30, జులై 2022, శనివారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-4)

 

                                                                         దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                                 (PART-4)

అక్కడ ప్రశాంతి నిలయం నుండి సుమారు ఒక ఫర్లాంగ్ దూరంలో తల విరుచుకుని ఉన్న ఆకారంలో నిలబడున్నది ఒక పెద్ద చింత చెట్టు. వేడి ప్రదేశాలలో మాత్రమే బాగా పెరిగి కాయలు కాచే తత్వం ఉన్న చెట్లు, కొంచం చల్లటి ప్రదేశాలలో తెలియక పెరిగినా కూడా, కాయలు కాయడం కష్టం. కానీ ఇక్కడ వొణుకు పుట్టించే చలిలో అందంగా కొమ్మలు విరిసి ఉండగా, చెట్టు నిండా కాయలు----అడిగే మనిషి లేక, కింద పడిపోయున్న కాయలు, రాక్షసుడి లాగా నిలబడి అందరినీ బెదిరిస్తున్నది చెట్టు. దాని చుట్టూ దట్టమైన పొదలు గుంపుగా ఉన్నాయి.

గబుక్కున తేరుకున్న జనక రాజ్ వీళ్ళను ఇక్కడే నిలబెడితే, మాటలు కోటలు దాటుతాయి!అనుకుని,

వెళ్ళండ్రా...వెళ్ళి పనులు చూసుకోండి. ఏదో చూడ కూడనది చూసినట్టు ఇక్కడే ఏమిట్రా గుంపు? మీరు కంబకరై నుండి వచ్చేటప్పుడు ఎన్ని చెట్లు చూసుంటారు?” అని కసురుకుని అందరినీ పనులకు పంపాడు.

లేదన్నా! చలి ప్రదేశంలో, మన ఊరి పక్కన లాగా ఒక చింత చెట్టును చూసిన వెంటనే భయం వేసింది. ఇలాంటి గుజ్జు ఎక్కువున్న కాయలు ఇక్కడ కాయవు. రకం చెట్లకు గుజ్జు ఎక్కువ లేని కాయలే ఉంటాయి. ఇక్కడ చూడండి...అడిగే వాడే లేని చోట, క్రింద పడున్న కాయలు పది మూటల వరకు ఉంటుంది! దీన్ని ఎలా   చుట్టు పక్కలున్న వాళ్ళు వదిలిపెట్టారు?” అంటూ ఆశ్చర్యంతోనే అందరూ తమ తమ పనులలోకి వెళ్ళారు.

ముందు భాగంలో ఉన్న స్నానాల గదిలోనూ, దానికి నేరుగా మేడ మీద ఉన్న రెండు స్నానాల గదులలోనూ ఎలాగో వైరింగ్ చేసి, అక్కడి కరెంటు వస్తువులను పనిచేసేటట్టు చేశాడు ఎలక్ట్రీషియన్.

ఇంట్లో ఉన్న మిగిలిన చోట్లలో వయరింగ్అంతా ఊడిపోయి వేలాడుతోంది. పూర్తిగా మార్చాలమ్మా. చాలా టైము పడుతుంది. మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే చెప్పండమ్మా చేసేద్దాం. వర్షాకాలం వస్తే ఇక్కడ కరెంటురోజుల తరబడి  పోతుంది. అందువలన కొవ్వొత్తులు ఎక్కువ కొని అట్టే పెట్టుకోండి

సాయంత్రానికి ఒక విధంగా ఇల్లు శుభ్రం అవగా, కొనుకొచ్చిన సామాన్లను పని వాళ్ళ సహాయంతో వంట గదిలో ఉంచారు. మిగిలిన పనులు ఏం ఏం చేయాలో చెప్పేసి, తిరిగి సొంత ఊరికి బయలుదేరింది ప్రశాంతి.

హైదరాబాద్ కు వెళ్ళిన వెంటనే తన పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దాడి ఆనందపడింది. అదే మొదటి సారివాళ్ళను వదిలి అన్ని రోజులు బయట ఊరులో ఉన్నది.

అమ్మా, గిరిజ నాకు భయంకరమైన కథ చెప్పింది

లేదమ్మా! వాడే దయ్యం ఎలా ఉంటుంది?’ అని అడిగాడు. అందుకే తల మీద తెల్ల తుండు వేసుకుని నటించి చూపించా

గిరిజా! చిన్న పిల్లాడ్ని ఇక మీదట అలా భయపెట్టకు. దయ్యాలు, భూతాలూ అన్నీ లేనే లేవు. అని గిరిజకు చెప్పి కొడుకు వైపు తిరిగి ఇక మీదట గిరిజ భయపెట్టినా, భయపడకు రాఘవ్అన్నది.

సరేనమ్మాఅని చెప్పి అమ్మ కొనుకొచ్చిన బొమ్మలను తీసుకున్నాడు.

తాను కొనుకొచ్చిన బొమ్మలను పెట్టుకుని -- ఆడుకుంటున్న గిరిజ, రాఘవ్ తో మెల్లగా తాము కోడైకానల్ వెళ్ళాల్సిన అవసరాన్ని చెప్పింది.

ఏమ్మా, నాన్న మళ్ళీ మిమ్మల్ని తిట్టేసి ఆంటీఇంటికి వెళ్ళిపోయారా? మనం ఎందుకమ్మా నాన్నకు నచ్చలేదు?”

వివరం తెలిసీ తెలియక మాట్లాడిన రాఘవ్ ను కన్నీటితో హత్తుకుంది. లేదురా! మనం అంటే మీ నాన్నకు చాలా ఇష్టం రా. అమ్మ తప్పు చేసింది కదా, అందుకనే తిట్టారు. త్వరలోనే మనల్ని వెతుక్కుంటూ వస్తారు చూడు

తరువాత ఐదు సంవత్సరాల వయసున్న రాఘవ్ కు కథలు చెప్పి నిద్ర పుచ్చింది...పది సంవత్సరాల గిరిజ అడిగిన ప్రశ్నలకు వీలున్నంత వరకు జవాబు చెప్పింది.

అమ్మా, మాకు మందులు కావాలి కదా...అక్కడకెళ్ళిన తరువాత ఆయాసం వస్తే?”

లేదమ్మా! అక్కడి వాతావరణానికి ఆయాసం రాదని చెబుతున్నారు. అదొక్కటే కాదు, అక్కడున్న శుభ్రమైన పరిస్థితులకు అంతగా ఆయాసం రాదు. అదీ కాకుండా, ఇప్పుడు కొన్ని రోజులుగా మన ఇంట్లో జరుగుతున్న సంఘటనల వలనే మీకు మనసు కష్టం ఏర్పడి -- ఆయాసం వస్తోందని డాక్టర్.పద్మ చెప్పింది. ఎందుకైన మంచిది, అక్కడికి వెళ్ళిన తరువాత బయటకు వెళ్ళి ఆడుకోకండి. అది చాలా వరకు మీకు మంచి చేస్తుంది. అయినా, అక్కడికి మందులు కొంచంగా తీసుకు వెళ్తున్నాం.  ఇంకా ఎక్కువ అవసరం అయితే తెప్పించుకుందాం...సరేనా?”

సరేనమ్మా అని చెప్పి దుప్పటి కప్పుకుంది గిరిజ.

గుడ్ నైట్ చెప్పి, ఇద్దరికీ నుదుటి మీద ముద్దు పెట్టి, తనగదికి వెళ్ళింది. తలనొప్పి మొదలవటంతో...ఒక మాత్ర వేసుకుని పడుకుంది.  

భీమవరం లో తన రెగులర్ పనులలో లీనమైపోయున్న ఫాదర్ లారన్స్ కు హైదరాబాద్ లో ఉన్న సిస్టర్అమీలియా దగ్గర నుండి ఫోన్ వచ్చింది.

ఫాదర్. ప్రశాంతి జాగ్రత్తగా హైదరాబాద్ వచ్చేసింది. నాకు ఫోన్ చేసి పిల్లల చదువు గురించి మాట్లాడింది. స్వరం అదీ బాగానే ఉన్నది

దేవుడికి కృతజ్ఞతలు అని చెబుతూ ఏసుక్రీస్తు చిహ్నం వేసుకున్నాడు.

అమీలియా కంటిన్యూ చేసింది ఏం ఫాదర్ ప్రశాంతికి ఏమిటి? మీరు ఏసుక్రీస్తు డాలర్ కలిగిన గొలుసును మీ మెడలో నుండి తీసేసి ఆమె దగ్గర ఇచ్చినప్పుడే అడగాలనుకున్నా. మనవలన ఆమెకు ఏదైనా సహాయం చేయటం కుదురుతుందా?”

ఆమె వెడతానని తీర్మానించుకున్న ప్రదేశంలో ఆమెకు చెడు శక్తుల వలన ఏదో ఆపద వస్తుందని నాకు అనిపించింది. దానికి కారణం, ఆ రోజు ప్రశాంతి నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను జరిగి నిలబడి మీ సంభాషణ వింటున్నాను. అప్పుడు ఆమె గురించి నాకేమీ తెలియదు. మీతో మాట్లాడుతూ ఒక బంగళా పేరు చెప్పిందే, ‘ప్రశాంతి నిలయం అనుకుంటా -- పేరు మాత్రం ఒక బొంగురు ధ్వని కలిగిన మగ స్వరంతో నా చెవులకు వినబడింది.  

మొదటిసారి ఏదో భ్రమ అయ్యుంటుందని అనుకుని, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నది క్షుణ్ణంగా విన్నాను. కానీ, ప్రతిసారీ పేరు నాకు అలాగే వినిపించింది. అప్పుడు ప్రదేశంలో ఏదో ఒక అమానుషం ఉన్నట్టు నాకు అనిపించింది. ఆపద నుండి అమ్మాయిని కాపాడటానికే నేను వేసుకున్న ఏసుక్రీస్తు డాలర్ ఉన్న గొలుసును నా మెడలో నుంచి తీసి ఆమెకు ఇచ్చాను. అది ఆమె దగ్గర ఉన్నంత వరకు, చెడు శక్తి ఆమెను ఏమీ చెయ్యలేదు

ఫాదర్ లారన్స్ ప్రశాంతత కోల్పోయి శ్రమ పడుతున్న ఆత్మలకు ప్రత్యేక ప్రార్ధనలను చాలా చేసి -- ఆత్మలు ప్రశాంతత పొందటానికి దారి చూపారు. ఆయన చెప్పేది నిర్లక్ష్యం చేయకూడదు’, ఆలొచనలలో చెప్పుకుంది అమీలియా.

ఫాదర్, అర్జెంట్ పని మీద నేను ఇప్పుడు బెంగళూరు బయలుదేరుతున్నా.నేను వచ్చిన వెంటనే ప్రశాంతితో మాట్లాడి, ఎలాగైనా ఆమెను బంగళాకు వెళ్ళకుండా అడ్డుకొవటానికి ప్రయత్నిస్తాను

మరికొన్ని విషయాలు గురించి మాట్లాడిన తరువాత ఇద్దరూ ఫోన్ లను కట్ చేసారు.

బెంగళూరు వెళ్ళి వచ్చిన తరువాత ఖచ్చితంగా ప్రశాంతిని కలవాలి, ఆమెను ప్రశాంతి నిలయం కు వెళ్ళకుండా ఆపాలిఅని తన డైరీలో గుర్తుగా రాసుకుంది అమీలియా.

కానీ, అమీలియా ఊరి నుండి తిరిగి వచ్చినప్పుడు కార్యం చెయ్యి దాటిపోయింది.

                                                                                                               Continued...PART-5

************************************************************************************************** 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి