పదిహేడవ అల…(సీరియల్) (PART-5)
‘ఇద్దరి
జాతకాలకూ పొత్తే
లేదు. మీ
రాశి, నక్షత్రం
బట్టి మీరు
పెళ్ళి చేసుకుంటే
ఒక సంవత్సరం
లోపే అక్షరాకి
అకాల మరణం
ఏర్పడుతుందీ’
ఆ గదిలో
అశరీర వాక్కులాగా
వినబడింది. ఎప్పుడో
చెప్పిన జ్యోతిష్కుడి
స్వరం.
లైటు వేయకపోవటం
వలన గదంతా
చీకటిగా ఉన్నది.
ఫ్యాను కూడా
తిరగటం
లేదు.
కిటికీ కర్టెన్
లో కొంచం
కూడా కదలిక
లేదు.
“అక్షరా...” అని గట్టిగా
అరిచాడు.
ఆ అరుపుతో
అక్షరా మేలుకుంది.
“వచ్చాసారా...? చాలా
అలసటగా ఉండటంతో
అలాగే నిద్ర
పోయాను” అంటూనే లేవటానికి
ప్రయత్నించింది.
భార్గవ్ అడ్డుకున్నాడు.
“లేవకు
అక్షరా. నీకు
జ్వరంగా ఉంది”
“మీకు
టిఫిన్ చేయాలే?”
“హోటల్
నుండి తెప్పించుకుందాం.
అలాగే పడుకోనుండు.
వచ్చేస్తాను” అన్నతను...లైటు, ఫ్యాను
వేసేసి వేగంగా
బయటకు వెళ్ళాడు.
కొద్ది సమయం
తరువాత అతను
వచ్చినప్పుడు, అక్షరా
లేచి మంచం
మీద కూర్చోనుంది.
“ఏమండీ...ఎక్కడికెళ్ళారు?”
“టాక్సీ
పిలుచుకు రావటానికే!
రా...హాస్పిటల్
కు వెళ్ళి
వచ్చేద్దాం”
“ఏమిటండీ
మీరు? ఒక
మాత్ర వేసుకుంటే
జ్వరం పోతుంది.
దీనికొసం...” అన్నది నీరసంగా.
“చూడు
ఒళ్ళు ఎంత
వేడిగా ఉందో? మాట్లాడకుండా
నాతోరా” అన్నాడు బాధతో.
అక్షరా లేచి
నడిచింది. ఆమెను
చేయి పుచ్చుకుని
తీసుకు వెళ్ళేటప్పుడు, “నేనేమన్నా
పేషంటునా...? వదలండి” అని చేతిని
వదిలించుకోవటానికి
ప్రయత్నించింది.
“మాట్లాడుకుండా
రా” -- కేకలు
వేసాడు.
భర్త చూపించిన
శ్రద్ధ, మనసును
సంతోష పరచింది.
లోలోపల గర్వ
పడింది.
ఇద్దరూ బయటకు
వచ్చి, ఇంటికి
తాళం వేసి
బయలుదేరారు.
డాక్టర్ దగ్గరకు
వెళ్ళి ఇంటికి
తిరిగి వచ్చినప్పుడు
టైము ఎనిమిది
అవుతోంది.
భార్యను ఏ
పని చేయనివ్వలేదు.
అతనే గంజి
కాచి తీసుకు
వచ్చాడు. తానే
పడదామనుకున్నాడు.
అలాగే మాత్ర
ఇచ్చాడు.
ఆమె నిద్రపోవటం
మొదలుపెట్టినప్పుడు, అతని
సెల్ ఫోన్
మోగింది. ఫోన్
చేసింది అక్షరా
నాన్నగారు.
గదికి బయటకు
వచ్చి మాట్లాడాడు.
“హలో...నమస్తే
మావయ్యా”
“నమస్తే
అల్లుడూ...బాగున్నారా?”
“బాగున్నాం
మావయ్యా”
“ఫోనును
అక్షరా దగ్గర
ఇవ్వండి. వాళ్ళ
అమ్మ మాట్లాడాలట”
“అదొచ్చి...
అక్షరాకి బాగా
జ్వరంగా ఉంది
మావయ్యా. మంచి
నిద్ర పోతోంది”
“ఏమిటీ...జ్వరమా? ఇప్పుడెలా
ఉంది?”
అవతలివైపు శ్రీనివాసమూర్తి
ఆందోళనపడ్డాడు.
అంతలో అక్షరా
నిద్ర చెదిరి, లేచి
వచ్చింది.
భార్గవ్ దగ్గర
నుండి ఫోను
తీసుకుంది. గబగబా
మాట్లాడింది.
“ఏమీ
లేదు నాన్నా.
నాకు తెలికైన
జ్వరం. దానికే
ఈయన భయపడి
హాస్పిటల్ కు
తీసుకు వెళ్ళారు.
డాక్టర్ ఇంజెక్షన్
చేసి మందులు
ఇచ్చాడు. ఇప్పుడు
బాగానే ఉన్నా”
“అక్షరా, ‘వైరస్’ జ్వరంగా
ఉంటుందేమోమ్మా!
ఇప్పుడే నేనూ, మీ
అమ్మా బయలుదేరి
వస్తాము”
“అదంతా
ఏమీ వద్దు
నాన్నా. ఇది
మామూలు జ్వరమే”
“సరే
అమ్మడూ. ఆరొగ్యం
జాగ్రత్తగా చూసుకో”
అమ్మా, అభయ అంటూ
ఒకరి తరువాత
ఒకరు ఆందోళనతో
మాట్లాడిన తరువాత
ఫోన్ కట్
చేసింది అక్షరా.
నీరసంతో భర్తను
చూసింది.
“ఏమండీ...నాకు
జ్వరం అని
చెప్పేసారు! అమ్మ, నాన్నా, అభయ
ముగ్గురూ టెన్షన్
పడ్డారు. రాత్రి
అనేది కూడా
చూడకుండా వెంటనే
బయలుదేరి వస్తామని
చెబుతున్నారు. మంచికాలం
నేను ఫోనులో
మాట్లాడినందు వలన
సమాధానమయ్యారు”
“సారీ.
ఆందోళనలో ఏం
చెప్పాలో నాకు
తెలియలేదు”
పెద్దగా నిట్టూర్పు
విడిచి గదిలోకి
వెళ్ళి పడుకుంది.
మరుసటి రోజు
పొద్దున మామూలుగా
లేచి ఉత్సాహంగా
వంటపనిలో మునిగిపోయింది.
భార్గవ్ వచ్చి
ప్రేమగా అడిగాడు
“అక్షరా...ఇప్పుడెలా
ఉంది?”
“బాగుందండి.
జ్వరం ఎటుపోయిందో
తెలియటం లేదు”
“ఈ
రోజు రెస్టు
తీసుకు. నేను
ఆఫీసుకు సెలవు
చెప్పేసి ఇంటి
పనులు చూసుకుంటాను”
అక్షరా ప్రేమ
కోపంతో చూసింది.
“ఎందుకు...? నేను
బాగానే ఉన్నాను.
మీరు పనికి
బయలుదేరండి”
“అది
కాదు...” అని ఏదో
చెప్పటానికి ప్రయత్నించిన
అతన్ని ఆపింది.
“అదొచ్చీ...”
“ఊ...జ్యోతిష్కుడు
చెప్పినట్టు ఎక్కడ
నేను చచ్చిపోతానోనని
భయపడుతున్నారు”
ఉలిక్కిపడి ఆమె
నోరు నొక్కాడు.
“దయచేసి
దాని గురించి
మాట్లాడకు”
మెల్లగా అతని
చేతిని తొలగించింది.
“ఏది
జ్ఞాపకం తెచ్చుకోకూడదో...దాన్ని
తలుచుకుని తలుచుకుని
భయపడి, నాకూ
జ్ఞాపకం చేస్తున్నారు”
“నేనేం
చేయాలి...చెప్పు”
“దేని
గురించీ బాధపడకుండా
ఆఫీసుకు వెళ్ళి
రండి. ఆదివారం
ఎక్కడికైనా పిక్నిక్
వెళ్ళొద్దాం”
“సరి”
ఆ ఆదివారం
వాళ్ళు అరకులోయకు
వెళ్ళారు.
ఇద్దరూ చేతులు
జోడించుకుని అరకులోయ
అందాలను తిలకిస్తూ
నడుస్తూ అక్కడక్కడ
కనబడుతున్న అటవీ
లోయలను ఆనందొత్సాహంతో
చూస్తున్నారు. ఒక
పచ్చిక బయలు
లాగా ఉన్న
చోట ఇద్దరూ
పక్కపక్కనే కూర్చుని, ఒకరినొకరు
రాసుకుంటూ ప్రకృతి
అందాలను ఆశ్వాదించారు.
వాళ్ళ మనసుల్లో
ఉత్సాహమూ, కుతూహులమూ
పొంగి పొర్లుతోంది.
ఏదో ఒక
స్కూలు నుండి
‘ఎస్కర్షన్’ వచ్చున్న
విధార్ధీ - విధార్ధినులూ, టీచర్లు
తొడురాగ...
అటవీ ప్రాంతాన్ని
ఆశ్చర్యంతో చూసారు.
కొంత మంది
విదేశీ పర్యాటకులు
ఫోటోలు తీస్తున్నారు.
భార్య భుజాన్ని
ముట్టుకున్నాడు.
“అక్షరా, నేను
ఇంతకు ముందే
ఇక్కడకు వచ్చి
చాలా చోట్లు
చూసాను. నీతోపాటూ
వచ్చి చూస్తున్నప్పుడు
ఒక్కొక్క చోటూ
చాలా కొత్తదిగా, మొదటిసారి
చూస్తున్నట్టు
కుతూహలంగా ఉంది”
ఆమెకు సిగ్గుతో
కలిసిన ఆనందం.
“అవునండీ...అభిమానించే
వాళ్ళు పక్కనుంటే
ప్రపంచమే కొత్తగా
కనబడుతుంది”
మాట్లాడుతూనే చాలా
సమయం గడిపారు.
“ఆ
రోజు నీకు
జ్వరం వచ్చినప్పుడు
నేనెంత భయపడ్డానో
తెలుసా?”
పచ్చ గడ్డి
నేల మీద
ఉన్న గడ్డి
ముక్కల్ను ఏరి
తుంపుతూ మాట్లాడింది.
“మీరు
చెప్పిన వెంటనే
నాకు పాత
జ్ఞాపకాలు వచ్చేసినై”
“ఏమిటది...?”
“నాకు
పదేళ్ళ వయసప్పుడు
అమ్మోరు పొసి
ఒళ్ళంతా చిన్న
చిన్న పొక్కులతో
నిండిపోయింది. జ్వరంతో
పడుకోనున్నాను.
ఒళ్ళంతా మంట
పుడుతొంది. అమ్మ...వాకిట్లో
వేపాకులు కట్టింది.
నాన్న విసన
కర్రతో విసురుతూ
ఉన్నారు. అప్పుడు
అభీ నా
పక్కన నిలబడి
ఏడుస్తూనే ఉన్నది.
అది దేవుని
దగ్గర ఏం
వేడుకుందో తెలుసా?"
“ఏం
వేడుకుంది?”
“దానికీ
అమ్మోరు రావాలని
వేడుకుంది. అదేలాగా
దానికీ వచ్చింది”
“అక్షరా, ఇంట్లో
ఒకరికి అమ్మోరు
వస్తే, పిల్లలందరికీ
వస్తుంది”
“అది
కాదండీ. నేను
దాని అభిమానాన్ని
చెబుతున్నా” -- చెప్పేటప్పుడే
ఆమె కళ్ళు
ఎర్రబడ్డాయి.
“నువ్వు
అభయ జ్ఞాపకంగానే
ఉన్నావనుకుంటా.
ఆమె వైజాగ్
వచ్చి నీతో
ఒక వారం
రోజులు ఉండనీ.
ఏమంటావు?”
“అదంతా
వద్దు”
“లేదు...తను
వస్తే నీకు
సపోర్టివ్ గా
ఉంటుంది” అన్న అతను
ఫోను తీసుకుని
నెంబర్లు నొక్కటం
ప్రారంభించాడు.
“అయ్యో...ఏం
చేస్తున్నారు?”
“సెల్
ఫోను పెట్టుకుని
మ్యాజిక్కా చేయగలను? ఫోనే
చేస్తున్నాను”
“ఎవరికి?”
“మీ
నాన్నకు”
“దేనికీ?”
“ఉండు...తెలుసుకుంటావు” అంటూ మాట్లాడాడు.
“హలో
నమస్తే మావయ్యా.
బాగున్నారా?”
“.........................”
“ఉన్నాను
మావయ్యా... అక్షరా కూడా
బాగుంది...” అన్న అతను
తిన్నగా విషయానికి
వచ్చాడు.
“అక్షరా
ఎప్పుడూ అభయ
జ్ఞాపకంతోనే ఉంటోంది.
మాట్లాడుతూంటే
మాటకు మాట
చెల్లెలి పురాణమే.
ఆ రోజు
వంటగది మూలలో
నిలబడి ఏడుస్తూ
ఉన్నది. అడిగితే...ఉల్లిపాయలు
తరుగుతున్నా అని
చెబుతోంది. నిజానికి
ఏడుస్తున్నది. మీరు
అభయాని ఒకఒక
వారం రోజులు
ఇక్కడకు పంపించండి.
ఆమె ఉంటే
అక్షరా సంతోషంగా
ఉంటుంది”
“..........................”
“కాలేజీకీ
వెళ్ళాలా...‘లీవు’ దొరకదా? సరే
మావయ్యా” అన్న అతను, “మీ
నాన్న నీతో
మాట్లాడాలట” అంటూ ఫోను
ఇచ్చాడు.
మొదట తండ్రి
మాట్లాడాడు, తరువాత
తల్లి మాట్లాడింది, తరువాత
అభయా మాట్లాడి
ముగించిన తరువాత
ఫోను కట్
చేసిన అక్షరా
కోపంతో భర్తను
చూసింది.
“ఎందుకండీ
ఇలా ఎక్కువ
చేసి చెబుతున్నారు? నేను
అభీ జ్ఞాపకంతో
ఏడ్చెనా?”
“అన్నీ
నిన్ను చూసి
నేర్చుకున్నదే
అక్షరా” అన్నతను “మీ
నాన్నా - అమ్మా
ఏం చెప్పారు?” అన్నాడు.
“ఇంకో
నెల రోజుల
తరువాత కాలేజీ
‘లీవు’ లో
అభీ, అమ్మా
వస్తారట”
“దానికా
అంతసేపు మాట్లాడారు?”
“ఎందుకు
అడగరు? అభీని
వదిలి ఉండలేకపోతున్నానని, నేను దానిమీద బెంగ పెట్టుకుని
ఏడుస్తున్నట్టు
అబద్దం చెప్పారు.
అమ్మ నాకు
సలహాల వర్షం
కురిపించింది. పెళ్ళి
అయిపొతే పుట్టింటి
మనుషులను మర్చిపోవాలట.
తోడబుట్టిన చెల్లెల్ని
అయినా సంధర్భం
దొరికినప్పుడే
చూడాలట. దాన్ని
తలుచుకుని భర్త
ముందు ఏడవకూడదట.
నాకు ఇది
అవసరమా?”
“సారీ
అక్షరా...కావాలంటే
మళ్ళీ మీ
నాన్నకు ఫోను
చేసి, ఇదంతా
నా లీలలు
అని చెప్పేయనా?”
అతని దగ్గరున్న
ఫొనును లాక్కుని
తరువాత “దీనిని
లోయలో పడేస్తా...” అని ముద్దుగా
బెదిరించింది.
“అయ్యయ్యో...అలా
విసిరేయకమ్మా. మన
ప్రేమ మొదలయ్యిందే
ఈ సెల్
ఫోను వలనే...మర్చిపోయావా?” అంటూ
నవ్వాడు.
“దానికోసమైనా
దీన్ని లోయలో
పడేయాలి!”
“అదేమిటి!”
గేలి మాటలు, ఎగతాలి, వేడుక
చూడటంలో టైము
గడిచింది. సాయంకాలం
సూర్యాస్తమయం అక్కడ
ఇంకా బాగా
అనిపించింది. పలు
యుక్త వయసు
జంటలు జోడిగా
తిరుగుతున్నారు.
వాళ్ళ మధ్యలో
డెబ్బై ఏళ్ళు
దాటిన తాతయ్య, అమ్మమ్మ
చేతులు జోడించుకుని
పచ్చగడ్డి మీద
గంభీరంగా నడిచి
వచ్చిన దృశ్యం
పలువురిని ఆకట్టుకుంది.
“ఏమండీ, మనకు
వయసు పైబడి
ఇలా అయిన
తరువాత ఇదేలాగా
అరకులోయకు పిక్నిక్
రావాలి” అన్నది కళ్ళల్లో
కల మెరుపుతో.
భార్గవ్ కు
షాక్ కొట్టినట్టు
అయ్యింది. పెదాలు
నవ్వుతున్నట్టు
ఉన్నా, లోపల
భయం పరిగెత్తుతున్నది.
‘నేనూ, అక్షరా నూ ఈ
వయసు వరకు
విడిపోని జంటగా
జీవించగలమా? లేక...జాతకం
మధ్యలో దూరి
మమ్మల్ని విడదీస్తుందా?’
Continued...PART-6
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి