హీరో (పూర్తి నవల)
కథా కాలక్షేపం టీమ్ రాసిన రచనలలో వంద శాతం పరిపూర్ణ సృష్టి ఇది అని చెప్పగలను. ఒకేసారి ఈ నవలను చదివే వాళ్ళూ -- కొంచం సుతిమెత్తని మనసు కలిగినవారుగా ఉంటే -- ఖచ్చితంగా నవల ముగింపులో కన్నీరు కారుస్తారు.
తేట తెల్ల నీరులాగా రచన ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం. ఇందులో అది ఉంటుంది. సినిమా రంగం గురించి నవలలో చెప్పబడుతున్నందున ఆ రంగానికి చెందిన జిగినా పనులు ఇందులో కొంచం చేర్చారు.
నాకు ఎప్పుడూ చురుకుదనం చాలా ముఖ్యం. దాంతో పాటూ ఆలొచింప చేయడం ఎక్కువ ఇష్టమైన విషయం. ఈ నవలలో స్వామీజీ పాత్ర ఒకటి, ఆ ఆలొచనను ఎక్కువ ప్రేరేపిస్తుంది.
ఇదొక కుటుంబ కావ్యం...ప్రేమ కథ...కొంచం సస్పెన్స్.
ఈ మూడు కలయికతో ఇది రాసి ముగించిన పరిస్థితిలో నిజమైన ‘హీరో’ అని పేరు పెట్టారు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నవలలోకి తల దూర్చండి...మా ‘హీరో’ మిమ్మల్ని కరిగించి ఏడిపించటానికి తయారుగా ఉన్నాడు.
ఆ మనిషిని
చూసినప్పుడు ఒక
బిచ్చగాడి లాగానే
అనిపిస్తోంది. కానీ, బిచ్చగాడి
దగ్గర ఉండవలసిన
చెడువాసనకు బదులుగా
అతని శరీరం
నుండి గంధము, పన్నీరూ
కలిసినట్లుగా ఒక
సువాసన వీస్తోంది.
అశ్విన్ ను
ఆ విషయం
ఆశ్చర్యపరిచింది.
అతను చూస్తున్నప్పుడే
పెద్దాయన ఒకరు
కారులో వచ్చి
దిగి పరిగెత్తుకుని
వెళ్ళి ఆయన
కాళ్ళమీద పడ్డాడు.
ఆయనో నిర్లక్ష్యంగా
మొహం తిప్పుకున్నారు.
“నువ్వు
బాగుపడవురా...కొంచం
కూడా బాగుపడవు...” అని కూడా
తిట్టారు. అదివిని
ఆ పెద్దాయన
మొహంలో ఒకటే
సంతోషం.
అలా ఆయన
తిడితే అది
ఆశీర్వాదమేనట!
మంచి ఉత్సాహమైన
మనసుతో ఉన్నాడు
అశ్విన్. ఈ
రోజు అతనికి
స్క్రీన్ పరీక్ష.
సినిమా డైరెక్టర్
విశ్వనాద్ గారిలాగా
ఒక డైరెక్టర్
అతన్ని ‘హీరో’ గా
పెట్టి ఒక
సినిమా తీయబోతారు.
ఆయన తీయబోయే సినిమాకు
హీరో సెలెక్షన్
కోసం ఎంతోమందిని
చూసారు. ఒకరు
కూడా నచ్చలేదు.
చివరగా సెలెక్ట్
అయ్యింది అశ్విన్
అనే ఈ అశ్విన్
కుమార్.
అశ్విన్ కు
పెద్ద ప్లస్
పాయింట్ అతని
శరీరమే. ఒక
రోజుకు మూడుసార్లు
స్నానం, ఆ
తరువాత వారానికి
రెండు రోజులు
నూనె రాసుకుని
తల స్నానం.
ఇది చాలదని
రోజూ జాగింగ్, జిం
లో వ్యాయామం
అంటూ రెగులర్
గా వెళుతూ
శరీరాన్ని ట్రిమ్ముగా పెట్టుకున్నాడు.
మామూలు జలుబుకు
కూడా వెంటనే
ఒక స్పేషలిస్ట్
దగ్గరకు వెళ్ళిపోతాడు.
శరీర ఆరొగ్యం
అంటే అంత
పిచ్చి. కాలేజీ
చదువుకునే రోజుల్లోనే
అతను ఆరొగ్యంపై
పెట్టుకున్న ప్రేమ
కాలేజీ లోనే అతన్ని చాలా ఫేమస్ చేసింది. మామూలు
ఎండను కూడా
ఎప్పుడూ శరీరానికి
తగలనివ్వడు. కొంతమంది
మహిళా టీచర్లలాగా
ఎప్పుడూ గొడుగు
వేసుకునే బయటకు
వెళతాడు. వర్షానికి
కూడా ఇదే
తంతు. చిన్న
వాన చినుకులతో
తడిసినా జ్వరం
వస్తుందేమోనన్న
భయం. అన్నిటికీ
మించి అతని
ప్రకాశవంతమైన ముఖ
అందం.
మొత్తానికి అతని
శరీరమే అతనికి ప్రపంచం.
ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
హీరో...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి