29, జనవరి 2023, ఆదివారం

పదిహేడవ అల…(సీరియల్)..(PART-2)


                                                                             పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                 (PART-2) 

వైజాగ్ బస్ స్టేషన్.

అక్షర...తెనాలి వెళ్ళటానికి, భార్గవ్...విజయవాడ వెళ్లటానికి తయారుగా వచ్చారు.

అక్షరా! రోజు పదిహేడవ అలమాత్రం మన కాళ్ళ దగ్గరకు రాకుండా వెళ్ళిపోయుంటే నువ్వేం చేసేదానివి?”

ఆమె పరిహాసంగా నవ్వింది. ఏం చేసుంటాను...? మన ప్రేమకు ఒక టాటా చూపించి, హాయిగా వెళ్ళిపోయే దానిని

రాక్షసీ... -- దొంగ కోపం చూపించాడు.

అంతర్జాతీయ క్వాలిటీతో విస్తారంగా ఉన్నది వైజాగ బస్ స్టేషన్. ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ ఖరీదు చేసే ఇడ్లీ, బజ్జీ, వడ. అయినా రెస్టారెంట్లో జనం ఈగల్లా మూగుతున్నారు. వరుస క్రమంలో ఒకదాని వెనుక ఒకటి ముఖ్య సిటీలకు వెళ్ళే ప్రభుత్వ బస్సులు. వాటిలో ప్రయాణం చేయటానికి గుంపులు గుంపులుగా వస్తున్న పబ్లిక్. వాళ్ళిద్దరూ గోలలో ఉండి కుదిరినంతవరకు దూరంగా నిలబడి మాట్లాడుకున్నారు.

అక్షర అడిగింది, “ఏమండీ...మీ అమ్మా-నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటారా?”

అంత సులభంగా ఒప్పుకోరు. మనం వేరువేరు కులం అనేది పెద్ద సమస్యగానే ఉంటుంది. నేను చాలా మొండిగా, పట్టుదలపట్టి, ఒత్తిడి చేసే ఒప్పుకునేటట్టు చేయగలను అనుకుంటున్నా. సరే, మీ ఇంట్లో ఏం చెబుతారు?”

మా అమ్మ ఒక అమాయకురాలు. నేను ఏది చెప్పినా సరే అని చెప్పేస్తుంది. నాన్నే కొంచం హడావిడి చేస్తారు...పాత ఆచారాలలో ఉరిపోయారు. నేను కులం కాని కులంలో పెళ్ళిచేసుకుంటే నా చెల్లెలు ప్రియాను ఎవరు పెళ్ళి చేసుకుంటారు అని ఆందోళన చెందుతారు

ఆయన్ని ఆందోళన చెందవద్దని చెప్పు! మీ చెల్లెల్ని కూడా నేనే చేసుకుంటా

అక్షర మొహం ఎర్రబడింది. గబుక్కున తల తిప్పేసుకుంది. భార్గవ్ కొద్దిగా  భయపడ్డాడు.

సారీ. నేను సరదాగా మాట్లాడాను...

సరదగా కూడా ఏదీ మాట్లాడ కూడదు! మన నోటి నుండి వచ్చే ఒక్కో మాటకీ శక్తి ఉందని మా నాన్న చెబుతారు

ఆమె ఆందోళనను చెదరగొట్టటానికి...మాట మార్చాడు.

...నీ దగ్గర అడగాలనుకుంటూ వుంటాను. కానీ మర్చిపోతాను. అవునూ...తెనాలిలో మీరు ఎక్కడుంటారు?”

కొండవారి వీధిలో ఉన్నాం...

అంతపెద్ద సిటిలో ఇల్లే దొరకలేదా?”

కొండవారి వీధి అనేది తెనాలిలో ఒక ఫేమస్ రోడ్డు

పెద్ద తో నవ్వాడు. సమాధానంగా ఆమె కూడా నవ్వింది.

తెనాలి వెళ్ళాల్సిన బస్సు వచ్చింది. ఆమె ఎక్కే ముందు చెప్పాడు. మీ నాన్న ఏం సమాధానం చెప్పారో ఫోను చేసి చెప్పు

నాన్నా, నేను, భార్గవ్ అనే ఒకర్ని ప్రేమిస్తున్నాను. విషయాన్ని మీ దగ్గర చెప్పి, మీ అంగీకారాన్ని అడగటానికే ఊరికి వచ్చాను

ఎదురుగా ఉన్న డ్రస్సింగ్ టేబుల్ కు అమర్చబడ్డ నిలువెత్తు అద్దంలో తన మొహాన్ని చూస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పి చూసుకుంది అక్షర. చోటు: తెనాలిలో ఉన్న ఇంట్లోని సపరేట్ గది.

అప్పుడే స్నానం చేసి ముగించింది. తడితో ఉన్న లంగాను ఛాతి వరకు లాగి  కట్టుకోనున్నది. తల వెంట్రుకల నుండి బొట్లు బొట్లుగా పడుతున్న నీటి బిందువులను తుండుతో దులుపుకుంటోంది. రోజు తెల్లవారు జామున ఇంటికి వచ్చి చేరిన దగ్గర నుండి...తానొచ్చిన కారణాన్ని తండ్రి దగ్గర ఎలా చెప్పాలి అనే ఆందోళన లోపల పరిగెత్తుతున్నది.

వంట గదిలో నుండి అమ్మ రెడీ చేస్తున్న స్వీటు వాసన గాలిలో కలిసొచ్చి నసాలాన్ని తాకింది. దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి నుండి వస్తున్న భక్తి గీతాలను వింటోంది. పాటల ధ్వని మధ్యలో హాలులో ఉన్న టీవీలో ప్రసారమవుతున్న రోజు రాశి ఫలాలుమాత్రం ఆమె చెవులకు క్లియర్ గా వినబడుతోంది. అందులోనూ ఆమె రాశికైన ఫలను:

కుంబరాశి ప్రేక్షకుల్లారా... ధనిష్ట నక్షత్రంలో పుట్టిన మీరు అనుకున్న కార్యం విజయవంతమవుతుంది. బంధువులు మీకు అనుసరణగా నడుచుకుంటారు. పెళ్ళికాని యుక్త వయసు ఆడపిల్లలకు వరుడు దొరుకుతాడు. రోజు మీకు అదృష్టం ఇచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట అంకె ఏడు

అక్షర ఒక్క క్షణంలో నార్మల్ కు వచ్చింది. రోజువారీ క్యాలండర్ చూసింది. తారీఖు ఏడు. అదృష్టమైన అంకే! అదృష్టమైన రంగు ఆకుపచ్చ...? హడావిడిగా బీరువా తెరిచింది.

పలు రంగులలో చీరలు. చుడీ దారులు...ఇదిగో ఆకుపచ్చ రంగు చీర. దానికి మ్యాచింగు గా డార్క్ ఆకుపచ్చ రంగులో జాకెట్టు వెతికి తీసుకుంది.

దుస్తులు వేసుకుని గది తలుపులు తెరిచినప్పుడు.

అక్కా అంటూ ఉత్సాహంతో పరిగెత్తుకు వచ్చింది అబి అని పిలువుబడే అభయ.

అబీ... -- చెల్లెల్ని అమాంతం కౌగలించుకుంది.

ఎప్పుడక్కా వచ్చావు?”

తెల్లరు జామున ఐదంటికి వచ్చాను. బస్ స్టేషన్ నుండి నాన్న టూ వీలర్లో తీసుకు వచ్చారు. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు

అక్షర ఒక విధమైన అందం అయితే... అభయ ఇంకోరకంగా అందం. తామర  పువ్వు, రోజా పువ్వూ రెండూ అందంగా ఉన్నట్టే! ఇద్దరూ వాళ్ళ తల్లిలాగా ఎర్ర రంగులో ఉన్నారు. అభయ ఎప్పుడూ అక్కయకు ముద్దు.

ఏమిటే...ఇంతసేపూ నిద్రపోయావా?”

కాలేజీ రికార్డు బోలెడు రాయవలసి వచ్చిందక్కా. రాత్రి చాలాసేపు మెలుకువగా ఉన్నాను

ఏమే...ఈరోజు సెలవు రోజే కదా? పొద్దున రాయచ్చు కదా?”

అక్కా. పొద్దున నువ్వు వచ్చేస్తావు...పగలంతా నీతో మాట్లాడుతూ ఉందామని రాత్రే పూర్తి చేసేశాను

అక్షర గబుక్కున కన్నీరు పెట్టుకుంది. మాటి మాటికి చెల్లెలితో మాట్లాడుతున్నా, ఇలా నేరుగా కలుసుకోవటానికి అది సరి అవుతుందా?

అమ్మ అన్నపూర్ణ లోపలకు వచ్చింది. స్నానం చేసేవా అక్షరా. నీకు ఇష్టమని పెసరట్టు, ఉప్మా, అల్లం పచ్చడీ చేసాను. రా...వచ్చి తిను

ఇదే తల్లి...కాలేజీలో చేరటానికి అక్షరా విశాఖపట్నం బయలుదేరేటప్పుడు ఏడ్చింది. కారణం, కుటుంబమే ఆమె లోకం.

సొంత ఇంట్లోనే తనని బంధువులాగా మర్యాద చేయటం ఇబ్బందిగా ఉన్నది అక్షరాకి. మౌనంగా అమ్మతో పాటూ తినటానికి వెళ్ళింది.

టిఫెన్ తిన్న తరువాత...తండ్రి ఉన్న హాలులోకి తొంగి చూసింది. శ్రీనివాసమూర్తి, ముక్కు మీదకు జారుతున్న కళ్ళద్దాలను పైకి తోసుకుని, దినపత్రిక చదువుకుంటున్నారు. ఏనుగు రంగు నలుపులో ప్యాంటూ, తెల్ల చొక్కా, నుదిటి మీద  చిన్నదిగా విభూతి గీత. దాని మధ్యలో కుంకుమ.

అక్షరా ఎప్పుడూ తండ్రితో బిడియం లేకుండా మాట్లాడుతుంది. కానీ, ఇప్పుడు హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్ళే స్కూలు పిల్లలా భయంతో వెళ్ళింది.

నాన్నా

తలెత్తారు. రా... అక్షరా...టిఫిన్ తిన్నావా?” ప్రేమగా వచ్చింది ప్రశ్న.

తిన్నా నాన్నా

నీ చదువు ఎలా వెడుతున్నది?”

సెమిస్టర్లోనూ అన్ని సబ్జెక్ట్స్ లలోనూ మంచి మార్కులుతెచ్చుకున్నా నాన్నా... అని తడబడుతూ చెప్పిన అక్షరాని ప్రశ్నార్ధకంగా చూసారు.

కాలేజీకి డబ్బులేమన్నా కట్టాలామ్మా?”

అదేం లేదు నాన్నా...మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి

శ్రీనివాసమూర్తి యొక్క మొహంలో మార్పు.

ఏమిటి అక్షరా...చెప్పు అంటూ ఆమెను లోతుగా చూసారు.

లంకణాలు చేసిన దానికి లాగా మొహం మాడిపోయింది. గొంతు బొంగురు పోయినట్టు చిన్న స్వరంతో మాట్లాడింది.

నాన్నా...నేను భార్గవ్ అని ఒకర్ని... -- పలుసార్లు మనసులో ప్రాక్టీస్ చేసి చూసుకున్నా...మాటలు అంతకు మించి రావటానికి నిరాకరించాయి.

ఏమిటి...?” అన్నారు తండ్రి కొంచం గట్టిగా.

నాన్నా...నేను భార్గవ్ అనే ఒకర్ని ప్రేమిస్తున్నాను -- బహిరంగంగా చెప్పేసింది.

షాక్ తిన్న తండ్రి చేతిలోని న్యూస్ పేపర్ జారిపోయింది. ఆయన స్వరం పిడుగు పడిన శబ్ధంతో వచ్చింది. 

బుద్దుందా నీకు? నిన్ను చదువుకోవటానికి పంపానా...లేక ప్రేమించటానికి పంపానా?”

అక్షరా వణికిపోయింది. ఇలాంటి ఒక పిడుగులాంటి అరుపు ఆమె ఎదురు చూడలేదు. కళ్ళల్లో నుండి ధారగా నీళ్ళు కారినై. ఇంతలో తండ్రి యొక్క అరుపు విని లోపలున్న అన్నపూర్ణ, అభయ వచ్చాశారు. అక్షరా, తల్లి భుజాల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది.

ఏమిటి...ఇలా ఏడుస్తోంది? మీరేమైనా తిట్టారా?” -- ఆందోళన చెందింది అన్నపూర్ణ.

ప్రశ్నకు జవాబు చెప్పకుండానే కూతుర్ని చూసి కోపంగా అడిగారు.

ఎవరే అబ్బాయి...కాలేజీలో నీతో చదువుతున్నాడా?”

లేదు నాన్నా...ఆయనది విజయవాడ. వైజాగ్ లో ఒక కంపెనీలో డిప్యూటీ  మేనేజర్ గా పనిచేస్తున్నారు

అతను కులం?”

అది కూడా చెప్పటంతో, ఆయన మొహం మరింత ఎర్ర బడింది.

ప్రేమించుకోవటంతో ఆపాసారా? లేక రిజిస్టర్ మ్యారేజీ చేసేసుకున్నారా?”

జవాబు చెప్పటానికి ఆమెకు నాలిక తిరగలేదు. ఏడుపే పొంగుకు వచ్చింది. ఆమెతో పాటూ ఆమె తల్లీ, చెల్లీ కళ్ళు నలుపుకున్నారు.

అంతకంటే ఇంకేమీ మాట్లాడకుండా తండ్రి శ్రీనివాసమూర్తి మొహం తిప్పుకున్నారు.

అన్నపూర్ణ అక్షరాని హాలులో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి నిదానంగా విచారించటం మొదలుపెట్టింది.

భార్గవ్ ను కలుసుకున్న విధం మరియు ప్రేమ గురించిన మిగిలిన సమాచారం అక్షరా మాటలతో బ్రీఫ్ గా వచ్చినై.

ఏమిటే ఇలా చేసేసావు?”  అని గొనుక్కోవటం తప్ప అన్నపూర్ణకి ఇంకో దారి తెలియలేదు.

సముద్రంలో ప్రశాంతంగా పోతున్న పడవ, హఠాత్తుగా సుడిగాలిలో చిక్కుకున్నట్లు... అంతకు ముందు వరకు కుతూహలంగా ఉన్న కుటుంబం ఇప్పుడు కలతతో చిక్కుకుని పోయింది.

ఒక ప్రళయం వచ్చి అన్నిటినీ తలకిందలు చేసినట్టుంది భార్గవ్ ఇల్లు.

మిగిలిన వస్తువులన్నీ అలాగే ఉన్నాయి...మనుషుల హృదయాలు మాత్రమే దెబ్బతిని ఉన్నాయి.

భార్గవ్ తల్లి ప్రభావతి ఒక పక్క కూర్చుని ఏడుస్తున్నది. తండ్రి ప్రకాష్ రావ్ ఇంకో పక్క కోపంతో మొహం తిప్పుకుని ఉన్నారు.

మధ్యలో భార్గవ్, ‘వాళ్లను ఎలా సమాధాన పరచాలి?’ అనేది తెలియక  నిలబడున్నాడు.

మన కులం ప్రజలలోనే ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్ళి చేద్దామని ఎంత ఆశగా ఉన్నానో తెలుసా?” పొంగుకు వస్తున్న కన్నీటిని చీరకొంగుతో తుడుచుకుంటూ మాట్లాడింది తల్లి.

కులం కంటే కూడా మనసుకు నచ్చిన అమ్మాయే కదమ్మా ముఖ్యం?” -- కొడుకు వివరణ ఇస్తున్నప్పుడు తండ్రి అడ్డుపడి గట్టిగా అరిచాడు.

ఇలా చూడరా! కన్న తల్లీ-తండ్రీ కావాలంటే మేము చెప్పింది చెయ్యి. లేకపోతే మా మొహానికే కనబడకు...అలాగే తిరిగి వెళ్ళిపో 

కన్న కొడుకు కంటే మీకు కులగౌరవం ఎక్కువైపోయింది...అంతే కదా?” -- అని కోపంగా అడిగిన భార్గవ్, తన సూట్ కేసును తీసుకు వచ్చి సోఫా మీదపెట్టి, బయట ఆరేసిన తన ప్యాంటూ - షర్టులను మడతపెట్టి అందులో పెట్టుకోవటం మొదలుపెట్టాడు.

అతను చేస్తున్నది ఓరకంటితో గమనిస్తున్నది అతని తల్లి.

ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్ల మీద వెలుగుతున్న సిగ్నల్లైట్లను చూసుంటారు! మొదట ఎర్ర లైటు...మనల్ని అడ్డగించి ఆపుతుంది. తరువాత ఆరెంజి...తయారుచేస్తుంది. చివరగా పచ్చ రంగు లైటు...బయలుదేర మంటుంది.

ఒక కొత్త విషయం వచ్చినప్పుడు మనిషి మనసు కూడా ఇదే వరుసక్రమంలో పనిచేస్తుంది. మొదట అపోజ్ చేస్తుంది, తరువాత ఆలొచిస్తుంది, ముగింపులో అంగీకరిస్తుంది!

గట్టి ఆలొచన తరువాత శ్రీనివాసమూర్తి...భార్యను పిలిచి పూర్ణా, దాన్ని ఇక్కడకు రమ్మని చెప్పు అన్నారు.

అక్షరా కన్నీటిని తుడుచుకుంటూ తండ్రి ఎదురుగా వెళ్ళి నిలబడింది.

నువ్వు ఇంకో కులానికి చెందిన వాడిని ప్రేమిస్తున్నావు. అతనెవరో, ఎలాంటి  గుణం ఉన్నవాడో...నాకు తెలియదు. మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటే ఇదే విధంగా కలిసి జీవితాంతం జీవిస్తారా అనేదీ తెలియదు. అందువల్ల ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను

దఢ దఢ మని కొట్టుకుంటున్న ఆమె గుండె శబ్ధం ఆమెకే బాగా వినబడుతోంది.

తండ్రి కొనసాగించాడు. భార్గవ్ యొక్క జాతకాన్ని తీసుకురా. మీ ఇద్దరి జాతకాలనూ మన రెగులర్ జ్యోతిష్కుడు దగ్గర  చూపించి....ఇద్దరికీ జాతకం కలిసిందా, మీ భవిష్యత్తు బాగా ఉంటుందా? అని అడుగుదాం. జాతకం కలిస్తే  పెళ్ళి జరుపుదాం. లేదంటే నువ్వు ప్రేమను మరిచిపోవలసిందే

చెప్పిన మరు క్షణం శ్రీనివాసమూర్తి లేచి వెళ్ళిపోయారు.

కొన్ని సార్లు ఎండ ఉన్నప్పుడు వర్షం పడుతుంది. అదేలాగా సగం సంతోషం, సగం బాధతో నిలబడింది అక్షరా. తండ్రి చెప్పిన మాటలు ఆమె చుట్టూ తిరిగుతూ రీ సౌండుగా వినబడ్డాయి.

జాతకం కలిస్తే పెళ్ళి!

                                                                                                             Continued...PART-3

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి