25, జనవరి 2023, బుధవారం

మాంత్రీకుడు-పడుచుపిల్ల…(కథ)

 

                                                                          మాంత్రీకుడు-పడుచుపిల్ల                                                                                                                                                          (కథ)

చిన్నప్పుడే తల్లి చనిపోయిన రోహిణి, గుడిలో పూజరిగా ఉంటున్న తండ్రి యొక్క బద్రత, ప్రేమ, అభిమానంతోనే పెరిగి పెద్దదయ్యింది. ఆమెకు పెళ్ళి వయసు రావడంతో రోహిణికి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నాడు తండ్రి. తనకు పేళ్ళై వెళ్ళిపోతే తన తండ్రిని ఎవరు చూసుకుంటారు అనే బాధతో రోహిణీ కుమిలిపోయింది. 'తండ్రినీ-నన్నూ వేరు చేయకు' అని తండ్రి పూజారిగా ఉంటున్న అదే గుడిలోని అమ్మోరి దేవతను వేడుకుంది.

అలా వేడుకున్న రోహిణి కోరిక నెరవేరిందా?.....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

న్యూస్ పేపర్ను విడదీసి, ఒక కంటితో చూస్తూ,  మరో కంటితో కాఫీని ఎదురుచూస్తూ, క్షణానికొకసారి వంటగది వైపు కంటి చూపును ప్రసరిస్తున్నారు డాక్టర్ వివేక్. ఈపాటికి వేడిగా కాఫీ వచ్చుంటుంది. కానీ, వాకిటివైపు భార్యను వెతుక్కుంటూ ఎవరో ఒక మహిళ వచ్చి మాట్లాడుతున్న శబ్ధం వినబడింది. , అందువలనే ఆలశ్యమా?’

ఏమండీ, విషయం తెలుసా...?” వేగంగా కాఫీను తీసుకుని వచ్చి జాపి, ఆదుర్దాగా మొదలుపెట్టింది సుప్రియా. ఆయన భార్య.

ఏమిటి సుప్రియా, పొద్దున్నే ఉరి గొడవ నిన్ను వెతుక్కుంటూ వచ్చేసిందా? వచ్చింది ఎవరు? ఏమిటి విషయం?” నవ్వుతూ అడిగి, కాఫీను చల్లర్చుకోవటం ప్రారంభించారు డాక్టర్ వివేక్.

గొడవ ఏమీ లేదండీ. ఒక ఆశ్చర్యపరిచే సమాచారం. మంగమ్మత్త వచ్చి చెప్పి వెడుతోంది. ఊరి సరిహద్దులో ఉన్న మన కనకదుర్గ అమ్మోరు గుడి పూజారి క్రిష్ణ శాస్త్రి ఉన్నారే, ఆయన కూతురు రోహిణి నిన్న మంగళగిరికి స్నేహితురాలు ఒకతిత్తో పానకాలస్వామిని దర్శనం చేసుకుందామని వెళ్ళిందట. అక్కడేదో తిరనాలుట. విపరీతమైన జనమట. గుడికి వెళ్ళే దోవలో జనసమూహంలో స్నేహితురాలిని విడిపోయిందట పిల్ల రోహిణి

అరెరె, తరువాత...?”

జనసమూహంలో స్నేహితురాలు కోసం అటూ ఇటూ రోహిణి వెతకటం చూసి,  ఆమె దగ్గరకి ఒక స్వామీజీ వచ్చాడట. ఆయన కాషాయం బట్టలు వేసుకుని ఉన్నారట. మెడలో బోలెడన్ని రుద్రాక్షమాలలు, నుదిటి మీద విబూధి గీతలు, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్న ఆకారంలో ఉన్నారట.  

ఏమిటి బిడ్డా, ఎవర్ని వెతుకుతున్నావుఅని రోహిణి దగ్గర అడిగారట.

నా స్నేహితురాలు రాధాను. ఆమె నాతోపాటూనే వస్తోంది. ఇప్పుడు గుంపులో విడిపోయింది... అని ఆమె చెప్పగా,

ఇందుకా బాధపడుతున్నావు. నువ్వు గుడికి వెళ్ళి తిరిగి వచ్చేలోపు, ఆమె నీ కంటికి కనబడుతుంది...అని చెప్పి,

ఇందా విబూధిని, కుంకుమనూ తీసుకో...భయమంతా పారిపోతుందిఅంటూ రోహిణి చేతులో వీభూది, కుంకుమ ఇచ్చారట. తరువాత, ఆయన తన చేతిలో ఉన్న కమండలంలో  నుండి ఏదో తులసి తీర్ధం లాంటిది రోహిణి చేతిలో కొన్ని చుక్కలు పోసి తాగమన్నారట. రోహిణి ఆయన చెప్పినట్టు చేసిందట. అంతే రోహిణి కళ్ళు తిరిగి స్ప్రుహ కోల్పోయిందట.

రోహిణిను ఒకమూలకు తీసుకు వెళ్ళి కూర్చోబెట్టేరట స్వామీజీ. తరువాత కొంతసేపటి వరకు ఈమెకు ఏం జరిగిందో గుర్తులేదట. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఆమె స్నేహితురాలు వచ్చి ఆమె మొహం మీద నీళ్ళు జల్లి లేపుతూ ఉందట. రోహిణి మెడలో వేసుకోనున్న బంగారు గొలుసు, చేతులకున్న బంగారు గాజులు, అన్నీ మాయమైనట!

ఏమిటే ఇది, అన్యాయంగా ఉందే? తిరనాల సమయంలో విపరీత జన సమూహం రోడ్డుమీద నడుస్తూ ఉంటారే, పొలీసు కాపలా చాలా ఉంటుందే? అక్కడా దోపిడి జరిగింది?”

అరె, అవునండి. పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేసి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చిందట రోహిణి...వచ్చినతను స్వామీజీ కాదట. అతనొక మాంత్రీకుడట! ఇలా మాటి మాటికీ జరుగుతోందట...పోలీసులు మంత్రీకుడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారట! అన్నది డాక్టర్ వివేక్ భార్య సుప్రియా.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాంత్రీకుడు-పడుచుపిల్ల…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి