13, జులై 2022, బుధవారం

గాలితో ఒక యుద్దం...(సీరియల్)...(PART-7)

 

                                                                             గాలితో ఒక యుద్దం...(సీరియల్)                                                                                                                                                               (PART-7)

జీవితంలో గొప్పగా విజయం సాధించిన కొందరి దగ్గర ఒక సర్వే జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ విజయానికి కారణం వాళ్ళు చిన్న వయసు నుండే కలలు కన్న వాళ్ళుగా ఉండటమే ఆశ్చర్యం.

అందులో పలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినై. విజయం సాధించినవారి విజయం వెనుక వాళ్ళ తల్లి-తండ్రుల కలలూ దాగి ఉన్నాయి.

ముఖ్యంగా సినిమా రంగంలో పెద్దగా విజయం సాధించిన వారి మనసుల్లో వాళ్ళు చాలా కాలంగా సినిమాలో విజయం సాధించాలనే పడ్డ తపన...కోరిక ఎక్కువగా ఉన్నది.

అదేలాగా క్రికెట్టులో విజయం సాధించటానికి ఒక వీరుడు, "నేను ఎప్పుడూ ఎదో ఒకటి తీసుకుని దానితో ఒకదాన్ని కొడుతూ ఉండే వాడిని. అదేలాగా రోడ్డు మీద పడున్న రాళ్ళను ఏరుకుని ఎక్కడైనా గురిచూసి వేసేవాడిని" అన్నారు.

తరువాత రోజులలో అతను ఎలా కొట్టినది...గురి చూసి వేసినదే క్రికెట్టు ఆటలో అతన్ని పెద్ద వీరుడుగా చేసింది.

మనసులో పాతుకుపోయిన ఇలాంటి ఇష్టాలు ఎలా విజయంగా మరినై? దాన్నీ నిపుణులు కనుగొన్నారు. అది ఒక ఆశ్చర్యకరమైన జవాబే!

వెక్కి వెక్కి ఏడుస్తున్న కార్తిక్ ను గమనించిన వీరబద్రం " కార్తిక్... ఎవరురా ఫోనులో...ఎందుకురా ఏడుస్తున్నావు?"

బద్రం! దెబ్బకు పైన దెబ్బరా. నన్ను పాము కరిచిన విషయం తెలిసి అమ్మా-నాన్నలు బెదిరిపోయి ఒక కారులో నన్ను చూడటానికి వస్తున్నారు. వచ్చే దారిలో వారు కారు ప్రమాదానికి గురై వాళ్ళిద్దరూ రోడ్డు మీద పడున్నారట..."

"నిజంగానా! అంతలోపు ఇంత దూరం వచ్చారా? అవును...ఎక్కడ?"

"నువ్వు వేగంగా వెళ్ళు...మనం వచ్చిన దారిలోనే"

కార్తిక్ కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పడంతో......

కారు వేగం పెంచాడు వీరబద్రం. మట్టిరోడ్డు కదా దుమ్ము పైకి లేచింది.

రోడ్డుకు చివర్లో నడుస్తున్న బాతుల గుంపు నీటి గుంట ఉన్న వైపు వెడుతున్నాయి. అవన్నీ కారు వేగం చూసి బెదిరిపోయి ఎగరటంతో కలవరం మొదలైంది.

బాతులను తోలుకొస్తున్న కాపరి అలాగే పక్కనున్న మొక్కల పొదల్లో పడుతూ గట్టిగా అరిచాడు.

వీరబద్రానికి మొదటి సారిగా...'ఒకవేల నిజంగానే గాలిదేవుడు ఉన్నాడో?' అనే ఆలొచన మొదలైయ్యింది.

                                                                                 ****************

రోడ్డు చివర!

అక్కడున్న చింత చెట్టుకు ఒక కారు ఢీ కొని, కారు బ్యానెట్ తెరవబడి ఉండగా...కారుకు ఇరుపక్కలున్న డోర్స్ పక్షి రెక్కలలాగా విరుచుకోనున్నాయి.

"అదిగో ఆక్సిడెంట్ కారు...!"

వీరబద్రం ఎదురుగా చూస్తూ కొంచం గట్టిగా చెప్పగా... కార్తిక్ గమనించాడు.

వేగంగా వచ్చిన వీరబద్రం కారు...యాక్సిడెంట్ అయిన కారును అనుకుని నిలబడ్డది. అదే సమయం...సైరన్ మోతతో ఒక ఆంబులాన్స్ వచ్చి నిలబడ్డది. చుట్టూ ఉన్న ప్రజలందరూ అక్కడ గుమికూడారు. 

కార్తిక్ ఆందోళనతో తనొచ్చిన కారులోంచి దిగి పరిగెత్తాడు.

రామశర్మ గారు, విమలాదేవి ఒకరి మీద ఒకరు పడున్నారు. ఇద్దరిలో విమలాదేవికి తలమీద దెబ్బ తగిలి రక్తం కారుతోంది. రామశర్మ గారికి కాలు మీద గాయం.

వణుకుతూ వాళ్ళను ముట్టుకోవటానికి వెళ్ళిన కార్తిక్ ను ఆంబులాన్స్ లో వచ్చిన హాస్పిటల్ స్టాఫ్ పక్కకు తోసి, వాళ్ళిద్దర్నీ స్టెక్చర్లో ఎక్కించారు. వాళ్ళతో వచ్చిన డాక్టర్ ఆంబులాన్స్ లోనే చేయాల్సిన ఫస్ట్ ఏయిడ్ చెయటం మొదలుపెట్టాడు.

ఐదు నిమిషాలు కూడా అవలేదు! ఆంబులాన్స్ బయలుదేరింది.

"అమ్మా...నాన్నా..." అంటూ కేకలు వేశాడు కార్తిక్.

"మీరు వాళ్ళ అబ్బాయా?"

"అవును డాక్టర్"

"అలాగే ఫాలో చేస్తూ రండి. ప్రాణాపాయం ఏమీ లేదు. కానీ, ఎముకులు విరగటానికీ...చర్మం గీసుకుపోవటానికీ ఎక్కువ చాన్స్ ఉంది"-- అన్నారు.

డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు...యాక్సిడెంట్ జరిగిన చోటును తన మొబైల్ కెమేరాలోనూ, డిజిటల్ కెమేరాలోనూ ఒకతను పలు కోణాలలోంచి ఫోటోలు తీసాడు.

ఇంతలొ పోలీసులు కూడా వచ్చారు.

"అయ్యా...'ఢాం' అని పెద్ద శబ్ధం వినబడగానే వచ్చి చూసానయ్యా. ఒకాయన, ఒకమ్మగారూ బోర్లా పడున్నారు. కారు డ్రైవ్ చేసుకు వచ్చిన డ్రైవర్...మేము చూసేటప్పుడు పరిగెత్తి వెళ్ళిపోయాడండి

"దొంగ వెధవ...మందు తాగి కారు నడిపుంటాడు. అందుకనే చిక్కితే చితకబాదుతారని పరిగెత్తి తప్పించుకున్నాడు..." అని ఒక పోలీస్ అతను చెప్పగా, ఇంకొక పోలీసు కారును ఒక చుట్టు చుట్టి వచ్చాడు. 'డాష్ బోర్డు నుండి చూడ గలిగింది చూశాడు. ముఖ్యంగా 'ఆర్.సి పేపర్లూ', 'ఇన్స్యూరన్స్ జెరాక్స్ ఒక కవరులో ఉన్నాయి.

అది చాలు వాళ్ళకు...డ్రైవర్ను పట్టుకుని లోపల వెయ్యటానికి.

ఆంబులాన్స్ బయలుదేరింది. వీరబద్రం, కార్తిక్ దాన్ని వెంబడించారు.

వీరబద్రం ఈ సారి కార్తిక్ దగ్గర ఏమీ అడగలేదు, మాట్లాడలేదు.

కానీ, అతని మనసులో 'గాలిదేవుడు ఇలా ఒక కోపమైన దేవుడా?' అనే ప్రశ్న మాత్రం పెద్దగా తలెత్తింది.

                                                                   *********************

ఖచ్చితంగా ఇరవై గంటల విరామం తరువాత రామశర్మ గారు, విమలాదేవి గారూ కళ్ళు తెరిచారు.

రామశర్మ గారికి తొడ ఎముక విరిగింది. 'ప్లేట్' పెట్టాలి. విమలాదేవి గారికి తల మీద ఆరు కుట్లు వేశారు.

కళ్ళు తెరిచిన రామశర్మ గారి కళ్ళ ముందు, ఏడుస్తున్న కార్తిక్, అతనికి దగ్గరగా అతని భార్య అఖిలా, చెల్లెలు పల్లవి. వాళ్ళ ముఖాలు వాడిపోయున్నాయి.

" కార్తిక్..." 

"నాన్నా..."

"నీకేమీ అవలేదే...?"

"నన్ను చూస్తున్నారు కదా నాన్నా...నేను బాగానే ఉన్నాను"

"పాము కరిచినట్టు 'ఫోన్ వచ్చిందే?"

"అవును! కానీ, నాటు వైద్యుడు కాపాడాడు. జి.హెచ్ కు వెల్లి ఇంజెక్షన్ చేయించుకున్నాను. 'ఐ యాం ఆల్ రైట్'! కానీ మీకు ఇలా జరగటమే నన్ను ఎక్కువ కలవరపరిచింది"

"నన్ను వదులు! మీ అమ్మ ఎలా ఉంది?"

"బాగుంది...మాట్లాడుతోంది"

"భగవంతుడా! కాపాడేవయ్యా...కాపాడేశేవు"

"అవును నాన్నా...ఆ గాలిదేవుడు మనల్ని చిన్నగా దెబ్బ వేసి వదిలేడు. నేను ఇక మీదట ఆ ఇంటి పక్కకే వెళ్ళను నాన్నా. బామ్మ చెప్పింది కరెక్టే! ఆ దేవుడు చాలా పవర్ ఫుల్"

"అవును కార్తిక్...దాన్ని యాక్సిడెంట్ అయిన చోటే గ్రహించాము"

రామశర్మ గారు అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వీరబద్రం వచ్చాడు.

అతని చేతిలో ఆపిల్, ఆరెంజ్ పండ్లు.

" వీరబద్రం...వచ్చేశేవా? నిన్నే మొదటగా చూడాలని ఆశపడ్డాను. రా...రా..."

"మీకు ఇప్పుడెలా ఉంది అంకుల్?"

"కాలు ఎముక విరిగిందట! కట్టు వేసి 'పైన్ కిల్లర్ ఇంజేక్షన్ ఇచ్చినందు వలన మీ అందరితో మాట్లాడ గలుగుతున్నాను"

"యాక్సిడెంట్ ఎలా జరిగింది అంకుల్...డ్రైవర్ తాగుబోతా?"

"లేదబ్బాయ్...మంచి డ్రైవర్. నాకు బాగా అలవాటున్న వాడు"

"మరెలా...?"

"చెబుతాను...!

కార్తిక్ ను పాము కరిచినట్టు సర్పంచ్ 'ఫోన్ చేసిన వెంటనే మాకు ప్రాణమే పోయినట్లు అయ్యింది. వెంటనే 'టాక్సీ' కి ఫోన్ చేసి, అదొచ్చిన వెంటనే బయలుదేరాం"

మా అవసరాన్ని అర్ధం చేసుకున్న డ్రైవర్ వేగంగానూ, అదే సమయం జాగ్రత్తగానూ వచ్చాడు. కానీ, ఆ చింత చెట్టు దగ్గరకు వచ్చిన వెంటనే ఎక్కడ్నుంచో వచ్చిన ఒక రాయి...కారు ముందు బ్యానెట్ పైన పడింది. అంతే డ్రైవర్ కి కాన్సెంట్రేషన్ పోయింది. కారు...పక్కనున్న చింత చెట్టుకు గుద్దుకుంది. అంతవరుకే నాకు తెలుసు, తరువాత స్ఫుహ కోల్పోయాను"

రామశర్మ గారు ఆపకుండా మాట్లాడేసి, గుండె దఢ తగ్గకుండా చూశారు.

అది విన్న వీరబద్రం తీవ్రమైన ఆలొచనలో పడ్డాడు.

"సందేహమే లేదురా...మన కారు మీద కోడి రక్తం. రాయి ఆకారంలో కనబడింది. ఇక్కడ నాన్నా-అమ్మ వచ్చిన కారు ముందు నిజమైన రాయి ఎగురుతూ వచ్చి పడింది. ఇది గాలిదేవుడి పనేరా..."

"అందులో సందేహమేముంది? 'నా ఆస్తిని అమ్మటానికి మీరు ఎవర్రా?'అని ఆ గాలిదేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. డబ్బులు లేవని అతని వరకు అతని ఆస్తిలో హక్కు తీసుకోవటం పెద్ద తప్పు"

రామశర్మ గారు నొక్కి చెప్పారు.

కానీ, వీరబద్రానికి గందరగోళంగానే ఉన్నది. 

"ఏం వీరబద్రం ఏమిటి ఆలొచిస్తున్నావు...నువ్వు నమ్మలేకపోతున్నావా ?"

వీరబద్రం సమాధానం చెప్పటానికి ఆలొచిస్తున్నప్పుడు, కార్తిక్ అడ్డుపడి సమాధానం చెప్పాడు.

"అవును నాన్నా...మొదటి నుండీ బద్రం ఇదంతా అబద్దం...మూర్ఖత్వం అని అనుకుంటున్నాడు, మట్లాడుతున్నాడు"

"ఇంకా నమ్మకం రాలేదా?"

"అవును సార్! అనుకోకుండా రెండు సంఘటనలు జరిగినై. వెంటనే ఆ సంఘటనలను గాలిదేవుడికి సంబంధ పరచటం సరికాదు..."

"ఏది అనుకోకుండా జరిగింది...యాక్సిడెంటా?"

"అవును...యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరగటమే కదా?"

"అప్పుడు కారు మీద పడ్డ రాయి?"

"అక్కడే నాకు కొంచం అనుమానంగా ఉంది..."

"ఇందులో అనుమానం ఏమీ లేదు! నువ్వు నగరం కుర్రాడివి. గ్రామంలోని నమ్మకాలు నీకు వేడుకుగానూ...ముర్ఖత్వంగానూ తెలుస్తుంది. కానీ మేము అక్కడే పుట్టి పెరిగాము"

"అయితే...ఏ నమ్మకంతో ఆ ఇల్లును అమ్మాలనే నిర్ణయానికి వచ్చారు?"

"గాలిదేవుడు పెద్ద మనసుతో వదిలిపెడతాడనే నమ్మకంతో..."

"ఇప్పుడు మీ నిర్ణయం?"

"ఇక గాలిపేట ఇల్లు గురించి ఆలొచించ దలుచుకోలేదు. గాయాలు తగ్గిన వెంటనే కుటుంబమంతా కలిసి వెళ్ళి గాలిదేవుడి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగటమొకటే మా కున్న ఒకే దారి..."

రామశర్మ గారి నిర్ణయం వీరబద్రం మొహంలో హేళన నవ్వు తెప్పించింది.

"నువ్వు నవ్వితే నవ్వుకో...నా నిర్ణయంలో మార్పు లేదు..."

"ఎలా సార్ ఏమీ ఆలొచించకుండా ఈ నిర్ణయానికి వచ్చారు?"

"ఇది ఆలొచించి తీసుకున్న నిర్ణయమే. ఆలొచించకుండా తీసుకున్న నిర్ణయం అని నీకు అనిపిస్తున్నదే, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది"

"ఖచ్చితంగా సార్! దేవుడు ఉన్నాడో...లేడో...ఉంటే మంచిగా ఉంటాడనేదే నా ఆలొచన సార్. అలాంటి దేవుడు మీ వరకు పెద్ద మనసు చూపలేదు అంటున్నారు చూడండి...అది తలచుకున్నందుకే నాకు నవ్వు వచ్చింది"

----వీరబద్రం చెప్పిన విధం రామశర్మ గారికి నచ్చలేదు.

అంతవరకు మాట్లాడకుండా ఉన్న కార్తిక్ భార్య నోరు తెరిచింది.

"మామయ్యా... వీరబద్రం అన్నయ్య చెప్పేదే నాకు సరి అనిపిస్తోంది!"

అది విన్న కార్తిక్ షాక్ అయ్యాడు.

"అఖిలా...ఏం మాట్లాడుతున్నావు నువ్వు?"

"దేవుడికి...క్షమించటం, అనుగ్రహించటం, ఆశీర్వదించటం, సహాయపడటం, తోడుగా ఉండటం మాత్రమే తెలుసు. ఏ దేవుడూ ఇలా కనబడకుండా దాక్కుని భక్తులను బెదిరించడు"

"నువ్వు చెప్పింది రాముడికి, కృష్ణుడుకి సరిగ్గా ఉంటుంది. గాలిదేవుడికి సరిపోదు. ఆ దేవుడు కోపం దేవుడు..."

"దేవుడు ఒక్కడే...పేర్లు మాత్రం వేరు వేరు! ఉగ్ర దైవం, శాంత దైవం అనేదంతా మన వర్ణణ"

అఖిల మాటలు... వీరబద్రాన్ని కొంచం భ్రమలో  పడేసింది.

"అఖిలా...నువ్విలా మనసు విప్పి మాట్లాడి నేను విన్నదే లేదు. ఇప్పుడే వింటున్నా. బాగా మాట్లాడుతున్నావు. నీలాగే ఆలొచించాలి"

"చాలు... బద్రం! ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయ్"…..కార్తిక్ చెప్పాడు.

"నేను వదిలేస్తాను...పెళ్ళి ఖర్చులకు ఏం చెయ్యబోతారు?”

"ఏదైనా చేసే కదా కావాలి! మెడలోని తాలి వరకైనా సరే అమ్మేసి పెళ్ళి చేసేస్తాం"

"కార్తిక్...క్లియర్ గానూ, ధైర్యంగానూ ఆలొచించాలి. కానీ, మీరందరూ గందరగొళంతోనూ, భయంతోనూ ఆలొచిస్తున్నారు"

"ఇలా చూడు వీరబద్రం...నీ అభిమానానికి చాలా సంతోషం. ఒక స్నేహితుడిగా ఇలాగే ఉండాలి. నువ్వు చెప్పినట్టు ఇది అనుకోకుండా జరిగినవే అయ్యుండచ్చు. కానీ, మా మనసులో భయం వచ్చేసింది. అందువలన దీన్ని ఇలాగే వదిలేద్దాం. అదే కరెక్ట్..." ---- రామశర్మ గారు...ఒక పులుస్టాప్ పెట్టి ముగించారు.

వీరబద్రం వలన కూడా అంతకంటే మాట్లాడటం కుదరలేదు. హాస్పిటల్ వార్డు వదలి బయటకు వచ్చాడు.

కార్తిక్ అతని వెనుకే వచ్చాడు. పక్క వార్డులో ఉన్న విమలాదేవిని చూశారు. వీళ్ళిద్దర్నీ చూసిన వెంటనే ఆమె కూడా వెక్కి వెక్కి ఏడ్చింది.

ఏడుస్తూనే, "కార్తిక్...ఇంటికి వెళ్ళి బామ్మను చూసి...మేము బాగానే ఉన్నామని, త్వరగానే కోలుకుంటామని, ఏ ఆపదా లేదని చెప్పు. లేకపోతే బెదిరిపోయి, ఏ సమాచరమూ రాలేదని భయపడి, ఆ భయంతోనే చచ్చిపోతుంది..." అని గుర్తు చేసింది.

"సరేనమ్మా....నువ్వు ధైర్యంగా ఉండు"

"మేము ధైర్యంగా ఉండటం అటుంచు. పాము కాటేసిన నీకు ఏమీ కాలేదు కదా?"

"నేను బాగానే ఉన్నానమ్మా..."

అమ్మకు ధైర్యం చెప్పి కార్తిక్, వీరబద్రం బయటకు వచ్చారు.

కారు దగ్గరకు వచ్చారు.

"కార్తిక్...నిన్ను ఇంట్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను"

"సరేరా...! అవును, నీకు ఇంకా ఎన్ని రోజులు లీవు ఉంది?"

"నేను ఈ రోజు ఆఫీసుకు వెళ్ళాలి కార్తిక్. నా లీవు నిన్నటితో ముగిసింది. ఈ రోజు ఒక రోజుకు లీవు 'ఎక్స్ టెండ్' చేశాను"

"థ్యాంక్స్ రా...! నువ్వు ఉన్నందువలనే ఇక్కడ కొన్ని విషయాలు త్వరగా చేయగలిగాను"

"ఈ ఫార్మాలిటీ మాటలన్నీ నా దగ్గర వద్దు. నీకూ,నాకూ చిన్నప్పటి నుంచి స్నేహం. గుర్తుంచుకో..."

" గుర్తుంచుకోవటానికి ఎక్కడరా నేను అది మరిచిపోయాను?"

"మరైతే ఎందుకురా థ్యాంక్స్-గీంక్స్ అంతా?" అంటూ కారు తీసాడు.

కార్తిక్ కారులో కూర్చున్నాడు.....బండి వేగంగా బయలుదేరింది.

                                                                                             Continued...PART-8  

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి