18, జనవరి 2023, బుధవారం

అక్షయ పాత్ర…(సీరియల్)..(PART-8)

 

                                                                               అక్షయ పాత్ర…(సీరియల్)                                                                                                                                                                      (PART-8)

ఖచ్చితంగా బయలుదేరటానికి రెండు గంటల ముందు అది జరిగింది. తన బ్రీఫ్ కేసులో కొన్ని ఫైళ్ళను పెట్టుకుంటున్న తండ్రి హఠాత్తుగా తలని రెండు చేతులతో పట్టుకున్నారు. పేపర్ చదువుతున్న గోపీ ఆందోళనతో లేచాడు.

ఏమైంది నాన్నా?”

తల...తలనొప్పి పుడుతోందిరా గోపీ... గొణిగిన ఆయన అలాగే జారి కింద పడ్డారు.

అమ్మా...పరిగెత్తుకురా గోపీ అరుస్తూనే ఆయన్ని గట్టిగా పుచ్చుకుని ఒడిలో పడుకోబెట్టుకున్నాడు.

ఏమిట్రా గోపీ...నాన్నకేమయిందిరా?”

తల్లి ఆందోళనతో వణుకుతూ ఆయన్ని కదిలించింది. తట్టుకోలేక ఏడుపు మొదలు పెట్టింది. గోపీ తన సెల్ ఫోన్ ద్వారా డాక్టర్ను కాంటక్ట్ చేసాడు.  తరువాతి ఐదో నిమిషం ఆంబులాన్స్ రాగా తండ్రి వెంటనే ఆసుపత్రిలో చేర్చబడ్డారు. వరుసగా పరిశోధనలు.

సారీ గోపీ. ఇది బ్రయిన్ హెమోరేజ్! మీ నాన్న ఇప్పుడు కోమాలో ఉన్నారు. మావల్ల చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. నమ్మకంగా ఉండండి  డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. గోపీ కృంగిపోయి కూర్చున్నాడు.  

కోమానా? నాన్నకా? ఎలా రాగలదు? ఆయన ఎవరికి ఏం ద్రోహం చేసారు? ఆయన చెప్పినట్టు దేవుడికి ఈర్ష్య వచ్చిందా..? లేక సంతోషం ఎక్కువైనప్పుడు పరీక్షలూ  ఎదురవుతాయి అనే జీవిత విధి వలన వచ్చిన కష్టమా?’

చెప్పలేనంత దుఃఖంతో తండ్రి దగ్గరే కూర్చున్నాడు. డాక్టర్లు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు.

ఇక ఇక్కడ ఉంచుకోవటంలో అర్ధంలేదు మిస్టర్ గోపీ, అనవసరమైన ఖర్చు.  ఇంటికి తీసుకు వెళ్ళిపొండి. ఒక నర్సును పెట్టుకుని ఆయన్ను చూసుకోండి. ధైర్యాన్ని వదిలేయకుండా దేవుడి దగ్గర వేడుకోండి. ఆయన మనసు పెడితే ఒక్క క్షణమే. మీ నాన్న ఇంతకూ ముందులాగానే గంభీరంగా తిరుగుతారు

డాక్టర్ దేవుడ్ని నమ్ముకోమని చెప్పి మందుల చీటీ రాసిచ్చి పంపారు. గోపీ అమ్మతో మాట్లాడాడు.

తండ్రి యొక్క గది ఒక చిన్న ఆసుపత్రి అయ్యింది. ఆయన్ని గమనించుకోవటానికి ఒక నర్సును కూడా ఏర్పాటు చేసాడు. రెండు రోజులకు ఒకసారి డాక్టర్ వచ్చి చూసి వెళ్తున్నాడు. తండ్రి పరిస్థితి తల్లిని నడిచే శవంగా మార్చింది. ఉద్యోగం నుండి కంపల్సరీ రిటైర్ మెంట్ తీసుకుని ఆయన దగ్గరే ఉన్నాడు గోపీ. తమ జీవితాలలో ఆశను చూపించి, ప్రస్తుతం స్ప్రుహలేని స్థితిలో  ఉన్న ఆయన్ని వెర్రిగా చూస్తున్నట్టు ఉన్నాడు. తండ్రి యొక్క వ్యాపారాన్ని గమనించుకోవలసిన బాధ్యత గోపీపై పడింది. ఆఫీసులోనూ, ఫ్యాక్టరీలోనూ కలిపి పనిచేస్తున్న రెండువందల మందీ తప్పు చేసే మనుషులుగా కనిపించటం లేదు. అంతమంది దగ్గరా గుణాలు వేరుగా ఉన్నా ఉద్యోగం చేసే చోట, ఉద్యోగంలో క్రమశిక్షణతో ఉన్నారు. అకౌంట్స్ తేటతెల్లగా ఉన్నాయి. అంతమందీ  తండ్రికోసం నిజాయితీగా కన్నీరు పెట్టుకున్నారు. గోపీకి ఆశ్చర్యంగా ఉన్నది.  తండ్రి ఏమన్నా మంత్రవాదా? ఇంతమంది ఉన్న చోట ఇంత క్రమశిక్షణ, నిజాయితీ, కరెక్టు లెక్కలూ ఆయన తీసుకురాగలిగారు! ఆయన లేక, గోపీ వలన చూసుకోలేని నెల రోజులలో ఒక చిన్న తప్పు కూడా జరగకపోవటం చూసిన అతను ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రెండువందల మంది ఉద్యోగస్తులనూ తన అభిమానంతో ఆయన కట్టి పడేసుంటారనే చెప్పాలి. తన ఆశ్చర్యాన్నికంపెనీ మేనేజర్ తో ఒకరోజు నోరువిప్పి మాట్లాడాడు.

కంపెనీ ఎలా నడుస్తున్నది అనుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఒక్కొక్కరికీ కంపెనీలో లాభంలో వాటా ఉంది. అందరూ వాటాదారులనే చెప్పొచ్చు. మీరు శ్రమపడితే అందులో ఇంత శాతం మీకే దొరుకుతుంది అని చెబితే, ఎవరు శ్రమ పడకుండా ఉంటారు? నోటి మాట మీద నిలబడటం మీ నాన్నకున్న మరొక బలం. సంవత్సరం చివర్లో లాభ-నష్టాల లెక్కల పుస్తకాన్ని అందరికీ తెరిచిన పుస్తకంలాగా చూపిస్తారు. వాళ్ళకు చేర వలసిన లాభాన్ని లెక్కవేసి ఒక్క పైసాకూడా బాకీ లేకుండా సెటిల్ చేస్తారు. బోనస్ గా రెండు నెలల జీతం కంటే వాటా లాభం రెండురెట్లు అధికంగానే ఉంటుంది. ఇది ఎవరి కంపెనీయో ఇక్కడ నేను సాధారణ ఉద్యోగస్తుడ్ని అనే మనోస్థితి ఇక్కడ ఎవరికీ ఉండదు. ఇది నా కంపెనీ. ఇందులో లాభం వస్తే నాకు వాటా ఉంది. ఇలాంటి ఆలొచనే వీళ్ళ నిజమైన శ్రమకు కారణం. మీ నాన్నగారి గుణం, నిజాయతీ, నోటి మాట, అభిమానం, అధికారం చూపించే తీరు--వీటన్నిటికీ ఇక్కడ అందరూ బానిస. ఇంకెక్కడ పనిచేసినా ఇలా వాటా లాభం, డబ్బు, మర్యాద, స్వతంత్రం దొరకదని అందరికీ తెలుసు. మొత్తానికి వాళ్ళకు ఇది వాళ్ళు పనిచేసే వాళ్ళ గుడిలాగా పెట్టుకున్నారనే చెప్పచ్చు. గుడిలో ఎవరైన ఉమ్మేస్తారా? గుడిలో శుభ్రంగా ఉండాలి, భక్తితో తన బాధ్యతను చేయాలి అనేది వాళ్లకు తెలుసు. అందువలన ఇక్కడున్న ఎవరికీ పర్యవేక్షణ అవసరంలేదు. మీరు గమనించినా, గమనించకపోయినా చోటు గుడిగానే ఉంటుంది 

మేనేజర్ చెబుతుంటే పరవసించిపోయాడు. నాన్న వలన మాత్రమే ఇలాంటి ఒక గుడిని సృష్టించటం కుదురుతుంది! ఎలాంటి గొప్ప మనిషి ఆయన? విధి మంచివాళ్ళను ఆరొగ్యంగా ఉండనివ్వదో?’ అని నిట్టూర్పు విడిచాడు.

తండ్రి యొక్క ముంబై కుటుంబ జ్ఞాపకం అప్పుడప్పుడు వచ్చినా వెంటనే ముంబైకి బయలుదేరటమే అతని వలన కుదరలేదు. పాపం! నాన్న రాలేదని వాళ్ళు ఎంత క్షొభ అనుభవిస్తున్నారో? ఖర్చులకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నయ్యో లేదో? ఒక లెటర్ రాసి డీడీ తీసి పంపితే ఏం?’ అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ నాన్న పరిస్థితి గురించి రాయకుండా ఉండలేము. ఒకవేల ఆయన్ని చూడాలని అనిపించి వాళ్ళు తమ కట్టుబాట్లను వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే అమ్మకు ఏమని చెప్పాలి? నిజం తెలిసి అమ్మ కుంగిపోతే...? వద్దు. ప్రస్తుతం మాట్లాడకుండా ఉండటం మంచిది. నాన్న కచ్చితంగా కోలుకుంటారు. అన్నిటినీ ఆయన చూసుకుంటారు

అతను నమ్మకంతో రోజులు గడిపాడు. కానీ తండ్రి ఆరొగ్యం రోజు రోజుకూ  క్షీణిస్తోందే తప్ప, కోలుకునే గుర్తులు ఏవీ కనబడలేదు.

నాలుగు నెలల పోరాటానికి తరువాత ఒక రోజు ఆయన ప్రాణం అనిగిపోయింది. తన ప్రాణమూ పోయినట్లు అమ్మ కూడా స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. ఆమె నోరు విప్పి ఏడవటానికి మూడురోజులు పట్టింది. అది కూడా అందరూ చెప్పగా, చెప్పగా మూడోరోజు గుండెపగిలి ఏడ్చింది. అలా ఆమె దుఃఖం బయటపడిన తరువాతే ఆమె గురించిన ఆందోళన తగ్గింది గోపీకి.

తండ్రి చనిపోయిన ఎనిమిదో రోజు వచ్చి నిలబడ్డ తులసిని మొదట్లో అతను ఎవరో అనే అనుకున్నాడు. ఆమె మాట్లాడిన తరువాతే ఒకవేల ఈమే తులసినా అనే అనుమానం ఏర్పడింది. లోతుగా చూస్తే ఆమె ముఖంలో తండ్రి పోలికలు కనిపించినై. అదే సమయం ఆమె తన పేరు చెప్ప, అతను ఆమెతో ఇంకా మాట్లాడాలనుకుంటున్నప్పుడు తల్లి వచ్చింది. తల్లి ఎదురుగా మాట్లాడలేక పోయేసరికి బాధతో ఆమె వెళ్ళిపోవటం మాత్రమే చూడగలిగాడు అతను. తండ్రి కార్యాలు పూర్తి అయ్యేంత వరకు బయటకు వెళ్లకూడదనే కట్టుబాటు అతన్ని కట్టిపడేసింది. ఒక విధంగా అన్ని కార్యాలు ముగిసేటప్పుడు సరిగ్గా తరువాత నెల రెండవ వారం ప్రారంభమయ్యింది. తండ్రి మామూలుగా ముంబై వెళ్ళే రోజు. అంతకంటే అతను ఉండలేకపోయాడు. తండ్రిలాగానే వ్యాపార రీత్యా వెళుతున్నట్టు కారణం చెప్పి అతనూ ముంబైకు విమానం ఎక్కాడు. అడ్రస్సు కనుక్కుని ఇంటి కాలింగ్ బెల్ కొట్టి, దఢ, దఢ మంటున్న గుండెతో కాచుకున్నాడు.

                                                                           *************************

వాళ్ళూ అతన్ని నమ్మలేని ఆశ్చర్యంతో చూసారు. నీరజ యొక్క చూపులు తండ్రి యొక్క ఫోటోవైపుకు, అతని ముఖం వైపుకు మారి మారి వెళ్ళినై.

గోపీనే కదా?” అడిగిన ఆమె స్వరం వణికింది.

అతను నమస్కరించాడు.

పరవాలేదే! గుర్తు పట్టేసేరే?”

నువ్వు...ఇక్కడికెలా?” తల్లి చూపులు అతని వెనుక వైపుకు, ఇంకా ఎవరైనా వస్తున్నారా అని చూసింది.

నేను మాత్రమే వచ్చాను తండ్రి ఫోటోను చూస్తూ అతను చెప్పాడు.

మమ్మల్ని ఎలా...?”

అన్ని విషయాలూ నాన్న నా దగ్గర మాత్రం చెప్పారు. భయపడకండి

మా మీద నీకు విసుగు రాలేదా గోపీ?”

నా తండ్రి లోకంలో ఎవరినీ, దేనినీ విసుక్కోలేదు. ఆయన అభిమానించిన  వాటిన్ననిటినీ నేనూ అభిమానిస్తాను. చివరి సమయంలో ఆయన మనసంతా ఇక్కడే ఉంది. వాళ్ళను వదిలి పెట్టద్దురా గోపీఅంటూ నా చేయి పుచ్చుకుని ఆయన అడిగింది ఇంకా నా గుండెలో ఉంది. నాన్న పరిస్థితిని చెప్పి మిమ్మల్ని రమ్మని చెప్పాలనే నాకు ఆశ. కానీ చివరిదాకా రహస్యాన్ని కాపాడతానని ఆయనకు ప్రామిస్ చేసాను. అందువలనే ఆయన చనిపోయిన తరువాత కూడా చెప్పలేకపొయాను. తులసి అక్కడికి వచ్చినప్పుడు అమ్మ నాతో ఉండటం వలన ఆమె ఎదుట తులసి నాకు తెలుసు అనేది చూపించుకోలేకపొయాను. కానీ, చెప్పక పోవటం కూడా ఒక విధంగా మంచిదే. నాన్న బాగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో రూపమే మీ మనసులో పదిలంగా ముద్ర వేసుకుంటుంది.

ముద్ర అలాగే ఉండిపోనివ్వండి. ఆయన మంచంలో ఉండటం మీరు చూసుంటే తట్టుకోలేక పోయేవారు. అంతవరకు, మంచాన ఆయన ఉండటం మీ మనసులో ముద్ర వేసుకొకపోవటం మంచిదే

నిలబడే మాట్లాడుతున్నావే బాబూ. నిన్ను లోపలకు కూడా రమ్మనకుండా...నేనొక బుద్దిలేని దానిని. రా గోపీ. వచ్చి ఇక్కడ కూర్చో. ఇక్కడకొస్తే మీ నాన్న చైర్లోనే కూర్చుంటారు

మీరే మాట్లాడుతున్నారు? నా చెల్లికి భయమా, సిగ్గా? ఇలా సైలెంటుగా ఉంది?”

అతను అలా అడిగిన వెంటనే తులసి ఏడ్చేసింది.  అలా ఏడుస్తూనే గబగబా వచ్చి హక్కుతో అతని భుజాల మీద ముఖం ఆనించి ఏడ్చింది. అతను ఆమెను ఓదార్చే విధంగా ఏడవకు తులసీ! ఏడిస్తే నాన్నకు నచ్చదని నీకు తెలుసు కదా? ఇక మీకు తోడుగా నేనుంటాను

ఇన్ని రోజులు ఖర్చుకు ఏం చేసేరమ్మా?”

కొంచం ఆగి ఆడిగాడు.

నాకు ఒక సేటు ఇంట్లో పని దొరికింది. ఇక మీదటే వెళ్ళి చేరాలి. ఇదేమో ఏదో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తోంది

ఏం పని తులసీ?”

డీ కోడర్ అన్నయ్యా...పేరు విన్నావా?”

మర్కెటింగ్ రీసెర్చ్ క్యాసెట్ విని రాసివ్వాలి. అదేనా?”

అదే

గుడ్...నువ్వు ఉద్యోగానికి వెళ్ళు. క్రియేటివ్ గా చాలా చెయ్యి...అవుట్ గోయింగుగా ఉండు.  ఎక్కువ ఫ్రెండ్ షిప్ లు పెట్టుకో. క్లారిటీ ఆలొచనతో, అందరితోనూ మాట్లాడి స్నేహం చెయ్యి. నీకు నా అభిమానం, ఆదరణ, సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. కానీ, అమ్మ పనికి వెళ్ళకూడదు. తరువాత తులసీ, నీ చదువు మధ్యలో ఆగిపోకూడదు. నేను డబ్బులు తీసుకు వచ్చాను. రేపు మనం వెళ్ళి డబ్బులు కట్టేద్దాం. పార్ట్ టైమ్ జాబే కదా చేస్తున్నావు. దానివల్ల ప్రాబ్లం లేదు. తరువాత  రోజు వంట ఏమిటమ్మా?”

నువ్వు స్నానం చేసి వచ్చేలోపల నీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర, ముక్కల పులుసు రెడీ అవుతుంది

...అదంతా కూడా నాన్న చెప్పేసారా?”

అది మాత్రమే కాదూన్నయ్యా. కెమిస్ట్రీ ప్రొఫసర్ మీనాక్షిని ఒన్ సైడుగా లవ్ చేస్తున్నావని కూడా తెలుసు” -- తులసీ చెప్పగా గోపీ ముఖం సిగ్గుతో మారింది.

ఏం తులసీ, కెమిస్ట్రీ ప్రొఫసర్ కు రసాయన మార్పు ఏర్పడిందా లేదా?”  

అంత అమాయకత్వం అన్నయ్యకు సరిపోదమ్మా. ఆమెను చూడు. అలజడే లేకుండా అన్నయ్యను వెన్న పూసలాగా కరగబెడుతోంది

ఏయ్...

లేకపోతే ఏమిటన్నయ్యా? డెవెలప్మెంటూ లేకుండా రెండేళ్ళుగా ఒకరు ఒక మనిషిని ఒన్ సైడుగానా లవ్ చేస్తారు. తరువాత స్టెప్ కు వెళ్ళొద్దూ? నేను కావాలంటే హెల్ప్ చేయనా?”

తంతా...!

గోపీ చెయ్యి పైకెత్త, ఆమె పరుగున వెళ్ళింది.

ఇప్పుడు ఒన్ సైడ్ లేదమ్మా

ఈజ్ ఇట్?”

నాన్న దగ్గర ఇది చెప్పేలోపల...ప్చ్...ఆయన తెలుసుకోకుండానే పోయారు

అవేదనతో గోపీ ఆయన ఫోటో వైపు చూసాడు. తులసీ తల్లిని చూసింది!

నాన్నకు తెలుసు గోపీ పిన్ని నీరజ చెప్పగా, గోపీ ఆశ్చర్యపోయడు.

ఏంటి పిన్నీ చెబుతున్నావు?”

మరి...కెమిస్ట్రీ దగ్గర రాయబారానికి వెళ్ళిందే మీ నాన్నే...ఏమనుకుంటున్నావు?”

గోపీ మరింత ఆశ్చర్యానికి లోనైయ్యాడు.

నిజంగానా?” గొణిగాడు.

ఆకలి మొదలవుతోంది. నువ్వెళ్ళి స్నానం చేసిరా అన్నాయ్యా తులసీ అతని ఒక టవల్ ఇచ్చి స్నాలగది వైపు చెయ్యి చూపింది.

తనకు నచ్చిన వంటకాలతో బాగా తినేసి ఒక పడక వేసాడు గోపీ. రాత్రి అవుతున్న సమయం మేడమీద కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకున్నారు.

ఒక వారం రోజులు గడిచిపోయినై.

వచ్చే నెల వస్తానమ్మా” -- గోపీ ఆదివారం బయలుదేరిన వేళ తులసీ గదిలోకివెళ్ళి గొళ్లెం పెట్టుకుంది. అలాగే చేస్తుందని తండ్రి ద్వారా తెలుసుకున్న గోపీ నవ్వాడు.

అయితే నేను బయలుదేరనా?”

నీరజ అతన్ని బ్రతిమిలాడేటట్టు చూసింది.  

గోపీ  కళ్ళతోనే ఏమిటన్నట్టు చూసాడు.

ఇంకో వారం రోజులు ఉండి వెళ్ళోచ్చుగా గోపీ

అలాంటి ఒక ఆశ మీకుంటే ఉండే వెళ్తాను!" -- గోపీ నవ్వగా తులసీ గదిలోంచి వేగంగా వచ్చింది.

థాంక్యూ అన్నయ్యా... అతని చేతి వేళ్లను గట్టిగా పట్టుకుంది.

నేను అమ్మకు ఫోన్ చేసి రావటానికి ఇంకా ఒక వారం అవుతుందని చెబుతాను

అతని అభిమానంతో తల్లి కరిగిపోయింది.

అయ్యా...భగవంతుడా! ఎలాంటి బిడ్డను ఇచ్చావు నాకు! నేను చెప్పలా తులసీ, మీ నాన్న అన్నిటినీ చూసుకుంటారని. ఎలాంటి బిడ్డను పంపారో చూసుకో...! సాధారణ వ్యక్తా ఆయన? దేవుడే...దేవుడు! చాలు స్వామీ...చాలు! తల్లి తండ్రి ఫోటో దగ్గరకు వెళ్ళి చేతులెత్తి దన్నం పెట్టింది.

తులసీకి కూడా అలాగే అనిపించింది. వెళ్ళేటప్పుడు కొడుకు దగ్గర అక్షయపాత్రను ఇచ్చేసి వెళ్ళిపోయారు నాన్న అనేది అర్ధమయ్యింది. తీయను, తీయనూ తగ్గిపోని అభిమానంను ఇచ్చే పాత్ర!

తండ్రి ఫోటోను తీసి ముద్దు పెట్టుకుని, హృదయానికి హత్తుకుంది ఆమె.  

*********************************************సమాప్తం*********************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి