16, జనవరి 2023, సోమవారం

అక్షయ పాత్ర…(సీరియల్)...(PART-7)

 

                                                                            అక్షయ పాత్ర…(సీరియల్)                                                                                                                                                                      (PART-7)

తులసి, తలకి ఒక టవల్ చుట్టుకుని, ఒళ్ళు తడితోనే వేసుకున్న నైటీతో బయటకు వస్తున్నప్పుడు, బుగ్గలు, మొహమూ ఎర్రదనంతో వాచున్నది.

ఏమిటే?”

తల్లి భయపడిపోయి కూతుర్ని చూసింది.

నువ్వెళ్ళి తలకు స్నానం చేసిరా అమ్మా

ఏమిటే చెబుతున్నావు?”-- తల్లి చూపులో ఆందోళణ కనబడుతోంది. తులసి తండ్రి వాడే దిండును తీసుకుని హృదయానికి గట్టిగా హత్తుకుంది. కన్నీటితో దానికి ముద్దు పెట్టింది.

నాన్న చనిపోయి రోజుకు పదిరోజులు అవుతున్నదమ్మా... గబుక్కున విషయం చెప్పేసి దిండులో ముఖం దాచుకుంది.

అమ్మ క్షణాన ఒంట్లో శక్తి అంతా పోయినట్లు, వణుకుతున్న కాళ్ళతో ముడుచుకుని కూర్చుండిపోయింది.

తులసి తల్లిని బాధగా చూసింది.

సంతోషమో, దుఃఖమో మనసులో దాచి ఉంచుకోకూడదమ్మా. నోరు తెరిచి ఏడ్చేయి ప్లీజ్...

ఆమె మళ్ళీ మళ్ళీ చెప్పినా తల్లి ఏడవలేదు. విపరీతమైన షాక్ లో ఏడుపు రాదు అన్నట్టు మౌనంగా కూర్చుంది.

నాన్నకు చెయ్యాల్సిన కార్యమును మనం కూడా ఇక్కడ సింపుల్ గా చేద్దామమ్మా

తల్లి అభ్యంతరం చెప్పలేదు.

రేపు చేసేద్దాం అన్నది. మరుసటి రోజు ఒక బ్రాహమణుడ్ని పిలిచి ఇంట్లోనే కార్యం జరిపి తండ్రికి పిండం చేసి పెట్టింది. కాకి ఒకటి నడుచుకుంటూ వచ్చి, నిలబడి నిదానంగా ఇద్దరినీ తలవంచి చూసి పిండాన్ని నాజుకుగా పొడిచి నాలుగైదుసార్లు తిని ఎగిరిపోయింది.

రోజు మొత్తం ఏమీ తినకుండా, పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా తండ్రి ఫోటో కింద ముడుచుకుని పడుకుంది తల్లి. తులసి ఆమె మౌనాన్ని ఛేదించలేదు. కానీ మరుసటి రోజు అదేలాగా జరగటంతో, కలతతో ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చుంది.

ఎన్ని రోజులమ్మా ఇలాగే ఉంటావు? మన భవిష్యత్తు తలుచుకుని భయపడుతున్నావా అమ్మా? ఇక ఏం చేస్తాం, ఎలా గడపాలా అని బాధపడు తున్నావా?”

తల్లి గబుక్కున లేచి కూర్చుంది.

నేనెందుకే బాధపడతాను? దేనికి భయపడాలి? ఆయనేమన్నా సాధారణ మనిషా? దైవమే! ఆయనకు తెలియదా మనల్ని ఇక ఎలా కాపాడాలో? ఆయనే అన్నిటినీ చూసుకుంటారు. నేనేమీ బాధపడటం లేదు. నువ్వూ బాధపడక్కర్లేదు. దైర్యంగా ఉండు! ఆయనకు మరణం లేదు. ఆయన వస్తాడు. ఎలాగైనా వచ్చి మనల్ని చూసుకుంటాడు

తులసి ఆశ్చర్యంతో తల్లిని చూసింది.అమ్మకు నాన్న మరణ దుఃఖం తగ్గి, మామూలు మనిషిగా మారి మాట్లాడుతోందో అనే అనుమానం ఏర్పడింది. విషయానికైనా వణికిపోతూ, కళ్ల చివర నీళ్ళ ధారను రెడీగా పెట్టుకునే అమ్మేనా ఈవిడ? ఇది నమ్మకమా? లేక నాన్న మీదున్న ఎక్కువ ప్రేమా...?-- తులసి ఆశ్చర్యంగా చూసింది.

తరువాతి వారం తులసి తాను రాసి ముగించిన క్యాసెట్లను, రాసిన పేపర్లనూ తీసుకుని బయలుదేరే సమయంలో, ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. శబ్ధం వినబడింది. ఇంటి అద్దె బాకీ కోసం ఇంటి ఓనర్ వచ్చుంటాడో అనే భయంతో తలుపు తెరిచిన ఆమె ఆశ్చర్యంలో పడింది.

గోపీ....!

నాన్న కొడుకు చిన్న నవ్వుతో బయట నిలబడి ఉన్నాడు.

ఏదైనా పని చేస్తున్నావా గోపీ?” గోపీ రూములోకి తొంగి చూసి అడిగాడు నాగభూషణం.

ఏంటి నాన్నా చెప్పండి -- గోపీ లేచి వచ్చాడు.

నీదగ్గర కొన్ని విషయాలు మాట్లాడాలి

విషయం నాన్నా?”

ఇక్కడ మాట్లాడలేను. బయటకు వెళ్దాం

ఇప్పుడా నాన్నా?”

ఇప్పుడొద్దు. సాయంకాలం. నువ్వు ఆఫీసుకురా. అక్కడ్నుంచి వెళదాం

తండ్రి చెప్పగా, గోపీకి అలా ఏముంటుంది అంత ముఖ్య విషయం అని ఆశ్చర్యంతో ఆయన వెడుతున్నవైపే చూసాడు. ఆయన చెప్పినట్లే సాయంత్రం తన పనులన్నీ ముగిసిన తరువాత ఆయన ఆఫీసుకు వెళ్లాడు. వాడి రాకకోసమే కాచుకోనున్నట్లు వాడ్ని చూసిన వెంటనే లేచి బయలుదేరారు.

హోటల్ బ్లూ ఇన్ రెస్టారంట్ మేడ మీద చల్లని గాలి ముఖానికి తగలేటట్టు చివరగా ఉన్న, ఎదురెదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నారు. తండ్రి ముఖాన్ని చూసాడు గోపీ. దూరంగా కనబడే వంతెనలపై వెలుగుతున్న లైట్లను చూస్తూ దీర్ఘ ఆలొచనతో కూర్చొనున్నారు ఆయన.

పది రోజుల కొకసారి ఇద్దరూ స్నేహుతుల్లాగా ఇలా బయటకు వచ్చి ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుంటారు. అప్పుడంతా మాటలు పలు విషయాలను  ముట్టుకుంటాయి. అతనే తాను కొత్తగా రాసిన ఆంగ్ల కవిత్వాన్ని తండ్రికి వినిపిస్తాడు. ఆయన అందులో చిన్న చిన్న మార్పులు చేస్తారు.

తెలుగులో కదా రాయాలి గోపీ. తెలుగు భాష బ్రమిప్పు కలిగించే అందమైన భాష

నీలాగా నాకు రాయటం రావటంలేదు నాన్నా. చదువుతున్నాను,  మాట్లాడుతున్నాను. కానీ, రాస్తున్నప్పుడు తప్పులు వస్తున్నాయి. ఆయనా కానీ  ప్రయత్నిస్తాను. చదువుతున్నప్పుడు అన్నీ తెలిసినట్లు ఉంటోంది. కానీ, రాస్తున్నప్పుడు అన్నీ మరిచిపోయినట్లు అవుతోంది. ఏం చేయను అంటాడు అతను.

రాజకీయాల నుండి అధ్యాత్మికం వరకు వాళ్ళు చర్చించుకుంటారు.   

కానీ ఈ రోజు తండ్రి యొక్క మౌనం విచిత్రంగా ఉంది. ఆయనే దాన్ని ఛేదించనీ అని కాచుకోనున్నాడు. బేరర్ ఆర్డర్ తీసుకోవటానికి వచ్చినప్పుడు, ఎప్పుడూ వాళ్ళిచ్చే ఆర్డర్ ఇచ్చి పంపించి తండ్రిని చూసాడు. నుదురు చిట్లించునట్టు కూర్చోనున్న ఆయన, తరువాత ఒక పెద్ద నిట్టూర్పు విడిచి అతన్ని చూసారు.

ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు షాకుగా ఉండొచ్చు గోపీ. నా మీద కోపం కూడా రావచ్చు. కానీ నువ్వు సాధారణ కొడుకుగా ఉంటే అవన్నీ ఏర్పడతాయి. ఒక స్నేహితుడుగా ఉండే వాడు అర్ధం చేసుకుంటాడు. నువ్వు అర్ధం చేసుకుంటావు అనే నమ్మకం నాకుంది

ఏమిటి నాన్నా ఇంతపెద్ద బిల్డప్?” -- గోపీ నవ్వాడు.

ఏదైనా సరే ముందు ఒక హెచ్చరిక ఇవ్వటం మంచిది కదా. అందుకే ఆయన మంచి నీళ్ళ గ్లాసు తీసుకుని కొంచంగా మంచి నీళ్ళు తాగాడు.

ఒక్కొక్క మనిషి జీవిత పుస్తకంలో చాలా చాలా రహస్యమైన కొన్ని పేజీలు ఉంటాయని నువ్వు నమ్ముతావా గోపీ

హఠాత్తుగా ఎందుకు నాన్నా సబ్జెక్టు?”

చెప్పు...చెబుతా

నమ్ముతాను. అందరూ, అందరి దగ్గరా, అన్ని విషయాలూ లైట్లువేసి చెప్పలేరు. ఎంతో ప్రాణ స్నేహం కలిగినవారైనా చెప్పలేని కొన్ని అంతరంగ విషయాలు ఉంటాయి

ఓకే. అలాంటివి చెప్పకుండా ఉండటం కరెక్టేనా? కాదా?”

అది రహస్యాన్ని బట్టి ఉంటుంది. రహస్యాన్ని బయట పెట్టకపోతే ఎవరికీ చెడూ జరగదు అనుకుంటే చెప్పకుండా దాచటం తప్పు కాదు

అలా అనుకుని, ఇరవై సంవత్సరాలుగా నాలో దాచుకున్న ఒక రహస్యాన్ని నేనిప్పుడు చెప్పబోతాను  

కట్ లెట్ను ఫోర్కుతో కట్ చేస్తున్న గోపీ ఆగిపోయి తలెత్తి ఆయన్న ముఖాన్ని చూసాడు.

నాకు ఇంకో కుటుంబం ఉంది గోపీ ఆయన ప్రారంభమే పాయింటుకు వచ్చారు. గోపీ మొహంలో అనుచుకోలేని షాక్ ఒక్క క్షణం మెరుపులా సాగింది. ఆయన్ని ఏమడగాలో కూడా అర్ధంకాక అయన్నే చూసాడు. నాగభూషణం సన్నటి స్వరంతో ముంబైలో విషయాలన్నిటినీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా, దాచకుండా, ఒక్క దానిని కూడా గొప్ప చెయ్యకుండా వివరంగా చెప్పి ఆగారు.  

నేను చేసింది కరెక్టేనని చెప్పేవారు కొంతమంది ఉంటారు. తప్పు అని  చెప్పేవారు ఎక్కువమంది ఉంటారు. జరిగి ముగిసిన ఒక విషయాన్ని తప్పా, రైటా అని ఇప్పుడు అన్వేసించి లాభం లేదు. ఇది మీ అమ్మ దగ్గర చెప్పుంటే, ఖచ్చితంగా ఆమె నన్ను అర్ధం చేసుకుని కుటుంబాన్ని కూడా ఇక్కడికి తీసుకురమ్మనేది. మీ అమ్మ మనసు చాలా మృదువైనది, సున్నితమైనది. అందువలనే పువ్వును గాయపరచటం కుదరక రహస్యాన్ని నాలోపలే దాచుకున్నాను. ఇంకో పెళ్ళి చేసుకున్నందువలన మీ అమ్మ మీద ప్రేభిమానాలు తగ్గిపోయినై అనేది అర్ధం కాదు...కరెక్టుగా చెప్పాలంటే తరువాతే ఆమె మీద ప్రేమాభిమానాలు ఇంకా ఎక్కువ అయ్యాయని చెప్పాలి.

ఆమె దగ్గర ఒక రహస్యాన్ని దాచామే నన్న బాధే ఆమె మీద ప్రేమను ఎక్కువ చేసింది. ఇది నీ దగ్గర చెప్పటానికి ఒక కారణం ఉంది. కొద్ది రోజులుగా నా మనసులో ఏదో తెలియని అలజడి. నాకు ఏదో జరగబోతోందని అనిపించింది. అది మంచిదా, చెడ్డదా అనేది తెలియలా. ఒకవేల చెడు జరిగితే? రహస్యంగా ఇంతవరకు నేను వహించిన బాధ్యతలు నీ దగ్గర అప్పగించానంటే నేను ప్రశాంతంగ ఉండగలననే భావన వచ్చింది. అలా నాకు ఏదైనా జరిగి నేను చనిపోయినా, మంచం మీద పడిపోయినా కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి గోపీ. చేస్తావా? నీ చెల్లెల్ని ఆమె చదువు ముగిసిన తరువాత, ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేయాలి. చివరి వరకు వాళ్ళతో ప్రేమగా ఉండాలి. ఇంతవరకు నేను మీ అమ్మ దగ్గర దాచిన విషయాన్ని, నువ్వు కూడా దాచాలి. రహస్యం నీలోనే ఉండిపోవాలి. వాళ్ళను నువ్వు వదిలి పెట్టకూడదురా గోపీ

కళ్ళల్లో చిన్నటి మెరుపుతో తడిసిన రెప్పలతో ఆయన బ్రతిమిలాడుతున్నట్టు చెప్పి ఆప, గోపీ బెదిరిపోయాడు. ఇలాంటి ఒక ముఖ భావంతో రోజూ ఆయన్ని చూసింది లేదు. తండ్రి కళ్ళల్లో తడా? ఎవరూ ఏడవకూడదని అనుకుంటారే ఆయన.

అలాంటి ఆయన కళ్ళు నలుపుకోవడమా?

ఇప్పుడు కూడా అమ్మ దగ్గర నువ్వు చెప్పొచ్చే. ఎందుకు నాన్నా ఆలొచిస్తావు? ఇప్పుడు కూడా అమ్మ నిన్ను అర్ధం చేసుకుంటుందని నాకు అనిపిస్తోంది

లేదురా గోపీ. మొదటే చెప్పుంటే ఒకే ఒక షాక్ తో పోయుంటుంది. ఇప్పుడు చెబితే దీన్ని ఇన్ని సంవత్సరాలుగా నేను ఆమె దగ్గర దాచాననే బాధ, షాకుకంటే ఎక్కువగా ఉంటుంది. ఆమె ముందు ఇంతకాలం నేను రెండు మనసులతో నడిచానని అనుకుంటే ఆమె మనసు విరిగిపోతుందిరా గోపీ. ఇంతకాలం తరువాత ఆమెను బాధపెడితే అది మహాపాపం! ఘొరాన్ని నేను చెయ్యలేనురా

అర్ధమవుతోంది నాన్నా. వద్దు. కానీ, దయచేసి నువ్వు ఫీల్ అవకు. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. కరెక్టు, తప్పు అనేది మనం చూసే విధంలోనే ఉంది. నువ్వు చెప్పిన విషయం నాకు షాకివ్వటం నిజమే. కానీ, మా నాన్న ఏది చేసినా దాని వెనుక ఖచ్చితంగా ఒక మానవత్వపు న్యాయం ఉంటుందని నాకు తెలుసు. నువ్వు చెప్పినట్టు ఇది కరెక్టేనా, తప్పా అని ఆలొచించటం వదిలేసి, ఇక ఏం చేయాలి అని ఆలొచించటమే మంచిది. జరిగిపోయిన దాన్ని నొక్కి మార్చటం జరిగే పనికాదు

గోపీ ఓదార్పుగా మాట్లాడాడు.

నిజం చెప్పు గోపీ. నామీద నీకు కోపమో, విరక్తో రానేలేదా?”

నీకు తెలియకుండా ఏదైనా చేసేసి, తరువాత నీ దగ్గర చెబితే నువ్వు నన్ను అసహ్యించుకుంటావా? నేను ఇందాకే చెప్పానే. నాకు షాకయ్యిందని -- కానీ దానికోసం నిన్ను అసహ్యించుకోవటమో, నీ మీద కోపగించుకోవటమో చేయలేను నాన్నా... నేను ఏం చేయాలి చెప్పండి

ప్రస్తుతం ఏమీ చెయ్యక్కర్లేదురా. నాకేదైనా జరిగిందా కుటుంబం కష్టపడకూడదు. మీ అమ్మ ఎంత మంచిదో, అదేలాగనే నీ పిన్ని కూడా మంచిది. రోజు వరకు పందొమ్మిది సంవత్సరాలలో ముఖ్యమైన ఖర్చులు తప్ప, తనకని ఏమీ నా దగ్గర అడిగిందే లేదు. తన బద్రత కోసమే నన్ను పెళ్ళి చేసుకుందే తప్ప, విలాశమైన జీవితం కోసం కాదు. ఇంకే హక్కూ తనకు లేదనే దాంట్లో ఆమె క్లియర్ గా ఉంది. నేను ఎంత చెప్పినా కూడా ఒక అవగింజంత బంగారం నేను కొనివ్వటానికి ఆమె ఒప్పుకోలేదు. కాటన్ చీర తప్ప, వేరే చీర ఆమె కట్టుకోదు. అవికూడా సంవత్సరానికి రెండు మాత్రమే. నా డబ్బును, అక్కడ విలాశంగా కర్చుపెట్టనివ్వలేదు. మీ మొదటి భార్యకు మన విషయం తెలియనివ్వకపోవడమనే తప్పు తప్ప, నా కోసం డబ్బు ఖర్చుపెట్టారనే తప్పు చేయకండి. రెండుపూట్ల భోజనం, రెండు చీరలూ, ఉండటానికి ఒక చిన్న ఇల్లు, తరువాత మీ ప్రేమ, అభిమానం. ఇవి చాలు మాకు అంటుంది. మీ గురించి ఆమె దగ్గర చాలా చెప్ప వచ్చు. అందువలన నీ గురించి చాలా చెప్పాను. నిన్ను చూడకపోయినా, పదినెలలు మోసినట్లు ఆమెకు నీమీద ప్రేమ ఉంది. ఎప్పుడూ మీ ఇద్దరి గురించి ఎంక్వయరీ చేస్తుంది. మొత్తానికి ఇద్దరు భార్యలు ఉంటే, నాకు ఉన్నట్టు ఉండాలి. విషయంలో నేను అద్రుష్టవంతుడ్ని. అందువలనే సమస్యా లేకుండా రహస్యాన్ని ఇంతకాలం కాపాడగలిగానని చెప్పొచ్చు

పేరు ఏమిటి నాన్నా?”

ఎవరి పేరు?”

నా చెల్లి పేరు

తులసి. పిన్ని పేరు నీరజా    

నువ్వు ఈసారి ముంబై వెళ్ళేటప్పుడు నేనూ వస్తా

ఆయన మొహం వికసించి తలెత్తి అతన్ని చూసారు.

చూడాలని ఉందా? వచ్చేవారం మనం వెళదాం. వాళ్ళకు స్వీట్ సర్ ప్రైజ్ ఇద్దాం నాన్న టిష్యూ పేపరుతో చేయి తుడుచుకుని నీళ్ళు తాగారు. గోపీ బిల్లు సెటిల్ చేసాడు.

వెళ్దామా నాన్నా

ఇద్దరూ లేచరు.

అబ్బో...ఇప్పుడు మనసు ఎంత తెలికగా ఉందో తెలుసా గోపీ?” అంటూ ఆయన అతని ఎడం చేతి వేళ్ళను, తన వేళ్ళతో కలుపుకుని తన సంతొషాన్ని బయటపెట్టే విధంగా నొక్కారు. నా భార్యలూ--పిల్లలూ అందరూ ఎలాంటి ప్రాణులురా గోపీ! ఇలాంటి ఒక అండర్ స్టాండింగ్ ఫ్యామిలీ ఎవరికి సెట్ అవుతుంది?” చిన్న పిల్లాడిలా ఉత్సాహ పడ్డారు ఆయన.

నువ్వు మంచి నాన్నగా ఉండటం వలనే కదా నాన్నా అన్నీ నీకు మంచిగా సమకూరినై

ఇప్పుడు చెప్పరా గోపీ? నేనిచ్చిన పుస్తకం చదివావా?”

సెవెంత్ సెన్స్ పుస్తకమే కదా? చదివేసాను. వాట్ వండర్ ఫుల్ బుక్! సెవెంత్ సెన్స్ దొరకాలంటే చాలా అనుభవాలు కావాలని అర్ధం చేసుకున్నా. అందులో చాలా చోట్ల చెప్పబడింది. ప్రేమ ఒక్కటే సర్వరోగ నివారిని! ఎంత నిజమైన మాటలు! తరువాత ఛెల్లుమని కొట్టేలాగా ఒక చిన్న కథ!

ఒక కాకి మాంశం ముక్కతో ఆకాశంలో ఎగురుతోంది. ఇరవై కాకులు దాన్ని తరుముతూ విపరీతంగా దానిపై దాడిచేయటం మొదలుపెట్టినై. కాకి మాంశం ముక్కను కిందకు వదిలేసింది.

వెంటనే కాకిని తరుముతున్న కాకులు, కాకిని వదిలేసి వెళ్ళటంతో, అది మాత్రం స్వతంత్రంగా భయంలేకుండా ఎగిరింది. అప్పుడు కాకి చెప్పింది.

నేను మాంశమును వదిలేసాను, ఆకాశాన్ని చేరుకున్నాను. అఖండ ఆకాశం యొక్క అద్భుతం తెలియక ఇంతసేపూ నా బుద్ది హీనతతో మాంశం ముక్కను గట్టిగా పుచ్చుకున్నాను! ఎంత అల్ప లక్ష్యం నాకు!

చదివిన వెంటనే భ్రమించిపోయాను నాన్నా . ఎక్కువగా ఆలొచించటం మొదలుపెట్టాను. నేను ఎన్ని మాంశం ముక్కలను పట్టుకోనున్నానో తెలియటం లేదు. అన్నిటినీ విధిలించుకోవాలని బాధగా ఉంది

బాధ పడకు. నీ దగ్గర పువ్వులే ఉన్నాయి. నువ్వింకా పైకి ఎగరుతావు

పువ్వులు కూడా బరువే నాన్నా. ఏదీ ఉండకూడదు. అదే జ్ఞానానికి గుర్తు

దుఃఖాన్ని కూడా మరో సంతోషంగా తీసుకోగలిగితే చాలు. ఏదీ మనల్ని బాధపెట్టదు. అందులోనే ఇంకో కథ చదివావా? ఒక ముని యొక్క గుడిస, నిప్పు రవ్వలు పడి పూర్తిగా కాలిపోయిందట. వెంటనే అందరూ పరిగెత్తుకువచ్చి అతనికి ఓదార్పు మాటలు చెప్పారట. కానీ, ఆయన హమ్మయ్య! ఇన్ని రోజులు వెన్నెల చంద్రుడ్ని అడ్డగించిన గుడిస కాలిపోయింది. చంద్రుడు ఎంత అందంగా కనబడుతున్నాడో అన్నారట.

ఎంతమందికి సమానత్వ పరిపక్వత, మైనస్ ను ప్లస్ చేసుకునే గుణమూ ఉంటుంది చెప్పు. కానీ, నీకు గుణం ఉందిరా గోపీ. తండ్రికి ఇంకో కుటుంబం  ఉన్నది అనే మైనస్సుకు కూడా ప్రేమ చూపించటానికి ఇంకో రెండు జీవులు దొరికినై అని ప్లస్సుగా మార్చుకుని సంతోషపడటం ఎవరి వల్ల కుదురుతుందిరా? చెప్పు! నేను లక్కీరా గోపీ. ఇంకేం చెప్పను? ఇలా నేను చెబుతున్నందువలన, దీనికొసం నువ్వు నన్ను ఛీదరించుకుని వేరుగా చూసినా అన్ లక్కీ అని చెప్పుకోను నాన్న నవ్వారు. మళ్ళీ చెప్పారు.

నేనూ నువ్వూ ఎలా మాట్లాడుకుంటామో, అదేలాగానేరా నేనూ తులసీనూ. టైము పొయేదే తెలియకుండా డాబామీద కూర్చుని స్వచ్చమైన గాలి పీల్చుకుంటూ మాట్లాడుకుంటాము. మీ పిన్ని అన్నీ వింటూ, మాకు తినటానికీ, తాగటానికీ ఏదో  ఒకటి ఇస్తూ ఉంటుంది. అప్పుడంతా నేను అనుకునేవాడిని, గోపీ కూడా ఇక్కడుంటే ఎంత బాగుంటుంది! ఇంకా ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు

అందుకే కదా వచ్చే వారం నీతో నేనూ వస్తున్నాను. ఒక వారం మొత్తం మాట్లాడుతూనే గడిపేద్దాం! అతను చెప్పగా, ఆయన సంతోషంగా అతని భుజాల మీద చేతులు వేసాడు.

ఇక నా కేమిట్రా తక్కువ! దేవుడే నన్ను చూసి ఈర్ష్య పడతాడనుకుంటా?’

సంతోషం వలనే ఆయన బ్లడ్ ప్రషర్ పెరగటం మొదలు పెట్టటం జరిగుండాలి.

                                                                                                            Continued...PART-8

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి