24, జనవరి 2023, మంగళవారం

అమ్మ...(కథ)

 

                                                                                           అమ్మ                                                                                                                                                                                               (కథ)

సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

అలాంటి తన తల్లికోసం కథలోని హీరో ఎన్ని తిప్పలు పడ్డాడో చూడండి. ఎందుకంటే చాలా కోడళ్ళకూ అత్తగారంటే పడదు. కథ హీరోగారి భార్య కూడా కోవకు చెందిదే. అయితే తల్లి-భార్యా ఉన్న త్రాసును సరిసమంగా ఎలా ఉంచుకోగలిగేడు అనేదే మీరు తెలుసుకోవలసింది. దానికి కథను చదవండి.

వేకువజాము 5.30 గంటలు!

బద్దకంగా నిద్రలేచి వాకిటికి వచ్చాడు రమణ!

డెబ్బై ఏళ్ళు దగ్గరపడుతున్న అతని తల్లి, వృద్ద రిటైర్మెంట్ వయసులోనూ వాకిలి చిమ్మి, ముగ్గు వేస్తోంది!

అమ్మను చూస్తుంటే రమణకి మనసు తరుక్కుపోయింది! పాపం అనిపించింది! అతని భార్య వర్షిణికో ఇంటి పనులు చేయటం అసలు ఇష్టంలేదు! అత్తగారు ఏది చెప్పినా మంచికోసమే కదా చెబుతారు...అని అనుకోకుండా తప్పు కనిపెడుతుంది!

ఏం చేయాలా అని ఆలొచించిన రమణకి ఎప్పుడూలాగానే తన వ్యూహం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు!

వర్షిణీ...!

....!

నువ్వు వాకిట్లోకి వెళ్ళి చూసావా...?”

లేదు...ఇప్పుడే లేచాను...!

రమణ స్వరం కొంచం పెద్దది చేసుకున్నాడు.

అమ్మని ముగ్గు వేయకు...ముగ్గువేయకూ అని ఎన్నిసార్లు చెప్పుంటాను...! ఇది ఆవిడ ఇల్లుట...! ముగ్గు వేస్తోందట...! వెళ్ళి చూడు... వర్షిణీవంకర్లు టింకర్లుగా ఒక ముగ్గు! ఎవరడిగారు ఈవిడ్ని ముగ్గు వేయమని? ఇల్లే అసహ్యంగా ఉంది...! ఇలా ముగ్గువేస్తే మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుందా? వయసైందే తప్ప, ఇంకా బుర్ర పెరగలా...

రమణ, తన తల్లిని తిడుతూ ఉంటే వర్షిణీకు సంతోషంగా ఉంది.

వర్షిణీ చిన్న స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టింది...!

సరే...వదలండి! రేపటి నుంచి నేను ఉదయాన్నే లేచి ముగ్గువేస్తాను...! ఆవిడకు అనవసరమైన గొప్పే ఎక్కువ...!

వర్షిణీ చెప్పిన వెంటనే రమణ పెద్ద నిట్టూర్పు విడిచాడు.

ఇక మీదట అమ్మ పొద్దున్నే లేచి, స్నానం చేసి, ముగ్గు వేసి శ్రమ పడదు...అని రిలీఫ్ అయ్యాడు.

వర్షిణీ...నువ్వు చెప్పేదే కరెక్టు...నువ్వు చుక్కలు పెట్టి ముగ్గువేసే అందమే వేరు. పెళ్ళైన కొత్తల్లో చూసాను కదా. ఎంత అందంగా ఉండేదో. ఇంటికే ఒక కళ వచ్చేది...! అని ఆమెను పొగడాడు.

సరే నండీ... రేపట్నుంచి నన్ను ఉదయాన్నే లేపేయండి...! అన్నది.

ఆఫీసు ముగించుకుని, సాయంకాలం రమణ టయర్డుగా ఇంటికి వచ్చినప్పుడు, అతనికి కాఫీ ఇచ్చిన వర్షిణీ, రమణ పక్కన కూర్చుని మాట్లాడసాగింది...!

ఏమండీ...!

...చెప్పు వర్షిణీ!

ఆదివారం రోజు చిన్న తిరుపతికి వెళ్దామా...?”

“....! అని అన్న అతనికి అప్పుడే గుర్తుకు వచ్చింది అమ్మ జ్ఞాపకం!

ఆదివారం అమ్మకు డెబ్బైయవ పుట్టిన రోజు!

ఆదివారం అమ్మకు పుట్టిన రోజు అని చెబితే అమ్మకు కొత్త డ్రస్సు కొనివ్వటానికి వర్షిణీ అంగీకరించదు...! వయసులో ఆవిడకెందుకండి కొత్తచీర అంటుంది. ఏం చేయాలి?’ అని ఆలొచించాడు.

బిడ్డనూ, అమ్మనూ ఇక్కడ వదిలేసి వెళ్దామా?” రమణ అడిగాడు.

ఆవిడ కూడా రానివ్వండి...బిడ్డను చూసుకుంటూ లాడ్జీలోనే ఉండనివ్వండి! మనం మరుసటిరోజే తిరిగి వచ్చేస్తాము కదా...

... ఒక మంచి ఐడియా వర్షిణీఅమ్మ ఎప్పుడు చూడు ఒక మాసిపోయిన పాతచీర కట్టుకుని నిలబడుతుంది...! భర్త లేకపోతే మంచి చీరలు కట్టకూడదా ఎం...? పిలుచుకు వెళ్ళే మనకే అవమానం...! విసుగుతో చెబుతున్నట్టు చెప్పాడు.

కరెక్టుగా చెప్పారు...మీరే రేపు ఆఫీసు నుండి వచ్చేటప్పుడు రెండు చీరలు కొనుక్కొచ్చి ఇవ్వండి...!

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అమ్మ...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి