మనుషులే లేని ద్వీపంలో మనుషుల విగ్రహాలు (మిస్టరీ)
మన భూమిమీద
మిస్టరీస్ కి
కొదవే లేదు.అలాంటివాటిలో
ఒకటి ఈ
మనుషులే లేని ద్వీపంలో మనుషుల విగ్రహాలు.
ఆ ద్వీపమే
ఈస్టర్ ద్వీపం…… దీనిని రూపనూయి అని కూడా పిలుస్తారు.
ఈస్టర్ ద్వీపం ఫసిఫిక్ మహాసముద్రం లోని పాలినేసియన్ ద్వీపం. ఈ ద్వీపం 1888 సంవత్సరంలో చీలి దేశం తో అనుసంధించబడింది .ఈ ద్వీపం ప్రాచీనమైన విగ్రహాలకు ప్రసిద్ధి . వీటిని రూపనూయి ప్రజలు నిర్మించారు.
ఈ ద్వీపం
ప్రత్యేకత
ఏంటో
తెలుసా
అసలు
మనుషులే
ఉండని
ఈ
ద్వీపంలో
మనుషులని
పోలిన
విగ్రహాలు
విస్తరించి
వున్నాయి.
ఒకటో,రెండో
కాదు
ఏకంగా
887
విగ్రహాలతో
విస్తరించి
వుంది
ఈ
ద్వీపం.
జకోబ్ అనే డచ్ అన్వేషికుడు వేరే ద్వీపాన్ని వెతుకుతుండగా దారి తప్పి ఈ ద్వీపాన్ని చేరుకున్నాడు. చేరుకున్న రోజు ఈస్టర్ అవడం తో దానికి ఈస్టర్ ఐలాండ్ అని పేరు పెట్టారు.
మనుషులు కనిపించని
ఆ
ప్రదేశం
లో,మనిషి
తలని
పోలిన
అన్ని
విగ్రహాలని
చూసి
వారు
నివ్వెరపోయారు.
సముద్రపు
ఒడ్డున
మాత్రం
20
విగ్రహాలు
అచ్చం
మనుషుల
లాగా
వరుసగా
నిలబడి
సముద్రపు
వైపు
చూస్తున్నట్టుగా
ఉంటాయి.
ఆ విగ్రహాలు చూసిన ఆ అన్వేషికులకు ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అసలు ఏమిటి ఈ ప్రాంతం? అసలు వీటిని ఎవరు చేసారు ?ఎందుకు చేసారు? అసలు ఇవి విగ్రహాలా లేక శాపగ్రస్తులైన మనుషులా? అంటూ ఎన్నో అనుమానాలు , ప్రశ్నలు తలెత్తాయి .అప్పటినుండి ఈ ప్రాంతం మీద ఇన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఆ బొమ్మలు నిజమైన మనుషులవే నని, క్షుద్రశక్తులు వారిని ఆలా బొమ్మలుగా మలిచాయని, రోజు రాత్రి అవి మాట్లాడుకుంటాయని,దీనంగా ఆర్తనాదాలు చేస్తాయని ఇలా ఎన్నో కథనాలు వెలువడ్డాయి.
ఇలాంటి మూఢ నమ్మకాలని నమ్మని సైంటిస్ట్ లు , అక్కడి మిస్టరీని ఛేదించాలని అనుకున్నారు . అలా వెళ్లిన వాళ్ళకి ఒక షాక్ ఎదురయింది.ఆ విగ్రహం దగ్గర తవ్వితే 30 అడుగుల విగ్రహం బయటపడింది. ఆ ద్వీపం మీద కనబడే తలల శరీరం భూస్థాపితమైంది. 30 అడుగుల ఆ విగ్రహాన్ని చూసి ఆ శాత్రవేత్తలు నిర్ఘాంత పోయారు. ఇక ఆ ద్వీపం మీద కథనాలు ఇంకా బలపడ్డాయి. క్షుద్రశక్తులు అలా చేశాయని అనుకునేవారు. దానికి ఆజ్యం పోస్తూ ఆ శిలల వెనుక భాగం లో ఏవో విచిత్రమైన గుర్తులు వున్నాయి. అది చూసిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనాలని ఇంకా ముమ్మరం చేసారు. ఆ బొమ్మలు చేసిన పదార్థం గురించి విశ్లేషించారు. ఆ పదార్థం చల్లారిన అగ్నిపర్వతం యొక్క లావా లాంటి బొగ్గు పదార్థం.ఆ పదార్థం ఊరిలో కాక అగ్నిపర్వతం దగ్గర మాత్రమే దొరుకుతుంది. మరైతే ఆ విగ్రహాల్లన్ని అక్కడే తయారు చేసి ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చారు ? ఏ టెక్నాలజీ లేని ఆ సమయం లో ఎలా తీసుకువచ్చారు ? అన్న ప్రశ్నలకు సైంటిస్ట్ లు తమకు తోచిన థియరీ లను చెప్పారు. తాళ్ళని ఉపయోగించి పెద్ద విగ్రహాలని కదల్చడం పెద్ద కష్టమేమీ కాదని వారు నిరూపించారు.
అక్కడ నివసించినవారి సాంప్రదాయ రీత్యా చనిపోయిన ఊరి పెద్దలకు లేదా సిపాయిలకు ఇలాంటి విగ్రహాలని ఏర్పాటు చేసి ఉండొచ్చని అంచనా. మరి దాదాపు 15000 ల మంది నివసించడానికి అణువుగ వున్నా ఆ ప్రదేశం నిర్మానుష్యం గా ఎందుకు మారింది ? అన్న ప్రశ్నకు సమాధానం వెతక సాగారు. క్రీ.పు అక్కడ 15000 ల మంది జనాభా వుండి ఉండొచ్చని ... కానీ కాలక్రమేణా ఆహార రీత్యా లేదా ఆ వోల్కనిక్ ఏరోప్షన్ వల్లనో జనాభా పూర్తిగా తగ్గి పోయి, యూరోపియన్ వారు అక్కడికి వెళ్ళినపుడు కేవలం 1 నుండి 2 వేల జనాభా ఉండేదని చరిత్ర చెబుతుంది. ఆ జనాభా కూడా వున్న చెట్లని నరికి ఈ విగ్రహాల తరలింపుకు గాని లేదా ఇంటి అవసరాలకి కానీ వాడుకొని డిఫోరెస్టెషన్ వల్లగాని ఆహారానికి కష్టమై ఉండొచ్చన్ని లేదా యూరోపియన్ల రాక వాళ్ళకు కలరా, ప్లేగు లాంటి వ్యాధులు సోకి వుండొచ్చని అంచనా.
కానీ ఇంతకీ ఈ విగ్రహాలని ఎందుకు తయారు చేసారు?వాటిలో కొన్ని సముద్రం ఒడ్డు మీద వరుసగా ఎందుకు ఉన్నాయి. ఆ విగ్రహాల వెనుక ఉన్న ఆ లిపి కి అర్థం ఏమిటి ? కొన్ని బొమ్మలకు కళ్ళు లేకపోవటానికి కారణం ఏమిటి ? లాంటి ప్రశ్నలు ఇంకా మిస్టరీ గానే వున్నాయి.
Images Credit: To
those who took the original photos
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి