దాగుడు మూతలు...(సీరియల్) (PART-2)
కాలేజీ జ్ఞాపకాలు
చెదిరిపోయి--ప్రస్థుత
కాలానికి వచ్చిన
ప్రశాంతి, సమయం
ఎక్కువ అయినట్లు
గ్రహించి తిరిగి
చర్చ్ ఆఫీసుకు
వెళ్ళింది. అంతకు
ముందే ‘సిస్టర్’ అమీలియా
తో మాట్లాడుతున్న
వ్యక్తులు వెళ్ళిపోగా...ఆమె, మరొకరు
మాత్రమే ఆఫీసు
రూములో ఉన్నారు.
అనుమతి తీసుకుని
లోపలకు వెళ్ళిన
ప్రశాంతిని కూర్చోమన్నట్టు
చెప్పింది ‘సిస్టర్’ అమీలియా.
“ఫాదర్...నేను
చెప్పాను చూడండి, రాజా
మార్తాండ్ చక్రవర్తి
గారి అమ్మాయని, ఆమే
ఈమె...పేరు
ప్రశాంతి. మన
కాలేజీ మాజీ
విధ్యార్ధిని. చాలా
తెలివిగలది”
“ప్రశాంతీ, ఈయనే
ఫాదర్ లారన్స్.
బుధవారం జరుగబోయే
ప్రత్యేక ప్రార్ధనకోసం భీమవరం నుండి
వచ్చారు” -- పరస్పరం ఇద్దరినీ పరిచయం చేసింది.
‘నమస్తే’ అంటూ
చేతులు జోడించిన
ప్రశాంతితో.
“మీ
నాన్న గురించి
చాలా విన్నాను.
భీమవరం లోని
మా చర్చుకు
కావలసిన స్థలాన్ని
కొనడానికి కూడా
సహాయపడ్డారు. నిన్ను
కలుసుకోవటం నాకు
చాలా సంతోషం
కలిగిస్తోంది. దేవున్ని
చేరుకున్న ఆత్మలకోసం
బుధవారం జరపబోయే
ప్రార్ధనలో నువ్వు
పాల్గొంటే నేను
ఇంకా సంతోష
పడతాను” అన్నారు
ఫాదర్ లారన్స్.
తటపటాయిస్తూనే
నవ్విన ప్రశాంతి
“క్షమించండి
‘ఫాధర్’...ఈ
రోజు రాత్రి
నేను ఊరికి
బయలుదేరుతున్నా.
పిల్లల్ని స్కూల్లో
చేర్పించటం గురించి
మాట్లాడేసి, తరువాత
మా ఇంటిని
చూసి రావాలి.
ఇంకోసారి తప్పకుండా
పాల్గొంటా ఫాధర్” అన్నది.
“అవును
‘ఫాదర్’. ప్రశాంతి
ముఖ్యమైన పనిమీద
ఊరికి వెళ్తోంది.
ఈ రోజు
కూడా నేనడిగేనని
ప్రార్ధనలో పాల్గొంది.
ఆమెకు కుదిరితే
తప్పకుండా వస్తుంది.
ఈ విషయంలో
అచ్చు ఆమె
తండ్రిలాగానే నడుచుకుంటుంది...” అని ఫాదర్
లారన్స్ తో
ప్రశాంతి పరిస్థితిని
వివరంగా చెప్పింది.
ఆ తరువాత
ఆవిడ, తన
చేతిలో ఉన్న
కవర్ను ప్రశాంతికి
అందించింది.
"ఇదిగోమ్మా...నువ్వు
అడిగిన లెటర్.
మీ నాన్నగారి
పేరు చెప్పే
నువ్వు సీటు
సంపాదించి ఉండవచ్చే!
అక్కడున్న రెండు
స్కూళ్ళూ, మీ
నాన్నగారు దానంగా
ఇచ్చిన స్థలంలోనే
జరుగుతున్నాయి”
“ఉండనివ్వండి
సిస్టర్. మా
నాన్న గారి
పేరును ఉపయోగించుకోవటం
నాకు ఇష్టం
లేదు! నేను
ఆయన కూతుర్నని
అక్కడ ఉన్న
ఎవరికీ తెలియకూడదు.
అది, ప్రశాంతతను
వెతుక్కుంటూ వెడుతున్న
నాకు, మరింత
వేదన పెడుతుంది.
మీరూ చెప్పకండి...ప్లీజ్...నా
కోసం...”
“సరేమ్మా...అలాగే
కానిద్దాం. కానీ, ఈ
సంవత్సరం నువ్వు
చెప్పినట్లే నీ
పిల్లలకు ఇంట్లోనే
చదువు చెప్పించు.
వచ్చే సంవత్సరం
నుండి వాళ్ళను
రోజూ స్కూలుకు
వెళ్ళనివ్వు. నీ
ఇంట్లోనే ఉండి
చదువు చెప్పించే
నమ్మకమైన ఒక
టీచర్ను కోడైకానల్లో
ఏర్పాటు చేశాను.
ఆమే వంటకు, తోట
పనికి, మిగిలిన
ఇంటి పనులుకు, చిల్లర
పనులకు మనుషులను
ఏర్పాటు చేసి
ఇస్తుంది. నువ్వు
ఎప్పుడు బయలుదేరుతున్నావు?”
“ఈ
రోజే.
నేను మాత్రమే
బయలుదేరి వెళ్తున్నాను. స్కూలు
పని ముగించుకుని, ఇంటికి
వెళ్ళి, ఇల్లు
శుభ్రం చేసుకుని, కొంచంగా
వంట సామాను
కొనిపడేసి, ఆ
తరువాత పిల్లల్ని
తీసుకుని వెళ్దామనుకుంటున్నా
సిస్టర్. అందువల్ల, వచ్చే
వారం వాళ్ళను
వచ్చి నన్ను
ఇంట్లోనే కలుసుకోమని
చెబితే వసతిగా
ఉంటుంది. కొన్ని
రోజులే ఆ
ఇల్లు......స్కూలు
తెరిచిన వెంటనే, స్కూలు
పక్కనే ఇల్లు
తీసుకుని అక్కడికి
నివాసం మార్చుకుందామని
అనుకుంటున్నా. పనిలోకి
వచ్చే వాళ్ళందరూ
మా ఇంట్లోనే
స్టే చేస్తే
నాకు వసతిగా
ఉంటుంది”
రాబోవు ఆపద గురించి తెలియకుండా చెప్పింది.
“ఖచ్చితంగా
చెబుతానమ్మా”
గందరగోళంలో ఉన్న
ప్రశాంతి ధ్యాంక్స్
చెప్పటం మరిచి
పోవటాన్ని గుర్తుకు
తెచ్చుకుని, తనని
తానే తిట్టుకుని
మీ సహాయానికి
చాలా థ్యాంక్స్
‘సిస్టర్’ అన్నది
చిన్నగా.
“ఎక్కడైనా
బిడ్డ తల్లికి
థ్యాంక్స్ చెబుతుందా? నేను
చదివిన చదువు
మీ నాన్న
నాకు పెట్టిన
బిక్ష. ఆయన
కూతురైన నీకు
సహాయపడి ఆయన
రుణాన్ని తీర్చుకోవటానికి
ప్రయత్నిస్తున్నాను.
నీకు ఏం
కావాలన్నా నా
దగ్గర అడగొచ్చు.
సరేనా...?” అని
తల్లిలాగా సిస్టర్
చెప్పిన మాటలకు
కళ్ళు చెమెర్చినై
ప్రశాంతికి.
ఆ ఆఫీసు
గదిలో ఒకచోట
తగిలించున్న ఒక
ఫోటోలో తన
తండ్రి గంభీరంగా
నిలబడుంటం ఆమె
మనసును మరింత
కరిగించింది.
‘ఊరంతటికీ
మంచి వారుగా
ఉన్న మీరు, ఎలా
మీ అల్లుడికి
మాత్రం విల్లన్
లా కనబడుతున్నారు?’ అని
మనసులోనే వెయ్యి
సార్లు అయినా
ప్రశ్నించుకుంది.
“ఊహూ...” అంటూ
గొంతు సవరించుకున్నారు
ఫాదర్ లారన్స్.
“ప్రశాంతీ, నువ్విప్పుడు
ఊరికి వెళ్ళే
కావాలా? ఇక్కడే
నీకు కావలసిన
సహాయం మేము
చేస్తామమ్మా. తప్పుగా
తీసుకోకు...చెప్పాలనిపించింది, చెప్పేశాను”
“చాలా
థ్యాంక్స్ ఫాదర్.
మీరూ తప్పుగా
తీసుకోకండి. నేను
ఇక్కడ ఉండలేని
పరిస్థితి. అందుకనే
పుట్టి, పెరిగిన
ఈ ఊరిని
వదిలేసి, నేను
ఎవరనేది తెలియని
ఊరికి వెళ్తున్నాను.
చూద్దాం, ఇంకా
కొన్ని రోజుల్లో
పరిస్థితులు సరి
అవుతాయి అని
నమ్ముతున్నా”
“బాధపడకమ్మా.
భగవంతుడు నీ
భర్తను తొందరగా నీ
దగ్గరకు తీసుకు
వచ్చి చేరుస్తాడు.
నువ్వు ఇదివరకు
లాగా కుటుంబంతో
కలిసి సంతోషంగా
ఉండబోతావు చూడు” అన్నది అమీలియా.
“సరే...నువ్వు
వెళ్ళిపోవాలని
నిర్ణయించుకున్నావు.
ఇక నిన్ను
అడ్డుపడి ఆపడం
కష్టం. నా
కోసం ఒక
సహాయం చేస్తావా? ఈ
గొలుసును ఎప్పుడూ
నీతోనే ఉంచుకుంటావా?"
అంటూ తన
మెడలో ఉన్న
ఒక గొలుసును
తీసి ప్రశాంతికి
ఇచ్చిన ఫాదర్
లారన్స్ ను ఆశ్చర్యంతో
చూసింది అమీలియా.
పునీత శక్తి
కలిగిన ఆ
గొలుసును ఆయన
ఎప్పుడూ తన మెడలో నుండి తీసిందే
లేదు. ఇప్పుడు
ఆ గొలుసును
ప్రశాంతి దగ్గర
ఇస్తున్నారంటే, ఆమెకు
ఆ గొలుసు
యొక్క అవసరం
ఎంతో ఉందని గ్రహించింది
అమీలియా. ఆ
సమయంలో అమీలియా
మన్సులో ‘ ఏదైనా తప్పు
జరగబోతోందా?’ అనే
ప్రశ్న వచ్చి
కూర్చుంది.
వాళ్ళ మనసులను
అర్ధం చేసుకోని
ప్రశాంతి “ఖచ్చితంగా
ఫాదర్...సరి
నేనొస్తాను” అని చెప్పి
బయలుదేరింది.
ఆమె వెళ్ళిపోయిన
వెంటనే గొణిగారు
ఫాదర్ లారన్స్.
“నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాలి...అదే ఇక మీదట నా ముఖ్యమైన ప్రార్ధన”
Continued...PART-3
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి