14, ఫిబ్రవరి 2023, మంగళవారం

జీవించటానికే జీవితం…(కథ)


                                                                               జీవించటానికే జీవితం                                                                                                                                                              (కథ) 

జీవితం అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? మనకున్న జీవిత సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా? జీవిత గమ్యాన్ని లక్ష్యాలుగా మార్చుకుని సాధించటం ఎలా? జీవిత విజయాలకు మూలము క్రమశిక్షణ మరియు పట్టుదల!   జీవితం--గమ్యం--లక్ష్యాలు--ప్రేరణ.

మనిషి పుట్టుకకు మరణానికీ మధ్య ఉండే సమయం జీవితం...మనం అబ్బాయిగా పుట్టాలా అమ్మాయిగా పుట్టాలా, ఊరిలో పుట్టాలి అనే విషయాలను మనం నిర్ణయించలేము.

అలాగే మనం ఎవర్ని పెళ్ళిచేసుకోవాలి, ఎంతమందికి జన్మ నివ్వాలి అనేది కూడా మనం నిర్ణయించుకోలేము.

అలాగే, జీవించటానికే జీవితం అనేది గుర్తుంచుకుని, మనకిచ్చిన బాధ్యతలను నెరవేర్చాలి. అదే జీవించటం అంటే.

సముద్ర తీరంలో ఇసుక మట్టి మీద వాళ్ళిద్దరూ కూర్చోనున్నారు. సాయంత్రపు పసుపు ఎండ మరుగవటం మొదలుపెట్టింది. చల్లని సముద్రపు గాలి మల్లె పూవు వాసనను మొహం మీదకు తోస్తుండగా కుటుంబరావ్ తిరిగి చూసాడు.

పువ్వులు అమ్ముకునే కుర్రాడు, “మల్లె పూవ్వులూ! కదంబం! అని అరుచుకుంటూ ఇసుకమట్టి మీద ఇటూ అటూ పరిగెత్తుతున్నాడు.

భార్య కవితకు ఒక మూర కదంబం కొనడానికి, చేతులు కొట్టి కుర్రాడిని పిలవాలని మనసులో లేచిన ఆశను అనుచుకున్నారు కుటుంబరావ్.

రోగిస్టి లాగా నీరసించి పోయున్న మొహంతో ఎదురుగా కూర్చోనున్న కొడుకు జగదీష్ ను చూసి, ఆయన మనసు ఎక్కువ వేదన చెందింది. కొద్ది రోజులుగా జగదీష్ ఎందులోనూ ఇష్టం చూపక, ఎప్పుడూ ఎక్కడో చూస్తున్న చూపులతో, పిచ్చి పట్టినట్టు తిరుగుతూ కష్టపడుతున్నట్టు ఉండటం చూసి తండ్రికి మిక్కిలి బాధగా ఉన్నది.  

జగదీష్! -- ప్రేమగా పిలిచాడు తండ్రి.

! -- కలలో నుండి బయటపడినట్టు ఉలిక్కిపడ్డ కొడుకు ఆయన్ని చూసాడు.

మొన్న మీ కంపెనీ మేనేజర్ను కలిసాను. ఆయన అన్నాడు నువ్వు పోయిన వారం మూడు రోజులు ఒంట్లో బాగుండలేదని లీవు పెట్టావట. నిన్న ప్రొద్దున కూడా తలనొప్పిగా ఉన్నదని లీవు తీసుకుని బయలుదేరేవుట...నీ అనారోగ్యానికి ఏమిటి కారణం అని నా దగ్గర విచారించారు. నువ్వు ఇప్పుడంతా నీ ఉద్యోగంలో ఎక్కువ శ్రద్ద చూపటం లేదని కూడా విసుకున్నారు. అవునూ, నేను కూడా అడుగుదామనే అనుకున్నాను. నిన్న తలనొప్పిగా ఉందని ఆఫీసు నుండి బయలుదేరిన వాడివి -- ఇంటికి రాత్రి చాలా లేటుగానే వచ్చావు?  మీ అమ్మ ఎక్కువగా బాధపడుతోంది. ప్రొద్దున నా దగ్గర చెప్పింది. కొద్ది రోజులుగా నువ్వు అలవాటుగా తాగే రాత్రి పూట తాగే పాలను ముట్టుకోవటం లేదట. బలవంతం చేసి అడిగితే విరుచుకుపడుతున్నావట. నిన్న రాత్రి నేను కూడా గమనించాను. నీ గదిలో లైటు వెలుగుతూనే ఉంది. ఒక పుస్తకాన్ని చేతిలో ఉంచుకుని, గోడవైపే చాలాసేపు చూస్తూ కూర్చోనున్నావు...!

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

జీవించటానికే జీవితం…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి