5, జనవరి 2023, గురువారం

వాగుడుకాయ...(కథ)

 

                                                                                        వాగుడుకాయ                                                                                                                                                                                   (కథ)

చక్రధర్ ఎప్పుడు చూడూ ఏదో ఒకటి వాగుతునే ఉంటాడు. ఎవరు పలకరించినా, పలకరించకపోయినా అతనే ఏదో ఒక టాపిక్ ఓపన్ చేసి వాగుతూనే ఉంటాడు. అవతలి వాళ్ళు తాను మాట్లేడిది వింటున్నారా, లేదా అని పట్టించుకోడు.

 అందుకని అతనికి తెలుసున్న అందరూ అతనికి వాగుడుకాయ అని పేరు పెట్టారు.

అందరూ అతన్ని వాగుడుకాయ అని వెక్కిరిస్తున్నారని చక్రధర్ కు తెలిసినా దాన్ని పట్టిచుకోకుండా, సిగ్గులేకుండా, అవతలి వారు విసుకున్నా ఆపకుండా వాగుతున్నే ఉంటాడు. ఒక్కోసారి చక్రధర్ వస్తున్నాడని తెలిస్తేనే, చాలా మంది అతన్ని తప్పించుకుని పారిపోతారు.

అతనికి కూడా తెలుసు అతన్ని అందరూ విసుకుంటున్నారని,  వెక్కిరిస్తున్నారని, అతన్ని చూసి తప్పుకుంటున్నారని. కానీ, అతను వాగటాన్ని ఆపలేడు....ఎందుకంటే దానికి ఒక బలమైన కారణం ఉంది.

ఎందుకని చక్రధర్ ఎప్పుడూ వాగుతునే ఉంటాడు? అందరూ తనని వెక్కిరిస్తున్న, విసుక్కుంటున్న ఎందుకు వాగటాన్ని ఆపలేకపోతున్నాడు?  అతను వాగటం ఆపలేకపోవటనికి వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటి? ......తెలుసుకోవాలంటే ఎమోషనల్ కథ చదవాల్సిందే:

ప్రయాణీకుల చూపంతా అతనిపైనే పడింది.

బస్సు బయలుదేరుతున్నట్టు చూపించటానికి బస్సు డ్రైవర్ బస్సును ఒక్కసారిగా కుదిపి, వేగంగా బస్సును బస్ స్టేషన్ బయటకు తీసుకు వచ్చి రోడ్డు పక్కన ఆపాడు. దానికే అరగంట పట్టింది. అది కూడా బస్సు వెనుక అదే రూటులో వెళ్ళే మరో బస్సు హారన్ మోత బస్సు డ్రైవర్ను కదలమని చెప్పటంతో.

బస్సులో సీట్లను నింపటానికి ఇదొక ఎత్తు. చివరి క్షణాన్న వేగంగా పరిగెత్తుకు వచ్చి ఎక్కి కూర్చున్న అతనే చక్రధర్. వచ్చి కూర్చున్న దగ్గర నుండి ఒకటే వాగుడు. అందుకే ప్రయాణీకుల చూపంతా అతనిపైనే పడింది.

"రైలు ప్రయాణం కంటే బస్సు ప్రయాణమే నాకు చాలా నచ్చుతుంది. దీనికి కారణాలన్నీ అడగకండి. కొన్ని కోరికలకు కారణం ఉండదు...కానీ నచ్చుతుంది"

"నేను మిమ్మల్ని అడగనే లేదే?" చక్రధర్ పక్కన కూర్చున్న ప్రయాణీకుడు అమాయకంగా అన్నాడు.

"గుడ్ జోక్..." అంటూ చక్రధర్ నవ్వుకుంటూ, ఖాలీగా కనబడ్డ మరో సీటుకు వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కూడా ఒక ప్రయాణీకుడు కూర్చోనున్నాడు. అతను కూడా అమాయకుడే. ఎందుకంటే చక్రధర్ వాగుడును భరించాలిగా.

"సార్...ఎవర్ని చూసినా చాలా రోజుల పరిచయం ఉన్నవాడిలా చనువు తీసుకుని మాట్లాడటం మొదలుపెడతాడు చక్రధర్..."

"ఎవరండీ చక్రధర్...?"

"నేనే నండి" అంటూ చక్రధర్ పగలబడి నవ్వటంతో ప్రయాణీకుని ముఖం వాడిపోయింది.

చక్రధర్ అలా బస్సులో ఖాలీగా ఉన్న సీట్లను ఆక్రమించి, పక్కన కూర్చున్న ప్రయాణీకులను తన వాగుడుతో విసిగించటంలో ఆరితేరిన మనిషి. అతని దగ్గర నుండి తప్పించుకోవటానికి అందరూ తలో ట్రిక్కూ వేయాల్సి వస్తోంది.

ఒకరు పాటలు వింటున్నట్టు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నాటకమాడితే, కొందరు అప్పుడే సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాటకమాడుతున్నారు. మాట్లాడటానికి పక్కన మనిషి ఉన్నాడా అన్నది మాత్రమే చూస్తాడు చక్రధర్. పక్కతను తన మాటలు వింటున్నాడా, లేదా అన్నది అతనికి అనవసరం.

రఘుపతికి పక్కవారి మాటల నుండి తప్పించుకోవటానికి నిద్రపోతున్నట్టు ఫోజు పెట్టటం అలవాటు. చాలామందికి పక్క ప్రయాణీకుల వాగుడు నుండి తప్పించుకోవటానికి నిద్ర ఫోజు చాలా ఉపయోగకరమైన ఆయుధం.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వాగుడుకాయ...(కథ)@ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి