మారని రాగాలు (పూర్తి నవల)
రచన అనేది వరమో...తపమో మాత్రమే కాదు! అదొక ఎండిపోని జీవనది. చల్ల చల్లగా రాసుకుని వెళ్ళే ఈదురుగాలి. ఒంటి మీద పడి జలదరింపు పెట్టే వానజల్లు. ఇంటి నిండా గుమగుమలాడే సన్నజాజి వాసన. ఎప్పుడూ కొత్తగా వాసన ఇచ్చే వాడిపోని మల్లె.
రచనకు మాత్రమే ఇవి సొంతం కాదు...ప్రేమకు కూడా! ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేమ...ప్రేమే. వయసైతే చల్లగాలి గిలిగింత పెట్టదా ఏమిటి? వర్షపు జల్లు జలదరింపు తీసుకురాదా? మత్తు ఎక్కించదా? సన్నజాజి వాసన ముక్కును తాకదా? వాడిపోని మల్లె మత్తు ఎక్కించదా?
వయసవుతున్న కొద్దీ నిజమైన ప్రేమకు బలం ఎక్కువ అవుతుంది. శరీరాన్ని ముట్టుకోవటం ప్రేమ కాదు. మనసును తాకి లోతుగా చెక్క బడుతుందే...దాని పేరే ప్రేమ!
ముందురోజు మొగ్గలను మాలకట్టి, రాత్రంతా గిన్నె కిందపెట్టి మూసిపెడతారు. మరుసటి రోజు పొద్దున దాన్ని తీస్తే గుప్పుమని విరుచుకుని, ఇల్లంతా వాసన వీస్తుంది.
అలాగే ప్రేమ కూడా! దాని వాసన జీవితాంతం వీస్తుంది. మనసులో మూతపెట్టి, మూసిపెట్టిన ఆ మాలలాగా జీవితాంతం పూస్తుంది.
వాడిపోకుండా...నలిగిపోకుండా ఉంటుంది. వాడిపోని మెల్లె పూవులాగా కొత్తగా తెలుస్తుంది.
కృష్ణమూర్తి -- మాలతీ ప్రేమ కూడా అలాంటిదే! దాన్ని ప్రేమ అని చెప్పటం కూడా తప్పే అవుతుంది. ప్రేమలో కామం ఉంటుంది. కామంలో ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళకున్నది కామంలేని...మనసును మాత్రమే తాకిన ప్రేమ. ఒకటిగా కలవని...కానీ ఒకటిగా ప్రయాణం చేసిన ప్రేమ.
ఇలాంటి ప్రేమ అపురూపం...ఆశ్చర్యం కూడా! వీళ్ళకు మాత్రమే సాధ్యం. మామూలుగా మానవ కులం మొత్తానికీ సాధ్యం అవాల్సిన ఈ విషయం సుతిమెత్తని కొన్ని మనసులకే సాధ్యమవుతుంది.
అలా ఎందుకు...ఎలా? తెలుసుకోవటానికి ఈ వర్ణజాలాన్ని చూడండి. కళ్ళను ఆకర్షించే దాని అందాన్ని అనుభవించండి. తరువాత మీ అభిప్రాయాలు తెలియజేయండి!
కృష్ణమూర్తి బయటకు
వెళ్ళటానికి రెడీ
అయ్యారు. చెప్పుల
స్టాండులో నుండి, చెప్పులు
తీసి తగిలించుకుంటున్నప్పుడు
బాగా నీరసంగా
ఉన్నట్లు అనిపించింది.
ఇదే చెప్పుల
స్టాండులో ఒకప్పుడు
నాలుగైదు జతల
చెప్పులు ఉండేవి.
పద్మజా....సీత...శారదా
అంటూ ఆడవాళ్ళ
చెప్పులు. అందులో
వెతికి తన
చెప్పులు తీసుకునేవారు
అప్పట్లో.
ప్రస్తుతం ఆ
వెతుకుడుకు అవసరంలేదు.
తనలాగానే చెప్పులు
కూడా ఒంటరిగా
పడుండటం అనేది
అనుకున్నప్పుడు
మనసులో నిండిపోయున్న
శూన్యం ఇంకొంచం
ఎక్కువ అయ్యింది.
లొతైన ఒక
నిట్టూర్పుతో వాకిలి
తలుపు తెరిచిన
ఆయన మెట్లమీద
సంకోచిస్తూ నిలబడ్డారు.
ఎండ చుర్రున
మొహాన కొడుతున్నది.
రోహిణీ కార్తి.
వీధిలో మనుష్యుల
హడావిడే లేకుండా
ఖాలీగా ఉంది.
నీడకు తలదాచుకోవటానికి
ఒక చెట్టు
కూడా లేని
వీధి అది.
వరుసగా, ఇరుకుగా
కట్టబడ్డ ఇళ్ళు.
గాలికి కరువైన
చోటు. సాయం
సమయంలో అందరికీ
ఖాలీ మేడలే
స్వర్గం. ఎండకి
ఖాలీ మేడ
నేల కూడా
కాలుతుంది.
ఈ పరిస్థితిలో
సుమారు పావుమైలు
దూరం నడిచి
వెళ్ళి హోటల్లో
భోజనం చేసి
తిరిగిరావాలి. రోజూ
మూడు వేళలూ
ఇలా భోజనం
కోసం తిరగటం
ఆయనకు కష్టంగా
ఉన్నది. దీనికొసమే
రాత్రి భోజనాన్ని
తగ్గించి, పొద్దున
తినేసి వస్తున్నప్పుడే
ఒక చిన్న
బ్రెడ్, రెండు
అరటిపండ్లు కొనుక్కుని
వచ్చేస్తారు.
వాటిని తినేసి, మంచినీళ్ళు
తాగేసి పడుకుంటారు.
ఈ రోజు
పొద్దుటి భోజనానికి
వెళ్ళటానికి కూడా
ఇష్టంలేక పోయింది.
పొద్దుటి నుండి
ఏ కారణం
చేతనో మనసు
నిలకడగా ఉండకుండా
తిరుగుతున్నది.
అది ఎందుకు
అనేది అర్ధంకాలేదు.
ఆయనా మనసును
కట్టుబాటులోకి
తీసుకురావటానికి
ఏమిటేమిటో చేసి
చూసారు.
బిందెతో నీళ్ళు
తోడుకుని, తలమీద
పోసుకుని స్నానం
చేసారు. పూజ
రూములోకి వెళ్ళి
కూర్చున్నారు. ‘లలితా
సహస్రనామం’ చెప్పారు.
ఆమ్మవారి ఫోటోకు
అర్చన చేసారు.
పూజలో కూర్చున్నారు.
కొద్ది నిమిషాలే.
మనసు దాంట్లో
ఏకాగ్రత వహించకుండా
మొరాయించింది...పీటను
తీసి గోడకు
ఆనించి, చొక్కా
తొడుక్కుని బయలుదేరారు.
ఈ రోజు
మాత్రమే కాదు...రెండు
మూడు రోజుల
నుంచే మనసు
అలజడిగా ఉంది.
ఏదోదే జ్ఞాపకాలతో
కంగారుపడుతోంది.
సతమతపడుతోంది. పాత
జ్ఞాపకాలలో మునిగి
మునిగి లేస్తోంది.
భార్య పద్మజా
జ్ఞాపకం, పెద్ద
కూతురు సీత
యొక్క జ్ఞాపకం, పదిహేనురోజుల
క్రితం పెళ్ళి
చేసుకుని, అల్లుడితో
బాంబే వెళ్ళిపోయిన
చిన్న కూతురు
శారదా జ్ఞాపకాలు...భార్య
చనిపోయిన తరువాత,
పెద్ద కూతురు
సీత వివాహం
జరిగిన తరువాత
చిన్న కూతురు
శారదానే ఇన్ని
సంవత్సరాలు ఆయనతో
ఉన్నది. చూసి
చూసి అన్నీ
చేసింది. ‘నేనూ
వెళ్ళిపోతే మీకు
ఎవరు నాన్నా
తోడు?'’ అంటుంది.
అలా ఎన్ని
రోజులు తోయగలడు? చివరగా
ఈయనే పట్టుదల
పట్టి చిన్న కూతురు
శారదాకి పెళ్ళి
జరిపించి ముగించారు.
పెళ్ళి అయిన
నాలుగో రోజే
భర్తతో ఊరికి
బయలుదేరిన రోజు
ఆమె ఏడ్చిన
ఏడుపు, ఆ
రోజు రాత్రి
ఒంటరిగా ఇంటికి
తిరిగి వచ్చి, తలుపులు
తీసుకుని, లోపలకు
వచ్చినప్పుడు మొట్టమొదటి
సారిగా ఒంటరి
తనాన్ని చవి
చూసాడు. శూన్యత
భావన కూడా
మనసును దెబ్బతీసింది.
ఒక్కొక్క సంఘటన
జ్ఞాపకానికి వచ్చి
వెళుతోంది.మనుషులందరూ
జ్ఞాపకాలతో తేలుతున్నారు.
పద్మజా....సీత...శారదా...చివరగా
మాలతీ.
ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మారని రాగాలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి