పదిహేడవ అల…(సీరియల్) (PART-9)
దగ్గర దగ్గర
ఇరవై రోజుల
తేడాతో పుట్టిన
సమయం కూడా
మారి ఉన్నది.
ముద్రించబడ్డ కాగితాలలో...పెన్నుతో
రాయబడ్డ జాతకాలు.
ఒకటి మగ్గిన
పాతది. ఇంకొకటి
కొత్తగా ఉన్నది.
అందులో వైజాగ్
ముద్రాలయం ఒకదాని
పేరు అచ్చు
వేయబడుంది.
అభయా మనసు
కన్ ఫ్యూజ్
అయ్యింది. ఒకటి
నిజమైన జాతకం.
ఇంకొకటి నకిలీనా...? వీటితో
కలిసున్న అక్షరా
జాతకం ఒకటి.
జాతకాలను చూస్తున్నప్పుడు
ఒక కాగితం
వచ్చి కిందపడగా, తీసి
చూసింది.
‘జ్యోతిష్క
పండితుడు’ అని, అడ్రస్సు
ముద్రించబడ్డ కాగితంలో
అర్ధంకాని కొన్ని
జ్యోతిష్య లెక్కలు.
అభయా ఒక
నిర్ణయానికి వచ్చినట్లు, తన
హ్యాండ్ బ్యాగులో
జాతకాలనూ, ముందు
ఆలొచనతో భార్గవ్
- అక్షరా ఇద్దరి
ఫోటోలను తీసుకుంది.
ఇంటికి తాళంపెట్టి
బయటకు వచ్చింది.
రోడ్డు మీద
వస్తున్న ఆటోను
ఆపి ఎక్కి
కూర్చుని చెప్పింది.
“....నగర్
వెళ్ళండి”
ఆమె మనసులో
వరుసగా అనుమానాలు
అలల లాగా
లేచినై. ఏదో
వేగంలో చేతికి
దొరికిన జ్యోతిష్కుడు
అడ్రస్సుకు బయలుదేరిందే
తప్ప...తాను
వెళ్ళే చోటు
తన ప్రశ్నకు
జవాబు ఇస్తుందా
అనేది కూడా
ఆమెకు తెలియదు.
జ్యోతిష్కుడు ఇల్లు
వచ్చింది. ఆటోవాడిని
వెయిట్ చేయమని
చెప్పి లోపలకు
వెళ్ళింది. అక్కడ
జ్యోతిష్కుడుతో
ఒకరు మాట్లాడుతూ
ఉండటంతో కాచుకోనుండ
వలసి వచ్చింది.
అతను వెళ్ళిన
తరువాత లోపలకు
వెళ్ళింది.
అదే జ్యోతిష్య
పండితుడు.
అభయా తన
హ్యాండ్ బ్యాగును
తెరిచి అన్నిటినీ
తీసింది. అయ్యా, “నేను
జ్యోతిష్యం చూడటానికి
రాలేదు. ఒక
అనుమానమును అడిగి
క్లియర్ చేసుకోవటానికి
వచ్చాను”
"పరవాలేదు...అడగండి”
“ఈ
జాతక వివరణ
మీరు రాసినవా?”
ఆయన ఆ
జాతకం తీసుకుని
క్షుణ్ణంగా చూస్తున్నప్పుడే, భార్గవ్
-- అక్షరా జంటగా
ఉన్న ఫోటోను
తీసి జాపింది.
జాతక వివరణ, ఫోటోనూ
ఒకసారి చూసినప్పుడు
జ్యోతిష్కుడికి
గుర్తుకు వచ్చింది.
“అవును...ఒక
సంవత్సరం పైనే
అయ్యుంటుంది. వీళ్ళిద్దరూ
నా దగ్గరకు
వచ్చి, జాతకాలు
ఇచ్చి కలుస్తున్నాయా
చూడమన్నారు”
అభయా యొక్క
హృదయం వేగంగా
కొట్టుకుంది. “మీరేం
చెప్పారు...జ్ఞాపకం
ఉందా?”
“మరిచిపోగలమా? రెండు
జాతకాలూ ఒక్క
విషయంలోనూ కలవలేదు.
ఒక వేల
ఇద్దరికీ పెళ్ళి
జరిగితే, ఒక
సంవత్సరం లోపు
ఆ అమ్మాయి
చచ్చిపొతుందని
చెప్పాను”
అగ్ని పర్వతంలా
పొంగివస్తున్న
ఫీలింగ్స్ ను
అనుచుకుంది.
“అయ్యా, ఇది
కూడా భార్గవ్
జాతకమే. ఈ
రెండింటిలో ఏది
నిజమైన జాతకమో
కనుక్కొగలమా?”
అది తీసుకుని
చూసిన ఆయన
తల ఆడించారు.
“ఇది
నకిలీ జాతకం.
నేను జాతకం
కలవదని చెప్పినందువలన, వాళ్ళు
ఇంకెవరో ఒక
జ్యోతిష్కుడ్ని
కలిసి...పుట్టిన
తారీఖూ, పుట్టిన
సమయాన్నీ మార్చి
నకిలీగా తయారు
చేసున్నారు. జాతకాన్ని
మార్చుకోవచ్చు...తల
రాతను మార్చలేము”
అభయా ఆయనకు
ఫీజు ఇచ్చింది.
“ఎందుకమ్మా
డబ్బులు? నువ్వు
జ్యోతిషిమే చూడలేదే?”
“దయచేసి
తీసుకోండి. మీరు
నాకు పెద్ద
సహాయం చేసారు”
“ఒక
విషయం మాత్రం
అడగాలి. ఏం
జరిగింది?”
“మీ
జ్యోతిష్యం ఫలించింది”
ఏడుపు స్వరంతో
చెప్పి బయలుదేరింది.
తిరిగి అదే
ఆటోలో యంత్రంలాగా
ప్రయాణం చేసి, ఆటో
చార్జ్ ఇచ్చేసి
ఇంటిలోపలకు వెళ్ళింది...తిన్నగా
పూజ గదిలోకి
వెళ్ళింది.
దాని మధ్యలో
దేవుళ్ళ ఫోటో
మధ్య అక్షరా
ఫోటో. అది
చూసిన వెంటనే
అనిచిపెట్టుకున్న
ఫీలింగ్స్ అన్నీ
ఏడుపుగా పేలినై.
ఆమె ఏడుస్తున్నప్పుడు
భార్గవ్ వచ్చాడు.
భార్య ఏడవటం
చూసి బెంబేలెత్తి
పోయాడు.
“అభయా, ఎందుకు
ఏడుస్తున్నావు? అక్షరా
జ్ఞాపకం వచ్చిందో?” అన్న
అతను తాను
కూడా దుఃఖించాడు.
అభయాకి భార్గవ్
ని చూడ
చూడ విరక్తిగా
ఉన్నది. తన
అక్కయ్య చావుకు
ఇతనే కారణం
అనే ఆలొచన
మన్సులో పరిగెత్తింది.
“సరే
అభయా, రా
వెళ్దాం” అంటూ ఆమెను
పూజ గది
నుండి బయటకు
తీసుకు రావటానికి
ప్రయత్నించినప్పుడు, అతని
చేతిని విధిలించుకుంది.
అభయా యొక్క
ఆ చేష్ట
అతన్ని ఆశ్చర్య
పరిచింది.
“ఏమైంది
అభయా?” అన్నాడు.
ఆమె తన
దగ్గరున్న రెండు
జాతకాలనూ తీసి
జాపింది.
“దీనికేమిటి
అర్ధం?”
అవి తీసుకుని
చూసిన తరువాత
అతనికి అర్ధమయ్యింది.
తాను అభయా
దగ్గర ఈ
జాతక
రహస్యాన్ని ఇంతవరకు
చెప్పలేదనేది అతనికి
గుర్తుకు వచ్చింది.
“నాకూ, అక్షరాకీ
జాతకాలు కలిస్తేనే
పెళ్ళి అని
మీ నాన్న
చెప్పారట. కానీ, మా
ఇద్దరి జాతకాలూ
కలవలేదు. ఆ
తరువాత అక్షరా
ఆలొచనప్రకారం అబద్దంగా
ఒక జాతకాన్ని
రెడీచేసి...”
“అలాగైతే
జ్యొతిష్యం ప్రకారం
మీరిద్దరూ పెళ్ళిచేసుకుంటే
అక్షరా చచ్చిపోతుందని
తెలిసే మా
అక్కయ్యను పెళ్ళిచేసుకున్నారు.
అవునా?” -- ఆవేశంగా
అడిగింది.
చూడటానికి అందంగా
ఉండే, ఆకుపచ్చని
అడవులు, మంటల్లో
కాలిపోతే ఘోరంగా
ఉంటాయి. అందమైన
స్త్రీలు కూడా
కోపగించు కుంటునప్పుడు
అలా మారిపోతారు.
వాళ్ళ కోపం
కూడా అంత
ఈజీగా ఆర్పలేనిదిగా
అయిపోతుంది.
అది చూసి
ఆశ్చర్యపోయాడు.
నిన్నటి వరకు
వంచిన తలను
ఎత్తని అభయా, ఈ
రోజు అతన్ని
నేరస్తుడుని చేస్తూ
ముద్దాయి బోనులో
నిలబెట్టి న్యాయవాదిలాగా
ప్రశ్నలు అడుగుతోంది.
“జ్యొతిష్యం
ఖచ్చితంగా ఫలిస్తుందని
నేను అనుకోలేదు.
కానీ, మనసులో
ఎక్కడో ఒక
భయం నన్ను
కదిలిస్తోంది. మనిద్దరం
విడిపోదాం అని
చెప్పాను. కుదరదు
అని చెప్పింది
అక్షరా. ‘నిన్ను
ప్రేమించి మరొకరిని
పెళ్ళి చేసుకోవటం
నావల్ల కాదు.
అదే జరిగితే
అప్పుడు కూడా
నేను చచ్చిపోతాను.
నా వరకు
నేను మీతో
ఒక్క రోజైనా
మీ భార్యగా
జీవించాలి. ఆ
తరువాత నేను
చనిపోయినా నాకు
ఆనందమే’. నేను
అక్షరాని సమాధన
పరచలేకపోయాను. అక్షరానే
నకిలీగా ఒక
జాతకం
రాయిద్దాం అని
పట్టుదల పట్టింది.
నేనూ అంగీకరించవలసి
వచ్చింది”
“అక్కయ్య
ఏం చెప్పినా, ఏం
చేసినా మీరు
పెళ్ళి మాత్రం
చేసుకోనుండ కూడదు.
అక్కయ్య పైన
మీకు నిజమైన
ప్రేమ ఉండుంటే
ఆమెను పెళ్ళి
చేసుకోనుండరు. ‘ఆమె
ఎక్కడున్నా, ఎవరితో
ఉన్నా మంచిగా
జీవిస్తే చాలు’ అని
తప్పుకోనుంటారు”
భార్గవ్ కళ్ళల్లో
కన్నీరు కారింది.
“అవును
అభయా...అప్పుడే
ఆమెను వదిలేసి
తప్పుకోనుండాలి.
నేను తప్పు
చేసేసాను”
ఆమెకు భార్గవ్
మొహాన్ని చూడటానికే
కంపరం పుట్టింది.
“నా
వరకు మీరొక
నేరస్తుడే. అక్కయ్య
చావుకు మొదటి కారణం
మీరే. అక్కయ్య
సంవత్సరీకాలకు
మమ్మల్ని వైజాగ్
పిలిచి, సోకంలో
మునిగిన వాడిలాగా
మాకు కనిపించి, పెద్దల
ద్వారా నన్ను
పెళ్ళికి అడిగి
తంత్రంగా కాయలు
జరిపేరు”
ఇప్పుడు ఆమె
కళ్ళకు భార్గవ్
ఒక ద్రోహిలాగా
కనబడ్డాడు. అంతకుపైన
అతని ముందు
నిలబడలేక వేగంగా
గదిలోపలకు వెళ్ళి
తలుపులు మూసుకుంది.
మూసిన తలుపుల
ఇరువైపులా రెండు
మనసులు కుమిలిపోతూ
నిద్రపోకుండా ఆ
రాత్రంతా గడిపినై.
తెల్లవారిన తరువాత
అభయా లేచి, స్నానం
చేసి, దుస్తులు
మార్చుకుని చేతిలో
సూట్ కేసుతో
బయలుదేరటానికి
రెడీగా నిలబడింది.
భార్గవ్ మౌనంగా
ఆమె ఎదురుగా
వచ్చి నిలబడ్డాడు.
భర్త మొహం
కూడా చూడకుండా, ఎక్కడో
చూస్తున్నట్టు
“ఊరికి
బయలుదేరుతున్నా” అన్నది.
“సరి...నీ
ఇష్టం” అన్న అతను, అతనే
వైజాగ బస్సు
స్టేషన్ దాకా
వచ్చి ఆమెను
తెనాలి వెళ్ళే
బస్సులో ఎక్కించాడు.
బస్సు బయలుదేరే
ముందు అడిగాడు.
“ఎప్పుడు
తిరిగొస్తావు?”
అభయా సమాధానమే
చెప్పకుండా మొహం
తిప్పుకుంది.
బస్సు బయలుదేరింది.
“ఏయ్...
అభయా, నీ
జ్ఞాపకమంతా ఎక్కడుంది? బంగాళదుంపలు
తోలు తీసివ్వమంటే...” అని తల్లి
కేకలెయ్యటం గమనించింది.
తాను ఏదో
అలొచనలో, ఉడకబెట్టిన
బంగాళదుంపల తోలును
తీస్తూ,
తోలును గిన్నెలోనూ, దుంపను
నేల మీద
చోటు మార్చి
వేస్తోంది.
“లేదమ్మా...టీవీలో
పాటలు వింటున్నా...” అని మాట
తప్పించింది.
అభయా వచ్చి
రెండు రోజులు
అయిపోయింది. కూతురు
రావటం కన్నవాళ్ళకు
మహా సంతోషం.
ఆమె కూడా
తన మనో
వేధనను కనబడనివ్వకుండా
ఆనందంగా ఉన్నట్టు
చూపించుకుంది.
నిజం తెలియనందువలన
కూతురు ఏదో
కొన్ని రోజులు
ఉండి వెళదామని
వచ్చుంటుందని కన్నవారు
అనుకుంటున్నారు.
ఆ రోజు
శ్రీనివాసమూర్తి సెల్
ఫోన్ మోగింది.
భార్గవే పిలిచాడు.
ఎత్తేరు.
“బాగున్నారా
అల్లుడు గారూ...” అన్న కుశల
ప్రశ్నల తరువాత
ఆయన గట్టిగా
చెప్పారు.
“అభయా...అల్లుడుగారు
మాట్లాడుతున్నారు”
మొహాన ఎటువంటి
ఫీలింగ్స్ చూపించకుండా
వచ్చి సెల్
ఫోనును తీసుకుని
లోపలకు వెళ్ళి
తలుపులు వేసుకుంది.
అవతలవైపు భార్గవ్
మొదలు పెట్టాడు.
“కులాశాగా
ఉన్నావా?”
“.......................” -- ఆమె
సమాధానం చెప్పలేదు.
“సరే...నేను
మనశ్శాక్షికి నిజాయతీగానే
నడుచుకుంటున్నాను.
నువ్వు నన్ను
ఒక నేరస్తుడిగా
చూడటాన్ని తట్టుకోలేకపోతున్నాను.
కానీ, ఇప్పుడు
నేను ఫోను
చేసింది వేరే
విషయంగా! గ్యాస్
బుక్ చేయాలి.
బుక్కు దొరకలేదు.
దాన్ని ఎక్కడ
పెట్టావు?”
“వంట
గదిలోని పై
అలమరాలో...” -- అంతే
అభయా మాట్లాడింది.
రెండు నిమిషాలాగి, “దొరికింది” అని భార్గవ్
మాట వినబడగానే
సెల్ ఫోన్
కట్ చేసింది.
గది నుండి
బయటకు వస్తున్నప్పుడు
ఆమె మొహం
ముడుచుకుపోయినట్లు
ఉండటాన్ని
అన్నపూర్ణ గమనించింది.
కూతురు వచ్చినప్పటి
నుండి ఆమెకు
మనసులో ఒక
సందేహం. ‘భర్తతో
గొడవపడి వచ్చిందో?’ అని!
అభయా తన
గదికి వెళ్ళి
నేలమీద కూర్చుని
బుర్ర గోక్కుంటోంది.
“అభయా...” అని అమ్మ
పిలుస్తున్న శబ్ధం
విని తల
తిప్పకుండా “ఏంటమ్మా” అన్నది విసుగ్గా!
అన్నపూర్ణ కూతురి
దగ్గరకు వచ్చి, కూర్చుని, కూతురి
భుజం మీద
చేయివేసి “ఏం
అభయా, ఒంట్లో
బాగుండలేదా?”
“నేను
బాగానే ఉన్నానమ్మా” -- సన్నటి
స్వరంతో చెప్పింది.
“ఎందుకే
దాస్తావు? తల్లికి
తెలియనది ఉందా? వచ్చినప్పటి
నుండీ నేనూ
గమనిస్తూనే ఉన్నాను.
నువ్వు గలగల
మంటూ ఉత్సాహంగా
మాట్లాడటం లేదు.
అల్లుడు కూడా
ఫోనులో సరిగ్గా
మాట్లాడటం లేదు.
ఏమైందే మీకిద్దరికీ?”
అంతే. అభయా
తన తల్లిని
కావలించుకుని ఏడవటం
మొదలుపెట్టింది.
అన్నపూర్ణ బెంబేలు
పడ్డది. “ఏమండీ...ఇక్కడకు
రండి...” -- కేకవేసి
భర్తను పిలిచింది.
కన్నవాళ్ళిద్దరూ
అభయా దగ్గర
కూర్చుని బుజ్జగిస్తూ
విచారించారు. ఏదో
భార్యా -- భర్తల
పోట్లాటలాగా ఉంది
అని అనుకున్న
వారికి ఆమె
చెప్పిన విషయం
తలమీద పిడుగు
పడినట్లు ఉన్నది.
“ఏమిటే
చెబుతున్నావు? అల్లుడు
ఇచ్చింది నకిలీ
జాతకమా?”
శ్రీనివాసమూర్తి
ఆవేశపడ్డారు. “అక్షరా
చనిపోయినప్పుడు
జ్యోతిష్యం అబద్దమైపోయిందే
అని మనసు
విరిగి పోయాను.
ఇప్పుడే కదా
తెలుస్తున్నది, జ్యోతిష్యం
అబద్దం చెప్పలేదు... భార్గవ్ మనల్ని
మోసం చేసాడు”
“అల్లుడు...మన
కూతురు అక్షరాని
కూడా అబద్దం
చెప్పేటట్టు చేసేరు”
“వాడేమిటే
అల్లుడు? పాపాత్ముడు, అయోగ్యుడు.
నా కూతురి
ప్రాణాన్ని బలితీసుకున్నాడు”
“అయ్యో...మన
అమ్మాయిని తెలిసే
మనం బలి
ఇచ్చేశేమే...?” గుండెలమీద
కొట్టుకుంటూ ఏడ్చింది
అన్నపూర్ణ. ఆమెతో
కలిసి అభయా, శ్రీనివాసమూర్తి
కూడా మనసు
గాయపడటంతో ఏడ్చారు.
అక్షరా మరణానికి
భార్గవ్ చేసిన
జాతక మార్పిడి
మోసమే కారణం
అని అనుకున్న
ఆ కుటుంబమే
ఏడుస్తూ ఉన్నది.
అభయా వచ్చి
ఒక నెల
రోజులు అయ్యింది.
ఆ రోజు
టేబుల్ ముందు
కూర్చుని ఒక
ధరకాస్తును ఎంతో
ఏకాగ్రతతో పూర్తి
చేస్తోంది. కన్నవారు
వచ్చారు.
“ఏమిటే
అది?”
“నేను
ఇక్కడే ఉండి
కాలేజీలో ఎం.ఎస్.సి.
చదవబోతాను”
“అప్పుడు
మొగుడింటికి తిరిగి
వెళ్ళవా?”
కడుపులో తిప్పటంతో
ఆందోళనతో అడిగింది
తల్లి. తండ్రి
మాత్రం కూతురుకి
సపోర్టుగా ఉన్నారు.
“నువ్వు
ఏ నిర్ణయం
తీసుకున్నా నీకు
తోడుగా ఉంటాను
అభయా. ఏం
చెయ్యబోతావు...చెప్పు”
భవిష్యత్తు ఒక
ప్రశ్నార్ధకంగా
నిలబడి భయపెడుతూంటే
-- ఏం సమాధానం
చెప్పలి అని
అభయా ఆలొచిస్తున్నప్పుడు...కాలింగ్
బెల్ మోగింది.
తల్లి వెళ్ళి
తలుపు తీసింది.
వాకిట్లో భార్గవ్
తల్లి-తండ్రులు
నిలబడున్నారు.
Continued...PART-10
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి