14, జనవరి 2023, శనివారం

త్యాగ ఫలితం...(కథ)


                                                                                      త్యాగ ఫలితం                                                                                                                                                                                   (కథ)

త్యాగమనేది ఒక గొప్ప శక్తి. త్యాగానికి ఫలితం ఎప్పుడూ దొరుకుతుంది. అది ప్రకృతి అందించేది. కానీ, ఫలితం ఎదురు చూసి త్యాగం చేయకూడదు.

 త్యాగానికి కూడా ఒక హద్దూ పద్దూ వుండాలా. స్నెహం గొప్పదే, ఎవరూ కాదనరు...కానీ స్నేహం కోసం ఒకరు తమ జీవితాన్నే త్యాగం చేయాలనుకోవడం వొట్టి మూర్కత్వం కాదా?

 "నువ్వు చేస్తున్న ప్రేమ త్యాగం నీ ఒక్క మనసు పైనే అధారపడిందా?...నిన్ను ప్రేమించిన నా మనసుపై నీకు కనీసం జాలి కుడా కలగట్లేదా? మీ ఆడవాళ్ళు అంటూంటారే 'మనసు ఒకరికిచ్చి శరీరాన్ని యంత్రంగా మార్చి మరొకరితో కాపురం చేయడం మోసం! వంచన!' అని... మాటలు ఒక్క మీ ఆడవాళ్ళకు మాత్రమే సొంతం కాదు, మగవారికి కూడా సొంతమైనదే. ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్ళి చేసుకోవడం నా వల్ల కాదు ...అయినా తెలియక అడుగుతున్నా నా మనసుపై ఒత్తిడి తెచ్చే అధికారం నీకెవరిచ్చారు? "

 చిన్నగా నవ్విన అర్చన "నువ్వే నవీన్... అధికారం నువ్వే ఇచ్చావు. నీ ప్రేమను నాకు తెలిపిన రోజు 'నీ కొసం ఎటువంటి త్యాగమైనా చేశ్తాను అని నువ్వు చెప్పావు...గుర్తులేదా?... అధికారంతోనే...సారీ, చనువుతోనే నీ మీద ఒత్తిడి తెస్తున్నా"

 అర్చన ఒత్తిడికి నవీన్ లొంగిపోయాడా? అర్చన అసలు తన ప్రేమను ఎందుకు త్యాగం చేసింది? దాని వలన అర్చన పొందిన ఫలితం ఏమిటి?...తెలుసుకోవటానికి కథ చదవండి.  

కారులో నుంచి ఎగురుతున్నట్టు ఒక్కసారిగా కిందకు దూకింది 8 ఏళ్ళ వర్షిణి.

పెద్ద పూవు ఒకటి చేతులూ, కాళ్ళతో వొయ్యారంగా నడిచి వస్తున్నట్లు ఉన్నది.

ఒక పక్క నవీన్, మరోపక్క మాధవి వర్షిణి చేతులు పట్టుకోగా, బంగళాలోకి వచ్చిన వర్షిణి కళ్ళకు మొదటగా కనిపించింది అర్చన యొక్క అందమైన ఫోటో.

ఫోటోకి పూల మాల, ఫోటోకి ఒక పక్క వెలిగించిన అగరొత్తులు, మరో పక్క వెలుగుతున్న దీపం... ఫోటోను చూసిన ఎవరైనా సరే ఫోటోలోని వ్యక్తి ప్రాణాలతో లేదని వెంటనే గ్రహిస్తారు. కానీ చిన్న పిల్ల వర్షిణికి విషయాన్ని గ్రహించే శక్తి ఇంకా రాలేదు.

"హాయ్...అర్చనా ఆంటీ!" అంటూ నవీన్-మాధవీల చేతులను ఒక్కసారిగా విధిలించుకుని పరిగెత్తుకుంటూ అర్చన ఫోటో దగ్గరకు వెళ్లిన వర్షిణి, చప్పట్లు కొడుతూ, నవ్వుకుంటూ అర్చన ఫోటో ఎదురుగా ఆనందంతో గిరగిరా తిరుగుతోంది.

సడన్ గా ఏదో అర్ధమైన దానిలా నవ్వునూ, చప్పట్లనూ ఒక్క సారిగా ఆపిన వర్షిణి మాధవి వైపుకు తిరిగి "మమ్మీ...అర్చనా ఆంటీ ఫోటోకి ఎందుకు పూలమాల వేశారు?...ఆంటీ దేవుడు దగ్గరకు వెళ్లిపోయిందా?" అంటూ అప్పుడే సొఫాలో కూర్చున్న మాధవి దగ్గరకు వచ్చి అడిగింది.

భారమైన మనసుతో, తీవ్ర ఆలొచనలో ఉన్న మాధవి వర్షిణి అడిగిన ప్రశ్నను వినలేదు.

మాధవి మాట్లాడకపోయేసరికి ఆమె చేతులను కుదుపుతూ "చెప్పు మమ్మీ"అంటూ ఇందాక అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగింది వర్షిణి.

"అలా అని నీకెవరు చెప్పారు?" ఆశ్చర్యంతో వర్షిణిని అడిగింది మాధవి.

"మా స్కూల్ ప్రిన్సిపాల్ రూములో కొన్నిఫోటోలు ఉన్నాయి మమ్మీ...వాటికి కూడా ఇలాగే పూలమాలలు వేసున్నాయి. ఎందుకలా వేశారు అని ప్రిన్సిపాల్ ను అడిగితే...వారంతా దేవుడు దగ్గరకు వెళ్ళిపోయారు, అందుకని వేశాము అని మా ప్రిన్సిపాల్ నాతో చెప్పింది" అమాయకంగా చెప్పింది వర్షిణి. వర్షిణిని దగ్గరకు తీసుకుంటూ "నిజమే తల్లీ...అర్చనా ఆంటీ దేవుడు దగ్గరకు వెళ్లిపోయింది" బొంగురుపోయిన కంఠంతో చెప్పింది మాధవి. "అయితే రా...ఆంటీకి దణ్ణం పెట్టుకుందాం.దేవుడు దగ్గరకు వెళ్లిపోయిన వాళ్ళకు దణ్ణం పెట్టుకుంటే వాళ్ళు మనల్ని విష్ చేస్తారట...మా ప్రిన్సిపాల్ చెప్పింది" అంటూ మాధవి చెయ్యి పుచ్చుకుని లాగుతూ, పక్కనే కూర్చున్న నవీన్ ను చూసి "నువ్వు కూడా రా డాడీ" అన్నది వర్షిణి.

"నువ్వు దణ్ణం పెట్టుకున్నా, పెట్టుకోక పోయినా నువ్వు ఎప్పుడూ బాగుండాలని అర్చన నిన్నువిష్ చేస్తుంది" అనుకుంటూ వర్షిణితో కలిసి అర్చన ఫోటో దగ్గరకు వెళ్లింది మాధవి. ఆమె వెనుకే వచ్చాడు నవీన్.

కళ్ళు మూసుకుని ముగ్గురూ అర్చనకు దణ్ణం పెట్టుకున్నారు.

దణ్ణం పెట్టుకుని కళ్ళు తెరిచిన మాధవికి వర్షిణి ఇంకా కళ్ళు మూసుకుని నిలబడి ఉండటం కనిపించింది. తన కళ్ళ వెంట నీరు ఉబికి వస్తుండటంతో కళ్ళు తుడుచుకుంటూ వర్షిణినీ, అర్చన ఫోటోనూ మార్చి మార్చి చూసింది మాధవి.

మాధవి మనసంతా అర్చన జ్ఞాపకాలతో నిండిపోయింది. 

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

త్యాగ ఫలితం...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి