27, జనవరి 2023, శుక్రవారం

పదిహేడవ అల…(సీరియల్)...(PART-1)

 

                                                                             పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                   (PART-1)

న్యూమరాలజీలో పదిహేడు అంకె దేవతతో సమానం అని కొందరు నమ్ముతారు. అందువలన అంకె దైవిక సత్యంతో కూడిన సందేశం ఇస్తుందని నమ్ముతారు. పదిహేడు అంకెలోని మొదటి అంకె ఒకటి 'ధర్మం' ను సూచిస్తుందని(సూర్యుడు-1) మరియు అంకె ఏడు 'రహస్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని' (కేతు-7) సూచిస్తుందని, సంఖ్యల కలయిక (పదిహేడు) శుభప్రదంగా పరిగణించబడి మరియు విజయాన్ని ఆశీర్వదించడానికి ప్రసిద్ధి చెందిందని కొందరు నమ్ముతారు. అందుకే ఈ నవలకు 'పదిహేడవ అల ' అని పేరు పెట్టాము.

భార్గవ్ విశాఖపట్నంలో పనిచేసే విజయవాడ యువకుడు. సుగంధి విశాఖపట్నం కళాశాల ఒకదాంట్లో చదువుతున్న తెనాలి అమ్మాయి. అనుకోకుండా కలుసుకున్న ఇద్దరి కలయిక ప్రేమగా మారినప్పుడు...?(టర్నింగ్ పాయింట్స్ చెప్పేస్తే కథ యొక్క ఆసక్తి తగ్గిపోతుంది)

 ప్రేమ మీదున్న నమ్మకం, జ్యోతిష్యం మీదున్న నమ్మకం ఒక దాని దారిలో ఇంకొకటి క్రాస్ చేసేటప్పుడు ఏర్పడే చిక్కులు, దాని వలన జీవితంలో ఏర్పడే దాగుడుమూతలు, తరువాత సంధర్భ కారణాల వలన భార్యా-భర్తలు అయ్యే ఇద్దరి బంధుత్వ కన్ ఫ్యూజన్స్ -- ఇవన్నీ కలిపే ఈ నవల.

దీన్ని మేము రాసినప్పుడు ముందే తీర్మానించిపెట్టుకున్న కథా అంశం నుండి కొద్దిగా వేరుబడి, మేము కథను రాయకుండా, కథ మమ్మల్ని రాయించింది ఒక సపరెట్ కథ.

చదివే మీరు ఒక తియ్యని అనుభూతిని పొందుతారు.

************************************************************************************************************

                                                                                            PART-1

మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉందా?”

ప్రశ్న అడిగిన అక్షరను ఆశ్చర్యంతో చూసాడు భార్గవ్.

విశాఖపట్నం సముద్ర తీరాన అలలకు సమానంగా ప్రజా సమూహమూ అలల లాగా తోసుకుంటోంది.

బఠానీలూ, పాప్కార్న్, కొబ్బరి బోండాం, ఐస్ క్రీం అంటూ సకల వ్యాపారాలూ బిజీగా ఉన్నాయి. పిల్లలతో వచ్చిన కన్నవారు, అక్కడా ఇక్కడా చేతులు జోడించుకుని తిరుగుతున్న యువ ప్రేమికులు, ఒకళ్ళుగా వచ్చి మట్టి నేల మీద కూర్చున్న వారు అంటూ సముద్రతీరమే రంగు రంగులుగా ఉంది. చిన్న పిల్లల గుంపు ఒకటి సముద్రంలో మోకాలు లోతుకు వెళ్ళి నిలబడటం, పెద్ద అల వచ్చినప్పుడు అరుస్తూ వెనక్కి పరిగెత్తుకు రావటం సముద్రతీరాన్ని ఉత్సాహంగా ఉంచుతున్నది.

అక్షరకు ఇరవై రెండేళ్ళు. అభిమానం, వినయం కలిసిన ముఖం. చిన్న చిన్న పువ్వుల ముద్రలతో, నీలి రంగు చీర, అదే రంగు జాకెట్టు వేసుకుని తన అందానికి మరింత అందం చేకూర్చుకుంది.

ఆమెను తాకుతున్నట్టు మట్టిలో కూర్చోనున్న భార్గవ్ కు ఇరవై ఎనిమిదేళ్ళ వయసు. నీలి రంగు జీన్స్ ప్యాంటు, లైట్ బ్లూ కలర్ చొక్కా వేసుకుని ఉన్నాడు. మంచి ఎత్తుతో, దృఢమైన శరీర అమరిక. ఎప్పుడూ మొహాన నవ్వు.

ఏమిటీ...హఠాత్తుగా జ్యోతిష్యం గురించి అడుగుతున్నావు?”

మన ప్రేమ ఎటువంటి అపోజిషన్ లేకుండా సక్సస్ అవాలని ఇప్పుడు జోస్యం చూడబోతాను. అందుకే ప్రశ్న. మీకు ఇందులో నమ్మకం ఉందా - లేదా?”

ఒక్క క్షణం ఏం సమాధానం చెప్పాలో ఆలొచించుకుని అడిగాడు. సరే, నమ్మకం ఉన్నదనే పెట్టుకో! ఇక్కడ జ్యోతిష్కుడు లేకుండా ఎలా జోస్యం చూస్తావు?”

ఆమె అందంగా కళ్ళు మూసి తెరిచింది. జ్యోతిష్కుడు లేడు...కానీ జోస్యం చూడటానికి దారి ఉంది

భార్గవ్ నవ్వాడు. ఏం దారి ఉంది? ఇక్కడ సముద్రం అలలు మాత్రమే ఉన్నాయి

అవును! ఇప్పుడు మనం సముద్రపు అలలు పెట్టుకునే జోస్యం చూడబోతాం... దీనినే అలల జోస్యం అంటారు

అతను కళ్ళు పెద్దవి చేసాడు. అలల జోస్యమాకొత్తగా ఉందే?”

మొదట లేవండి అన్న అక్షర...అతన్ని లేపి, సముద్రపు అలలు వచ్చి వెళ్ళే తడిసిన మట్టి నేలకు కొంచం దూరంగా నిలబెట్టి, తానూ అతని దగ్గరగా నిలబడింది. ఇప్పుడు ఇద్దరూ సముద్రాన్ని చూస్తున్నట్టు నిలబడ్డారు.

అక్షర చెప్పింది. ఇప్పుడు రాబోయే పదిహేడు అలలలో ఒక అల అయినా మన కాలును తాకి వెళ్ళిపోతే, మన ప్రేమకు ఎటువంటి అపోజిషన్ లేకుండా అనుకూలంగా నెరవేరుతుంది. లేదంటే...

ఇదేనా అలల జోస్యం? కొత్తగానే ఉంది  అన్న భార్గవ్ తాము నిలబడ్డ చోటును గమనించాడు. ఇంత దూరానికా? ఎప్పుడైనా ఒక అల వస్తుంది. అందువల్ల వంద అలలలో ఒక అల అని పెట్టుకుందాం

ఆమె కచ్చితంగా ఉన్నది. చెప్పింది. చెప్పిందే. భగవంతుడి ఆశీర్వాదాలు మన ప్రేమకు ఉంటే పదిహేడు అలలలో ఒక అల ఖచ్చితంగా మన కాలును తాకుతుంది

అదేమిటి ఏటూ కాని విచిత్ర పదిహేడు అంకె?”

పదిహేడు అంకె శుభప్రదంగా పరిగణించబడి మరియు విజయాన్ని ఆశీర్వదించడానికి ప్రసిద్ధి చెందిందని నమ్ముతారు. అందుకనే పదిహేడు

వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే ఒక దాని వెనుక ఒకటిగా మూడు అలలు వచ్చి తిరిగి వెళ్ళినై.

ఒకటి...రెండు...మూడు... అంటూ లెక్కపెట్టటం మొదలుపెట్టింది అక్షర.

భార్గవ్ చిరుకోపంతో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. నాలుగు... అన్న అక్షర అతన్ని చూసి మళ్ళీ గద్దించింది ఎమిటలా చూస్తున్నారు?”

నువ్వు ఆందోళనగా నిలబడితే ఎంత అందంగా ఉన్నావో తెలుసా! అందం నాకే సొంతమవబోతోంది అని అనుకుంటేనే...

ఉష్...నా ఏకాగ్రతను చెదరగొట్టకండి. అలలను లెక్క పెట్టండి అంటూ లెక్కపెట్టటాన్ని కంటిన్యూ చేసింది.

ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది...అని వచ్చిన అలలు ఒక్కొక్కటీ సగం దారిలోనే తిరిగి వెళ్ళిపోయినై.

తొమ్మిది...పది...

పదకుండో అల కూడా వచ్చిన వేగంతో తిరిగి వెళ్ళిపోవటంతో...అతను కంగారుపడ్డాడు.  ఏమిటిది? వద్దు. మనం అలల జోస్యాన్ని డ్రాప్ చేసేద్దాం

జరగాటానికి ప్రయత్నించిన  అతన్ని లాగి పట్టుకుని కదలకుండా నిలబెట్టింది. ఆమె మనసులోనూ ఆందోళన చోటు చేసుకున్నట్టు ఆమె మొహం చూపిస్తోంది.

పన్నెండు...పదమూడు...పద్నాలుగు...అని వచ్చిన అలలన్నీ మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయినై.

భార్గవ్ మొహం అదొలా అయిపోయింది. అక్షర ఏడ్చేదానిలాగా ఉన్నది. పదిహేను...పదహారు అలలు కూడా వాళ్ళను తాకకుండా తిరిగి వెళ్ళిపోవటంతో వాళ్ళిద్దరూ ఆందోళన శిఖర అంచులో ఉన్నారు.

చివరగా పదిహేడవ అల...

వాళ్ళిద్దర్నీ కిందకు తొసేలాగా దూకుడుగా వచ్చి, మోకాలు వరకు దుస్తులను తడిపి వెళ్ళింది.

అంతే! అక్షరా, భార్గవ్ అప్పుడే తమ ప్రేమ విజయం సాధించినట్లు ..... అని ఉత్సాహ స్వరంతో భుజాలు కలుపుకుని నిలబడ్డారు. సముద్రం కొత్త కాంతితో వెలిగిపోతునట్టు అనిపించింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ అందంగా కనబడ్డారు. వీచిన సముద్రపు గాలిలో సువాసన పొంగింది.

కొంతమందికి ప్రేమ...ఒక పువ్వు, మెల్లమెల్లగా విచ్చుకుంటున్నట్టు పుడుతుంది. చాలా మందికి పొలాలలో నుండి అతివేగంగా వీస్తున్న నీటి పారుదలలాగా బయలుదేరుతుంది.

భార్గవ్ -- అక్షర ప్రేమ రెండు రకాలలోనూ చేర్చుకోవచ్చు. ఒక తీపి యాక్సిడెంట్ లాగానే వాళ్ళు అనుకోకుండా కలుసుకున్నారు.

వాళ్ళిద్దరి మధ్యా ఆ మొదటి పరిచయం జరిగింది వేలమంది జనం గుమికూడే పుణ్య స్థలంలో.

తిరుపతికి వెళుతున్నావు కదా తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఏదో ఒకరోజు తిరుమలకు వెడితే వెంకటేశ్వరుడి ఆశీస్సులు దొరుకుతుందబ్బాయ్. ఖచ్చితంగా వెళ్ళు

ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడే భార్గవ్ దగ్గర అతని తల్లి చెప్పింది.

కుదరదమ్మా! నాకు తిరుపతిలో ఆఫీసు పనికే టైము సరిపొతుందో లేదో తెలియదమ్మా. చాలా పని ఉంది అని ఆమె ఆశను నిరాకరించి బయలుదేరాడు. బస్సు స్టేషన్ వరకు తండ్రి తన స్కూటీ మీద తీసుకు వచ్చి వదిలి వెళ్ళాడు.

తిరుపతి చేరుకున్నాడు. ఆఫీసు బుక్ చేసి ఉంచిన హోటల్ కు చేరుకున్నాడు. కొద్దిసేపు రూములో రెస్టు తీసుకుని ఆఫీసు పనులు మొదలుపెట్టాడు. అతని ప్రోగ్రాం ప్రకారం ఆఫీసు పనులు ముగించటానికి వారం రోజులు పడుతుందని అనుకున్నాడు. ఐదు రోజులలోనే పని ముగిసింది. తిరిగి బయలుదేరదామని అనుకున్నాడు. అప్పుడు అతనికి తిరుమల బ్రహ్మోత్సవాలు జ్ఞాపకానికి వచ్చింది. తల్లి చెప్పింది కూడా జ్ఞాపకానికి వచ్చింది. రెండు రోజులు టైము దొరికింది.

అంతే! భార్గవ్ ప్రయాణంలో మార్పు చేసుకున్నాడు. తిరుమలకు వెళ్ళే బస్సు  ఎక్కాడు. గంటన్నరలో తిరుమలలో దిగాడు. ఎక్కడ చూసినా జనం. గోవిందా...గోవిందా అని పరవశంతో అరుస్తూ నడుస్తున్నారు కొంతమంది. వాళ్ళ వెనుకే భార్గవ్ కూడా నడిచాడు. అతని దగ్గర దర్శన టికెట్టు లేదు. సర్వ దర్శనం క్యూ బహుదూరానికి నిలబడింది. గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే చాలు  అనుకున్నాడు. అటుగా నడిచాడు.

భక్తుల్లో ఒకడిగా వెడుతున్నప్పుడు, “సార్...ఒక్క నిమిషం... అని ఒక ఆడగొంతు వినబడి గబుక్కున ఆగాడు.

పిలిచింది ఒక యుక్త వయసు యువతి. రోడ్డు పక్కగా భయపడుతూ నిలబడింది. అందమైన ముఖం. పసుపు రంగు పట్టు చీర కట్టుకోనుంది.

సార్...నాతోపాటూ వచ్చిన స్నేహితులను గుంపులో మిస్ చేసాను. ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు. ఒక ఫోను చేయాలి. ఒక నిమిషం మీ సెల్ ఫోన్ ఇస్తారా?” అని అడిగిన వెంటనే తన సెల్ ఫోన్ తీసిచ్చాడు.

ఆమె ఆందోళనతో సెల్ ఫోన్ లో నెంబర్లు నొక్కి, లైను దొరికిన వెంటనే మాట్లాడింది.

ఏయ్ బాలా...నేను అక్షర మాట్లాడుతున్నాను. ఎక్కడికే వెళ్ళిపోయారు?”

చుట్టూ గోవిందానామస్మరణ అరుపులు పెద్దగా వినబడుతుంటే అక్షర అరిచి, అరిచి మాట్లాడవలసి వచ్చింది.

ఏమిటీ...ధీక్షుతుల మఠానికి పక్కన ఉన్నారా? సరే అక్కడే నిలబడండి...నేను వచ్చేస్తాను

మాట్లాడి ముగించిన వెంటనే థ్యాంక్స్అంటూ సెల్ ఫోన్ ను తిరిగి ఇచ్చిన అక్షర సార్, ధీక్షితుల మఠం ఎక్కడుంది?” అని అడిగింది.

పక్కన ఉన్న షాపులో విచారించి జవాబు చెప్పాడు ఇదే వీధిలో ఇంకా కొంచం ముందుకు వెడితే ఉందట అన్న అతను...ముందుకు నడిచాడు. ఆమె అతని వెనుకే నడిచింది.

కొన్ని అడుగులు వేసిన తరువాత అతని సెల్ ఫోన్ మోగింది.

భార్గవ్ ఎత్తిన వెంటనే అవతల పక్క ఒక ఆడగొంతు, “అక్షరా... అని పిలిచింది. వెంటనే వెనక్కి తిరిగి, “ఏమండీ...మీకే  ఫోను... అంటూ సెల్ ఫోనును ఆమెకు అందించాడు.

తీసుకుని మాట్లాడింది. తరువాత ధీక్షితుల మఠానికి పక్కనే ఒక పెద్దాయన బడ్డీకొట్టు పెట్టుకున్నాడట. అక్కడ నిలబడున్నారట అన్నది.

ఆమె ఫోనును తిరిగి ఇవ్వబోతుంటే, “ఫోను మీ దగ్గరే ఉండనియ్యండి. మీ స్నేహితులను కలుసుకున్న తరువాత తిరిగి ఇస్తే చాలు అన్నాడు.

ధీక్షితుల మఠం దగ్గర గుంపు ఎక్కువగా ఉండటంతో, మళ్ళీ అక్షర ఫోనులో మాట్లాడి తన స్నేహితులను కనుగొనగలిగింది.

చాలా థ్యాంక్స్ అండీ అని ఆమె, ఆమె స్నేహితులు ధన్యవాదాలు తెలిపి ఫోనును తిరిగి ఇచ్చారు.

భార్గవ్ విశాఖపట్నం తిరిగి వచ్చి చేరిన తరువాత, సెల్ ఫోన్ ను రాత్రి పూట తీసుకున్న అక్షర యొక్క అందమైన మొహం మనసులో నీడలాగా ఆడుతూనే ఉంది.

ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంటుంది?’

మనసు పరితపించింది. తన సెల్ ఫోనులో రిజిస్టర్ అయున్న ఆమె స్నేహితురాలి ఫోనుకు ఫోన్ చేసాడు.

హలో.... -- ఆడగొంతు.

హలో...మీరు అక్షర యొక్క స్నేహుతురాలే కదా...?”

...మీరెవరు?”

తిరుమలధీక్షితుల మఠంవీధి...సెల్ ఫోన్ ఇచ్చి...

ఎంత ఆశ్చర్యం! ఫోనులో మాట్లాడింది అక్షరానే!

మీరా...? నేను అక్షరనే మాట్లాడుతున్నాను. ఇది నా నెంబరే. రోజు నా ఫోనును ఒక స్నేహితురాలు చేతికి ఇవ్వటమే సమస్య అయ్యింది

.కే. అక్షరా...మీరు స్నేహితులతో కలిసి జాగ్రత్తగా విశాఖపట్నం వచ్చి చేరేరా అని అడగటానికే ఫోను చేసాను

నేనే మీకు ఫోను చేయాలని అనుకున్నాను...మర్చిపోయాను. చాలా థ్యాంక్స్ అండీ! మీ  పేరు...?”

భార్గవ్

అవతలివైపు చిన్న విరామం.

ఆమే, ‘భార్గవ్... భార్గవ్అని తనలో తాను ఉచ్చరించుకుంటోందని అతనికి అనిపించింది.

మీరు తిరుమలకు మాటి మాటికీ వస్తారా?”

ఆమే అడిగింది.

లేదండీ. ఆరోజు అనుకోకుండా తిరుమలకు వచ్చాను అన్న అతను, అతను అక్కడికి వచ్చి చేరిన కథను వివరించాడు. ఆమె కొట్టిందే తప్ప ఇంకేమీ చెప్పలేదు.

మనసులో ఆనంద పడుంటుంది!

ఏమిటండీ...ఏమీ చెప్పనంటున్నారు?”

అదొచ్చి...నేను తెలియని మగవారి దగ్గర ఎక్కువగా మాట్లాడింది లేదు

తెలియని మగవారు’-- అతనికి చురుక్కుమన్నది.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను...మన్నించండి అని చెప్పి సెల్ ఫోన్ కనక్షన్ కట్ చేసాడు.

కొద్ది క్షణాల్లో సెల్ ఫోన్ మోగింది.

ఆమే. మన్నించండి! నేను చెప్పింది మీ మనసును గాయ పరిచింది అనుకుంటా. పరిచయం లేని వాళ్ళ దగ్గరఅని చెప్పుండాలి

అతని కోపం తగ్గింది. పరిచయం ఎప్పుడో అయిపోయామే! అన్నాడు.

ఎప్పుడు?”

తిరుమలలో...

అవతలవైపు కూడా నవ్వు శబ్ధం వినబడింది.

అలా మొదలైన మాటలు...అంతటితో ఆగక సాగినై. మాటల సంధర్భాలలో ఆదివారాలలో సాయంత్రం పూట ఆమె, స్నేహితురాళ్ళు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ కు వస్తున్నారు అనేది తెలుసుకున్నాడు.

అదేరోజు అతనూ వెళ్ళాడు. పెద్ద గుంపులో అనుకోకుండా చూసినట్లు చాతుర్యంగా కలుసుకున్నాడు.

ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు.

ఆమె సొంత ఊరు తెనాలి. మధ్య తరగతి కుటుంబం. తండ్రి బిల్డింగ్ కాంట్రాక్టర్. తల్లి హౌస్ వైఫ్. చెల్లెలు మీద అత్యంత అభిమానం పెట్టుకుంది. అక్షర, కాలేజీ పై చదువులకొసం వైజాగ్ వచ్చి స్టే చేస్తోంది.

భార్గవ్ కు విజయవాడ. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి ఒకడే కొడుకు. వైజాగ టౌన్ షిప్ లో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీకి డెప్యూటీ జి.ఎం. గా పనిచేస్తున్నాడు.

తరువాత వచ్చిన రోజులలో బొర్రా గుహలు, ఉడా పార్క్ అంటూ  కలుసుకోవటం కొనసాగింది...ఒక మంచి రోజున ఒకరికొకరు తమ ప్రేమను బయటపెట్టుకుని...ఇదిగో ...ఇప్పుడు బీచ్ లో అలల జోస్యంచూసేంతవరకు వచ్చారు.

                                                                                                            Continued...PART-2

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి