9, ఫిబ్రవరి 2023, గురువారం

పదిహేడవ అల…(సీరియల్)....(PART-7)


                                                                                    పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                 (PART-7)

అక్షరా ఇక లేదు.

వైజాగ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్డులో స్కూటర్ లో ఉన్నప్పుడు, వెనుక నుండి వచ్చిన ప్రభుత్వ బస్సు, కట్టుబాటు తప్పి వేగంగా ఢీ కొనడంతో ఎత్తి పడేయబడింది.  తల వెనుక బలమైన గాయం ఏర్పడ, రక్తం ఎక్కువగా పోవటంతో, గుంపు చేరి ఆంబులాన్స్వచ్చే లోపు...

భార్గవ్ వెళ్ళినప్పుడు ఆమె శరీరం, వైజాగ్ ప్రభుత్వ హాస్పిటల్ శవ గిడ్డంగికి వెళ్ళుంది. షాక్ తో నిలబడలేక ఒరిగిపోయిన అతన్ని...పక్కన ఉన్న వారు పట్టుకున్నారు.

ఎన్నో ప్రమాదాలలో...ఎంత మందో మరణం చెందుతున్నారు. మన వరకు అవి ఉత్త వార్తలు. మరణాలు మన మనసును విధంగానూ బాధ పెట్టదు. కానీ, మనకు కావలసిన వారికి హఠాత్తుగా మరణం సంభవించినప్పుడు షాకును అనుభవిస్తాం, ఫీలవుతాము.

అక్షరా మరణం ఒక భయంకర కలలాగా ఉన్నది. ఇరు కుటుంబాల వారూ,  బంధువులూ వైజాగుకే వచ్చేసారు. పోస్టు మార్టం తరువాత వాళ్ళింటికే దేహం తీసుకురాబడింది. భార్గవ్ను కావలించుకుని ఏడ్చారు బంధువులు.

నీటిలో పడి కొట్టుకుంటున్న చీమలు, చిన్న గుంపుగా చేరి తేలుతున్నట్టు, బాధలో కష్టపడుతున్న వాళ్ళందరూ కలిసి ఏడ్చారు. వాళ్ళ హృదయాలలో అక్షరా మరణం ఏర్పరిచిన గాయం జీవితాంతం నొప్పి పుట్టిస్తూనే ఉంటుంది.

పొద్దుటి పూట వైజాగ్ చురుకు తనంతోనే మేల్కుంది. వాకింగ్ ట్రాక్స్ లో వాకింగ్ చేస్తున్న వారు, వేడి వేడిగా అమ్ముడు పోతున్న దినపత్రికలు, సెగలు కక్కుతున్న కాఫీ షాపులు.

గాంధీ నగర్ కాలనీలోని వీధులలో దూరిన ఆటో తిన్నగా భార్గవ్ ఇంటి ముందు వచ్చి ఆగింది. అందులో నుండి దిగారు అక్షరా తల్లితండ్రులు, చెల్లి అభయ.

శబ్ధం విని బయటకు వచ్చిన భార్గవ్ తల్లి-తండ్రులు, ముఖం వికసించ నమస్కరించారు.

రండి...రండి...

లోపలకు వెళ్ళి కూర్చున్నారు. హాలులో అక్షరా యొక్క పెద్ద ఫోటో, జరీ పూలమాలతో గోడకు వేలాడుతోంది. దాన్ని చూసిన వెంటనే అన్నపూర్ణా, అభయ పొంగి వస్తున్న తమ కన్నీటిని తుడుచుకున్నారు.

బాగున్నారా బావగారూ?”

కూతురు చనిపోయిన తరువాత కూడా తనని బావగారూఅని పిలవటంతో శ్రీనివాసమూర్తికి గొంతుక అడ్డు పడింది.

ఏదో ఉన్నాం బావగారూ!

కొన్ని క్షణాల మౌనం. ప్రభావతి లోపలి నుండి కాఫీ తీసుకు వచ్చి అందరికీ ఇచ్చింది. అది తాగి ముగించిన తరువాత సంభాషణ మొదలైయ్యింది.

ప్రకాష్ రావ్ చెప్పారు: అక్షరా చనిపోయి ఒక సంవత్సరం అయిపోయింది. మన అలవాటు ప్రకారం సంవత్సరీకాలు పెట్టుకుందాం అని భార్గవ్ ని అడిగాము. వాడికి ఇంకెవరినీ పిలవటం ఇష్టం లేదు. మన రెండు కుటుంబాలూ మాత్రం ఉండి చేస్తే చాలని చెప్పాడు

శ్రీనివాసమూర్తి పెద్ద నిట్టూర్పుతో చెప్పారు. ఒక సంవత్సరంగా మేము ఎక్కడికీ వెళ్లలేదు బావగారూ. ఎంత దుఃఖమున్నా జీవించి తీరాల్సిందే కదా? మీ ఫోను వచ్చిన తరువాతే... అక్షరా చనిపోయి ఒక సంవత్సరం అయ్యిందనేది జ్ఞాపకమొచ్చింది. అందరం వచ్చాసాము” 

అక్షరా లాంటి మంచి కోడలు దొరికినా, మాకు అదృష్టం లేకుండా పోయింది -- చీర్ కొంగుతో కన్నీరు తుడుచుకున్న ప్రభావతి...

ఇలా సంభాషణ కొన సాగితే అభయనూ, అన్నపూర్ణానూ ఏడవటం ప్రారంభించేస్తారు. శ్రీనివాసమూర్తి గబుక్కున మాట మార్చాడు.

అల్లుడు ఎక్కడ?”

బయటకు వెళ్లాడు. ఇప్పుడు వచ్చేస్తాడు

చెప్పినట్టే కొద్ది సమయం తరువాత వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే వచ్చిన వాళ్ళు స్టన్ అయ్యారు.

మునుపున్న శరీరంలో సగానికి చిక్కిపోయాడు. కళ్ళ కింద నల్లటి మచ్చలు. అతుక్కుపోయిన బుగ్గలూ, కొంచంగా పెరిగిన గడ్డంతో మంచాన పడి లేచిన రోగిలాగా ఉన్నాడు. అతన్ని రూపంలో వాళ్ళు ఎదురు చూడలేదు.

భార్గవ్ వాళ్లను చూసిన వెంటనే రండి మావయ్యా...రండి అత్తయ్యా అని స్వాగతిస్తూ లోపలకు వచ్చాడు. అన్నపూర్ణ తన కూతురు, అల్లుడితో పెళ్ళి అలంకరణలో గంభీరంగా చూసిన జ్ఞాపకం వచ్చినప్పుడు ఏడుపు పొంగుకు వచ్చింది. అతనికి కూడా మనసు భారంగా అయ్యుండొచ్చు. మౌనంగా లోపలకు వెళ్ళిపోయాడు.

శ్రీనివాసమూర్తి అడిగారు. ఏమిటండీ...అల్లుడు ఇలా చిక్కిపోయి, సగం అయిపోయారు?”

అక్షరా జ్ఞాపకాలు అతన్ని కాల్చుకు తింటున్నాయి. నడుస్తున్న శవంలాగా జీవిస్తున్నాడు. మొదట్లో రెండు నెలలు ఇక్కడ ఉండి వాడ్ని చూసుకున్నాం. తరువాత మేము విజయవాడ వెళ్ళిపోయాము. మునపటిలాగా మెస్లో తింటూ, ఆఫీసుకు వెళ్ళొస్తూ ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు

హాలులో ప్రకాష్ రావ్, శ్రీనివాసమూర్తి కూర్చుని మాట్లాడుకుంటున్నారు... అన్నపూర్ణ, అభయ - ప్రభావతితో కలిసి లేచి లోపలకు వెళ్లారు.

పగలు పన్నెండు గంటలకు అక్షరా ఫోటోను పెట్టి దన్నం పెట్టుకున్నారు. ప్రకాష్ రావ్ నడుముకు తుండు కట్టుకుని పూజలన్నీ చేసాడు. 

లంచ్ హోటల్ నుండి తెప్పించాలని అనుకున్నారు. కానీ అన్నపూర్ణ, అభయ... ప్రభావతితో కలిసి వంటచేసారు. అందరూ భోజనాలు చేయడానికి కూర్చోగా... అభయ వడ్డించింది. 

పెద్ద గుంపుగా జేర్చుకుని, శాస్త్ర సంప్రదాయ కార్యాలు ఏదీ వాళ్ళు చేయలేదు. రెండు కుటంబాలూ కలిసి వాళ్లను కన్నీటిలో తేలనిచ్చి...కళ్ళు మూసిన అక్షరా యొక్క ఆత్మకు అంజలి ఘటిస్తున్న ఒక ఫంక్షన్ లా చేసారు.

సాయంత్రం రైలుకు తెనాలికి తిరిగి వెళ్దామనుకున్న శ్రీనివాసమూర్తి ఫ్యామిలీని ఎక్కువ బలవంత పెట్టి అడ్డుకున్నారు ప్రకాష్ రావ్ దంపతులు.

రాత్రి భార్గవ్ బయటకు వెళ్ళినప్పుడు... అభయ పక్కింటి అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు...లోపల అన్నపూర్ణ దగ్గర మెల్లగా మాటలు మొదలుపెట్టింది ప్రభావతి.

వదినా, మీ అభయాకు ఏమైనా సంబంధాలు చూస్తున్నారా?”

లేదమ్మా... అక్షరా కి ఇలా అవటంతో మేము విరిగిపోయాము. దీని గురించి ఆలొచించటం కుదరలేదు

భార్గవ్ ని తలుచుకుంటేనే మాకు బాధగా ఉంది. వాడికి మళ్ళీ పెళ్ళి చేస్తేనే జీవితంపై వాడికి ఒక పట్టు వస్తుంది. లేకపోతే ఏదో ఒకరోజు వాడు కూడా మాకు  లేకుండా పోతాడు

సంభాషణ దిశగా వెళుతున్నదీ అనేది అన్నపూర్ణకి అర్ధమయ్యింది -- ప్రభావతి కంటిన్యూ చేసింది.

ఇలా అడుగుతున్నానే అని తప్పుగా అర్ధం చేసుకోకండి. మీ అభయాను మా భార్గవ్ కు పెళ్ళి చేసిస్తే...వాళ్ళిద్దరి జీవితాలూ బాగుంటాయి. మనమూ ప్రశాంతంగా ఉండొచ్చు

అన్నపూర్ణ సమాధానం చెప్పకుండా తన భర్తవైపు చూసింది.

వాళ్లను ఒంటరిగా ఆలొచించుకోవటానికని ప్రకాష్ రావ్, ప్రభావతి అక్కడ్నుంచు కదిలారు.

అన్నపూర్ణ, “ఏమండీ...మన అభయ జాతకాన్నీ, అల్లుడు జాతకాన్నీ కాంపార్ చేసి చూద్దామా?” అని అడిగింది.

మనం జాతకం చూసే కదా అక్షరాకి పెళ్ళి చేసాము. అక్షరా చనిపోయిందే...! అప్పట్నుంచే నాకు జ్యోతిష్యం పైన ఉన్న నమ్మకం పోయింది. నా ఆలొచనంతా మన అభయాను రెండో భార్యగా పెళ్ళి చేసివ్వాలా అనేదే... అన్నారు  శ్రీనివాసమూర్తి. 

అన్నపూర్ణ ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. దీనికా ఇంతగా ఆలొచించారు? అల్లుడి గురించి మీకు తెలియదా చెప్పండి? బంగారం కదండీ. అక్షరాకి అతనితో జీవించే అదృష్టం లేకపోయింది. అభయా అయినా చక్కగా జీవించనివ్వండి”  

వాళ్ళు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రకాష్ రావ్, ప్రభావతి వచ్చారు. ఇద్దరి నవ్వు మొహాలనూ చూసిన తరువాత వాళ్లకు నిర్ణయం తెలిసిపోయింది.

పెళ్ళి చాలా వరకు నిశ్చయం అయిపోయింది. ఒకే ఒక ముఖ్యమైన విషయం బాకీ ఉన్నది. అభయానీ, భార్గవ్ ని పెళ్ళికి ఒప్పించటం.

వాళ్ళు ఒప్పుకుంటారా?

ఏం మాట్లాడుతున్నారు మీరు? అక్షరా జ్ఞాపకాలతోనే జీవితమంతా గడపాలని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి వెళ్ళిపొండి

టపాకాయలా పేలేడు భార్గవ్. ఎదురుగా నిలబడ్డ కన్నవారు అతన్ని సమాధాన పరచటానికి ప్రయత్నించారు.  

ఇదంతా ఎమోషన్ కు లోబడి మాట్లాడేది. జీవితాంతం ఒంటరిగా గడపటం కుదురుతుందా? విధవరాలు అయిన స్త్రీ కూడా మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారే. మగవాడైన నువ్వెందుకు ఒంటరి జీవితం జీవించాలి?”

ఒక వేల నేను పెళ్ళి చేసుకున్నా అక్షరా చెల్లెల్నా...ఎవరు మీకు ఆలొచన చెప్పింది?”

అక్షరా యొక్క తల్లి-తండ్రులే

ధైర్యంగా ఒక అబద్దం చెప్పింది ప్రభావతి.

భార్గవ్ మాట్లాడలేకపోయాడు. ప్రకాష్ రావ్ కి కంటితో సైగ చూపిన ప్రభావతి, అతికేటట్టు మాట్లాడటం మొదలు పెట్టింది.

అభయాకు వస్తున్న వరులు...పెద్దమ్మాయి కులం కాని కులంలో పెళ్ళి చేసుకుందని తెలిసిన వెంటనే వద్దని తిరిగి వెళ్ళిపోతున్నారట. అందుకే అభయాను నీకే పెళ్ళి చేసి ఇద్దామని చూస్తున్నారు

నిజం సగం -- మిగతాది కల్పితం కలిపి తెలివిగా మాట్లాడింది. భార్గవ్ కు ఇక వద్దని  చెప్పటానికి మనసు రాలేదు. ఇంతకు ముందు ఒకసారి అక్షరాతో సరదాగా నీ చెల్లెల్నూ నేనే పెళ్ళిచేసుకుంటానుఅని చెప్పిన వెంటనే, ఆమె  కోపగించుకున్నది జ్ఞాపకానికి వచ్చింది. రోజు...విధి నా నోటి ద్వారా మాటలు రప్పించుంటుందా?’

అభయా భ్రమ పట్టిన దానిలాగా నిలబడింది. ఆమె కలలో కూడా అనుకోని ఒక ప్రశ్నను అడిగారు కన్నవారు.

బావను పెళ్ళి చేసుకోవటం నీకు సమ్మతమేనా?”

పెళ్ళి అన్న వెంటనే ఒక అమ్మాయికి రావలసిన సిగ్గూ, సంతోషం, ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవటం -- ఏదీ ఆమెకు రాలేదు. మొదట ఆశ్చర్యం, తరువాత కన్ ఫ్యూజన్.

అక్కయ్యనూ, బావనూ పెళ్ళి అలంకరణతో నిల్మడున్న దృశ్యాలే మనసులో కదులుతున్నాయి. బావను ఒంటరిగా కల్పనలో కూడా చూసింది లేదు. ఇప్పుడు హఠాత్తుగా ఇలా అడిగితే...?

అక్కయ్య భర్త నాకు వరుడు! అక్కయ్య ఉన్న చోట ఇక నేను. ఇది కరక్టేనా...?’

అభయా యొక్క కాళ్ళు అమెకు తెలియక నడిచి వెళ్ళి హాలులో ఉన్న అక్కయ్య ఫోటో ముందు నిలబడ్డాయి. ఫోటోలో అక్షరా ప్రాణాలతో వచ్చి నిల్బడినట్లు అనిపించింది. నేను ఏం నిర్ణయం చెప్పాలి అక్కా?’ అని అడిగేటట్టు ఆమె రూపాన్నే చూస్తూ నిలబడ్డది. అక్కయ్య యొక్క అందమైన ముఖం తనని చూసి మృదువుగా నవ్వుతున్నట్టు అనిపించింది. అభయా కళ్ళల్లో నుండి కన్నీరు పొంగింది.  

అక్కయ్య మరణం వలన బావ మనసు, శరీరం వాడిపోయి ఉన్నాయి. నేనూ అదే దుఃఖంలో ఉన్నాను. ఒకే బాధతో తపించిపోతున్న రెండు జీవులు పెళ్ళి చేసుకుని ఒకరికొకరు ఓదార్పుగా ఉండటంలో ఏముంది తప్పు?’

ఒక మెరుపులాగా అనిపించిన ఆలొచనతో మనసు స్పష్టత పొందింది. అక్కడకు వచ్చిన తల్లి ఆమె మొహం చూసే ఆమె నిర్ణయాన్ని ఊహించుకోగలిగింది. అప్పుడు గోడమీదున్న బల్లి వేసిన శబ్ధం వినిపించింది. బల్లి చెప్పేసింది. మంచి శకునం. ఇక పెళ్ళి మంచిగా జరుగుతుంది అన్నది తల్లి, ఆనందంతో.

భార్గవ్ -- అభయా పెళ్ళి తెనాలి శివాలయంలో చాలా సింపుల్ గా జరిగింది. దగ్గర బంధువులనూ, స్నేహితులనూ మాత్రం పిలిచారు. గుడికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద  రెస్టారెంటులో ఉదయం టిఫిను, లంచ్.

భార్గవ్ నీ, అభయానీ పూలమాలలతో చూసినప్పుడు వారిని కన్నవాళ్ళకు హృదయం నిండింది. అక్షరా మరణం మనసులో పైకెత్తిన భారాన్ని పెళ్ళి కిందపెట్టింది.

పెళ్ళి ఎంత సింపుల్ గా జరిగిందో...అలాగే మొదటి రాత్రి గది కూడా సింపుల్ గా అలంకరించబడి ఉంది. మంచానికి దగ్గర ప్లేటులలో పళ్ళూ, స్వీట్లూ, మల్లె పువ్వుల మూరల సన్నటి వాసన.

గది మధ్యలో అక్షరా యొక్క అందమైన ఫోటో.

మంచం మీద పట్టు పంచ, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోనున్న భార్గవ్ మనసులో ఒక విధమైన ఇబ్బంది చోటు చేసుకుంది. క్వోస్చన్ పేపర్ను చేతిలో ఉంచుకుని జవాబు తెలియక బిత్తర చూపుల స్టూడెంట్ మనో పరిస్థితిలో ఉన్నాడు.

గది తలుపు తెరుచుకుని, మళ్ళీ గొళ్ళెం పెట్టబడ్డ శబ్ధం. కంటిన్యూ గా వినబడుతున్న కాళ్ళ గొలుసు యొక్క చిన్న శబ్ధం.

పెళ్ళి కూతురుగా సిగ్గుతో తలవంచుకుని వచ్చింది అభయ.

అతని హృదయం దిక్కు-దిక్కుమని కొట్టుకుంది.

                                                                                                    Continued...PART-8 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి