18, జనవరి 2023, బుధవారం

నిద్రలేని రాత్రులు…(పూర్తి నవల)


                                                                                   నిద్రలేని రాత్రులు                                                                                                                                                                         (పూర్తి నవల) 

కష్టాలు శాశ్వతం కావుక్షణకాలం కష్టాలకు కుమిలి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికోసం నిజ జీవత గాధ ఆదర్శం కాగలదు.

మానవుడు తల్లి-తండ్రుల ధర్మాలకు అణుగుణంగా నడుచుకుంటే అతనిపై దేవుని యొక్క కృప ఉంటుంది. కానీ ఎప్పుడైతే అతడు దేవుని యొక్క ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడో అతనికి జీవితం లో కష్టాలు మొదలవుతాయి.

కొన్ని రకాల కష్టాలకు మానవుని యొక్క ప్రవర్తనే కారణంగా ఉంటుంది.. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం బహుశా వారు  దారికి తిరిగి రావచ్చేమోనని కూడా విధంగా జరిగుండచ్చు. 

మానవుని చర్యలు మరియు అతని బాహ్యప్రపంచానికి మధ్య లోతైన సంబంధం ఉంది.

 కష్టాలు వస్తున్నాయి అంటే కాలం పరిక్షిస్తోందని అర్థం. ఇంకేదో మంచి జరగబోతోందని అర్ధం. వాటిని ఎదురుకొని.. పరిష్కరించుకోవాలి. అంతేగాని బాధపడుతూ కష్టాలకు కారణాలను వెతక కూడదు.

నవలలోని నాయకురాలు సౌందర్య, తన సొంత ప్రవర్తన కారణంగా కష్టాల పాలవుతుంది. కష్టాలకు కుమిలి పోయి ఆత్మహత్య చేసుకోవటానికి పూనుకుంటుంది.

సమయంలో నవలలోని నాయకుడు అనిల్, ఆమెను కాపాడి వేరే దారిలేక తనతో పాటూ తన గదికి తీసుకు వెడతాడు. రోజు నుండే వాళ్ళిద్దరికీ నిద్రలేని రాత్రులు మొదలవుతాయి.

..........వాళ్ళిద్దరికీ నిద్రలేని రాత్రులు ఎప్పుడు ముగిసింది? సౌందర్య ప్రవర్తన వలన కష్టాలకు కుమిలిపోయి ఆత్మహత్యకు పూనుకుంటుంది?

 తనకు ఎటువంటి సంబంధమూ లేని ఒక అమ్మాయిని కాపాడి నిద్రలేని రాత్రులను అనిల్ ఎందుకు కొని తెచ్చుకున్నాడు? వీటన్నిటికీ సమాధానం నవల మీకు అందిస్తుంది.

మౌలాలి రైలు స్టేషన్.

హడావిడికి, ఆందోళనకూ కరువు లేని చోటు. రోజూ ఎన్నో సిటీ రైల్లు వచ్చి వెడతాయి. మధ్యలో సూపర్ ఫాస్ట్ రైళ్ళు కూడా వెల్తాయి. ఎంతమంది వచ్చి వెళ్ళినా, ఎంత మంది ప్లాట్ ఫారం మీద నిలబడున్నా అక్కడ హడావిడి మాత్రమే కనబడుతుంది తప్ప ఎక్కువ శబ్ధం ఉండదు.

టికెట్టు కౌంటర్ దగ్గర టికెట్టు కొసం ఒక రైలు పొడవంత క్యూఉంటుంది. ప్లాట్ ఫారం మీద కాచుకోనున్న ప్రయాణీకులలో కొందరు రైలులో సీటు దొరకాలనే ఆశతో అటూ, ఇటూ తిరుగుతూ ఉంటారు. రైలు వచ్చిన వెంటనే పెట్టి ఖలీగా కనబడుతుందో అందులో ఎక్కేయాలనిప్లాట్ ఫారం మీద వ్యాపారుల కేకలు వినబడతాయి. బిచ్చగాళ్ళ గొంతుకలు అప్పుడప్పుడు వినబడతాయి.

కాలేజీ విధ్యార్ధీ-విధ్యార్ధినులు వస్తే... వాళ్ళ కేరింతలూ, మాటలూ అక్కడున్న వారిని మైమరిపిస్తాయి. ఇప్పుడు అక్కడొక ఆత్మహత్య జరుగబోతోంది.

అదిగో ప్లాట్ ఫారం చివర నేల మీద కూర్చోనుందే...ఆమే, రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకోబోతోంది. ఆమె మాత్రమే కాదు -- ఆమెతో పాటూ ఆమె ఒక వయసు కూతురూ ప్రాణం వదలబోతోంది.

ఆమెను చూసిన వెంటనే...తట్టుకోలేని కష్టాలను అనుభవించి అక్కడికి వచ్చినట్టు ఊహించలేము. ఏడ్చి, ఏడ్చి కన్నీరు ఎండిపోయిన కళ్ళల్లో, ఆమె ఆలొచించి తీసుకున్న ఆ నిర్ణయం కనిపించదు.

బిడ్డకు ఆకలేమో...? ఏడుస్తునే ఉన్నది.

ఇదిగో మన సమస్యలన్నీ ముగియబోతున్నాయిఅన్నట్టు బిడ్డను సమాధాన పరుస్తోంది.

అదిగో... సూపర్ ఫాస్ట్ రైలు వస్తోంది.

ఆమె పడ్డ బాధలన్నిటి నుండి విడుదల...ఇదిగో వేగంగా వస్తున్నది.

బిడ్డతో పాటూ తడబడుతూ లేచి నడిచి ప్లాట్ ఫారం చివరకు వెళ్ళి అంచులో నిలబడింది. బిడ్డను గట్టిగా గుండెలకు హత్తుకుని పుచ్చుకుంది.

ప్రమాదమైన పరిస్థితిలో ఆమె నిలబడుండటం చూసిన రైలు డ్రైవర్, పెద్దగా హారన్ మోగిస్తూ వస్తున్నాడు. ఇంజెన్ కు బయట తల పెట్టి జరిగి వెళ్ళుఅనేలాగా చేతితో సైగ చేస్తున్నాడు.

చోటును దాటుకుంటూ వెడుతున్న ప్రయాణీకులు కొందరు, జరగబోవు విపరీతాన్ని గ్రహించినట్టు...ఆమెను చూసి వెనక్కిరాఅని అరిచారు.

కానీ, ఆమె జరిగేటట్టు లేదు.

వేగంగా వస్తున్న రైలును ఇంతవరకు ఇంత దగ్గరగా చూడని ఆమె మొహంలో మరణ భయం కనబడటం మొదలైయ్యింది.

తనని తాను మరచి కేకలు పెట్టింది. బిడ్డ కూడా భయంతో గట్టిగా ఏడ్చింది.

ఇదిగో కొద్ది క్షణాలలో.

రైలు ముందుకు దూకి అదే చోట ప్రాణం వదల బోతారు. మరణ భయం వణుకు అమెలో వ్యాపిస్తోంది. బిడ్డ ఏడుపు పెద్ద దయ్యింది.

కానీ, ఆమె చోటు నుండి జరిగేటట్టు కనిపించలేదు.

అప్పుడు...

ఒక చేయి ఆమెను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగింది. మరణం యొక్క ఘోరమైన పిడి నుండి తప్పించుకుంది. అతనిపై స్ప్రుహ తప్పి వాలిపోవటం గ్రహించింది.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నిద్రలేని రాత్రులు…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి