గాలితో ఒక యుద్దం...(సీరియల్) (చివరి పార్ట్ PART-9)
మనసు గురించి
జరిగిన అన్ని పరిశోధనలూ ప్రధానంగా ఒక్క నిజాన్ని ఒప్పుకుంటున్నాయి. అదేమిటంటే ఒక
మనసు తీవ్రంగా నమ్మే విషయం నిజమైపోతుందనేదే అది! ఎందుకంటే అది అబద్దంగా
ఉంటే...నమ్మకంలోని తీవ్రతలో నిజమనే ఆలొచన ఏర్పడుతుంది. దానికి అర్ధం అలా
తీసుకోకూడదు.
ఒక వంద
శాతం అబద్దాన్ని ఏ మనసూ నిజమని నమ్మటంలేదు. రామాయణం కూడా...రాముడు అవతార పురుషుడు
అనేది కూడా...పురాణ కల్పనే! అది నిజం అయ్యో చాన్సే లేదు అని కొందరు చెప్పినా... రాముడు అవతార పురుషుడే, అందులో కొంచం కూడా అనుమానమే లేదు
అని ఒప్పుకునే వాళ్ళు ఎక్కువ.
వాళ్ళళ్ళో
ఒకరు బద్రాచల రామదాసు. ఆ నమ్మకం కారణంగానే ఆయన, ప్రభుత్వ
పన్ను డబ్బు తీసి రాముడికి గుడి కూడా కట్టిస్తాడు. అందువలన రామదాసును రాజు దండించి
జైలులో పెడతాడు. రామదాసో రాముడు తనని కాపాడతాడని నమ్ముతాడు. అదేలాగానే జరిగింది
కూడా. రాముడే నేరుగా వచ్చి పన్ను డబ్బును రాజుకు చెల్లించి రామదాసును
విడిపిస్తాడు.
వచ్చింది
రాముడేనని రాజు తెలుసుకున్నప్పుడు రామదాసు యొక్క నమ్మకానికి ఉన్న బలం ఎటువంటిదో తెలిసింది. నమ్మకం ఇలాంటి సాహసాలను జరిపి చూపించింది!
గాలిపేట వీధిలోపలకు
వీరబద్రం కారు వెళ్ళిన వెంటనే...వీధి మొత్తం మళ్ళీ ఆశ్చర్యంగా చూసింది. వెళ్ళే
దోవలోనే ఉంది సర్పంచ్ ఇల్లు. ఆయన వాకిట్లో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నారు. వీరబద్రం
కారును ఆశ్చర్యంగా చూశారు.
"బద్రం! మనల్ని చూస్తున్నాడే అతనే ఈ ఉరి
సర్పంచ్..." ---చెప్పాడు కార్తిక్.
"ఓ...అతనేనా? నిన్ను పాము కాటేసిందని మీ అమ్మా-నాన్నకు చెప్పింది!” అడుగుతూ వీరబద్రం కారును ఆయనకు దగ్గరగా తీసుకు వెళ్ళి ఆపాడు.
"ఎందుకురా కారాపావు?"
"దిగు...ఆయన దగ్గర రెండు
నిమిషాలు మాట్లాడాలి"
"ఆయనతో మాట్లాడటానికి ఏముందిరా?"
"అది మాట్లాడేటప్పుడు విని తెలుసుకో"---- వీరబద్రం
కారు దిగి నవ్వుతూ ఆయన ముందుకు వెళ్ళి
నిలబడ్డాడు. ఆయన కూడా సమాధానంగా ఆశ్చర్యంగా చూశారు.
"మీరేనా సర్పంచ్?"
"అవును..."
"ఊర్లో ఏది జరిగినా వెంటనే అది మీకు
తెలిసిపోతుందనుకుంటా?"
బద్రం...కొంచం ఆగరా. క్షమించండి సర్పంచ్ గారూ? అతను నా
స్నేహితుడు. తప్పుగా తీసుకోకండి"---మధ్యలో దూరి కార్తిక్
మాట మార్చాడు.
"లోపలకు రా తమ్ముడూ..."---సర్పంచ్ వాళ్ళిద్దర్నీ
లోపలకు పిలిచాడు.
"పరవాలేదు...చలా పనుంది. ఇంకో సందర్భంలో వస్తాము"
"ఇంకో సందర్భంలోనా...వస్తారా...?"
"ఎందుకలా అడుగుతున్నారు?"
"మీ బామ్మ ఇంటి దస్తావేజులను గాలిదేవుడికి అప్పగించినట్లున్నారుగా"
"ఆ...అవును!"
"అరే...ఇంతలోనే ఆ విషయం మీకు తెలిసిపోయిందా?"
"బద్రం...ఆయన సర్పంచ్! ఆయనకు అన్ని విషయాలూ తెలిసుండాలి.
అది తెలుసుకో"
"అది నేనూ కాదనటం లేదు. కానీ, జరిగి
ఐదు నిమిషాలు కూడా కాలేదు. అంతలోపలే తెలిసిపోయిందే అని ఆశ్చర్యపడుతున్నా"
"ఈ ఊరు మీ నగరంలాగా పెద్దదా ఏమిటి? మొత్తం
ఆరేడు వీధులే. అందువలనే ఏది జరిగినా నాకు తెలిసిపోతుంది"---అంటూ సర్పంచ్
సరిపుచ్చాడు.
సర్పంచ్ పెద్ద మనిషిలాగానే ఉన్నాడు. ఇకపోతే చూడటానికి నటుడు
లాగా మంచి 'మేకప్' లో...శరీరమంతా సెంటు వాసనతో
గుమగుమ లాడుతోంది.
మెడలో బంగారు గొలుసు. పనిమనిషి ఇల్లు తుడుస్తోంది. వయసులో
ఉన్న మహిళ! తుడుస్తున్నప్పుడు సర్పంచ్ ఆమెను చూసే విధం కొంటె చూపు.
వీరబద్రం అతన్ని ఒక మదన కామరాజులాగా చూసాడు.
"కూర్చోండి! ఏం తింటారు?"---అంటూ ఉపసరణ
చేయటం మొదలుపెట్టాడు సర్పంచ్.
"ఏమీ వద్దండీ...టైమవుతోంది"
"అదంతా కుదరదు...ఇక మీదట ఈ గ్రామం వైపు మీరు రాబోయేది
లేదే! కాబట్టి ఈ రోజు మా ఇంట్లో ఉండి భోజనం చేసే వెళ్ళాలి" అని ఒత్తిడి చేసాడు.
"వాళ్ళు రాబోయేది లేదా...ఎవరు చెప్పింది?"--- వీరబద్రం గబుక్కున అడిగాడు.
"గాలిదేవుడు అంతగా దండిచిన తరువాత కూడా ఎవరికి ఈ ఊరు
రావాలనిపిస్తుంది? దస్తావేజులు మాత్రమే ఇవ్వ వలసి ఉంది.
దాన్ని అప్పగించారు. ఇంకేమిటి పని?"
"ఇక మీదటే పని! ఇప్పుడు ఏ నేర భావమూ లేకుండా ధైర్యంగా
రావచ్చు" అన్న వీరబద్రాన్ని కొంచం బెదురుగా చూసాడు సర్పంచ్.
అప్పుడు సర్పంచ్ ఎదుటికి...ఒకడు మేడ నుండి దిగి వచ్చాడు.
చూడటానికి గంభీరంగా ఉన్నాడు. జీన్స్ ప్యాంటు, టీ షర్టూ--అంటూ అత్యంత నాగరీకంగా ఉన్నాడు.
"మామయ్యా...నేను హైదరాబాద్ వెళ్ళి టికెట్టు బుక్
చేసుకుని వస్తా. విజయవాడ నుండి హైదరాబాద్ కు డైరెక్ట్ విమానం ఉన్నదా
తెలియదు--ఇప్పుడే ఇంటర్ నెట్ లో చూసాను. హైదరాబాద్ నుండి తాయ్ లాండ్ కు చాలా
విమానాలున్నాయి. మనం అలాగే వెళ్ళిపోదాం"
ఆ మాట విని సర్పంచ్ కొంచం కంగుతిన్న వాడిలాగా అయిపోయాడు.
"సరి...సరి...నువ్వు బయలుదేరు” ---అంటూ
అతన్ని వేగంగా తరమటానికి ప్రయత్నం చేసాడు. అతనూ వెళ్ళిపోయాడు.
అతని మీద కూడా సెంటు స్ప్రే వాసన వస్తోంది. కార్తిక్ అతన్ని
ఆశ్చర్యంగా చూసాడు.
"వీడు నా బావ మరిది. నా భార్య యొక్క చివరి తమ్ముడు.
విదేశాల నుండి ఇప్పుడే వచ్చాడు. వీడు బయటి దేశాలకు వెళ్ళి రావటం సర్వ
సాధారణం" అంటూ దొంగ నవ్వుతో సవరించాడు.
"అక్కడ ఏం పని చేస్తున్నాడు?"
"అక్కడ...అక్కడ...ఆ! ఈ
ఎక్స్ పొర్ట్ - ఇం పొర్ట్.."
"ఏం ఎక్స్ పోర్టు చేస్తాడు...ఏం దిగుమతి
చేస్తాడు"
"అవన్నీ నాకు తెలియదు! నేను అవన్నీ అడగను. నాకు ఈ ఊరి
పనే పెద్ద తలకాయి నొప్పిగా ఉందే?"
“కానీ, ఇంత పనిలోనూ మధ్య మధ్య
విదేశాలకు వెళ్ళి వస్తున్నారనుకుంటా..."
"నేనా...బయటి దేశాలకా?"
"మీరే! మీరు తాయ్ లాండుకు
వెళ్ళి రావటానికి టికెట్టు బుక్ చేస్తానని మీ బావమరిది చెప్పాడు కదా"
----- వీరబద్రం అలా అడుగుతాడని
సర్పంచ్ అనుకోలేదు.
"ఆ...అవును...అవును! చాలా రోజుల నుంచి నన్ను
పిలుస్తున్నాడు. సరే...ఒకసారి వెళ్ళి ఊరు చూసొద్దామని అనుకుని..."
ఆయన దొంగ నవ్వును కొనసాగించాడు.
మధ్యలో 'కూల్ డ్రింక్స్’ వచ్చినై. ఖరీదైన గాజు
గ్లాసు కప్పుల్లో ఇచ్చింది ఇంటి పనిమనిషి.
ఒక కప్పు యొక్క ఖరీదు ఐదువేలు ఉంటుంది!
వీరబద్రం మనసులో పురుగులు ఎగరటం మొదలయ్యింది. పళ్లరసం
తాగుతుంటే కొత్త రుచి.
"ఎలా ఉంది? జనీవా ద్రాక్ష రసం"
అన్నాడు సర్పంచ్.
గాలిపేటలో జనీవా ద్రాక్ష!
ఎక్కడెక్కడో కొట్టుకుంది వీరబద్రానికి.
జ్యూస్ తాగి ముగించి లేచారు.
"గాలిదేవుడ్ని బాగా ప్రార్ధించుకున్నారా?"
"అవును సర్పంచ్ గారూ...!"
“కొంచం ఉగ్రమైన దైవం. మీ దగ్గర దస్తావేజులు తీసుకోవటానికే కొంచం
బెదిరించింది. ఇక జాగ్రత్తగా ఉండండి"
"ఖచ్చితంగా...!"
"జాగ్రత్తగా వెళ్ళి రండి"
సాగనంపాడు సర్పం
*****************
బయటకు వచ్చిన వాళ్ళిద్దరూ కారులో ఎక్కారు. కారును వేగంగా
తీసాడు వీరబద్రం. అతను ఏదో గందరగోళంలో ఉన్నట్టు అర్ధం చేసుకున్నాడు కార్తిక్.
"ఏమిటి బద్రం...సర్పంచును చూసిన దగ్గర నుండి నీలో
గందరగోళం ఎక్కువ కనబడుతోంది...?"
"నీకు లేదా?"
"గందరగోళ పడటానికి ఏముంది... నేను చూసినప్పుడు సాధారణంగా
ఉండేవారు. ఇప్పుడు కొంచం దర్జాగా కనబడుతున్నాడు. ఇల్లు కూడా బాగా మారింది"
"అంతేనా?"
"అంతేనా అంటే?"
"ఆయన చాలా తప్పులు చేస్తున్నాడని నాకు
అనిపిస్తోంది..."
"తప్పులా?"
"అవును..."
"ఎలా చెబుతున్నావు?"
"పేరుకు మాత్రమే సర్పంచ్. కాంటాక్టులు తాయ్లాండ్ వరకు. మనం
జ్యూస్ తాగామే...ఆ గాజు గ్లాసు ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?"
"యాభై రూపాయలు ఉంటుందా?" అన్నాడు
కార్తిక్.
అది విన్న వీరబద్రం నవ్వాడు. “ఐదువేల
రూపాయలకు తక్కువ ఉండదు." అని అనగానే...గుండె గుభేలు మంది కార్తిక్ కి.
"నిజంగానా బద్రం...?"
“నేను ఐ.టీ. కంపెనీలో పెద్ద పదవిలో ఉన్నాను. చాలా రకాల
పార్టీలకు వెళ్ళొస్తాను. చెబితే నమ్ము"--- వీరబద్రం చెప్పి ముగించగానే ఇంటి ముందు
ఆగింది కారు.
కారు దిగారు......ఈ
సారి వీధిలో ఉన్నవారు వేడుక చూసారు.
దాన్ని పట్టించుకోకుండా లోపలకు వెళ్ళారు.
"రేయ్...గాలిదేవుడ్ని మనసులో ప్రార్ధించుకుంటూ వెతుకు.
లేకపోతే మళ్ళీ ఆ పాము తిరిగి వస్తుందేమో"-- హెచ్చరించాడు కార్తిక్.
"రానీ...ఈ సారి దానికి పరలోకం ఖచ్చితం"---అంటూ
సెల్ ఫోనును వెతుక్కుంటూ ఇంటి మధ్య బాగం దగ్గరకు వెళ్ళాడు వీరబద్రం.
అంతకు మునుపు అక్కడ చదునుగా చూసిన కడప రాయి...ఈ సారి తిరిగి
పడుంది. దాన్నే తధేకంగా చూస్తున్నాడు వీరబద్రం.
"ఏమిటి ఆ రాయినే అంత దీర్ఘంగా చూస్తున్నావు! త్వరగా నీ
సెల్ ఫోనును వెతుకు. కావాలంటే నేను నీ నెంబర్ కు ఫోన్ చేస్తాను. సౌండ్ వస్తుంది
కదా?"
"చెయ్యి..."
కార్తిక్, వీరబద్రం నెంబర్ కు డయల్ చేయగా, ఒక పొదలో నుండి 'రింగ్ టోన్’ వినబడింది.
వెళ్ళి తీసుకు వచ్చాడు.
"హమ్మయ్య...దొరికింది..." అంటూ రిలాక్స్ అయ్యాడు వీరబద్రం.
"సరి...సరి...బయలుదేరు. ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండ
కూడదు..."
"పోరా పిచ్చోడా...ఇకపైనే మనకి ఇక్కడ ఎక్కువ పని
ఉంది"
"ఏం చెబుతున్నావు?"
"నువ్వొక భయస్తుడివి! ఒకే
చూపుగా పయనిస్తావు..."
"నువ్వు మాట్లాడేది అర్ధం కాలేదు..."
"ఎలా అర్ధం అవుతుంది? భయం, స్వార్ధం, మూర్ఖత్వం నిండిపోయినప్పుడు...ఏదీ అర్ధం కాదు. సరే
కానీ...నాతోరా..."
"ఎక్కడికి?"
"అరే రమ్మంటుంటే…"--కసురుకుంటూ
ఇంటి మధ్య భాగం దగ్గరకు తీసుకు వెళ్లాడు.
"ఇక్కడేముంది?"
"వంగుని కడప రాయిని
చూడు"
"దానికి ఏమిటిప్పుడు?"
"బాగా చూసి చెప్పరా..."
"హు...చూశాను"
"ఏం చూసావు?"
"రాయిని..."
"కర్మరా...! నువ్వు ఇంతకు ముందు ఈ రాయిని చూసినప్పుడు
ఈ రాయి ఎలా ఉంది...ఇప్పుడెలా ఉంది?”
"రాయి ఎప్పుడూ రాయిలాగానే
ఉంటుంది?"---కిందకు మరోసారి చూసి సన్నని
స్వరంతో అడిగాడు.
"సరిగ్గా చూడరా? రాయి దిశ మారి ఉన్నట్టు లేదూ? రాయి యొక్క నున్నటి వైపు కింద వైపుకూ ఉన్నది..."
అన్నాడు….."అది
మాత్రమే కాదు...కూర్చుని వాసన చూడు".
వంగుని వాసన చూశడు కార్తిక్. తరువాత "వాసన
వస్తోంది" అన్నాడు.
"ఏం వాసన?"
"లావెండర్"
"ఇదే వాసన ఆ సర్పంచ్ మీద కూడా వచ్చిందే! జ్ఞాపకముందా?"
"ఓ నువ్వు అలా ఆలొచిస్తున్నావా? అంటే
ఆయన ఇక్కడకు వచ్చుంటాడంటావా?"
"గట్టిగా చెబుతున్నాను...వచ్చాడు...రాయి తీసాడు. తిరిగి
వెడుతున్నప్పుడు రాయిని మార్చి పెట్టాడు. అంతే కాదు అతనే నీపై పాము విసిరేసింది.
మీ అమ్మా-నాన్నలకు జరిగిన కారు యాక్సిడెంట్ కు కూడా కారణం ఆయనే"
" బద్రం..."
"ఏమిటీ....రుజువు కావాలా? నాకు ఒకే
ఒక నమ్మకమే! దేవుడు ఎప్పుడూ ఇంత 'చీప్' గా బెదిరించడు. మీ తప్పును మీరు తెలుసుకోవాలని గాలిదేవుడు నిర్ణయించుకో
నుంటే ఇలా పామును ఎగరేసి బెదిరించక్కర్లేదు. మీ నాన్న కలలో కనబడి 'వద్దు’ అని చెప్పుంటేనే చాలు. మీ నాన్న
వణికిపోయేవాడు. ఇదంతా గాలిదేవుడనే దేవుడు ఉండుంటే..! ఇప్పుడు ఆ దేవుడు
ఉన్నాడో...లేడో! ఆ విషయం తరువాత మాట్లాడుకుందాం. ఈ కడప రాయి కింద ఖచ్చితంగా ఏదో
ఉంది. అదేమిటో నేను చూసేస్తే ఖచ్చితంగా లేక్క వేసేస్తాను" మాట్లాడుతూ వేగంగా రాయిని తీసి పక్కన పడేసాడు.
చుట్టూ చూసాడు. గోడ చివర్న ఒక పలుగు కనబడింది.
ఆ పలుగు తీసుకుని తవ్వటం మొదలుపెట్టాడు. కార్తికుకు అంతా ఒక
కలలాగా ఉంది. కొన్ని అడుగుల లోతులో ఒక చెక్క పెట్టే కనబడింది. దాన్ని ముట్టుకుని
తెరిచి చూస్తే, గుండె అడ్డుపడింది. లోపల
తలతల మని మెరుస్తున్న బంగారు బిస్కెట్లు. అన్నిటి మీద విదేశీ ముద్ర.
" బద్రం...!"
"చూడరా...అంతా అక్రమ బంగారం! మీ సర్పంచ్ పని దొంగ
వ్యాపారం. అతనింట్లో చూశామే ఒకడ్ని...వాడే ఆయన అక్రమ వ్యాపారానికి ఏజెంటై ఉంటాడు.
మామూలుగా అక్రమంగా రవణా చేసిన రహస్య బంగారాన్ని చాలా చాలా
సీక్రెట్ ప్రదేశంలోనే ఉంచాలి. ఈ ఊర్లో పాడుపడిన, ఎవరూ రాలేని ఈ ఇల్లు...దానికి బాగా ఉపయోగపడింది.
దానికి తోడు గాలిదేవుడి ఇల్లు అనే ఆనవాలు వేరే! సర్పంచ్ పెద్ద క్రిమినల్ రా.
మీ మొక్కూ...ప్రార్ధన తనకు లాభంగా ఉపయోగించుకున్నాడు. ఒక
విధంగా తెలివితేటలు గలవాడే!
గాలిదేవుడు నిజంగా ఉండుంటే...ఇతన్ని ఎప్పుడో శిక్చించే
వాడు. కానీ గ్రామ ప్రజల నమ్మకం వేరేలాగా ఉన్నది. అదే సర్పంచ్ బలం...పెద్ద
క్రిమినల్ కదా...? గొప్ప ఆట ఆడాడురా"
వీరబద్రం చెబుతూ వెడుతుంటే కార్తికుకు సిగ్గేసింది--కోపం
వచ్చింది. తాను ఎంత మోసపోయేనో అనేది అతనికి బాగా అర్ధమయ్యింది.
"ఏమిట్రా బద్రం...మౌనంగా ఉన్నావు? ఇప్పుడేం చేద్దాం?"
"ఈ విషయాలు తెలుసుకున్న
మనం, ఇప్పుడు చేతులు ఊపుకుంటూ వెళ్ళలేము. మనం ఇక్కడ ఏం
చేస్తున్నామో తెలుసుకోవటానికి ఇక్కడ ఏదైనా కెమేరా పెట్టి చూస్తూ ఉండొచ్చు. ఈ నిజం
నీ బామ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో ఆలొచించి చూడు..."
వీరబద్రం చెబుతుంటే కార్తిక్ కు గొంతు ఎండిపోయింది.
"మీ బామ్మకు ఎంత నమ్మకమోరా? కానీ,
ఆవిడ నమ్మకాన్ని ఉపయోగించుకుని ఇక్కడ ఒకడు దొంగతనాలు చేయడానికి మీ
ఇంటిని వాడుకుంటున్నాడు. ఇదేరా ఇవాల్టి లోకంలోని పరిస్థితి, లక్షణం.
దీన్ని నాలాంటి వాడు ఎత్తి చూపితే...వాడు మూర్కుడు. నమ్మకం
లేని బుద్ది హీనుడు అని చెప్పేస్తారు!"
"చాలు బద్రం! ఇక నేను ఓర్చుకోలేను. ఆ
సర్పంచును..."
"ఏమిటి పళ్ళు కొరుకుతున్నావు? నీ వలన
అతన్ని ఏమీ చేయటం కుదరదు. ఇంకమీదటే మనకు ఆపద ఎక్కువ. పారేసుకున్న సెల్ ఫోను కే
నేను థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే ఇంతపెద్ద నిజం తెలిసుండేదా?"
"సరే...ఇప్పుడేం చేద్దాం?"
********************
"మొదటి పనిగా విజయవాడ కలెక్టర్ కు విషయం చెబుతాను.
ఎందుకంటే...ఆయన నాకు బాగా తెలుసు. తరువాత ఆయన ఏం చేయదలుచుకున్నారో చేయని. మనం
ఇప్పుడు ఈ సర్పంచ్ చేతులకు దొరకకుండా తప్పించుకోవటంలోనే మన తెలివితేటలు
ఉన్నాయి"
"అయితే రా...కారులోకి ఎక్కి వేగంగా వెళ్ళిపోదాం"
“పోరా మూర్ఖుడా...ఆ సర్పంచ్ కళ్ళు ఇప్పుడు మన కారుపైనే
పడుంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఇంటిలోపలకు దూరామో...అప్పుడే అతనికి వార్త
వెళ్ళుంటుంది. అందువల్ల మనం వెనుక దోవ నుండి వెడదాం. ఇలా వెడితే ఎక్కడికి
వెడుతుంది?"
"వెనుక వైపు పొలాలు. పక్క దారిలో వెడితే మనం ఈ ఊరులోకి
వచ్చిన రోడ్డును అందుకోవచ్చు..."
"అయితే రా...పరిగెత్తుదాం"
“ఉండు...మొదట కలెక్టర్ కు ఫోన్ చేసేస్తాను"
వీరబద్రం ఫోన్ లో నెంబర్లు నొక్కుతున్నప్పుడు...అతని
మణికట్టుపైన ఎక్కడ్నుంచో ఎగురుకుంటూ వచ్చిన ఒక అంగుళం పొడవున్న సూది గుచ్చుకుంది.
ఆ వేగంలో సెల్ ఫోన్ కింద పడిపోయింది. దాన్ని వీరబద్రం తీసుకునేలోపు పక్కనున్న
పొదలలో నుండి నలుగురు మనుషులు వచ్చారు.
అందులో ఒకడి చేతిలో నోటితో ఊదే సూది ఆయుధం ఉన్నది. అది
పెట్టుకునే అతను వీరబద్రం మణికట్టు పైకి సూదిని వేసుంటాడు.
వీరబద్రం ఆ సూదిని తీస్తున్నప్పుడు కళ్ళు బైర్లు కమ్మి
పడిపోయాడు. ఆ సూదిలో ఉన్న మత్తుమందు వలనే అలా జరిగింది!
కోపంతో చూసిన కార్తిక్ భుజాల మీద కూడా సూది గుచ్చుకుంది.
అతనూ కళ్ళు తిరిగి పడిపొయేడు.
ఇద్దర్నీ వాళ్ళు ఎత్తుకున్నారు. అలాగే వెనుక వైపుకు
వెళ్ళారు. అంతకు ముందు ఆ నలుగురిలో ఒకతను తన సెల్ ఫోనులో ఒక మీట నొక్కగా గుర్రం
వెడుతున్న శబ్ధం వినబడింది. డప్పుల శబ్ధమూ వినబడింది.
ఫోను స్పీకర్లలో దాన్ని అతిపెద్ద ధ్వనితో ప్రసారం చేసాడు.
చుట్టుపక్కలున్న వాళ్ళు భయపడిపోవాలే?
అది అద్వాన్నమైన అడవి!
వీరబద్రం, కార్తిక్ ఒక చెట్టుకు
కట్టబడున్నారు. ఇద్దరూ స్ప్రుహలోకి వచ్చారు.
చుట్టూ ఆ నలుగురు........
ఇంతలో కారు వస్తున్న శబ్ధం.
సర్పంచ్, అతని బావమరిది వచ్చారు.
సర్పంచ్ ఒక సాలువాతో తలను కప్పుకున్నాడు.
వాళ్ళ దగ్గరకు వచ్చిన తరువాత తీసేడు.
అతన్ని చూసిన వీరబద్రానికి కోపం వచ్చింది.
"ఏయ్ సర్పంచ్! నువ్వింత మోసగాడివని నేను
అనుకోలేదు" అన్నాడు.
అప్పుడు సన్నని గాలి మొదలయ్యింది. చుట్టూ ఉన్న కలుపు
మొక్కలు చిన్నగా ఊగటం మొదలుపెట్టినై.
"మామయ్యా...వదిల్తే న్యాయమూ, అన్యాయమూ అంటూ ప్రశంగం మొదలు పెడతాడు. వీళ్ళకు మన
గురించి తెలిసిపోయింది.ఇద్దర్నీ చంపేసి ఆ ఇంట్లోనే పూడ్చి పెడితేనే మంచిది"
అన్నాడు బావమరిది.
"అయితే అలాగే చేయండి" అంటూ...ఒకే వాక్యంలో వచ్చిన
విషయం చెప్పి సర్పంచ్ వెనక్కి తిరిగాడు.
"సర్పంచ్...ఇది పెద్ద పాపం! మీరు మమ్మల్ని మాత్రమే
మోసగించటం లేదు...ఆ దైవాన్ని కూడా మోసగిస్తున్నారు?
అరిచాడు కార్తిక్.
ఆ పరిస్థితులలోనూ నవ్వాడు వీరబద్రం.
"ఎలారా ఇలాంటి పరిస్థితులలోనూ నువ్వు నవ్వ
గలుగుతున్నావు?" --వీరబద్రాన్ని అడిగాడు కార్తిక్.
"నవ్వకుండా ఏం చేయను...? ఈ మనిషి మనల్ని మోసం చేసేడని నువ్వు అన్నది సరి.
దైవాన్ని కూడా అన్నావే...అందుకు. ఇంకా దైవం ఉన్నదని మాట్లాడుతున్నావే? ఆ దేవుడే ఉండుంటే మనల్ని ఇలాగా వదిలిపెట్టేవాడు?"
---అతని ప్రశ్న కార్తిక్ గుండెల్లో గుచ్చుకుంది. కళ్ళల్లో
కన్నీరు ఉబికి వచ్చింది.
అప్పుడు గాలి వేగం ఎక్కువైంది. ఆకాశంలో వర్షం పడే సూచనలు
కనిపించాయి. ఇంతలొ తుపాకి పేలిన శబ్ధం వినబడింది.
వాళ్ళ చూట్టూ ఉన్న ఆ నలుగురు, సర్పంచ్ బావమరిది, ఆ శబ్ధం విని ఆశ్చర్యపోయారు.
"మీరు వీళ్ళను చూస్తూ ఉండండి. నేను వెళ్ళి
చూసొస్తాను" అని ఆ నలుగురుకీ చెప్పి తుపాకీ శబ్ధం వచ్చిన వైపుకు వెళ్ళాడు
సర్పంచ్ బావమరిది.
గాలి వేగం ఎక్కువయ్యింది. మళ్ళీ తుపాకీ పేలిన శబ్ధం
వినబడింది.
ఆ నలుగురిలో ఒకడు శబ్ధం వచ్చిన వైపుకు పరిగెత్తాడు...కొంచం
దూరంలో సర్పంచ్, అతని బావమరది కింద పడున్నారు.
వాళ్ళ శరీరం గిలగిల
కొట్టుకుంటొంది.
అది చూసిన అతను తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
ఆందోళన పడుతూ విషయాన్ని తన అనుచరలతో చెప్పాడు.
"రేయ్...మన యజమానిని, ఆయన బావమరిదిని ఎవరో
కాల్చేశారు. పోలీసులే మనల్ని చుట్టుముట్టి ఉంటారు లాగా కనబడుతోంది.
రండిరా...పారిపోదాం".
అతను తన చేతులో ఉన్న తుపాకీని తన పంచ కట్టులోకి దోపి
పరిగెత్తడం మొదలుపెట్టాడు. మిగిలిన అనుచరులు కూడా వాడి వెనుకే పరిగెత్తటం మొదలు
పెట్టారు. అందులో ఒకడు కార్తిక్ ను 'కాల్చి వెళ్ళిపోదాం' అన్నట్టు తుపాకీని అతనివైపు గురిపెట్టాడు. అప్పుడు ఎక్కడ్నుంచో వచ్చిన మరో
తుపాకీ గుండు అతని గుండెను తాకింది.
కార్తిక్ , వీరబద్రం బెదిరిపోయారు.
శబ్ధం తగ్గిన సమయంలో ఎదురుగా ఒక గుర్రం లాంటి జంతువును
చూసిన కార్తిక్ కు వొళ్ళంతా జలదరించింది. వీరబద్రానికి...ఏదో
జరుగబోతోందని అర్ధమయ్యింది. దానికి తగినట్లు గుర్రంపైన ఒకతను. పెద్ద మీసాలు. అతని
చేతిలోనే తుపాకి.
ఆయన్ని చూసిన క్షణం... కార్తిక్ కు పాత జ్ఞాపకాలు.
పసి పిల్లాడుగా ఉండి తప్పిపోయినప్పుడు వచ్చిన అదే మనిషి.
"అయ్యా...మీరా?"
"నేనే! నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వచ్చి
కాపాడేను. ఇప్పుడూ వచ్చి కాపాడేను. ఎప్పుడు చూడూ ఇలా తప్పైన వాళ్ళ దగ్గర
చిక్కుకుంటున్నావే?"
ఆయన సమాధానం కార్తిక్
ను ముగ్దపరిచింది.
వీరబద్రం కూడా అది చూసి భయపడిపోయి "అయ్యా...మీరెవరు?" అన్నాడు.
"వేటగాడిని...అలాగే కదా నువ్వు అనుకున్నావు!"
ఆ సమాధానం వీరబద్రం బుర్రలో బలంగా తగిలింది.
ఆయన సమాధానం చెబుతూనే వాళ్ళ కట్లు విప్పాడు. తరువాత.........
"నేను వేటగాడినే. ఈ రోజు ఒక్క మృగం కూడా దొరకలేదు.
ఏమిట్రా ఇది అని విసుకున్నాను. అప్పుడే ఈ మానవ మృగాలు చిక్కుకున్నై. వీళ్ళు
ఎక్కువగా ఆటలాడారు. మారుతారులే అని నేను ఎన్ని సంధర్భాలు ఇవ్వను?"---ఆయన
అడిగిన విధం, నవ్విన విధం, చూసిన విధం అన్నీ
అమానుషంగానే ఉన్నది.
"అయ్యా...నిజం చెప్పండి! మీరెవరు?"-- అడిగాడు
కార్తిక్.
"అదే చెప్పేనే...వేటగాడినని"
"లేదు... మీరు గాలిదేవుడు..."
"అరే...నా పేరు సరిగ్గా చెప్పావే...!"
"కాదు మీరు గాలిదేవుడే..."
"నేను కాదనలేదే..."
"మీ సహాయాన్ని మరిచిపోలేము..."
"నేనేమీ మీకొసం చేయలేదు. మీ ఇంట్లో ఒక బామ్మ ఉంది
చూడు...ఆమెకోసం చేశాను. ఇప్పుడు దార్లో కూడా చూశాను. 'వెళ్ళే
దోవలో నా మనవుడూ, అతని స్నేహితుడూ మీ కళ్ళల్లో పడితే త్వరగా
పంపించండి అని చెప్పింది. అందుకే వచ్చాను”
"బా...బా...బామ్మను చూసారా?"
"వెళ్ళి అడిగి తెలుసుకో...ఆ తరువాత ఎవరెవరికి
వివరాలివ్వాలో ఇచ్చేయి. ఆ ఇంటిని శుభ్ర పరిచి ఎవరికైనా అమ్మేయి. వూరికే ఉంచితే
ఇంతే. దొంగలు అక్కడ దాక్కుంటారు. దొంగలు ఎదగటానికి మనమే కారణంగా ఉంటున్నాము"
"మీరా ఇలా చెబుతున్నారు?"
"మరి...దేవుడా వచ్చి చెబుతాడు? నా
లాంటి ఆసామే చెప్పగలడు. ఏమిటి...నేను చెప్పేది కరక్టే కదా?"
-----ఆ మనిషి మీసాలు తిప్పుకుంటూ, కళ్ళు
ఆర్పుతూ, తిరిగి గుర్రం మీద ఎక్కాడు.
వీరబద్రాన్ని చూసి నవ్వుతూ..."నువ్వు చాలా
తెలివిగలవాడివి...నీకు మెధస్సు ఎక్కువ. కానీ జ్ఞానం లేదు. ఇక మీదట నీకు జ్ఞానమూ
దొరకటం ప్రారంభమవుతుందని నమ్ముతున్నాను" అంటూ బయలుదేరారు.
గుర్రం...కంటి చూపు నుండి కనుమరుగయ్యింది.
వీరబద్రానికి ఏమీ అర్ధం కాలేదు. తలను విధిలించాడు.
ఇద్దరూ నడిచారు.
ఆకాశం నుండి వర్షం చినుకులు మొదలయ్యాయి. గాలి బాగా వీసింది.
ఆ గాలే.
కార్తిక్ వరకు గాలిదేవుడు.
అతని స్నేహితుడు వీరబద్రానికి ఒక ధర్మదేవత కనబడ్డాడు!
*****************************************************సమాప్తం***************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి