2, ఫిబ్రవరి 2023, గురువారం

జెంటిల్ మ్యాన్…(కథ)


                                                                                        జెంటిల్ మ్యాన్                                                                                                                                                                                   (కథ) 

“ఒక మగాడికి ఆడది షర్ట్ గిఫ్టుగా ఇస్తోందంటే ఆమె అతనికి తల్లిగానో, చెల్లిగానో, భార్యగానో, కూతురుగానో లేక ప్రేమికురాలుగానో అయ్యుండాలి...నువ్వు ఆ షర్టును నీ భర్తకు ఇస్తేనే కరెక్టుగా ఉంటుంది నందిని" అన్నాడు.

"ఏం ప్రకాష్! నేను చెడ్డ మనిషినా?"  అంటూ పెద్దగా ఏడ్చింది.

 “ఫస్టు ఆ ఏడుపు ఆపు. నీ మనసులో ఉన్నదేమిటో నాకు తెలుసు. నీకు మంచి భర్త దొరికాడు. ప్రేమించే పిల్లలు, సలహాలిచ్చే అత్తమామలు ఉన్నారు. నువ్వు చాలా అద్రుష్టవంతురాలివి. ఎవరికి దొరుకుతుంది చెప్పు ఇలాంటి జీవితం? నీ మనసులో ఒక సంచలనం ఏర్పడిపోయింది. ఇది చాలా మందికి ఏర్పడేదే. అందువల్ల నువ్వు చెడ్డ మనిషివని అర్ధం కాదు. నువ్వు ఇప్పుడున్నది అందమైన ఒక గాజు గూటిలో. అందులో చిన్న పగులు ఏర్పడితే జీవితమే పాడైపోతుంది నందిని”

ప్రకాష్ నందినీతో ఎందుకలా చెప్పాడో తెలుసుకోవటానికి ఈ కథ చదవండి:

నందిని ఆ రోజు చాలా అదుర్దాగా ఉంది.

కారణం.

ఆ రోజు ఆమె పనిచేస్తున్న ఆఫీసు బాధ్యతను స్వీకరించడానికి కొత్త ఎం.డి రాబోతున్నారు.

ఆమె ఆదుర్దాకు అదొక్కటే కారణం కాదు. ఆ కొత్తగా వస్తున్న ఏం.డి పేరు సత్య ప్రకాష్  అని ఉండటం కూడా ఒక కారణం.

"వచ్చేది...అతనై ఉంటాడా?" అని అనుకున్న వెంటనే ఆమెలో వణుకు పుట్టింది.

నందినికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. భర్తకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ వ్యాపార సంస్థలో "మేనేజర్" ఉద్యోగం.  మామగారూ, అత్తగారూ అనే ఉమ్మడి కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్న జీతాలతో ఆ ఇల్లు హాయిగానే గడుస్తోంది.

సరిగ్గా సమయం ఉదయం 10.30. తలుపు వేగంగా తెరుచుకుంది. లోపలకు వచ్చాడు కొత్త ఎం. డి. అతను అదే సత్య ప్రకాష్! నందిని గుండే వేగంగా కొట్టుకుంటోంది.

ఆఫీసులో అందరినీ పరిచయం చేస్తున్నాడు మెనేజర్.

సార్...ఈవిడ పేరు నందిని! మీకు ఈవిడే పర్సనల్ సెక్రటరీ. పది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తోంది. షార్ట్ హాండ్, కంప్యూటర్ ఆపరేటింగ్ అన్నీ బాగా తెలిసున్న మేధావి అని చెప్పొచ్చు"

ఆ సమయంలో నందిని జ్ఞాపకాలు పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళినై.

 ఆ కాలేజీ కధానాయకుడు సత్య ప్రకాష్. ఆటలలొ చాంపియన్. ఫుట్ బాల్ టీమ్ క్యాప్టన్. చదువులో గోల్డ్ మెడలిస్ట్. స్టూడెంట్ యూనియన్ ప్రెశిడెంట్. ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలలో చాలా మంది అతని ఫ్యాన్స్!  అందరూ అతన్ని జెంటిల్ మ్యాన్ అని పిలుస్తారు.

"ఇతనిలాంటి ఒకతనే భర్తగా దొరకాలి" అనుకుని ఎంతోమంది ఆడపిల్లలు నిట్టూర్పు విడిచిన కాలం అది. 

అలాంటి సత్య ప్రకాష్ తనతో పాటు చదువుతున్న ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమె పేరు శ్యామల. అందం, తెలివి, ఆస్తి పాస్తులు...ఇలా అన్నిట్లోనూ సత్య ప్రకాష్ కు సరితూగుతుంది శ్యామల.  కాలేజీ స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రొఫసర్స్, మిగిలిన ఆఫీస్ స్టాఫ్ అందరూ సత్య ప్రకాష్ - శ్యామల ప్రేమను చూసి ఆనందించారు. ఆ సంవత్సరం జరిగిన బెస్ట్ జోడి పోటీలో వాళ్ళకు టైటిల్ అవార్డ్ లభించింది. 

కానీ పోను పోనూ వాళ్ళకు ప్రేమ కలిసి రాలేదు.

సత్య ప్రకాష్ శ్యామలను వదిలేశాడని కాలేజీ మొత్తం కోడై కూసింది. సత్య ప్రకాష్ జెంటిల్ మ్యాన్ కాదు, అవకాశవాది అని కొందరు అతన్ని ఆడిపోసుకున్నారు.

ఎంతో అన్యోన్యంగా ఉండే సత్య ప్రకాష్-శ్యామల మధ్య ఏం జరిగుంటుంది….ఎందుకు విడిపోయుంటారుఅనేది మాత్రం చాలా మందికి అర్ధం కాలేదు.  

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

జెంటిల్ మ్యాన్…(కథ) @ కథా కాలక్షేపం-1

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి