26, జులై 2022, మంగళవారం

మృత్యుదూత...(క్రైమ్ నవల)

 

                                                                                        మృత్యుదూత                                                                                                                                                                            (క్రైమ్ నవల)

ఔషధానికి (మెడిసిన్) పనికి వచ్చే మొక్కలను ఓషధులు అంటారు (మెడిసినల్ హెర్బ్స్). ఔషధానికి పనికి వచ్చే మొక్కల వేరు ను మూలికలు అంటరు(మెడిసినల్ రూట్స్). అలాగే విషపూరిత మొక్కలు, వాటి వేర్లు కూడా తక్కువ మోతాదులో ఔషదంగా పనికొస్తాయి. అలాంటి మూలికలను కనుగొనటానికి ఏర్పరచిన పురావస్తు శాఖ మూలికా పరిశోధనా విభాగంలో పనిచేసి విరామం తీసుకున్నారు దశరథమూర్తి గారు. విరామం తీసుకున్న తరువాత కూడా ఆయన తన సొంత పరిశోధనా శాల ఏర్పాటు చేసుకుని, అంతర్జాతీయ మూలికా పరిశోధనా శాస్త్రవేత్తలతో కలిసి  మూలికలపై తన పరిసోధనలను కొనసాగిస్తూ ప్రభుత్వానికి సహాయపడుతూ ఉంటారు.

దశరథమూర్తి గారి సొంత పరిశోధనా శాలలో ఉన్న కొన్ని అరుదైన మూలికలను దశరథమూర్తి గారిని తమ నిర్భందంలోకి తీసుకుని, ఆయన్ని బెదిరించి ఆయన పరిశోధనా శాలలో జాగ్రత్త చేసుకున్న అరుదైన మూలికలను దోపిడి చేసుకుని వెడుతుంది ఒక ముఠా.

ముఠా అరుదైన మూలికల దుష్ట శక్తులను ఉపయోగించి కొందరిని హతమారుస్తుంది. పోలీసులకు దోపిడి విషయాన్ని రిపోర్టు చేసి  ముఠాను పట్టుకోమని ప్రాధేయపడతారు దశరథమూర్తి గారు.

మూలికలే కదా అని పోలీసులు మెతకగా జరుపుతున్న విచారణను వేగవంతం చేయమని, అరుదైన మూలికలకు విదేశాలలో మంచి డిమాండ్ ఉన్నదని, కోట్లు విలువ చేస్తాయని, 'ఆలస్యం అమృతం విషం'  అని దశరథమూర్తి గారు పోలీసులను ప్రాధేయపడతారు.

దోపిడి చేయబడ్డ మూలికలకు విదేశాలలో అంత డిమాండ్ ఉందా? నిజంగానే మనుష్యులను హతమార్చే శక్తి మూలికలకు ఉన్నదా? ఎలా హతమార్చింది? దీన్ని పోలీసులు ఎలా నమ్మారు? కేసును సీరియస్ గా తీసుకుని చివరికి దోపిడీదార్లను పోలీసులు ఎలా కనిపెట్టారు? ఇవన్నీ తెలుసుకోవటానికి నవల చదవండి.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మృత్యుదూత...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి