అక్షయ పాత్ర (పూర్తి నవల)
మనిషి జీవితంలో పలు సంఘటనలకు కొన్ని సందర్భాలలో పరిస్థితులే కారణమవుతాయి. కరెక్టా, తప్పా అనేది పరిస్థితులను బట్టే. ఎటువంటి పరిస్థితులలోనూ అనురాగమును హైజాక్ చేయటమనేది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. నాలుగు నెలలుగా ఇంటికే రాని తండ్రిని వెతుక్కుని వెళుతుంది తులసి.
తండ్రి అంటే ఆమెకు ప్రాణం.
ఎంత తీసుకున్నా తరిగిపోని అనురాగమును మాత్రమే ఇచ్చే అక్షయపాత్ర ఆయన. అనురాగము మాత్రమే సర్వరోగనివారిణి అని నమ్మే తండ్రిని ఆమె కలుసుకుందా? ఆమె అక్షయపాత్ర ఆమెకు దొరికిందా? వీటన్నిటికీ జవాబు చెప్పే ‘అక్షయ పాత్రే’ ఈ నవల.
ఈ నవలను చదివి మీ అభిప్రాయాలను పంచుకోండి.
వీధి చివర
ఆటో ఒకటి
వేగంగా వస్తున్న
శబ్దం విన్న
వెంటనే తులసి
ఉప్పొంగి లేచింది.
“నాన్న
వచ్చేశారమ్మా!” -- వంట
గదిలో పనులలో
ఉన్న అమ్మకు
వినబడేటట్టు అరిచి
చెప్పి వాకిలి
వైపుకు పరిగెత్తింది.
ఆటో ఆమె
ఇల్లును దాటుకుని
నాలుగైదు ఇళ్ళ
తరువాత వెళ్ళి
ఆగింది.
తులసి ముఖం
వాడిపోయింది. “నాన్న
కాదు...ఇంకెవరో” -- చెప్పుకుంటూ
లోపలకు వచ్చింది.
తల్లి ముఖం
కూడా వాడిపోయున్నది.
కన్నీరు వస్తున్న
కళ్ళను చూపించటానికి
ఇష్టంలేక మళ్ళీ
వంట గదిలోకి
దూరింది తల్లి.
ఒంటరిగా ఉండాలనుకుని
మేడపైకి వెళ్ళింది
తులసి. పిట్ట
గోడ మీద
కూర్చున్న రెండు
మైనా పక్షులు
ఆమె వచ్చిన
హడావిడి శబ్దం
విని భయపడి
ఎగురుకుంటూ దగ్గరున్న
వేప చెట్టు
కోమ్మల పైకి
చోటు మార్చుకున్నాయి.
డాబా మీద
హాయిగా వీస్తున్న
చల్లగాలిని అనుభవించ
లేకపోయింది. దూది
ముక్కలలాగా పలు
ఆకారాలలో ఆకాశంలో
తేలుతూ వెళుతున్న
మేఘాల గుంపును
ఆస్వాదించటం కుదరలేదు.
గుంపు గుంపుగా
ఎగురుతున్న తెల్లటి
కొంగలను కళ్ళు
విరిచి చూడలేకపోయింది.
ఎక్కడ చూసినా
తండ్రి మొహమే
కనబడ్డది. ‘ఎందుకు
నాన్న రాలేదు?’ -- ఈ
ప్రశ్నే తులసి
మనసును గుల్ల
చేస్తోంది.
నాన్నను చూసి
నాలుగు నెలలు
అయ్యింది. నెలలోని
రెండో వారంలో
ఎక్కడ ఏ
పని ఉన్నా
వాటిని ముగించకుండా
అలాగే వదిలేసి
ఇక్కడికి పరిగెత్తుకు
వస్తారు. ఆ
వారమంతా ఇల్లు
ఆహ్లాదకరంలో తేలుతుంది.
చూసేవన్నీ మనోరంజకంగా
కనబడుతుంది. గాలీ, నిప్పు, ఆకాశం, నీరు, నేల
అన్నీ రమణీయంగానే
ఉంటుంది. ఆమెకు
ఊహ తెలిసినప్పటి
నుండి ఈ
పద్దెనిమిదేళ్ళల్లో
ఒక్కసారి కూడా
తండ్రి రెండో
వారంలో అక్కడ
లేకుండా పోవటం
జరగలేదు.
వచ్చేటప్పుడు ఖాలీగా
రారు. ఒక
బుట్ట నిండుగా
పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు, సూటు
కేసులో ఆమెకోసం
ఖచ్చితంగా ఒక
కొత్త డ్రస్సు
ఉంటుంది. చిన్న
వయసులో గౌను
అయితే, ఇప్పుడు
చుడీధార్, సాల్వార్
అంటూ అది
కూడా పెరిగింది.
ఆయన వచ్చే
ఆటో ఆ
వీధి చివర్లోకి
వస్తున్నప్పుడే
తులసి జింకలాగా
ఎగురు కుంటూ
పరిగెత్తుతుంది.
బల్లిలాగా ఆయనకు
అతుక్కుని ఆయన్ని
లోపలకు తీసుకు
వస్తుంది.
ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అక్షయ పాత్ర…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి