28, జులై 2022, గురువారం

మిస్టర్ దోమ...(హాస్య కథ)

 

                                                                                        మిస్టర్ దోమ                                                                                                                                                                                (హాస్య కథ)

" మానవ జాతికి మనల్ని చూస్తేనే చిరాకు పుట్టుకు వస్తుంది. మన కష్టం వాళ్లకు ఎందుకు తెలుస్తుంది? ఒక బొట్టు రక్తం తీసుకోవడానికి ఎన్ని దెబ్బలు తినాల్సివస్తోంది" అనుకుంటూ వీధి చివర పారుతున్న మురికి నీటి గుంటపై కూర్చుని ఆలొచిస్తున్నది మిస్టర్ దోమ.

"కాపురం ఉంటున్న చోటును మార్చాలంటే మామూలు పనా...అందులోనూ మంచి మురికి గుంట లేక మురికి కాలువో దొరకటం సాధారణ విషయమా? మన కష్టాలు ఆడ దోమలకు ఎక్కడ అర్ధమవుతోంది? ‘….వెళ్ళి మంచి మురికి కాలువ వెతికి రా!’  అని గదమాయించడం తప్ప. వెతికే మనకి మాత్రమే తెలుసు వెతకటం ఎంత కష్టమైన పనో" అని మనసులోనే బాధపడింది మిస్టర్ దోమ.

మిస్టర్ దోమ బాధపడటానికి పెద్ద కారణమే ఉంది. మధ్యే అష్టకష్టాలు పడి ఇప్పుడు కాపురం ఉంటున్న మురికి గుంటను వెతికి పట్టుకుంది. ఇప్పుడు మురికి గుంటను కూడా ఖాలీ చేసి పోవాలి. ఎందుకంటే ఏరియా క్పౌన్సిలర్ ప్రాంతానికి రేపోమాపో రాబోతున్నాడని  ప్రాంతంలోని మురికి గుంటలను మట్టిపోసి మూసేసి బ్లీచింగ్ పౌడర్ జల్లి పరిశుభ్రం చేస్తున్నారు. మురికి కాలువల మీద లిక్విడ్ మందు జిమ్మి వెడుతున్నారు. రోజో, రేపో మిస్టర్ దోమ కాపురముంటున్న మురికి గుంటను కూడా మూసేశ్తారు. అందుకని మిస్టర్ దోమ భార్య కొత్త చోటు చూడమని ఆర్డర్ వేసింది.

భార్య దోమ వేసిన ఆర్డర్ ను అమలుపరచటానికి వెళ్ళిన ఆ మిస్టర్.దోమ పడిన కష్టాలు, అందువల్ల కనుక్కోగలిగిన ఒక విష పరీక్ష ఏమిటో?...తెలుసుకోవటానికి ఈ హాస్యభరిత కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మిస్టర్ దోమ...(హాస్య కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి