19, జనవరి 2023, గురువారం

వాళ్ళూ మనుష్యులే…..(కథ)

 

                                                                                     వాళ్ళూ మనుష్యులే                                                                                                                                                                                (కథ)

మూర్తికి ఇద్దరు పిల్లలు ఇద్దరూ పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టారు. ఇద్దరు పిల్లలనూ ఎక్కడైనా వదిలిపెట్టాసి రమ్మని, రోజూ బార్యతో పోట్లాట పెట్టుకుంటాడు. తల్లీ అలా చేయదని అతని భార్య అతనితో చెప్పినప్పుడు నేను విడిచిపెట్టి వస్తాను అని గొడవపడే వాడు. రోజూ అతను పెట్టే భాధలను భరించలేక పిల్లలను తీసుకుని అతని భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది. సమాజానికి భయపడి పోలీసు రిపోర్టు ఇచ్చేడే గానీ, భార్యా పిల్లల మీద ప్రేమతో కాదు.

తన ఆఫీసులొ పనిచేస్తున్న పెళ్ళి వయసు దాటిన క్రిష్ణవేణిని పెళ్ళి చేసుకోవటానికి ఇష్టపడి ఆమెను అడుగుతాడు. 

పెళ్ళి వయసు దాటిన, అందం తక్కువగా ఉన్న  తనను పెళ్ళిచేసుకోవటానికి రెడీ అంటున్న మూర్తికి  క్రిష్ణవేణి .కే. చెప్పిందా?......తెలుసుకోవటానికి కథను చదవండి.

అందంగా లేకపోయినా చూడటానికి లక్షణంగా ఉంటుంది క్రిష్ణవేణి. వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. ఇంకా పెళ్ళి కాలేదు. మూర్తితో పాటు అతని ఆఫీసులోనే గత పదేళ్ళుగా పనిచేస్తోంది. ఇద్దరికీ బాగా పరిచయముంది.

" క్రిష్ణవేణిని పెళ్ళిచేసుకుంటే...ఏమవుతుంది?"… అని అనిపించిన వెంటనే ఇంటర్ కాం లో క్రిష్ణవేణిని పిలిచాడు మూర్తి.

"సార్" అంటూ అతని క్యాబిన్ లోకి వచ్చింది క్రిష్ణవేణి.

"నీతో కొంచం పర్సనల్ గా మాట్లాడాలి అలా కూర్చో " అంటూ క్రిష్ణవేణికి కుర్చీ చూపించాడు మూర్తి.

" పరవాలేదు చెప్పండి సార్"

తిన్నాగా అసలు విషయానికే వచ్చాడు మూర్తి.

"నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను"

"ఏంటి సార్ అంటున్నారు!" ఆశ్చర్యపోతూ అడిగింది.

"అవును క్రిష్ణవేణి. నా పరిస్థితి నీకు తెలుసు కదా. పిల్లలను తీసుకుని నా భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పటికి రెండేళ్ళు దాటింది. ఎంత వెతికినా కనబడలేదు. పోలీసు కంప్లైంట్ ఇచ్చినా దొరకలేదు. పిల్లలంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. నా భార్య వలన నీకు ఎటువంటి ఇబ్బందీ రాదు. దానికి నేను గ్యారంటీ. డైవర్స్ కూడా మంజూరయ్యింది. ఇంకోవారం రోజుల్లో కోర్టు నుండి పేపర్స్ వస్తాయి"

ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది క్రిష్ణవేణి.

"నీ మౌనాన్ని అంగీకారంగా తీసుకోవచ్చా" అన్నాడు మూర్తి.

మాటకు ఉలిక్కిపడ్డ క్రిష్ణవేణి "నాకు కొంత టైము కావాలి" అన్నది.

ఎంతటైము కావాలి? ఒక రెండు, మూడు రోజులు అన్నాడు మూర్తి.

"అలా అడిగితే ఎలా సార్?" ఇబ్బంది పడ్డది క్రిష్ణవేణి.

"దేనికైనా గడువు అనేది పెట్టుకోవాలి క్రిష్ణవేణి. అప్పుడే అది త్రిల్లింగ్ గా ఉంటుంది" చిన్న చిరు నవ్వుతో చెప్పాడు.

"నాకు ఒక్క వారం రోజులు టైము కావాలి సార్"

"వారం రోజులా? పెళ్ళి చేసుకోవాలా, వద్దా అని ఆలొచించుకునేందుకు అన్ని రోజులు అవసరమా?"

అంటే, మా అమ్మగారు ఊర్లో లేరు, శనివారం వస్తారు...అందుకని"

".కే...నీ ఇష్టం" అన్నాడు మూర్తి.

వెనక్కి తిరిగి తన సీటు దగ్గరకు వచ్చింది క్రిష్ణవేణి. 

కథను చదవటానికి క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వాళ్ళూ మనుష్యులే…..(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి