3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

పదిహేడవ అల…(సీరియల్)...(PART-4)

 

                                                                                  పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                (PART-4)

ఆత్మీయులకు...నమస్కారములతో. జరుగుతున్న శుభకృత నామ సంవత్సరం జేష్ట మాసం 25 తారీఖు మంగళవారం ఉదయం 6.50 గం.లకు విజయవాడ వాస్తవ్యులు ప్రభావతీ - ప్రకాష్ రావ్ కుమారుడు భార్గవ్  అనే వరునుకి తెనాలి వాస్తవ్యులు శ్రీనివాసమూర్తి - అన్నపూర్ణ దంపతుల పుత్రిక అక్షరా అనే వధువుకు జీవిత భాగస్వామిగా పెద్దలు నిర్ణయించిన పెళ్ళి తెనాలి రైల్వే ఆడిటోరియంలో జరుగబోతోంది కనుక...

మైకు పెట్టకపోయినా, పెళ్ళి శుభలేఖను గట్టిగా చదివారు... అక్షరా  స్నేహితులు బాలా మరియూ దీపికా, వీళ్ళ అల్లరితో హాస్టల్ గది కళకళలాడుతోంది. ఎదురుగా శుభలేఖను ఇచ్చిన భార్గవ్, అక్షరా  అమాయకులై నిలబడున్నారు.

భార్గవ్ సార్, పెద్దలచే నిర్ణయించబడింది అని వేసేరే...వాళ్ళా మీ ఇద్దరికీ పెళ్ళి నిశ్చయం చేసారు? మీరిద్దరే కదా ప్రేమించి పెళ్ళి చేసుకోబుతున్నారు?” అని ఎగతాలిగా, సందేహంగా అడిగింది బాలా.

అవునమ్మా! ప్రేమకు మీ సెల్ ఫోనూ...అందులో ఉన్న సిమ్ కార్డు నే సాక్ష్యం

ఆమెతో కలిసి ఆట పట్టించింది దీపిక.

వాళ్ళ మాటలను దారి మళ్ళించటానికి...మీరు తప్పకుండా పెళ్ళికి రావాలిఅన్నాడు.

ఖచ్చితంగా వస్తాం, సార్ అన్న వెంటనే

అక్షరా, “రండి, ఇంకా గీత, అభి, జననీ, విశాలిని అందరికీ పత్రిక ఇవ్వాలి అంటూ అతన్ని తోసుకుంటూ జరిగింది.

స్నేహితులకు పత్రిక ఇచ్చి ముగించిన తరువాత, హాస్టల్ వాకిట నిలబడి కొంచం సేపు మాట్లాడుకున్నారు.

నిశ్చయ తాంబూలాలలో కలుసుకున్నప్పుడే, మీ నాన్నా, మా నాన్నా దగ్గరి స్నేహితుల్లాగా అయిపోయారు...గమనించావా?” అని అడిగింది అక్షరా గర్వంతో.

అవును...! మీ అమ్మగారూ, మా అమ్మగారూ కూడా దగ్గరి బంధువులలాగా సహజంగా మాట్లాడుకున్నారు. కానీ, నీ చెల్లెలు అభయ మాత్రం నాతో మాట్లాడ  లేదు - తప్పు పట్టాడు భార్గవ్.

అలాగా...? ‘బావగారి దగ్గర ఎందుకే కోపం?’  అని దాన్నే అడుగుతాను అంటూ అక్షరా సెల్ ఫోన్ తీస్తుంటే అయ్యో...వద్దు అని అడ్డుకోబోయేడు.

అతన్ని పట్టించుకోకుండా నెంబర్లు నొక్కింది.

అవతలవైపు అభయ స్వరం. హలో అక్కా, ఎలా ఉన్నావు?”

బాగున్నాను. నీ దగ్గర ఒక విషయం అడగాలి. బావగారు మన ఇంటికి  వచ్చినప్పుడు...నువ్వు ఆయనతో మాట్లాడనే లేదటగా...ఎందుకే? ‘నీ చెల్లెలుకు మాటలు రావా? లేక మూగ సినిమా హీరోయిన్ లాగానా?’ అని అడుగుతున్నారే

నేనెక్కడ అడిగాను?” అంటూ భార్గవ్ తడుముకుంటుంటే అక్షరా వదలకుండా సరే, బావగారు పక్కనే నిలబడ్డారు. ఇదిగో ఆయన దగ్గర మాట్లాడు. నీ స్వరాన్ని వినని అంటూ అతని చేతికి సెల్ ఫోను ఇచ్చింది.

భార్గవ్ వంకర్లు తిరుగుతూ, “హలో... అన్నాడు.

పూర్తిగా రెండు నిమిషాలు నవ్వుతూ వినేసి...పెట్టేస్తా అభయా అని చెప్పి సెల్ ఫోన్ను తిరిగి ఇచ్చేసాడు.

ఏం చెప్పిందండి అభీ?”

కాకినాడ కాజాలంటే నాకు చాలా ఇష్టం. తెనాలి వచ్చేటప్పుడు ఎక్కువ కొనుక్కురండి అని చెప్పింది!

అలాగా చెప్పింది?” అన్నది అక్షరా అమాయకంగా.

నువ్వొక దానివి! నీ చెల్లెలు మాట్లాడలేనే లేదు

అక్షరాకి నవ్వు వచ్చింది సిగ్గు పడుతోంది అనుకుంటాను

సరే అది వదులు. నేను బయలుదేరనా?”

బయలుదేరతారా?” అని మనసు లేక అడిగింది అక్షరా.

నేను బయలుదేరకపోతే, నీ స్నేహితురాళ్ళు మళ్ళీ ఎగతాలి చేయటానికి వచ్చేస్తారు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు.

పట్టు చీరలు జిగేలు మన్నాయి. జరీ పంచెలు గంభీరంగా ఉన్నాయి. బ్యూటీ పార్లర్ల నుండి తిన్నగా వచ్చి దిగిన వాళ్ళలాగా కొంత మంది మహిళలు విపరీత మేకప్ తో తిరుగుతున్నారు. నిన్నటి వరకు పెట్టెల్లో నిద్రపోతున్న బంగారు ఆభరణాలు, రోజు మహిళల మెడలను అలంకరిస్తూ పుట్టిన ఫలితాన్ని చేరుకున్నాయి. బంధువులు, స్నేహితులు కూర్చోనున్న కుర్చీల వరసకు మధ్య దూరి పిల్లలు అటూ, ఇటూ పరిగెత్తుతున్నారు. కల్యాణ మండపం అంతా మంగళ వాద్యాలు వినబడి చెవులను ఆనంద పరుస్తున్నాయి.

వాకిట్లో భార్గవ్ తల్లి-తండ్రులు, అక్షరా తల్లి-తండ్రులూ నిలబడి...వస్తున్నవారిని స్వాగతిస్తున్నారు. బర్తతో గుసగుస లాడింది అన్నపూర్ణ.

ఇంటర్ క్యాస్ట్ పెళ్ళికి మన బంధువులు వస్తారో, రారో అని సందేహించారే! ఇప్పుడు చూడండి...ఎంతమంది జనమో

శ్రీనివాసమూర్తి కూడా గుసగుస గానే సమాధానం చెప్పారు. నువ్వొక పిచ్చిదానివే! కులం కాని కులం వాళ్ళతో ఎలా పెళ్ళి జరుపుతున్నామో వేడుక చూడటానికి వచ్చారు

ఏవండీ, అందరినీ లోపలకు రమ్మంటున్నారు పురోహితులు అంటూ బంధువు ఒకరు వచ్చి చెప్పటంతో, వాళ్ళు లోపలకు వెళ్ళారు.

వైజాగ నుండి భార్గవ్ ఆఫీసు స్నేహితులు, అక్షరా కాలేజీ స్నేహితులూ వచ్చారు. వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉపచరణ చేస్తున్న అభయ, ప్రభావతి కళ్ళకు కనబడింది. వెంటనే భర్త దగ్గర, “ఏమండీ...మనకు ఇంకో అబ్బాయి ఉండుంటే వాడికి చిన్నమ్మాయి అభయాని పెళ్ళి చేసి మన కోడలుగా చేసుకోనుండొచ్చు

నీకు చాలా ఎక్కువ అత్యాశే అంటూ నవ్వారు ప్రకాష్ రావ్.

పెళ్ళి వేదికపైన పెళ్ళి అలంకరణతో కుర్చోనున్న భార్గవ్ -- అక్షరా జంటను చూసి కన్నవారు మనసారా ఆనందపడ్డారు.

ముహూర్త సమయం దగ్గర పడింది.

అగ్ని గుండంలో నుండి వస్తున్న పొగ మెల్లగా విస్తరించింది. కెమేరా, వీడియో లైట్లు కళ్ళు చెదిరే వెలుతురు ఇస్తున్నాయి. పురోహితుడు, “మాగళ్యం తంతునానేనా, నవ జీవన... అని మంత్రాలు చెబుతూనే మేళాల బృందానికి చేతితో సైగ చేయ -- ముహూర్తం వేళ వాయిద్యం గాలిలో కలవ అక్షరా మెడలో భార్గవ్ మూడు ముళ్ళూ వేయ, పెళ్ళికి వచ్చిన వాళ్ళు జల్లిన అక్షింతలు -- ఆశీర్వాదాలూ వాళ్ళ మీద పడ్డాయి.

ఒక మగవాడికీ, ఆడదానికీ పెళ్ళి నిశ్చయం చేసినప్పటి నిమిషం నుండి శరీరంలోనూ, మనసులోనూ, ఒక విధమైన కరెంటు ఉత్పత్తి అవుతుంది. వాళ్ళ చూపుల్లో, మాటల్లో, నడకలో, దుస్తులలో, భావాలలో విద్యుత్ శక్తి బయటపడటాన్ని మిగిలిన వాళ్ళు తెలుసుకోగలరు. పెళ్ళి రోజు దగ్గర పడను పడను దాని కొలత పెరుగుతూ వెళ్ళి, ఊరంతా చూస్తూండగా తాళి కట్టే సమయంలో శిఖరాన్ని చేరుకున్న తరువాత...ఒంటరి తనం తీయదనంలో భావాలు కట్లు విప్పుకుంటున్న మొదటి రాత్రి నుండి మెల్ల మెల్లగా తగ్గటం ప్రారంభమవుతుంది.

మొదటి రాత్రి కోసం ఏర్పాటు చేయబడ్డ గదిలోకి ఒంటరిగా వదిలిపెట్టబడ్డారు భార్గవ్, అక్షరా.

మల్లె పువ్వులతో అలంకరించిన మంచం, దగ్గరలో ఉన్న స్వీట్లూ, పండ్లూ ఉంచిన పళ్లెం, పొగతో సువాసనను వెదజల్లుతున్న అరటిపండులో గుచ్చున్న అగర్ బత్తులు.

భార్గవ్ మౌనంగా కూర్చోనున్నాడు. అతనికి దగ్గరగా అందాలు ఒలకబోస్తూ కూర్చోనున్న అక్షరా హఠాత్తుగా అడిగింది. 

ఏమండీ...పెళ్ళిలో మా నన్నగారు ఇచ్చిన సారె వరుసలో ఏదైనా తక్కువైందా?”

ఎగతాళి చేస్తున్నావా?”

మరి...? మొదటి రాత్రి అనే సంతోషమే లేకుండా, మౌనంగా కూర్చోనున్నారు?”

అదంతా ఏమీ లేదు!

వెంటనే అతని మొహాన్ని పట్టుకుని తనవైపుకు తిప్పుకుంది. అబద్ధం చెప్పకండి. విషయమేమిటో చెప్పండి?”

ఒక విషయం నా మనసులో ముళ్ళులాగా గుచ్చుకుంటోంది. జ్యోతిష్కుడు చెప్పాడే...పెళ్ళి అయిన ఒక సంవత్సరం లోపు నీకు ఆపద ఉందని...

అతని నోటి మీద చెయ్యిపెట్టి అతన్ని మాట్లాడనివ్వకుండా అడ్డుకుంది అక్షరా. ఎప్పుడు జ్యోతిష్కుడు అలా చెప్పాడో...అప్పట్నుంచే నాకు జ్యోతిష్యం పైన ఉన్న నమ్మకం పోయిందండి. దాన్ని నేను పూర్తిగా  మర్చిపోయాను...మీరూ మరిచిపొండి. ఇక మీదట టాపిక్ ఎత్తకూడదు

క్షమించు అక్షరా...ఇక మాట్లాడను

వాళ్ళ మాటలు వేరు దిశగా తిరిగినై.

నీ పరీక్షా ఫలితాలు ఎప్పుడు వస్తాయి?”

జూలైలో వస్తాయి. ఖచ్చితంగా పాస్ అవుతాను

మాటల మధ్యలో భార్గవ్ మెల్లగా అమె భుజాలను పట్టుకున్నాడు. అప్పుడు అతని సెల్ ఫోన్ మోగి ఆగిపోయింది.

దాన్ని తీసి చూసేసి, “మా స్నేహితుడు ఎస్.ఎం.ఎస్. చేసాడు

అక్షరా సిగ్గుతో మొహాన్ని మూసుకుంది. టైములో కూడానా?”

తప్పుగా ఏమీ పంపలేదు అక్షరా. మొదటి రాత్రి లైట్లు ఆపేసే ముందు, సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేయాలని పంపాడు

ఆమె చిన్నగా నవ్వి, నోరు మూసుకుంది.

అతను నవ్వుతూ సెల్ ఫోనులను మౌనం చేసిన తరువాత, గదిలోని లైట్లను ఆపాడు.

మొదటి రాత్రి గదిలో చీకటి కమ్ముకుంది...రెండు శరీరాలు ఒకటిగా కలిసి హృదయంలో ఆనంద వెలుతురును ప్రకాశింప చేయటం మొదలు పెట్టినై.

భార్గవ్....ఉత్సాహంగా నడుస్తూ ఇంట్లోకి వస్తున్నప్పుడు, వంట గదిలో నుండి అక్షరా సెల్ ఫోనులో మాట్లాడుతున్నది వినబడింది.

వైజాగ్ లో అదే సీతాపురం.

అంతకు ముందు స్నేహితులతో కలిసున్న అతని ఇంటికి ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరు కాపురం వచ్చిన తరువాత కొత్త కళ వచ్చింది. స్నేహితుడు ఇంకొక గదికి వెళ్ళిపోవడంతో ఇంట్లో అక్షరా సారెగా తెచ్చిన కొత్త మంచం, పరుపు, బీరువా లాంటి వస్తువులు నిండి ఉన్నాయి. అంతకంటే పెద్ద మార్పు....ఇంటిలోపలకు వస్తున్న వెంటనే భార్గవ్ ని అంటుకునే ఉత్సాహం. ఆఫీసు పనులతో ఎంత అలసట చెందినా, ఇంటికి వచ్చిన వెంటనే అతనిలో కొత్త ఉత్సాహం పుట్టేస్తుంది.

వేరు కాపురానికి వచ్చి ఒక నెల అయిపోయింది. మధ్యలో విజయవాడ, తెనాలీ అంటూ మార్చి మార్చి ప్రయాణాలు, పిలుపులూ, విందులు, అన్నీ ఒక విధంగా ముగిసినై.

అక్షరా యొక్క అమ్మ--నాన్న, చెల్లి అభయ ముగ్గురూ ఇక్కడికి వచ్చి...రెండు రోజుల క్రితమే బయలుదేరి వెళ్ళారు.

భార్గవ్ ప్యాంటూ -- షర్టూ తీసేసి లుంగీలోకి మారాడు. స్నానాల గదికి వెళ్ళి కాళ్ళూ, చేతులూ, మొహం కడుక్కుని వచ్చాడు. వంట గదిలో ఒక చేతిలో సెల్ ఫోను, మరో చేతిలో గరిటతో అక్షరా.

ఏమిటి...నువ్వు? మటన్ బిరియానీ చేసుంటావు అని చూస్తే...ఫోనులో మాట్లాడుతూ ఉన్నావు?” అని భర్త అడిగినప్పుడు పట్టించుకోకుండానే, ఫోనులో మాటలు కంటిన్యూ చేసింది.

నువ్వు చెప్పినట్టు మిక్సీలో రుబ్బి తీసేసాను -- మాట్లాడినట్లే మసాలాను తీసి పెట్టుకుంది.

.......................”

అమ్మా! మటన్ను కుక్కర్ లో వేసేసాను. తరువాత... అంటూ సంభాషణ కంటిన్యూ అవగా, అతనికి అర్ధమయ్యింది. .కే...మీ అమ్మ దగ్గర అడుగూతూనే బిరియానీ చేస్తున్నావా? రోజు తిన్నట్టే అంటూ ఎగతాలి చేసాడు.

అక్షరా గబుక్కున వెనక్కి తిరిగి, “మీరు ఇక్కడ ఉంటే...నాకు పనే జరగదు...జరగండి అంటూ అతని వీపు మీద చెయ్యి వేసి తోసి వంటగది నుండి బయటకు పంపింది.

మంచి కుర్రాడిలాగా హాలులోకి వచ్చి అక్కడున్న టీవీ ఆన్ చేసి, చూడటం మొదలుపెట్టాడు.

అక్షరాతో వాళ్ళ అమ్మా, “ఏమే, అల్లుడు ఏదో చెప్పినట్టు వినిపించింది?” అన్నది.

ఆయన ఇప్పుడు టీవీ చూడటానికి కూర్చుండిపోయారమ్మా. అక్కడేమిటి...ఎవరో నవ్వుతున్న శబ్ధం?”

మీ నాన్నా, అభయా! నేను నీకు సెల్ ఫోనులో వంట చేయటం నేర్పిస్తున్న విధం చూసి పగలబడి నవ్వుతున్నారు

అక్షరా కొంత కోపంతో, “అలాగా...? ఫోను అభీ దగ్గర ఇవ్వమ్మా అన్నది.

అభయా ఉత్సాహంతో కాంటాక్ట్ లోకి వచ్చింది.

చెప్పక్కా

ఏయ్ అభీ! నీకు మటన్ బిరియాని చేయటం వచ్చా?”

రాదక్కా

తరువాత ఎందుకే నవ్వుతావు? పెళ్ళి చేసుకోవటానికి ముందే వంట చేయటం నేర్చుకునే దారి చూడు

దేనికక్కా...? సెల్ ఫోను ఉంది కదా! నేనూ నీలాగానే అమ్మ దగ్గర అడిగి... అని నవ్వటం మొదలుపెట్ట, తల్లి ఫోను లాక్కుంది.

నువ్వు దీనితో మాట్లాడుతూ బిరియానీని పాడుచేయకు

సరేమ్మా

కుక్కర్ను మూసేసి విజిల్ పెట్టేసావా?”

విజిల్ పెట్టేసానమ్మా

మూడు విజిల్స్ వచ్చేంతవరకు వదిలేయి

సరేమ్మా

పెరుగు పచ్చడి తయారు చేసావా?”

చేస్తూ ఉన్నానమ్మా

కొంతసేపటి కల్లా బిరియానీ రెడీ.

చాలా బాగుంది అక్షరా అని మెచ్చుకుంటూ తిన్నాడు భార్గవ్ -- భార్యకు ఒకటే సంతోషం. ఇప్పుడేనండీ నేను పాస్ అయ్యాను

ఎప్పుడు పరీక్షా ఫలితాలు వచ్చినై...చెప్పనే లేదే?”

నేను వంటను చెప్పేనండీ! అంటూ, హడావిడిగా సెల్ ఫోన్ తీసుకుని నెంబర్లు నొక్కింది.

ఇప్పుడెవరికి?” అంటూ ఎగతాలిగా చూసాడు.

అమ్మా...బిరియానీ చాలా గొప్పగా ఉందట. ఆయన అడిగి అడిగి పెట్టించుకున్నారు. నాకు కూడా మిగల్చకుండా తింటున్నారంటే చూసుకో

తింటూ ఉన్న భార్గవ్ కు ఎక్కిళ్ళు వచ్చినై. బాగుందని ఒక మాటే కదా చెప్పాను? ఇలా సర్టిఫికేట్ చదువుతున్నావే?”

అక్షరా ఇంకా మాట్లాడుతూనే ఉంది. అమ్మా! మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకందరికీ నా చేత్తో వంట చేసి పెడతాను

తల్లి ఏదో చెప్పినందుకు...గబుక్కున చిన్నగా నవ్వి సరేమ్మా అంటూ ఫోను కట్ చేసింది.

ఎందుకు నవ్వావు?”

అమ్మ చెబుతోంది...మీరు బాగా సన్నగా ఉన్నారట. ఇలా నోటికి రుచిగా వంట చేసి పెట్టి, ఒక పది కిలోలైనా పెంచి మిమ్మల్ని లావుగా చెయ్యాలట!

అంతే...అతనికి పొలమారింది. తల మీద తడుతూ గ్లాసుతో మంచి నీళ్ళు తీసుకు వచ్చింది.

రోజు అతను ఉత్సాహమైన మనో స్థితిలో ఉన్నాడు. ఆఫీసుకు వెళ్ళి త్వరగానే ఇంటికి వచ్చాడు.

ఇంట్లోకి వస్తున్నప్పుడే తలుపు తెరిచి ఉండటం గమనించాడు. ఇదేమిటి బాధ్యతే లేకుండా...తలుపు మూసి ఉంచకూడదా?’

అక్షరా... అక్షరా

లోపలకు వచ్చిన వాడు తిన్నగా వంట గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఆమె లేదు. స్నానాల గది. అక్కడా లేదు.

ఆదుర్దాతో బెడ్ రూముకు వెళ్ళినతను ఆశ్చర్యపోయాడు. అక్షరా నిద్రపోతున్నది. దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు మొహమంతా ఎర్రబడి ఉంది.

ఏయ్... అక్షరా అంటూ మెల్లగా లేపినా లేవలేదు. ఆమె నుదుటి మీద చెయ్యిపెట్టి చూసినతను అధిరిపడ్డాడు.

సెగలా కక్కుతున్నంత వేడి.

                                                                                                         Continued...PART-5

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి