7, జులై 2022, గురువారం

గాలితో ఒక యుద్దం...(సీరియల్)...(PART-4)

 

                                                                          గాలితో ఒక యుద్దం...(సీరియల్)                                                                                                                                                                 (PART-4)

నేను నిజంగానే చంద్రుడు మీదకు వెళ్ళాలని ఆశపడుతున్నాను... ఆశ నేరవేరుతుందా?" అని అడిగినతన్ని కౌన్సలింగ్ చేసే ఆయన నవ్వుతూ సమాధానంగా తిరుగు ప్రశ్న ఒకటి ఆయన్ని అడిగాడు.

"మీ ఆశ నిజంగా వచ్చినట్లు తెలియటంలేదే?"

లేదు! నిజంగానే...మనసారా ఆశపడుతున్నాను" అన్నాడు.

"ఆశ పడే దాని గురించి కొంచమైనా తెలిసుండాలి. మీకు చంద్రుని గురించి ఏం తెలుసు?"

"ఇదేం ప్రశ్నండీ...చంద్రుడు ఒక అందమైన గ్రహం. అది ఆకాశంలో ఉన్నది. ఇంతకంటే ఏం తెలియాలి?"

"తప్పు...అందమైన గ్రహం అనేది ఒక మాయ. అది కాంతిని వెలువరిస్తోందనేదీ ఒక మాయ. నిజానికి చంద్రుడిపైన మనుష్యులు నివసించటానికి కావలసిన ఆక్సిజన్, నీళ్ళూ మరియూ నిప్పు అని ఏదీ లేదు. చంద్రుడ్ని చూసి మైమరచిపోయి ఒక 'పిక్నిక్' వెళ్ళేటట్టు పరిశోధకులు అక్కడికి వెళ్ళిరాలేదు. వాళ్ళ ఉద్దేశ్యం అన్వేసించటం...అందుకోసం వెళ్ళి వస్తున్నారు. ఇదే చంద్రుని యొక్క నిజ స్వరూపం. ఇది తెలియక, మీరు అక్కడికి వెళ్ళి రావటానికి ఆశపడటంలో ఏమర్ధం ఉంది?"

--అతను తిరిగి అడిగాడు. తరువాత గట్టిగా నొక్కి చెప్పారు......

"నిజానికి ఆశ పెట్టటం అనేది అర్ధం చేసుకున్న దాని మీదే ఉండాలి. ఒక మగాడిగా ఉంటూ...'నేను గర్భం దాల్చి బిడ్డను కనాలి అని ఆశపడుతున్నాను అని ఎలా ఆశపడకూడదో...అలా అర్ధంలేని విపరీత ఆశలు పడకూడదు. అవి మూర్ఖత్వమైనవి...ఏరోజూ నెరవేరవు. అది పెట్టుకుని నా నమ్మకం మోసం అయిపోయిందే అని అనుకోకూడదు.

ఒక మనిషి తన శక్తికి తగినట్లు నెరవేర్చుకోగల ఒక దాని మీదే ఆశపెట్టుకోవచ్చు. ఆశ పెడితే మాత్రం చాలదు. ఆశకోసం కష్టపడాలి. అలా కష్టపడే పనిలో కూడా అర్ధం ఉండాలి. అలా ఉండే పక్షంలో ఆశ ఏదైనా సరే ఏదో ఒక రోజు నెరవేరి తీరుతుంది. అలాగే రోజు వరకూ జరుగుతూ వస్తోంది" అన్నారు ఆయన.

గాలిపేట అనే పేరు రాసున్న పలక స్వాగతంతో వీరబద్రం కారు, ఊరికివెళ్ళే మట్టి రోడ్డు మీద ప్రవేశించింది. కార్తీక్ ఒదిగి పోయి కూర్చున్నాడు.

రేయ్...సంతోషంగా ఉండరా. ఇప్పుడు మనం వచ్చింది మీ ఊరికి. ఎవరైనా సరే పుట్టిన ఊరును చూసేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక సంతోషం కనబడుతుంది తెలుసా?”

అలా చెప్పకు బద్రం. కొందరి చిన్న వయసు పర్వం మంచిగా లేకపోతే...దానిని ఆలొచించి చూడటానికే అతను ఇష్టపడడు

కార్తీక్...అన్నిటినీ ఆలొచించే విధంలోనే ఉంటుంది. అందుకే ఎక్కువగా పుస్తకాలు చదవాలి...

మా అమ్మా, నాన్న కూడా పుస్తక పురుగులే. వాళ్ళకూ గాలిదేవుడంటే భయమే...తెలుసుకో...!

రేయ్...ఎప్పుడో ఒకసారి పుస్తకాలు చదివితే పుస్తకం పురుగులు అయిపోరు. బోలెడు పుస్తకాలు చదవాలి. అన్ని రకాలు పుస్తకాలూ చదవాలి. చదివితే మాత్రం చాలదు. దాన్ని ఆశపడాలి. అన్నిటికంటే ఎక్కువగా...మనమే మనల్ని అర్ధం చేసుకోవటం ముఖ్యం. తనని తాను తెలుసుకోలేని ఒకడు ఏది తెలిసిపెట్టుకున్నా ప్రయోజనం  లేదు

--- బద్రం మాట్లాడిన దానిని బట్టి అతని కున్న క్లారిటీ, ధైర్యం అన్నిటికీ ఒకే ఒక కారణం అతను ఎక్కువగా చదువుతాడనేది తెలుస్తోంది.

ఆప్పుడు ఊరి చెరువు, చెరువు గట్టు దగ్గరున్న రావి చెట్టు -- చెట్టు క్రింద ఉన్న గాలిదేవుడి గుడి కనబడింది. అక్కడ కొంతమంది నిలబడి దన్నం పెట్టుకుంటున్నారు.

రేయ్...ఇదేనా నువ్వు చెప్పిన గుడి?”

అవును...కారాపు. ఊరిలోకి వెళ్ళే ఎవరైనా సరే గాలిదేవుడ్ని దర్శించుకో కుండా వెళ్లరు

ఆపుతాను! కానీ దన్నం పెట్టుకోవటానికి కాదు. చూడటానికి...

వీరబద్రం కారు ఆపాడు. ఇద్దరూ దిగి గుడి దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరినీ...గాలిదేవుడ్ని నమస్కరించుకోవటానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూశారు. వాళ్ళల్లో ఒకరి దగ్గర కోడి ఉంది.

పూజారి కూడా ఉన్నాడు. అతను కార్తీక్ ను గుర్తు పట్టాడు.

అరెరే....పంతులగారి అబ్బాయి గారా రండి రండి?"  అంటూ స్వాగతించాడు.

బాగున్నారా పూజారిగారూ...

గాలిదేవుడి పుణ్యామా అంటూ... ఏదో జరుగుబాటు అవుతోంది

సంతోషం! కర్పూరం వెలిగించండి

అవును...ఏమిటిలా వచ్చారు? మీ అమ్మా-నాన్నలు కూడా రాబోతారని విన్నాను. ఇంతకు ముందులాగా మన ఊర్లోనే ఉండి పోదామని నిర్ణయించుకున్నారా?”

అవును...మీరు కర్పూరం వెలిగించండి. నేను బయలుదేరుతాను. నాకు చాలా పనుంది

కాసేపాగండి బాబూ...వీళ్ళోచ్చి చాలా సేపయ్యింది. మొదట వీళ్ళకు పూజ జరిపించి మీ దగ్గరకు వస్తాను. వీళ్ళతో పాటూ మీరు నిలబడలేరు...వీళ్ళు కోడిని బలి ఇచ్చి ప్రార్ధించుకుని వెళ్లటానికి వచ్చారు. అది మొదట ముగిస్తాను. మీరు పంతుల తాలుకా. నేను కోడిని నరకటం చూస్తే మీకు ఏదోలాగా ఉంటుంది. అలా వెళ్ళి నిలబడండి

నిలబడే టైము లేదు పూజారీ. విబూధి ఇవ్వండి...చాలు

---- కార్తీక్ హడావిడి పడ్డాడు. అతనే వంగుని కర్పూర పళ్లెంలో ఉన్న గరగర మంటున్న విబూధి తీసుకుని నుదిటికి రాసుకున్నాడు. దేవుడి రాయి దగ్గరున్న నిమ్మ పండ్లను చూసిన కార్తీక్ కు ఏదోలా అనిపించింది. నేరం చేస్తున్నామో అన్న భావన!

కానీ వీరబద్రానికి చాలా ఆనందంగా ఉన్నది. జరుగుతున్నది చూశాడు. గాలిదేవుడికి కోడి అంటే చాలా ఇష్టమా?” అంటూ కొంచం హేలనగా మాట్లాడాడు.

తమ్ముడెవరో?”  కార్తీక్ ను అడిగాడు పూజారి.

కార్తీక్ స్నేహితుడ్ని! కార్తీక్ కు బదులు వీరబద్రమే జవాబిచ్చాడు.

ఎవరుగా ఉన్నా సరే ఇక్కడ భయ భక్తులతో ఉండాలి"

లేకపోతే...?”

మీరు సేఫ్ గా ఊరు వెళ్ళి చేరలేరు

ఇలా బెదిరించి చూడటమే మీ గాలిదేవిడి 'స్టైలా'?”

పంతులు తమ్ముడూ...ఎవరితను. ఎందుకలా ప్రశ్నకు ప్రశ్నవేసి మాట్లాడుతున్నాడు?”

క్షమించండి పుజారి గారూ. ఇతను కొంచం సరదా టైపు. తప్పుగా తీసుకోకండి. రేయ్ బద్రం...బయలుదేరరా. నీతో కలిసి నేను ఊరు బయలుదేరటమే తప్పురా

అంతా విధి ఆడుతున్న ఆట...”-- నవ్వుతూ చెప్పాడు బద్రం.

"విధే! రా...మొదట" -- అంటూ బద్రాన్ని లాక్కుంటూ కారున్న వైపుకు నడిచాడు. డోర్ తెరిచి బద్రాన్ని డ్రైవింగ్ సీటులోకి తోశాడు కార్తీక్.

ఇంతలో కోడి తల తెగింది. తలను ఒక పక్కకూ, మిగిలిన భాగాన్ని మరో పక్కకు పూజారి విసిరేసినప్పుడు, తల భాగం కారు బ్యానెట్ మీద పడి నెత్తురు చిందింది.

ఒక్కసారి ఒళ్ళు జలదరించింది కార్తీక్ కి.

భయపడ్డావా కార్తీక్...పాపం రా కోడి. మనుష్యులున్న నేలమీద అది పుట్టే ఉండకూడదు. చివర్న చూశావా దాని స్థితి అంటూ హేళనగా చెబుతూ కారు స్టార్ట్ చేశాడు వీరబద్రం.

అప్పుడు చూశాడు కార్తీక్. బేన్యట్ మీద పడిన కోడి తల నుండి చిందిన నెత్తురు కారు అద్దాలపై పడింది. నెత్తుటి మరకల్లో గాలిదేవుడి విగ్రహ రూప ఆకారం గమనించాడు.

కార్తీక్ గుండె గుభేల్ మంది!

                                                           ********

కార్తీక్ ఇంటి దగ్గర...బామ్మ సరోజమ్మ ఒకటే నస పెడుతోంది.

కార్తీక్... కార్తీక్... ఓర్పు నసించినట్టుగా అరిచింది!

రామశర్మ గారు లేచి వెళ్ళారు.

ఎందుకమ్మా...ఇలా, ' కార్తీక్... కార్తీక్ ' అంటూ ప్రాణం తీస్తున్నావు?”

నేను ప్రాణం తీస్తున్నానా? దుర్మార్గుడా...ప్రాణం కాపాడటానికి తహతహ లాడుతున్నాను! ఇప్పుడు కార్తీక్ ఎక్కడ?”

బయటకు వెళ్ళాడు...ఏమిటి విషయం?”

ఎక్కడికి వెళ్ళాడు?”

అది నాకు తెలియదు

అబద్దం చెబుతున్నావు...వాడు మన గ్రామానికి వెళ్ళాడు. గాలిదేవుడి సన్నిధిలోనే ఇప్పుడు ఉన్నాడు

సరే...దానికేమిటిప్పుడు?”

ఏమిటా...? అక్కడ మన మట్టిలో వాడు కాలు పెట్టిన వెంటనే ఇక్కడ నా గుండెలో ఎవరో తొక్కినట్టుంది. ఇక గ్రామానికి ఇంకెవరూ వెళ్ళకండిరా.  ఆ ఆస్తి మనకు వద్దు...

ఇదిగో చూడు...నీ దగ్గర అడిగేటప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్పు. నువ్వుగా భయపడి ఇష్టం వచ్చినట్టు వాగకు!

నేనేమీ వాగటం లేదు...వాస్తవమే చెబుతున్నా. గాలిదేవుడికి వాగ్దానమే పెద్దదిరా!

అది సరే... నేనెక్కడ గాలిదేవుడి దగ్గర వాగ్దానం చేశాను? లేకపోతే... కార్తీక్ చేశాడా? లేదే నాన్నగారు చేశారు. ఆయన ఉన్నంత వరకు ఆయన మాటను ఆయన కాపాడారు. దాంతో ముగిసిపోయింది

అలా మాట్లాడకురా ఆ ఇల్లు మనకు సొంతం కాదు. ఇప్పుడది గాలిదేవుడి ఆస్తి. ఆస్తిని అమ్మటానికి ఎటువంటి ప్రయత్నం చేయకండిరా

సరే...ఒక మాట చెప్పు. నేను నువ్వు చెప్పేది ఒప్పుకుంటాను. ఇక్కడ పల్లవి పెళ్ళి ఎలా జరపాలి. డబ్బులు కావాలి. ఎవరిస్తారు?”

గాలిదేవుడ్ని నమ్మి అడగరా...ఇస్తాడు. ఆయన్ని నమ్మకుండా, ఆయన ఆస్తిని అమ్మటం అనే తప్పును చేయకండిరా?”

ఇది ద్వాపర యుగం కాదమ్మా...కలియుగం. దేవుడు కాలంలో ఎప్పుడు నేరుగా వచ్చాడు...ఆయన దగ్గరకు వెళ్ళి అడగటానికి?”

నాస్తీకుడిలా మాట్లాడొద్దురా రామశర్మా...నమ్మకం చాలా ముఖ్యం. గాలిదేవుడు నిదర్శనమైన వాడు. అతని వలనే నీ పిల్లాడు నీకు తిరిగి దొరికేడు

సరేనమ్మా...నువ్వు సనుగుడు ఆపి నిద్రపోయే దారి చూడు. మాకు పెళ్ళి పనులు చాలా ఉన్నాయి

రామశర్మా...మనిషికి రోజూ నాలుక మడత పడ కూడదురా? నమ్మకమూ ముఖ్యం. మీ నాన్న దగ్గర ఉన్న నమ్మకం నీ దగ్గర లేకుండా పోయిందేరా...?”

ఇంత మాట్లాడుతున్నావే... గాలిదేవుడి దగ్గర నువ్వు డబ్బులు అడిగి తీసుకుని ఇవ్వు. ఆలా గనుక ఆయన ఇచ్చేస్తే...నిజంగా చెబుతున్నా నేను ఇంటిని అమ్మకుండా, ఇంటి దస్తావేజులను తీసుకు వెళ్ళి గాలిదేవుడి హుండీలో వేసేస్తాను

రామశర్మ విరక్తిగా మాట్లాడాడు. కానీ అందులో కొంచం స్వార్థం...తెలివితేటలు అన్నీ కలిసున్నాయి.

ఖచ్చితంగా అడుగుతారా

ఏమడుగుతావో ఏమో... గాలిదేవుడ్ని మేము కూడా వెళ్ళి దర్శించుకుంటున్నామే? మనల్ని అడిగేంత వరకా ఆయన ఉంచుకోవాలి?

మనిషనే వాడికి కొంచమైనా భయం ఉండాలని రోజుల్లో పెద్దవాళ్ళు కనుగొన్న ఒక విషయమే దేవుడు...అదే గాలిదేవుడు. రాయికి ఆలొచించగలిగే శక్తి లేదనేది తెలుసుకోలేని వాడు కావాలంటే భయపడతాడు. చదువుకున్న మనం కూడా భయపడితే...అది మూర్ఖత్వం. ఇలా మాట్లాడుతున్నాను కదా అని నేను గాలిదేవుడ్ని ద్వేసిస్తున్నానని అనుకోకు! ఒక కర్పూరం వెలిగించి, దేవుడికి చూపించి, చెంపలు వేసుకోవటానికి నేనెప్పుడూ రెడియే. అంతేగానీ నా ఆకలికి నేనే కదా తినాలి? నాకు కావలసిన వాటి కోసం నేనే కదా పనిచేయాలి. ఆకాశం నుండి ఏదీ ఒడిలోకి వచ్చి పడుతుందనేది లేదు. అది తెలుసుకో..." అని చెప్పి రామశర్మ గారు గది విడిచి వెళ్ళిపోయారు..

సరోజమ్మ కళ్ళల్లో ఊటలాగా కన్నీళ్ళు బయటకు వచ్చినై.

                                                                                                                        Continued...PART-5

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి