దాగుడు మూతలు...(సీరియల్) (PART-1)
జీవితమే ఒక దాగుడుమూతల ఆట. 'ప్రేమ' కూడా ఆ ఆటలో ఒక భాగమే.
జీవితం యొక్క మొదటి దశ అయిన బాల్య ప్రాయములో మనం దాగుడుమూతల ఆట ఆడుంటాము… జీవితం యొక్క తరువాతి దశలలో, జీవితం మనతో పలు దాగుడుమూతలాట ఆడుతుంది. జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూతలాట మనకు ఇష్టమున్నా లేకున్నాఆడుతూ పాడుతూ
జీవించాల్సిందే…మనము ఆ ఆటలోని భాగమే.
విద్యార్థి దశలో, ఒక వ్యక్తి కోరిన చోట చదవలేకపోవడం, కోరిన వస్తువులను పొందలేకపోవడం, చెయ్యాలనుకున్న ఉద్యోగం చేయలేకపోవడం… జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూత.
యవ్వనంలో వున్న వారు కోరిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే తరుణము.. ఒక దాగుడుముత ఆటే .
మధ్య వయస్కుడు తాను ఊహించిన శైలిలో బ్రతకలేక పోవడం .. జీవితం మనతో ఆడే దాగుడుమూతే.
వయసు మల్లిన కాలములో, తన తరువాతి తరం వారికి అన్ని సమకూర్చాక…వారి మధ్య వుంటూ…మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడపగలగడం కూడా…జీవితం మనతో ఆడుకునే దాగుడుముత ఆటలోని భాగమే.
జీవితంలో దాగుడుమూతలు లేకుండా, అన్ని ఒక పద్దతిగా, ఏదో శాసనములో తెలిపిన విధముగా సాగితే, జీవితం నీరుగారి అంతే నిరుత్సాహంగా తయారవుతుంది. జీవితం మనతొ ఆడే ఈ ఆటను ద్వేషించక, ఆటలోని మెలుకువలు మరియు కిటుకులు తెలుసుకొని, పూర్వ అనుభావాల పాఠాలు గుర్తుంచుకొని, పెద్దలు చెప్పే అనుభావాలను చక్కగా అమలుపరిచి ఆడితే.. గెలుపు మనదే…..
'ప్రేమ 'కూడా జీవితంలో ఒక భాగమే. కానీ 'ప్రేమ' మాత్రం జీవితం అడే దాగుడుమూతల ఆటను జయించి, కావలసిన వారిని చేరుకుంటుంది...ఏలా? ఈ సీరియల్ ను పూర్తిగా చదివితే మీకే అర్ధమవుతుంది. చదివితే మీరే ఆశ్చర్యపోతారు.
***********************************************************************************************
(PART-1)
సంవత్సరం: 1955
చోటు: హైదరాబాద్.
“ప్రియమైన
దేవుడా...ఈ
మంచి సమయంలో, ఇక్కడున్న
అందర్నీ నీ
బంగారు చేతులలో
పెడుతున్నాను. మీరు
మా జీవితంలో
ఎంత మంచివారుగా
ఉన్నారో, ఎలాగైతే
మా పాపాలన్నిటినీ
మన్నించారో...అదేలాగా
ఇక్కడున్న ఒక్కొక్క
వ్యక్తి కుటుంబంలోనూ, జీవితంలోనూ
ప్రవేశించి, వాళ్ళ
పాపాలను మన్నించి
ఆశీర్వదించు. వాళ్ళను
శాపాల నుండి, వ్యాధులు-అనారోగ్యం
నుండి, మానసిక
పోరాటాల నుండి
వాళ్ళకు విముక్తి
ప్రసాదించి, వాళ్ళకు
సుఖాలాను అందించు!”
ఆ పాతకాలం
నాటి క్రైస్తవ దేవాలయంలో
ప్రొద్దుటి పూట
ప్రార్ధన జరుగుతున్నది.
ప్రార్ధన చేస్తున్న
వారు సిస్టర్
అమీలియా. విరామం
లేకుండా దైవ
కార్యాలలో ఆమె
చేస్తున్న సేవల
వలన ఆమె
మొహంలో ఒక
తేజస్సు, ప్రశాంతత
కనిపిస్తోంది. చూసేవాళ్ళందరూ
చేతులెత్తి నమస్కరించే
-- దైవీక మొహం
ఆమెది.
ఆమె ఎదురుకుండా
ఉన్న కుర్చీలలో, దేవుని
దగ్గర పలు
కోర్కెలను ముందుంచి,
జనం కూర్చోనున్నారు.
మతాలు ఏదైనా
ప్రశాంతతను వెతుక్కుని
తిరుగుతున్న మనసులు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలు!
అక్కడున్న వారినందరినీ
వరుసగా చూస్తూ
వస్తే చివరి
వరుసకు ముందు
వరుసలో ఐదవ
వ్యక్తిగా కూర్చోనున్నది
మన కథా
నాయకి ప్రశాంతి.
క్యారట్ రంగులో
చిన్న చిన్న పసుపు
చుక్కలు పెట్టిన
కొత్తగా కొనుక్కున్నచీర, దానికి
మ్యాచింగ్ గా
పసుపు రంగు
బార్డర్ వేసిన
జాకెట్టు వేసుకోనున్నది.
పొడుగైన జడే
అందం అని
అనుకుంటున్న వారందరి ఆలొచన
ఆమె యొక్క
ఒత్తుగానూ, చిన్నదిగానూ
ఉన్న జుట్టును
చూస్తే మారిపోతుంది.
అందంగా కట్
చేయబడ్డ జుట్టుతో, రెండు
జడలు వేసుకుని
నల్ల రంగు
రబ్బర్ బ్యాండును
చుట్టుకోనుంది.
ప్రశాంతి యొక్క
ఎత్తు తక్కువని, ఆమె
వేసుకున్న హీల్స్
వేసుకున్న చెప్పులే
చెబుతాయి.
రేగి పండు
రంగుతో, బాణం
ఆకారంలో దిద్దుకున్న
కురులు, గుండ్రంగా
ఉన్న మొహం, ఆహా...అందులో
అందమైన తిలకం
బొట్టు క్రింద, నుదుటిపైన
ఉన్న తల
వెంట్రుకల దగ్గర
ఉన్న కుంకుమ, ‘ఈమె
ఇక్కడ ఏం
చేస్తున్నది?’ అనే
ప్రశ్నను మిగిలిన
వారి మనసులలో
ఏర్పరిచింది. ఆమె
పెద్ద పెద్ద
కళ్ళల్లో అశాంతి నిండిపోయున్నది.
అవును! ఎప్పుడూ
ప్రశాంతంగా ఉండే అమె మొహం ఈ
రోజు కొంచం
వాడిపోయే ఉంది.
చూసిన వెంటనే
ఈమె మంచిదా...లేక
చెడ్డదా అని
లెక్క వేయలేని
వ్యత్యాసమైన ముఖ
అమరిక.
కారణం. మన
ప్రశాంతి మంచివారికి
మంచిది...చెడ్డవారికి
చెడ్డది. గంభీరంగానూ, పట్టుదలగానూ, శాంతంగానూ
ఉంటూ మనల్ని
ఆశ్చర్యపరుస్తుంది.
ప్రార్ధన ముగియగానే, ఆఫీసుకు
వెళ్ళిన ప్రశాంతి
‘సిస్టర్’
అమీలియా ను
కలుసుకోవాలని సెక్యూరిటీ
దగ్గర చెప్పి
పంపి కాచుకోనున్నది.
ఆమె ఆ
కాలేజీ మాజీ
విధ్యార్ధిని మాత్రమే
కాదు...అక్కడ
పనిచేస్తున్న వాళ్ళకూ
పరిచయస్తురాలు.
అందువలన తెలిసిన
వారందరూ ఆమెతో
మర్యాదగా నడుచుకుంటారు.
“అమ్మగారూ, కొంచం
ఆలశ్యం అయ్యేటట్టు
తెలుస్తోంది. బయటకు
ఎక్కడకైనా వెళ్ళాలంటే
వెళ్ళి ఒక
గంట తరువాత
రండి?” అని
ఎంతో వినయంగా
చెప్పాడు సెక్యూరిటీ.
ఇంకొంచం వివరంగా
“రేపు
జరపాల్సిన ప్రార్ధన
గురించి, లారన్స్
ఫాదర్ తో
మాట్లాడుతున్నారమ్మా.
ఆయనతో పాటూ
చాలా మంది
ఉన్నారమ్మా. అందుకనే...” అంటూ తల
గోక్కున్నాడు.
“పరవాలేదు.
నేను మన
కాలేజీ అంతా
ఒక చుట్టు
చుట్టొస్తా. టైము
సరిపోతుంది. చాలా
రోజులైంది అటువైపు
వెళ్ళి...” అంటూ బయలుదేరింది
ప్రశాంతి.
కాలేజీ సెలవులు
అనేది తెలిసేటట్టుగా
ఖాలీగా ఉన్న
ప్లే గ్రౌండ్, కాకుల
కచేరీ గుర్తు
చేస్తోంది. ఎర్రటి
రాలిపోయిన పూవులు
పడిన సిమెంటు
బెంచ్ మీద
కూర్చున్న ఆమె, మెల్ల
మెల్లగా తన
కాలేజీ జ్ఞాపకాలలో
మునిగిపోయింది.
హైదరాబాద్ లో
పేరు పొందిన
కాలేజీ, అది.కో-ఎడ్యుకేషన్
అయినా, చాలా
కఠినమైన నిబంధనల
కాలేజీ అని
పేరు తెచ్చుకుంది.
అందువలన నగరంలోని
ఉన్నత సంపాదన
గల ప్రజలు
పోటా పోటీ
వేసుకుంటూ తమ
పిల్లల్ని ఈ
కాలేజీలో చేర్చటానికి
ఇష్టపడతారు. బాగా
చదువుకునే మధ్య
తరగతి సంతతికీ
కూడా అక్కడ
స్వాగతం ఉంది.
“రోజా, ఈ
రోజు మీ
సినిమా హాలులో
ఏం సినిమా
ఆడుతోందే?”
“అనార్కలి.
మన వేదాంతం
రాఘవయ్య గారి సినిమా. మిస్
చేయకండే. నేనూ, మా
అక్కయ్య ఆదివారమే
పట్టుదల పట్టి
వెళ్ళి చూసొచ్చాము”
“దానికి
తరువాత వెళదాం.
ఇప్పుడు ‘శ్రీ
420’ హిందీ సినిమాకు
వెళ్దామే. చెక్కిన
శిల్పంలా ఉన్నదట
హీరోయిన్ నర్గీస్.
పోయిన సారి
వచ్చినప్పుడే చూడలేకపోయాము”
“ఆ
సినిమాకి టికెట్టు
దొరకటం చాలా
కష్టమే. మన
క్లాసులోని మగ
పిల్లలందరూ అక్కడికే
దండయాత్ర చేశారు.
నర్గీస్ కోసమే
పలు సార్లు
చూసే రకం
వాళ్ళు”
“ప్లీజ్
జానకీ, ఈ
రోజే మనకు
టైము దొరికింది.
టికెట్లకు మీ
అన్నయ్య శంకర్
ను పట్టుకో.
నన్ను ఎలాగైనా
ఆ సినిమాకు
తీసుకు వెళ్ళు.
సినిమా అయిన
తరువాత మీ
అందరికీ ఐస్
క్రీం కొనిస్తాను”
“నా
వల్ల కాదే!
ప్రొద్దున వాడి
దగ్గర అడిగి
బాగా తిట్లు
తిన్నాను”
“ఇప్పుడు
ఏం చేద్దామే?”
ఆలొచిస్తూ ఒకరి
మొహం ఒకరు
చూస్తున్న స్నేహితుల
బృందం కళ్ళకు
తెల్ల రంగు
కలిగిన సొగసు
కారులో నుండి
దిగుతున్న యుక్త
వయసు యువతి
ప్రశాంతి కళ్ళల్లో
పడింది.
“మనం
అడిగితే ఈ
మగ పిల్లలు
టికెట్లు కొని
ఇవ్వరు. అడిగే
వాళ్ళు అడిగితే
దొరుకుతుంది. ఇప్పుడు
చూడు” అని చెప్పిన
జానకి,
“హాయ్
ప్రశాంతి...గుడ్
మార్నింగ్. ఈ
రోజు క్లాసులు
లేవు! నీకు
ఫోన్ చేసి
చెబుదామనే బయలుదేరుతున్నాం.
ఇంతలో నువ్వే
వచ్చాశావు”
“అలాగా...సరే
పరవాలేదు. లైబ్రరీ
కి వెళ్ళాల్సిన
పని ఉంది.
పరీక్షలకు తయారవ్వాలి”
"ఇలా
చూడవే, సినిమాలలో
దీని లాంటి
డబ్బు గల
అమ్మాయలు, కాలేజీ
ఎగొట్టి ఊరంతా
తిరుగుతారు. మధ్య
తరగతి అమ్మాయలు
ఉద్యోగాలకు వెళ్ళాలని
పడీ పడీ
చదువుతారు. ఇక్కడేమిట్రా
అంటే...అంతా
తలకిందలుగా ఉంది.
ప్రశాంతీ, ఈ
రోజుతో లైబ్రరీ
ఏమీ మూసేయటం
లేదు. అందుకని
ఈ రోజు
మాతోపాటూ ‘శ్రీ
420’ సినిమాకు
వస్తున్నావు”
“రామయ్యా
వస్తావయ్యా” అంటూ
అందమైన గొంతుకతో
ఆమె పాడగా, ఆమెతో
ఉన్న మిగిలిన
స్నేహితురాళ్ళు
కోరస్ పాడారు.
“నా
వల్ల కాదు
బాబూ. ఈ
రోజు నాకు
గుర్రపు స్వారి
ట్రయినింగ్ ఉంది”
“సరే, ఈ
రోజు మా
అన్నయ్య,
తన స్నేహితుడూ
మీ బావ శ్రీనివాస్
కలిసి ఆ
సినిమాకు వెడుతున్నట్టు
చెప్పాడు. నీకు
వద్దంటే నువ్వు
రావద్దు”
ప్రశాంతి యొక్క
మెరుస్తున్న కళ్ళను
చూస్తూనే చెప్పింది
జానకి.
“లేదే...నా
కోసం ప్రత్యేకంగా
ఒక స్త్రీ
వచ్చి చెప్పిస్తోంది.
అందువల్లే క్లాసు
ఎగోట్టాలంటే అదొలా
ఉంది”
“కథలు
చెప్పకు. కానీ, ఒక
విషయం. ఇది
ఇప్పుడే వేసిన
హఠాత్ ప్లాను.
అందువలన డబ్బులు
మేమిస్తాము. టికెట్లు
మాత్రం నువ్వు
కొనివ్వాలి”
ప్రశాంతికి ఆ
డబ్బులు ఒక
లెక్క కాదు.
ఇది తెలిసే
అలా మాట్లాడింది.
“డబ్బులే
కదా. వడ్డీతో
కలిపి ఇంకో
పది సంవత్సరాల
తరువాత తీసుకుంటా” అని నవ్వుతూ
చెప్పి, అటుపక్కగా
నడిచి వెడుతున్న
ఒక అబ్బాయిని
పిలిచింది.
“ప్రభూ...ఇక్కడికి
రావా. మేము
‘శ్రీ
420’ సినిమా
చూడటానికి టికెట్లు
కొనివ్వగలవా?”
అతను ప్రశాంతి
తనని పిలిచి
మాట్లాడటాన్ని
నమ్మలేకపోయాడు.
ఆనందంతో “ఖచ్చితంగా
ప్రశాంతీ. మేము
అడ్వాన్స్ రిజర్వేషన్
చేసుకున్న టికెట్లు
ఉన్నాయి. మీరు
చూడండి. మేము
రేపు చూసుకుంటాం” అని దారాల
ప్రభువులాగా తన
జేబులో ఉన్న
టికెట్లను దానం
చేశాడు.
టికెట్లు తీసుకుని, దానికి
ఇవ్వాల్సిన డబ్బుకు
రెట్టింపు డబ్బు
అతని చేతిలో
పెట్టి, స్నేహితులతో
గలగలమని మాట్లాడుకుంటూ
వెళ్ళిపోయింది.
జరుగుతున్నదంతా
గమనిస్తున్న వివేక్, “ప్రభూ
నీ స్టేటస్
కు ఎక్కువ
ఆశపడకూడదు. ఇంతకు
ముందే వేరే
ఒకతను, ఆమె
పుట్టిన దగ్గర
నుండే కాచుకోనున్నాడని
విన్నాను”
“ఛీ...ఛీ...ఎందుకురా
నీ బుద్ది
ఇంత నీచంగా
ఆలొచిస్తోంది? సినిమా
టికెట్టు ఇచ్చి
ట్రాప్ చేయగలమారా
ఆమెను? ప్రశాంతీ
అడిగితే, ఆ
సినిమా హాలునే
వాళ్ళ నాన్న
కొనేసి, రోజూ, ప్రశాంతీకి
నచ్చిన సినిమా
వేస్తారు. నా
స్టేటస్ కు
అందులో ఒక
మేనేజర్ ఉద్యోగం, ఆమె
రెకమండేషన్ తో
దొరికితే చాలు.
మా కుటుంబమే
బ్రతికేస్తుంది”
ఇలా తన తోటి విధ్యార్ధినీ/విధ్యార్ధులు ఎవరికీ దొరకదు అని మాట్లాడబడిన ప్రశాంతీ, సినిమాలో రాజ్ కపూర్ ను చూసి ఆనందించక, ఆ చీకటిలో దూరంగా కనబడుతున్న తన బావ శ్రీనివాస్ ను చూసి ఆనందిస్తూ ఉన్నది.
Continued...PART-2
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి