ఇది
నేనూ, అక్షరానూ
ప్రేమించుకుంటునప్పుడు
మా అమ్మా, నాన్నలకు
చూపించి ఓ.కే.
అనిపించుకోవటం
కోసం తీసుకున్నది”
“అక్కయ్య
ఇందులో చాలా
అందంగా ఉన్నదే?”
“అవును
అభయా. అందంగా
ఉండటానికోసమే ‘స్టూడియో’ కి
వెళ్ళి తీసుకున్నాం”
మాట్లాడుకుంటూనే
తిరిగి వచ్చారు.
భార్గవ్ మంచం
మీద కూర్చోగా, అభయా
కూడా సహజంగా
దగ్గరే కూర్చునే
అడిగింది.
“బావా, అక్కయ్యను
మొట్టమొదటి సారి
ఎక్కడ చూసారు?”
“తిరుమల
సన్నిది వీధిలో...”
అతను వివరించి
చెప్ప చెప్ప....ఆ
దృశ్యం వాళ్ళ
కళ్ళెదురుగా ప్రాణం
పోసుకుంది.
భార్గవ్, తాను
తిరుమల బ్రహ్మోత్సవాల
కారణంగా తిరుమలకు
వచ్చిన భక్తులు
మధ్యలో నడుస్తున్నట్టు
ఫీలైయ్యాడు. గుంపులో
స్నేహితులను పోగొట్టుకొని
సెల్ ఫోన్
అప్పుగా అడుగుతూ
నిలబడున్న అక్షరా
అతని మనసు
కళ్ళ ముందు
వచ్చింది.
మనసును ఏకాగ్రపరచి
వింటున్న అభయా, భార్గవ్
-- అక్షరాల మధ్య
తాను కూడా
దూరి...జరుగుతున్నది
నేరుగా చూస్తున్నట్టు
ఫీలయ్యింది.
కళ్ళకు కట్టినట్టు
అక్షరాని మొదటిసారిగా
కలుసుకున్నది చెప్పి
ముగించిన భార్గవ్, “అక్షరా
దగ్గర నేను
ఎప్పుడు ఐ.లవ్.యూ.
చెప్పానో తెలుసా?”
“ఎప్పుడండీ?”
ఈగర్ గా
అడుగ...సమాధానం
చెప్పటం మొదలుపెట్టాడు.
భార్గవ్ నూ, అభయా
నూ తమకు
ఫస్ట్ నైట్
అనేదే మర్చిపోయి
మాట్లాడుతూనే ఉన్నారు.
మాటల ఆధార
సృతిగా అక్షరా
ఉన్నది. హ్యాపీ
కలలు నెరవేర
వలసిన రాత్రి, పూచే
జ్ఞాపకాలుగా గడిచింది.
మధ్యరాత్రి దాటి...వాళ్ళకే
తెలియకుండా నిద్ర
వాళ్ళను చుట్టుముట్టింది.
మరుసటి రోజు
భార్గవ్ ఆఫీసుకు
వెళ్ళాల్సి ఉంది.
సాయంకాలం తిరిగి
వచ్చాడు.
వైజాగుకు వచ్చిన
అతని తల్లి-తండ్రులు, అభయ
తల్లి-తండ్రులు
ఊరికి తిరిగి
వెళ్ళగా...ఆ
ఇంట్లో భార్గవ్
,
అభయా ఒంటరిగా
విడిచిపెట్టబడ్డారు.
రెండో రోజు
రాత్రి.
భార్గవ్ బెడ్
రూములో కూర్చోని
ఉన్నప్పుడు, అభయా
ఆకుపచ్చ రంగు
చీరతో, కొత్త
అందాలతో వచ్చి
నిలబడింది.
ఆమెను చూసిన
తరువాత ఏదో
ఆలోచించాడు.
“ఏమిటీ
అంత ఆలొచన?”
“లేదు
అభయా, ఇదేలాంటి
ఆకుపచ్చ రంగులో
అక్షరాకు చీర
కొనిచ్చిన జ్ఞాపకం
వచ్చింది”
గలగలమంటూ నవ్వింది.
“ఇది
అదే చీరే
బావా. మీకు
ఇష్టమని బీరువాలో
నుండి తీసి
కట్టుకున్నాను.
నాకు బాగుందా?”
“సూపర్
గా ఉంది”
మంచం మీద
కూర్చున్న ఆమె
కళ్ళు, గోడమీదున్న
అక్షరా ఫోటోవైపుకు
మళ్ళినై.
“బావా...చీర
విషయంగా నాకూ, అక్కయ్యకూ
పోట్లాటలూ వస్తుంది”
“నిజంగానా...? నమ్మలేకపోతున్నానే...!”
“అవును
బావా. మా
అమ్మ. లేత
ఎరుపు రంగులో
పట్టు చీర
కట్టుకోమంది. సంక్రాంతి
రోజున దాన్ని
ఎవరు కట్టుకోవాలన్న
ప్రశ్నతో మా
ఇద్దరికీ పెద్ద
గొడవ. నాన్న
వచ్చి ‘అక్షరానే
పెద్దది. ఆమే
కట్టుకోవాలి’ అని
చెప్పాసారు. నాకు
ఒకటే ఏడుపు.
అక్షరా సడన్
గా మనసు
మార్చుకుని ‘ఇదిగో
నువ్వే కట్టుకో’ అని
చెప్పింది. నాకు
అక్కసు వచ్చి
నువ్వేంటి నాకు
వదిలిపెట్టి ఇచ్చేది
అని చెప్పి
కట్టుకోను అని
చెప్పాను”
“ఆ!” అంటూ నవ్వాడు.
ఆ నవ్వుతో
అభయా కూడా
కలిసింది.
“తరువాత
అమ్మే ఆ
చీర కట్టుకుంది”
“ఇలా
చిన్న చిన్న
పోట్లాటలు ఉంటేనే
జీవితం స్వారస్యంగా
ఉంటుంది. కదా
అభయా?”
“అవును బావా.
ఈ ఒక్క
సంవత్సరంలో ఎప్పుడైనా
మీకూ-అక్షరాకూ మధ్యా
గొడవ వచ్చిందా?”
“వచ్చిందే...”
“........................”
“నన్ను
అడగకుండా ఎందుకు
నెక్లస్ కొనుక్కు
వచ్చారు అని
అడిగి కోపగించుకుంది.
నీకు ఆశ్చర్యంగా
ఉండనీ అని
చెప్పి సమాధానపరచటానికి
ప్రయత్నించాను”
అభయా “ఊ” కొడుతూ వింటోంది.
కలిసిపోవలసిన హృదయాలు
కథలు చెప్పుకుంటున్నాయి.
ఆ తరువాత
వచ్చిన రాత్రులూ
అలాగే గడిచినై.
“ఏమిటి
భార్గవ్...కళ్ళు
చాలా ఎర్రగా
ఉన్నాయి?”
అతని ఆఫీసు
స్నేహితులు అడగ, సమాధానంగా
నవ్వి వూరుకున్నాడు.
దగ్గర ఉన్న
ఇంకో స్నేహితుడు
“కొత్త
పెళ్ళి కొడుకు
కదా...రాత్రి
చాలాసేపటి వరకు
నిద్ర పోయుండడు” అని గేలి
చేసాడు.
‘తన
పరిస్థితి తెలియక
గేలి చేస్తున్నారు’ అని
చటుక్కున అతని
మనసులో ఒక
ఘర్షణ ఏర్పడింది.
భార్యా -- భర్తల
మధ్య సహజంగా
జరగవలసిన ఒకటి
జరగకుండా దాగుడుమూతలు
ఆడుకుంటోందే?
బెడ్ రూములో
అక్షరా గురించిన
మాటలతోనే కలుసుకున్నారు.
ఒక పరుపు
మీద పడుకున్నా
నీటిలో ఉండే
తామర పువ్వుకు
అతుక్కోకుండా నీరు దూరంగా
జరిగే వెళ్ళేలాగా
దూరంగా పడుకున్నారు.
ఇంతవరకు భార్గవ్
వేలు కూడా
అభయా మీద
పడలేదు.
తనకీ, అభయాకీ
మధ్య కంటికి
కనబడని ఒక
సన్నటి తెర
పడి వేరు
చేస్తూనే ఉంది.
ఆ తెర
ఏమిటనేది కనిబెట్టేసాడు.
బెడ్ రూములో
ఉన్న అక్షరా
యొక్క ఫోటో.
ఆ రోజు
సాయంత్రం భార్గవ్...బెడ్
రూములో నుండి
అక్షరా యుక్క
ఫోటోను తీస్తున్నప్పుడు
అయోమయంగా చూసింది
అభయా.
“ఏమిటి...అక్కయ్య
ఫోటోను తీస్తున్నారు?”
జవాబు చెప్పకుండా
నవ్వుతూ దాన్ని
తీసుకుని వెళ్ళగా, అభయా
కూడా అతని
వెనుకే వెళ్ళింది.
అతను వెళ్ళింది
పూజ రూముకు.
తిరుమల వెంకటేశుడు, మహలక్ష్మీ, వినాయకుడు
అంటూ పూజ
గది అంతా
నిండి ఉన్న
దేవుడి ఫోటోలకు
మధ్య అక్షరా
ఫోటోను పెట్టాడు.
అభయా ఆశ్చర్యంతో
దగ్గరకు వచ్చి
“బావా” అన్నది.
“అక్షరా
దేవతగా ఉండి
మనల్ని కాపాడుతుంది” వాళ్ళు చేతులు
జోడించి అక్షరా
ఫోటోకు నమస్కరించ, ఆమె
దేవుళ్ళతో కలిసిపోయింది.
బెడ్ రూము
తలుపులు మూసేసి
లోపలకు వచ్చిన
ఆమె, చీర
కట్టుకోనుంది. ఆకాశంలాంటి
నీలిరంగు. ఆమె
యొక్క ఎర్రటి
దేహానికి ఆ
నీలి రంగు
ప్రకాశవంతంగా ఉండి, ఆమె
అందాన్ని రెట్టింపు
చేసింది.
అప్పుడే ఆమెను
కొత్తగా చూస్తున్నట్టు
కళ్ళార్పకుండా
చూసాడు భార్గవ్.
ఐదున్నర అడుగుల
ఎత్తుతో, బంగారంతో
చెక్కిన శిలలాగా
మెరిసిపోయింది.
ఆమెను అలాగే
ఎత్తుకుని మంచం
మీద కూర్చో
బెట్టాడు. గడ్డం
ముట్టుకుని ఆమె
ముఖాన్ని పైకెత్తాడు.
అతని కళ్ళు
ఆమె దగ్గర
అనుమతి అడిగినై.
జవాబు చెప్పకుండా
ఆమె కళ్ళు
కిందకు వంగినై.
దాన్నే అనుమతిగా
తీసుకుని....
నిజానికి ఆ
రోజే వాళ్ళకు
ఫస్ట్ నైట్.
ఆఫీసు ముగించుకుని
ఇంటికి వచ్చాడు
భార్గవ్. శబ్ధం
విన్న వెంటనే
వాకిటికి పరిగెత్తుకు
వచ్చి స్వాగతం
పలికే అభయా
కనబడలేదు.
“అభయా...
అభయా...”
జవాబు మాట
కూడా చెప్పకుండా
లోపలి నుండి
వచ్చింది.
ఆమె ముఖాన్ని
చూసినతను ఆందోళన
చెందాడు. వానలో
తడిసిన కోడి
పిల్లలాగా అలా
ఒక వణుకు.
“ఏంటి
అభయా...అదోలా
ఉన్నావు?” -- ఆశ్చర్యంతో
అడగ,
ఏడుస్తూ అతన్ని
కావలించుకుంది.
అక్కడ టేబుల్
మీద ప్యాంటూ
- షర్టూ జతలు, ఇస్త్రీపెట్టె
పెట్టుంది.
ఒక్క క్షణం
భయపడ్డాడు. “అయ్యో, ఇస్త్రీ
చేస్తునప్పుడు
షాక్ కొట్టిందా?”
“లేదు” అంటూ అభయా
తల ఊపిన
తరువాతే అతనికి
పొయిన ప్రాణం
తిరిగొచ్చింది.
“మరెందుకు
ఇలా షాక్
తిన్నదానిలాగా
ఉన్నావు?”
అతని చొక్కా
ఒకటి తీసుకు
వచ్చి చూపింది.
“కాస్త
నిర్లక్ష్యంగా
ఉండటంతో...వీపు
వైపు కాలిపోయి
చిల్లు పడింది”
“అరె...దీనికా
ఇలా భయపడిపోయావు?”
“లేదండీ.
మీరు తిడాతారని
అనుకుని...”
“ఛఛ...దీనికిపోయి
తిడతానా?” అన్న
అతను చొక్కా
విప్పగా...
అభయా దాన్ని
తీసుకుని “లేదండీ...పదిహేనువందల
రూపాయల చొక్కా...ఒక్క
క్షణంలో చిల్లుపడింది...” అంటూ మనసు
ఉండబట్టలేక చెప్పింది.
“పోతే
పోయింది...వదులు”
“మీకిష్టమైన
గంధం రంగు
చొక్కా”
“అదే
రంగులో ఇంకో
చొక్కా కొనుక్కుందాం” అన్న అతను
స్నానాల గదిలోకి
వెళ్లాడు. ముఖం
కడుక్కుని తిరిగినప్పుడు
చేతిలో టవల్
తో అభయా.
ఆ టవల్
తీసుకుని అతను
మొహం తుడుచుకోగా
“ఒకసారి
మా నాన్న
చొక్కా ఇదేలాగా
కాలిపోయి చిల్లిపడింది.
ఆ తరువాత...నాన్న, నాన్న...” అంటూ ఏడ్చింది.
“ఏమిటి...బెల్టు
విప్పి కొట్టారా?”
“కొట్టుంటే
కూడా పరవాలేదు...నాతో
నాలుగు రోజులు
మాట్లాడలేదు”
“నేను
అలాగంతా కోపగించుకోను” అంటూ అభయాకి
అభయం ఇస్తూ
జరిగాడు.
అద్దం ఎదురుగా
నిలబడి తల
దువ్వుకుంటున్నప్పుడు.
పక్కన వచ్చి
నిలబడింది.
ఆమె పెదాలు
తుళ్ళినై.
“ఏమిటి...?”
“ఏమీ
లేదు...”
“ఏమిటి
ఏమీ లేదు?”
“మీకు
నామీద లోలోపల
కోపం...మంచి
చొక్కాను పాడుచేసానని”
“అలాగంతా
లేదు అభయా”
“కొత్త
అమ్మాయినని వచ్చిన
కోపాన్ని అనుచుకున్నారు”
“నేను
కోపమే రాలేదని
చెబుతున్నానే...?”
భర్తను కౌగలించుకుంది...కళ్ల
నిండా కుండపోతగా
కన్నీరు.
“ఏయ్...ఎందుకు
ఇప్పుడు ఏడుస్తున్నావు?”
“లేదండీ.
నా మనసు
విననంటోంది. చాలా
మంచి గుడ్డను
పాడుచేసాను. నన్ను
తిట్టండి...కొట్టండి”
చిన్న పిల్లలాగా
ఏడుస్తున్న ఆమెను
చూసి ఆశ్చర్యపోయాడు.
“సరే...కళ్ళు
మూసుకో. నువ్వు
చేసిన తప్పుకు
ఇప్పుడే శిక్ష
వేస్తాను”
ఆమె కళ్ళను
గట్టిగా మూసుకోగా, మొహం
దగ్గరకు వెళ్ళి...
“ఇచ్”
అభయా గబుక్కున
పెదాలు తుడుచుకుంటూ
తప్పుకుంది.
“ఏమిటిది...శిక్ష
వేస్తాను అని...”
“అవును...దీనికి
పేరే ముద్దుగా
శిక్షించటం అంటారు.
ఇక మీదట
నువ్వు తప్పు
చేస్తే నీకు
ఇదే శిక్ష”
“ఊరుకోండి” -- సిగ్గు
నవ్వుతో లోపలకు
పరిగెత్తింది.
ఏడుస్తున్న ఆమెను
నవ్వించేననే మనో
విజయంతో నవ్వుకున్నాడు
భార్గవ్.
“బావా...”
పిలుస్తూ వంట
గది నుండి
బయటకు వచ్చిన
అభయా రెండు
చేతుల్లోనూ గ్లాసులు.
“ఏమిటి
అభయా, మైసూర్
పాక్ చేస్తానని
లోప్లకు వెళ్లావు!
ఇప్పుడు గ్లాసులతో
వస్తున్నావు?”
“అదొచ్చి...నేను
మైసూరు పాక్
బాగానే చేస్తా.
కానీ ఈ
రోజు పాకం
పట్టటానికి నీళ్ళు
పోస్తున్నప్పుడు, నీళ్ళు
ఎక్కువ అయినై.
చేసింది వేస్టు
అవకూడదని దాన్ని
గ్లాసులో పోసి
తీసుకు వచ్చాను...అదేనండీ” అన్న అభయా
అది తాగటానికి
వీలుగా స్పూనూ
వేసి ఇవ్వటంతో
భార్గవ్ నవ్వు
ఆపుకోలేకపోయాడు.
ఆమె దొంగ
కోపంతో “ఊరికే
నవ్వకండి. కావాలంటే
రెండు దెబ్బలు
వేయండి” అన్నది.
“బాగా
జ్ఞాపకం చేసావు!
ఇలా తప్పు
చేస్తే నా
న్యాయస్థానంలో
శిక్ష ఏమిటో
తెలుసు కదా? ముద్దు
శిక్ష” అంటూ అతను
ఆమె భుజాలు
పట్టుకున్నాడు.
“అయ్యో...నన్ను
వదిలిపెట్టండి.
లోపల కూర
మాడిపోతున్న వాసన
వస్తోంది”
“కూర
మడిపోయిందా? అయితే
ఆ తప్పుకూ
కలిపి ముద్దు
శిక్ష ఇప్పుడే
ఇస్తాను. కలిపి
తీసుకో”
“బావా, ఎవరో
కాలింగ్ బెల్
కొడుతున్నారు” అని అతన్ని
ఏమార్చి జారుకోగా, అతను
ఆమెను తరుముకుంటూ
వెళ్ళ...
భార్యా-భర్తల
మధ్య అదొక
ప్రేమ దాగుడుమూతలు!
“ఏయ్... అభయా...”
గొంతువిని తిరిగింది.
వాళ్ళు నివసిస్తున్న
ఏరియాలో ఉన్న
షాపింగ్ మాల్
కు ఒంటరిగా
వచ్చింది.
ఎదురుగా రమ్యా.
తెనాలిలో హైయర్
సెకండరీ ఆమెతో
కలిసి చదువుకున్నది.
“ఏయ్...ఎలాగున్నావు?”
“బాగున్నా
అభయా...నువ్వేమిటి
ఇక్కడ...?”
“నాకు
పెళ్ళి అయ్యి
ఇక్కడే ఉంటున్నా.
నువ్వు...?”
“నాకూ
పెళ్ళి అయ్యింది.
ఒక గిఫ్టు
కొందామని వచ్చాను”
“ఎవరికి?”
“నా
భర్తకే! వచ్చే
పద్నాల్గవ తారీఖు
ఆయన పుట్టిన
రోజు. ఆయనకు
చేతి గడియారం
కొన్నాను. బాగుందా?”
తీసుకుని చూసింది.
“చాలా
బాగుంది”
“అభయా, నా
భర్త యొక్క
పుట్టిన రోజును
ఆయనకు తెలియకుండానే
తెలుసుకుని ఆ
రోజు పొద్దున
గిఫ్టు ఇవ్వబోతాను”
“ఎలా.
ఆయనకు తెలియకుండా
ఆయన పుట్టిన
రోజును తెలుసుకున్నావు?”
"ఆయన
లేనప్పుడు ఆయన
జాతకాన్ని వెతికి
తీసాను. అందులో
నుండి ఆయన
కరెక్ట్ అయిన
పుట్టిన రోజును
కనిబెట్టాను. మా
ఇద్దరికీ పెళ్ళి
సంబంధం కుదిరినప్పుడే
నాకు ఆయన
పుట్టిన రోజు
తెలుసు. అయితే
సరిగ్గా గుర్తులేదు.
అది ఆయనకు
తెలియకూడదనే ఆయన
జాతకాన్ని వెతికి
తీసి తారీఖు
చూసాను. ఆయనే
ఎదురు చూడని
సమయంలో గిఫ్టు
ఇస్తేనే నిజమైన
సంతోషం ఉంది”
కొంచం సేపు
మాట్లాడిన తరువాత
స్నేహితురాలు వెళ్ళిపోయింది.
అభయాకి ఆమె
సెల్ ఫోన్
నెంబర్ అడిగి
తీసుకోవాలని కూడా
అనిపించలేదు. అభయాకి
అనిపించింది ఒకటే
ఒకటి.
భార్గవ్ పుట్టిన
రోజును అతనికి
తెలియకుండానే తెలుసుకుని
సడన్ గా
గిఫ్టు ఇచ్చి
ఆశ్చర్యపరచాలి
అనేదే!
ఇంటికి వచ్చిన
వెంటనే మొదటి
పనిగా అతని
బీరువాను వెతికి
చూసింది. కొంతసేపటి
వెతుకులాట తరువాత
అక్షరా, భార్గవ్
ఇద్దరి జాతకాలూ
దొరికినై. దాన్ని
తీసుకుంటున్నప్పుడే
భార్గవ్ యొక్క
ఇంకో జాతకం
దొరికింది. అతని
పుట్టిన
రోజును వెతికిన
ఆమె షాకయ్యింది.
భార్గవ్ పేరు
మీద రెండు
జాతకాలు కనబడ్డాయి.....రెండు
జాతకాలలోనూ వేరు
వేరు పుట్టిన
తారీఖులు ఉన్నాయి.
Continued...PART-9
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి